క్లాస్, మాస్ కాంబో; ధనుష్, శేఖర్ కమ్ముల మూవీ లాంఛ్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, తెలుగు డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్లో వస్తున్న చిత్రానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. సోమవారం ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభించారు. థ్రిల్లర్ మూవీగా, మల్టీ లింగ్వల్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు శేఖర్ కమ్ముల. సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులను ఇంకా ఖరారు చేయలేదు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.