• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • “వాల్తేరు వీరయ్య” టైటిల్ టీజర్‌

  చిరంజీవి హీరోగా బాబీ డైరెక్ట్ చేస్తున్న #Mega154 సినిమా టైటిల్ టీజర్‌ అదిరిపోయింది. వాల్తేరు వీరయ్య టైటిల్‌ ఫిక్స్‌ చేస్తూ చిరు లుక్‌ రివీల్‌ చేస్తూ టీజర్‌ విడుదల చేశారు. మాస్‌ గెటప్‌లో ముఠా మేస్త్రీని గుర్తుతెచ్చేలా చిరు కనిపించారు. ఈ సినిమాలో రవితేజ, ప్రకాశ్ రాజ్, శ్రుతి హాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

  సంక్రాంతికి బాలయ్య vs చిరు..?

  సంక్రాంతికి బాలయ్య, చిరుల పోరు తప్పదా? ప్రస్తుతం ‘మెగా154’, ‘NBK107’ చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నాయి. అయితే, ఈ రెండింటిని ‘మైత్రీ మూవీ మేకర్స్’ నిర్మిస్తుండటంతో ఈ పోటీ ఉంటుందా అనే విషయంపై స్పష్టత లేదు. రెండింట్లో ఏదైనా ఒక సినిమానే బాక్సాఫీస్ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల టాక్. బాలయ్య- గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంలో శ్రుతిహసన్ నటిస్తోంది. ‘మెగా154’లోనూ ఈ అమ్మడు మెరవనున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రేక్షకులకు ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

  దీపావళికి ‘మెగా154’ టీజర్..?

  మెగా అభిమానులకు దీపావళి రెట్టింపు ఆనందాన్ని ఇవ్వనుంది. ‘మెగా154’ సినిమాకు సంబంధించిన టీజర్, రిలీజ్‌ డేట్‌ను పండుగకు వెల్లడించే అవకాశం ఉందన్నట్లు ఇండస్ట్రీలో టాక్. మరో రెండు రోజుల్లో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గాడ్‌ఫాదర్ విజయంతో ఊపు మీదున్న అభిమానులకు ‘మెగా154’ అప్డేట్ మరింత కిక్కిస్తోంది. ఈ సినిమాని బాబీ డైరెక్ట్ చేస్తుండగా.. రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నాడు. డీఎస్పీ సంగీతం అందిస్తున్నాడు. కాగా, సంక్రాంతికి ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.

  ‘మెగా154’ విడుదల అప్పుడేనా..?

  మెగాస్టార్, కేఎస్ రవీంద్ర కాంబోలో వస్తున్న చిత్రం ‘మెగా154’. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను వచ్చేఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు. అయితే, సంక్రాంతి బరిలోనే దింపినప్పటికీ.. విడుదల తేదీ కాస్త అటూ, ఇటూగా మారే అవకాశం ఉంది. జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుందన్న ఊహాగానాలు ఇండస్ట్రీలో ఊపందుకున్నాయి. ఆదిపురుష్, వారసుడు సినిమాలు పండుగకు విడుదలవుతున్నాయి. అయితే,.ఎట్టి పరిస్థితుల్లో సినిమాను సంక్రాంతికే విడుదల చేస్తామని ఇదివరకే నిర్మాతలు ప్రకటించారు.

  #Mega154 డబ్బింగ్ పనులు షురూ

  చిరంజీవి హీరోగా బాబీ డైరెక్ట్ చేస్తున్న #Mega154 సినిమా నేడు డబ్బింగ్ పనులకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు డైరెక్టర్ బాబీ పూజా కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ మూవీకి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. ఇందులో రవితేజ, ప్రకాశ్ రాజ్, శ్రుతి హాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇదివరకే కొంతమేర షూటింగును జరుపుకొంది. డీఎస్సీ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.

  సంక్రాంతి బరిలో ఆదిపురుష్, మెగా 154

  వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలిచే సినిమాలేంటో ఖరారయ్యాయి. చిరంజీవి నటిస్తున్న మెగా 154 జనవరి 11 న విడుదల కానుంది. ఈ విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ జనవరి 12న ప్రేక్షకులను పలకరించనుంది. అటు తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన వారసుడు జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మూడు సినిమాలు వస్తున్నా తెలుగులో మాత్రం ఆదిపురుష్, మెగా 154 మధ్యనే ప్రధా పోటీ అని అభిమానులు అంచనాలు వేస్తున్నారు.

  ‘మెగా154’ ఓటీటీ రైట్స్ నెట్‌ఫ్లిక్స్‌కే

  మెగాస్టార్ చిరంజీవి నటించబోయే ‘మెగా 154’ మూవీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. రూ.50 కోట్లు వెచ్చించి తెలుగు రైట్స్ కొనుగోలు చేసింది. ఇంతకుముందు కూడా చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. రూ. 57 కోట్లు వెచ్చించి ‘గాడ్ ఫాదర్’ ఓటీటీ హక్కులను దక్కించుకుంది. కాగా ‘మెగా 154’ రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని సినీవర్గాల అంచనా.

  మెగాస్టార్ మూవీలో వెంకటేష్

  మెగాస్టార్ చిరంజీవి హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మెగా 154 మూవీలో విక్టరీ వెంకటేష్ నటించనున్నారనే వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. చిత్రంలో వెంకటేష్ అతిథి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఇదే నిజమైతే ఇద్దరు అగ్ర హీరోలను ఒకే తెరపై చూడొచ్చని అభిమానులు సంతోషపడుతున్నారు. కాగా మెగా 154 మూవీకి ’వాల్తేరు వీరయ్య‘ టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.

  ‘MEGA154’ సెట్‌లో కృష్ణంరాజుకు నివాళులు

  దిగ్గజ నటుడు కృష్ణంరాజు మృతికి ‘MEGA154’ మూవీ టీం నివాళులు అర్పించింది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సెట్‌లో కృష్ణంరాజు చిత్రపటానికి పూలమాల వేసి చిత్రబృందం నివాళులు అర్పించింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవితో పాటు డైరెక్టర్ బాబీ, స్టార్ యాక్టర్ ప్రకాష్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. కాగా చిరంజీవి నిన్న కృష్ణంరాజు ఇంటికెళ్లి ఆయనకు నివాళులు అర్పించి, ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. Courtesy Twitter:

  మెగా 154 కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం

  బాబీ ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ న‌టిస్తున్న 154 మూవీ చిత్రీక‌ర‌ణ‌ నేడు తిరిగి ప్రారంభ‌మైంది. హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్న ఈ షూటింగ్‌లో చిరంజీవితో పాటు ర‌వితేజ‌, శృతిహాస‌న్ ఇత‌రులు పాల్గొన్నారు. మ‌రోవైపు మెగాస్టార్ గాడ్‌ఫాద‌ర్ సినిమా అక్టోబ‌ర్ 5న రిలీజ్ కానుంది. ఇక భోళా శంక‌ర్ వ‌చ్చే ఏడాది సంక్రాంతి స‌మ‌యానికి రిలీజ్ చేస్తామ‌ని ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. మెగా 154 కూడా 2023 స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేసేందుకు సిద్ద‌మవుతున్నారు.