‘పైసలు, బంగారం ఇస్తేనే ఓటేస్తాం’
TS: మునుగోడులో వింత ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. డబ్బులు ఇవ్వలేదని గ్రామస్థులు పోలింగును బహిష్కరించారు. గట్టుప్పల్ మండలంలోని అంతంపేట గ్రామస్థులు నిరసనకు దిగారు. రూ.30-40 వేలు ఇస్తామని ప్రకటించి పూర్తిగా అందజేయలేదని వాపోయారు. ‘ఓట్లు ఎక్కువగా ఉన్న కుటుంబానికి తులం బంగారం అందజేస్తామని నాయకులు చెప్పిర్రు. పైసలు ఇస్తమన్నరు. పేర్లు రాసుకున్నరు. కానీ ఇంకా ఏం ఇవ్వలేదు. కొంతమందికి మాత్రమే ఇచ్చిర్రు. పైసలు ఇచ్చేదాకా అసలు ఓటెయ్యం’ అని కొందరు పట్టుబడుతున్నారట.