ఆ రోజు నా భార్య నాపై చెప్పు విసిరింది: రాజ్ కుంద్రా
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, రాజ్ కుంద్రా తన జీవిత కథను చిత్రంగా నిర్మిస్తున్నాడు. ఇందులో అతడే హీరోగా నటించాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా రాజ్‌కుంద్రా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ‘మొదట నా జీవిత కథను బయోపిక్‌గా తీయాలనుకున్నా. ఈ విషయాన్ని నా భార్యకు చెప్తే నా పైకి చెప్పు విసిరింది. నేను సినిమా తీయాలన్న ఆలోచన తనకు నచ్చలేదు. కానీ తర్వాత తన మనసు మార్చుకుని నాకు అండగా నిలబడింది’ అని చెప్పుకొచ్చాడు..