• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విడుదలకు సిద్ధమైన యాక్షన్‌ థ్రిల్లర్‌

    పాయల్‌ రాజ్‌పూత్‌ ప్రధాన పాత్రలో నటించిన మంగళవారం చిత్రం విడుదలకు సిద్ధమైంది. నవంబరు 17న తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రాన్ని ముద్ర మీడియా వర్క్స్‌ పతాకంపై స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్‌ వర్మ.ఎం. నిర్మించారు.

    ఆసక్తికరంగా ‘మంగళవారం’ టీజర్‌

    పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ’మంగ‌ళ‌వారం’ మూవీ టీజ‌ర్ రిలీజైంది. హార‌ర్ అంశాల‌తో టీజ‌ర్ ఉత్కంఠ‌ను పంచుతోంది. ప్ర‌ధాన పాత్ర‌ధారుల ముఖాల్లో భ‌యం, ఆశ్చ‌ర్చాన్ని చూపిస్తూ టీజ‌ర్ చివ‌రి వ‌ర‌కు ఉత్కంఠ‌గా సాగింది. టీజ‌ర్‌లోని సీన్స్ ఎక్కువ‌గా డార్క్ మోడ్‌లోని క‌నిపిస్తూ ఆస‌క్తిని పెంచాయి. టీజ‌ర్ చివ‌ర్లో బోల్డ్ సీన్స్‌లో పాయ‌ల్‌ క‌నిపించింది.