ఈ నెల 24న ఓటీటీలో ‘స్వాతిముత్యం’
గణేష్ బెల్లంకొండ హీరోగా తెరకెక్కిన ‘స్వాతిముత్యం’ సినిమా ఈ నెల 24న దివాలి కానుకగా ఆహాలో విడుదలవుతోంది. ఈ విషయాన్ని ఆహా ప్రతినిధులు తెలిపారు. ముందుగా ఈనెల 28న ఓటీటీలో రిలీజ్ చేయాలని భావించారు. కానీ పండుగ రోజు రిలీజ్ చేస్తే వ్యూయర్షిప్ పెరుగుతుందనే భావనతో కొంచెం ముందుగానే విడుదల చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో గణేస్ సరసన వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి లక్ష్మణ్ క్రిష్ దర్శకత్వం వహించారు.