• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కాంగ్రెస్ అంటే దగా పార్టీ: మల్లా రెడ్డి

  ఉద్యమ నేత కేసీఆర్ సీఎం అయ్యాకే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని మంత్రి మల్లా రెడ్డి అన్నారు. ‘బీఆర్ఎస్‌ పార్టీ అంటే చరిత్ర.. కేసీఆర్‌ సీఎం అయ్యాకే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. కేసీఆర్‌ కొత్తగా 10 పథకాలు తీసుకువచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పథకాలు ప్రవేశ పెట్టారు. కాంగ్రెస్ అంటే మోసం, దగా పార్టీ.. భూకబ్జా దారులు.. వాళ్లను జైలుకి పంపించే బాధ్యత నాదే. దళితులకు భూములను పంచే బాధ్యత నాదే’ అని చెప్పుకొచ్చారు.

  నేడు బీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు

  అసెంబ్లీ ఎన్నికల వేళ.. బీఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు స్టార్ అయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు.. రెండుసార్లు వనపర్తి ఎమ్మెల్యేగా గెలిచిన రావుల చంద్రశేఖర్ రెడ్డి ఈరోజు కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. భువనగిరికి చెందిన జిట్టా బాలకృష్ణ రెడ్డి సైతం ఈరోజు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. గతంలో ఆయన బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌కు.. కాంగ్రెస్ నుంచి బీజేపీకి మళ్లీ ఇప్పుడు తిరిగి సొంతగూటికి చేరుతున్నారు. మరోవైపు నల్లగొండ కాంగ్రెస్ పార్టీకి చెందిన చెందిన బీసీ నాయకుడు, ఉద్యమకారుడు … Read more

  నేడు బీజేపీ తొలి జాబితా?

  తెలంగాణ బీజేపీ అభ్యర్థుల ప్రకటనపై ఇంకా తర్జన భర్జనలు కొనసాగుతునే ఉన్నాయి. గురువారం రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జ్ ప్రకాశ్ జావ్‌డేకర్ నివాసంలో టీబీజేపీ ముఖ్య నేతలు సమావేశం అయ్యారు. తొలి జాబితాపై కసరత్తు చేశారు. సామాజిక వర్గాల వారిగా టికెట్ల కేటాయింపు, ఎక్కువ మంది టికెట్లు ఆశిస్తున్న స్థానాలపై తుది జాబితా ఖరారు చేశారు. ఈరోజు 11 గంటలకు జాతీయ అధ్యక్షుడు నడ్డాతో సమావేశమై అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు.

  కొండా సురేఖకు ప్రమాదం

  రాహుల్ గాంధీ బస్ యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఆయనకు మద్దతుగా చేపట్టిన బైక్‌ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ ప్రమాదానికి గురయ్యారు. బైక్ నడిపిన సురేఖ అదుపుతప్పి కింద పడిపోయింది. ఆమె చేతికి, ముఖానికి గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ కార్యకర్తలు హుటాహుటినా సురేఖను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది.

  నేడు ప్రధాని మోదీతో టీబీజేపీ నేతల కీలక భేటీ

  నేడు ఢిల్లీలో ప్రధాని మోదీతో తెలంగాణ బీజేపీ నేతలు కీలక భేటీ కానున్నారు. ఇప్పటికే తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, ఈటల రాజేందర్ ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, జేపీ నడ్డాతో రాష్ట్ర నేతల ప్రత్యేక భేటీలు నిర్వహించనున్నారు. తెలంగాణలో రూట్ మ్యాప్, అభ్యర్థుల ఖరారుపై చర్చలు జరపనున్నారు. అన్ని కుదిరితే ఇవాళ రాత్రికే తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది.

  మీ కలను కాంగ్రెస్‌ అర్థం చేసుకుంది: ప్రియాంక

  ములుగు బహిరంగ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ… ‘తెలంగాణ ఇస్తే రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని సోనియాకు తెలుసు. రాజకీయ లబ్దికోసం కాకుండా, తెలంగాణ ప్రజల కోరిక మేరకు ఆ నిర్ణయం తీసుకున్నారు. శ్రీకాంతాచారికి నా నివాళి. ఉద్యోగాలు, నిధుల కోసం మీరు కలలు కన్నారు. మీ కలలు సాకారం అవుతాయని బీఆర్‌ఎస్‌ను నమ్మి ఓటేశారు. ఉద్యోగాలు వస్తాయని పిల్లల భవిష్యత్‌ మారుతుందని అనుకున్నారు. మీ కలను కాంగ్రెస్‌ అర్థం చేసుకుంది. సామాజిక న్యాయం జరగాలన్నదే కాంగ్రెస్‌ సిద్ధాంతం’ అని చెప్పుకొచ్చారు.

  బండి సంజయ్‌ మండిపడ్డ కేటీఆర్

  కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. బీజేపీ ఎంపీ బండి సంజయ్‌పై మండిపడ్డారు. ‘హిందూ ముస్లింల మధ్య కొట్లాటలు పెట్టే సన్నాసులు కరీంనగర్ లో ఉన్నారు. కమలాకర్ చేతిలో చావు దెబ్బతిని దొంగ ఏడ్పుతో ఎంపీ అయ్యాడు. ఎంపీ అయ్యాక ఏం చేశారు. ఓ బడి తేలేదు. కనీసం గుడి అయినా తేలేదు. మోడీ దేవుడని అంటున్న బండి సంజయ్ చెప్పాలి గ్యాస్ ధర ఎంత పెరిగిందో.. గంగుల కమలాకర్‌ మీద పోటీ అంటే పోషమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్టే’ అని … Read more

  కాంగ్రెస్ జాబితాలో 12 కొత్త ముఖాలు

  కాంగ్రెస్‌ ప్రకటించిన తొలి జాబితాలోని 55 మందిలో 12 మంది కొత్త అభ్యర్థులు ఉన్నారు. సీపీఎం అడిగిన భద్రాచలంలో పొదెం వీరయ్యకు టికెట్ కేటాయించారు. ఇటీవల పార్టీలో చేరిన వేముల వీరేషంకు నకిరేకల్ టికెట్ ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి కుటుంబంలో ఇద్దరికి సీట్లు కేటాయించారు. నాగార్జునసాగర్ నుంచి జానారెడ్డి కుమారుడు జయవీర్ ఈసారి బరిలోకి దిగుతున్నారు.

  కేసీఆర్ ఎన్నికల రథం సిద్ధం

  తెలంగాణ ఎన్నికల ప్రచారానికి BRS ప్రచార రథం సిద్ధమైంది. గులాబీ వర్ణంలో రూపొందిన ఈ బస్సులో అన్ని రకాల ఆధునిక వసతులు కల్పించారు. సీఎం కేసీఆర్ ఈ వాహనం ద్వారా ప్రసంగిస్తారు. ఈ వాహనంపై తెలంగాణ, భారత దేశ చిత్ర పటంతో పాటు రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. ఈరోజు సాయంత్రం హుస్నాబాద్ నుంచి సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. అక్కడి సభలో బీఆర్ఎస్ మెనిఫెస్టో ప్రకటించనున్నారు.

  4 రోజుల్లోనే రూ.37 కోట్లు స్వాధీనం

  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూలు విడుదలైన వేళ.. పోలీసుల తనిఖీల్లో పెద్ద ఎత్తున డబ్బు, బంగారం పట్టుబడుతోంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.37 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. గత ఎన్నికల సమయంలో తనిఖీల్లో మొత్తం రూ.98 కోట్ల విలువైన డబ్బు, బంగారం మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈసారి 4 రోజుల్లోనే ఈ స్థాయిలో పట్టుబడటం గమనార్హం. ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో డబ్బు, మద్యం విచ్చలవిడిగా సరఫరా అవుతోంది.