‘ఓరి దేవుడా’ ట్విటర్ రివ్యూ
తమిళంలో మంచి విజయం సాధించిన ‘ఓ మై కడవులే’ సినిమా రీమేక్ ‘ఓరి దేవుడా’. తెలుగులోనూ అశ్వత్ మారిముత్తు డైరెక్ట్ చేశారు. ఈ సినిమాపై ట్విటర్లో పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఫస్టాఫ్ వినోదభరితంగా సాగిపోతుందని ట్వీట్లు చేస్తున్నారు. ‘ఫస్టాఫ్ వినోదభరితంగా సాగిపోతుంటుంది. కామెడీ బాగుంది. విశ్వక్సేన్ బాగా నటించారు. వెంకటేశ్ దేవుడిగా కనిపించారు. ఇంటర్వెల్ బ్యాంగ్‌తో సెకండాఫ్‌పై ప్రేక్షకులకు ఆసక్తి పెరుగుతుంది. వినోదానికి ఫాంటసీ మిక్స్ చేయడంతో ఫన్ రైడ్‌గా సాగింది’ అని చెబుతున్నారు. అయితే, పూర్తి రివ్యూ కోసం వేచిచూడాల్సిందే.