• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అరెస్ట్

    గన్ పార్క్‌ వద్ద టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేసేందుకు వచ్చిన ఆయన్ను అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందునా అనుమతి లేదని పోలీసులు చెప్పారు. దీంతో రేవంత్ రెడ్డికి పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. పోలీసులు డౌన్ డౌన్ అంటూ స్లోగన్స్ ఇచ్చారు. దీంతో ఉద్రిక్తతలు పెరగడంతో రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి ఛాలెంజ్

    టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు సవాలు విసిరారు. అసెంబ్లీ ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ చేయకుండా ఎన్నికలకు వెళ్దామని ఛాలెంజ్ చేశారు. ఈమేరకు మధ్యాహ్నం తాను అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లనున్నట్లు చెప్పారు. దమ్ముంటే కేసీఆర్ వచ్చి ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అక్రమ మార్గాల ద్వారా పెద్ద ఎత్తున మద్యం, డబ్బు సరఫరా చేస్తోందని ఆరోపించారు. ఓటర్లను ప్రలోభపెట్టి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.

    ఇంటింటికి కాంగ్రెస్ 6 గ్యారంటీ కార్డుల పంపిణీ

    వికారాబాద్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్‌ 6 గ్యారంటీ కార్డుల పంపిణీ చేశారు. ఎన్నికల్లో గెలిస్తే కాంగ్రెస్ అందివ్వనున్న 6 గ్యారంటీలను ప్రజలకు ఆయన వివరించారు. పాలమూరు-రంగారెడ్డి పూర్తికాకపోవడానికి కేసీఆరే కారణమని ఆరోపించారు. ఆడబిడ్డ ఆత్మహత్యపై కేటీఆర్‌ అబద్దాలు చెబుతున్నారన్నారు. ప్రజల జీవితాల్లో వెలుగులు రావాలంటే కాంగ్రెస్‌ను గెలిపించడంటూ ఓటర్లను కోరారు.

    కాంగ్రెస్‌ అరాచక శక్తులను పెంచి పోషించింది: కేసీఆర్

    జనగామ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ అరాచక శక్తులను పెంచి పోషించింది. ప్రస్తుతం భువనగిరి ప్రశాంతంగా ఉంది. రెవెన్యూలో అవినీతి తగ్గించేందుకే ధరణి తీసుకొచ్చాం. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తుంది. కాంగ్రెస్‌ వస్తే పైరవీకారులు, దళారులు రాజ్యమేలుతారు. భువనగిరిలో స్పెషల్‌ ఐటీ హబ్‌, ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తాం. భువనగిరిలో 50వేల మెజార్టీలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

    27 కేజీల బంగారం పట్టివేత

    మియాపూర్‌లో భారీగా బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న దాదాపు 27 కేజీల గోల్డ్‌ను అధికారులు సీజ్ చేశారు. మరో 15 కేజీల వెండి సైతం అధికారుల తనిఖీల్లో వెలుగు చూసింది. పట్టుబడిన వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు వివరాలు తెలుసుకుంటున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఇంత పెద్ద ఎత్తున బంగారం పట్టుబడటం విస్తుపోయేలా చేస్తోంది.

    నేను సీఎం అయితా: కోమటిరెడ్డి

    తాను సీఎం అయినంక రాష్ట్రంలో బెల్ట్ షాపులను బంద్ చేస్తా అని కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. పార్టీ నుంచి సీఎం రేసులో ఇద్దరు, ముగ్గురం సీఎం అభ్యర్థులు ఉన్నామని పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ముందు ఎన్నికల్లో ఎలా గెలవలనేదానిపై దృష్టి పెడితే మంచిదన్నారు. సీఎం అభ్యర్థి ఎంపికను అధిష్ఠానం చూసుకుంటుందని సూచించారు. తొందరపాటు వ్యాఖ్యలతో ప్రజల్లో చులకన కావొద్దని అభిప్రాయపడ్డారు.

    మూడోసారి కేసీఆరే సీఎం: ఓవైసీ

    తెలంగాణలో మూడో సారి కేసీఆర్ సీఎం అవుతారని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తాము పోటీ చేసే ప్రతిచోటా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో రాజస్థాన్లోనూ పోటీ చేస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా MIM పోటీ చేసే స్థానాల్లో పార్టీ అభ్యర్థులకు, పోటీ చేయని చోట బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయాలని ముస్లింలకు సూచించారు.

    ఆలస్యమే మా స్ట్రాటజీ: కిషన్ రెడ్డి

    తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సిద్ధంగా ఉన్నామని టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థులను ఎప్పుడు ప్రకటించాలన్నది మా పార్టీ ఇష్టం. నామినేషన్ చివరి రోజు వరకు కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటించడం మా ఎన్నికల స్ట్రాటజీ. అభ్యర్థుల ఎంపిక ఇప్పటికే 50 శాతం పూర్తి చేశాం అని చెప్పుకొచ్చారు.