పోలవరానికి కాళేశ్వరానికి పోలికా: అంబటి
పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి ముంపు లేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తెలంగాణ ఎందుకు ఈ వాదన చేస్తుందో అర్థం కావడం లేదన్నారు. వైఎస్ హయాంలోనే అన్ని అనుమనుతులు వచ్చాయని చెప్పారు. ప్రాజెక్టును నిర్మిస్తోంది కేంద్రమే. బ్యాక్ వాటర్ వల్ల ప్రమాదముంటే మేం ఊరుకుంటామా? పోలవరానికి ముందు వరద వచ్చినప్పుడు భద్రాచలం మునిగిపోయింది. పోలవరానికి కాళేశ్వరానికి పోలిక లేదు. కాళేశ్వరం కేవలం రెండు టీఎంసీల బ్యారేజ్ మాత్రమే అని చెప్పారు.