తొలి టీ20లో అదరగొట్టిన టీమిండియా
టీమిండియా అదరగొట్టింది. ఉత్కంఠగా సాగిన పోరులో 2 పరుగుల తేడాతో తొలి టీ20ని కైవసం చేసుకుంది. 162 పరుగుల లక్ష్యాన్ని చక్కగా కాపాడుకుంది. మిడిల్ ఓవర్లలో బౌలర్లు తడబడినా చివర్లో పుంజుకోవడంతో గెలుపు టీమిండియా వశమైంది. అరంగేట్ర బౌలర్ శివమ్ మావి 4 వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్లతో టీమిండియా విజయానికి దోహదపడ్డారు. అంతకుముందు బ్యాటింగులో దీపక్ హుడా, అక్షర్ పటేల్ చెలరేగడంతో టీమిండియా 162 పరుగులు చేయగలిగింది.