హయ్యా కార్డుదారులకు గుడ్న్యూస్
ఫిఫా వరల్డ్ కప్ సందర్భంగా విదేశీయులకు అందించిన హయ్యా కార్డుదారులకు ఖతర్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆ కార్డు గడువు తేదీని సంవత్సరం పాటు పొడగించింది. 2023 జనవరి 30 నుంచి 2024 జనవరి 24 వరకు ఈ కార్డులు పనిచేస్తాయి. వీళ్లు దేశంలోకి ప్రవేశించడానికి ఏ వీసాకు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఆటోమేటిక్గా వర్తింపజేయనున్నారు. దీనికోసం అదనంగా ఎలాంటి రుసుము కూడా తీసుకోవడం లేదని అధికారులు వెల్లడించారు. ఇది మల్టీపుల్ ఎంట్రీ పర్మిట్.