• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సమంతకు గుడి కడుతున్న వీరాభిమాని: ఏపీలోనే?

    స్టార్ హీరోయిన్ సమంతకు ఓ అభిమాని గుడి కడుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఏపీలోని బాపట్లకు చెందిన సందీప్.. హీరోయిన్ సమంతకు వీరాభిమాని. ఈ క్రమంలో ఆమె మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకోవాలని గతంలో చెన్నై, తిరుపతి, నాగపట్నంలో మొక్కుబడి యాత్ర చేశాడు. ఇప్పుడు ఏకంగా కోవెల కడుతున్నాడు. ఆలపాడులోని తన స్వగృహంలో ఈ గుడి నిర్మిస్తున్నాడు. ఏప్రిల్ 28న సమంత బర్త్‌డే సందర్భంగా ఈ గుడిని ఓపెన్ చేస్తున్నాడు.

    మహిళా పోలీసు డ్యాన్స్.. ట్విస్ట్ ఏంటంటే?

    ఒక మహిళా పోలీసు డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ఈ [వీడియో](url) పోలీసు ఉన్నతాధికారులకు చేరడంతో ఆమెతోపాటు వీడియోలో కనిపిస్తున్న మరో నలుగురిని సస్పెండ్ చేశారు.అయోధ్యలోని రామజన్మభూమి సెక్యూరిటీ కోసం నలుగురు మహిళా కానిస్టేబుళ్లను నియమించారు. కానీ వారిలో ఓ మహిళ భోజ్‌పురి సాంగ్‌కు డ్యాన్స్ వేసింది. దీనిని తోటి కానిస్టేబుళ్లు ఎంకరేజ్ చేశారు. ఈ వీడియో వైరల్‌ కావడంతో ఉన్నతాధికారులు నలుగురినీ సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు. #Ayodhya: महिला सिपाहियों के द्वारा बनाया गया … Read more

    ఆలయంలో మహిళల డ్యాన్స్ .. ఊడిన ఉద్యోగం

    ఆలయంలో ఇద్దరు మహిళలు డ్యాన్స్ చేసి ఉద్యోగం పోగొట్టుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో ఉన్న మహాకాళి ఆలయంలో జరిగింది. దేవాలయంలో పనిచేసే ఇద్దరు మహిళా సిబ్బంది బాలీవుడ్ పాటకు డ్యాన్స్ వేశారు. ఆసమయంలో గుడిలో భక్తుల రద్దీ అంతగా లేదు. ఈ [వీడియో](url)ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో వైరల్‌గా మారింది. దీంతో వారిపై భక్తులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ విషయం దేవస్థాన అధికారులకు తెలియడంతో వారిని విధుల నుంచి తొలగించారు. #WATCH उज्जैन के महाकाल मंदिर में एक … Read more

    దేవుని చెంత ప్రాణాలొదిలిన భక్తుడు; వీడియో వైరల్

    దేవుడి చెంత ఓ వ్యక్తి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలో చోటుచేసుకుంది. మొహానీ అనే వ్యక్తి దగ్గర్లోని సాయిబాబా ఆలయానికి తరచూ వెళ్తుంటాడు. తాజాగా ఎప్పటిలాగే గుడికి వెళ్లిన మొహానీ దేవుడి పాదాలపై పడి నమస్కరించాడు. ఎంతసేపటికీ ఆయన పైకి లేవకపోవడంతో ఆలయ సిబ్బంది ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో మరణించినట్లు డాక్టర్లు ద్రువీకరించారు. ఇందుకు సంబంధించిన[ వీడియో](url) వైరల్‌గా మారింది. मध्यप्रदेश कटनी साईं मंदिर में बाबा के चरणों में टेका मत्था, फिर सिर नहीं … Read more