ఇంటింటికి కాంగ్రెస్ 6 గ్యారంటీ కార్డుల పంపిణీ
వికారాబాద్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ 6 గ్యారంటీ కార్డుల పంపిణీ చేశారు. ఎన్నికల్లో గెలిస్తే కాంగ్రెస్ అందివ్వనున్న 6 గ్యారంటీలను ప్రజలకు ఆయన వివరించారు. పాలమూరు-రంగారెడ్డి పూర్తికాకపోవడానికి కేసీఆరే కారణమని ఆరోపించారు. ఆడబిడ్డ ఆత్మహత్యపై కేటీఆర్ అబద్దాలు చెబుతున్నారన్నారు. ప్రజల జీవితాల్లో వెలుగులు రావాలంటే కాంగ్రెస్‌ను గెలిపించడంటూ ఓటర్లను కోరారు.