• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కింగ్ నాగార్జున ‘ది ఘోస్ట్’ ట్రైల‌ర్ విడుద‌ల‌

    కింగ్ నాగార్జున హీరోగా న‌టించిన ది ఘోస్ట్ మూవీ ట్రైల‌ర్ వ‌చ్చేసింది. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశాడు. ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం తెర‌కెక్కింది. తండ్రికి ఇచ్చిన మాట ప్ర‌కారం సోద‌రుడిగా అక్క‌ను, ఆమె కూతుర్ని కాపాడే బాద్య‌త‌ను విక్ర‌మ్ తీసుకుంటాడు. శత్రువుల బారి నుంచి వారిని ఎలా ర‌క్షించాడుఅనే క‌థాంశంతో సినిమా తెర‌కెక్కిన‌ట్లుగా తెలుస్తుంది. సోనాల్ చౌహాన్ ఇందులో హీరోయిన్‌గా న‌టించింది. ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అక్టోబ‌ర్ 5న మూవీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.

    ‘కొత్త‌కొత్త‌గా’ మూవీ ట్రైల‌ర్ విడుద‌ల‌

    అజ‌య్, విర్తి వాఘ‌ని జంట‌గా న‌టించిన ‘కొత్త‌కొత్త‌గా’ మూవీ ట్రైల‌ర్ నేడు రిలీజ్ అయింది. ల‌వ్‌, ఎమోష‌న్స్, ఫ్యామిలీ సెంటిమెంట్‌తో ట్రైల‌ర్ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగింది. ఒక అమ్మాయిన మ‌న‌స్పూర్తిగా ప్రేమించే అబ్బాయి, అన్నింటిని లైట్ తీసుకొని మ‌నం కేవ‌లం ఫ్రెండ్స్ అని చెప్పే ఒక మోడ్ర‌న్ అమ్మాయి మ‌ధ్య జ‌రిగే ల‌వ్‌స్టోరీ ఈ సినిమా క‌థ‌గా తెలుస్తుంది. హ‌నుమాన్ వాసంశెట్టి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. శేఖ‌ర్ చంద్ర మ్యూజిక్ అందించాడు. సెప్టెంబ‌ర్ 9న మూవీ థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.

    ట్రెండింగ్‌లో ‘రంగ‌రంగ వైభ‌వంగా’ ట్రైల‌ర్‌

    వైష్ణ‌వ్ తేజ్ హీరోగా న‌టించిన ‘రంగ‌రంగ వైభ‌వంగా’ మూవీ ట్రైల‌ర్ నిన్న రిలీజ్ చేశారు. దీనికి ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న ల‌భిస్తుంది. 24 గంట‌ల్లో 4 మిలియ‌న్ల డిజిట‌ల్ వ్యూస్‌తో యూట్యూబ్ ట్రెండింగ్‌లో దూసుకెళ్తుంది. గ‌త రెండు సినిమాల్లో సీరియ‌స్ పాత్ర‌ల్లో క‌నిపించిన వైష్ణ‌వ్ ఇందులో ఎంట‌ర్‌టైనింగ్ పాత్ర‌లో అల‌రిస్తున్నాడు. కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించింది. ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌కు గిరీశాయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. దేవీశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అందించాడు. సెప్టెంబ‌ర్ 2న మూవీ థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది.

    న‌వీన్ చంద్ర ‘రిపీట్’ ట్రైల‌ర్ విడుద‌ల‌

    న‌వీన్ చంద్ర హీరోగా న‌టిస్తున్న ‘రిపీట్’ మూవీ ట్రైల‌ర్ విడుద‌లైంది. ఈ సినిమాలో ఆయ‌న ఐపీఎస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఒక క్రైమ్ మిస్ట‌రీని ఛేదించే దిశ‌గా పోలీసాఫీస‌ర్ చేసే ప్ర‌య‌త్నాలు ఆస‌క్తిని పెంచుతున్నాయి. ఆగ‌స్ట్ 25 నుంచి మూవీ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. న‌వీన్ చంద్ర వ‌రుస‌గా సినిమాలు, వెబ్‌సిరీస్‌ల‌తో బిజీగా మారాడు. ప్ర‌తి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ స‌రికొత్త పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాడు. ఇటీవ‌ల హాట్‌స్టార్‌లో నవీన్ చంద్ర న‌టించిన ప‌రంప‌ర వెబ్‌సిరీస్‌కు మంచి విజ‌యం సాధించింది. https://youtube.com/watch?v=QsURblraGtE

    ఆది సాయికుమార్ ‘తీస్ మార్ ఖాన్’ ట్రైల‌ర్ విడుద‌ల

    ఆది సాయికుమార్ హీరోగా న‌టిస్తున్న ‘తీస్ మార్ ఖాన్’ మూవీ ట్రైల‌ర్ నేడు రిలీజ్ అయింది. పూర్తి యాక్ష‌న్‌తో కూడిని ఈ చిత్రాన్ని క‌ళ్యాణ్‌జీ గొగాన తెర‌కెక్కిస్తున్నాడు. స్టూడెంట్, రౌడీ, పోలీస్ మూడు షేడ్స్ ఉన్న పాత్ర‌లో ఆది క‌నిపించ‌నున్నాడు. పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఆమె ఈ సినిమాలో మ‌రోసారి అందాల ఆర‌బోత‌లో, రొమాన్స్‌లో రెచ్చిపోయింది. ఒక సునీల్, పూర్ణ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. సాయికార్తిక్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఆగ‌స్ట్ 19న మూవీ థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.

    10 మిలియ‌న్ వ్యూస్‌ క్రాస్ చేసిన ‘సీతా రామం’ ట్రైల‌ర్‌

    దుల్క‌ర్ స‌ల్మాన్, మృణాల్ ఠాకూర జంట‌గా న‌టించి సీతా రామం ట్రైల‌ర్‌కు మంచి స్పంద‌న ల‌భిస్తుంది. 10 మిలియ‌న్‌కి పైగా వ్యూస్‌తో యూట్యూబ్ ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది. స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌క‌థ‌గా వ‌స్తున్న ఈ సినిమాపై ప్రేక్ష‌కుల‌కు భారీ అంచ‌నాలు ఏర్పడ్డాయి. సెన్సార్ బోర్డు నుంచి కూడా మూవీకి U స‌ర్టిఫికెట్ రావ‌డం విశేషం. ర‌ష్మిక‌, త‌రుణ్ భాస్క‌ర్, సుమంత్ ఇందులో కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. హ‌ను రాఘ‌వ‌పుడి ద‌ర్శ‌క‌త్వం వహించాడు. సీతా రామం ఆగ‌స్ట్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

    ‘బింబ‌సార’ ట్రైల‌ర్ వ‌చ్చేసింది

    నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టించిన బింబిసార మూవీ ట్రైల‌ర్ రిలీజ్ అయింది. జూనియ‌ర్ ఎన్‌టీఆర్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. కేథ‌రిన్, సంయుక్త మీన‌న్ హీరోయిన్లుగా న‌టించారు. ఈ చిత్రాన్ని నాలుగు భాగాలుగా తెర‌కెక్కిస్తున్నారు. ట్రైల‌ర్ చూస్తుంటే రెండు జ‌న్మ‌ల‌ను క‌నెక్ట్ చేసే క‌థ‌గా తెలుస్తుంది. క‌ళ్యాణ్‌రామ్ డైలాగ్స్‌, యాక్ష‌న్ అద‌ర‌గొట్టాడు. గ్రాండ్ విజువ‌ల్ ఎఫెక్ట్స్‌తో ట్రైల‌ర్‌ రిచ్‌గా ఉంది. విశిష్ఠ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఆగ‌స్ట్ 5న చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

    ‘లైగ‌ర్’ ట్రైల‌ర్‌ అద‌రిపోయింది

    పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న ‘లైగ‌ర్’ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ అయింది. ర‌మ్య‌కృష్ణ విజ‌య్‌కి త‌ల్లిగా న‌టించింది. ఆమె ప‌క్కా మాస్ రోల్‌లో క‌నిపించింది. ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్‌తో పూరీజ‌గ‌న్నాథ్ మ‌రోసారి అద‌ర‌గొట్టాడు. ట్రైల‌ర్‌లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్‌గా నిలిచింది. చివ‌ర్లో మైక్‌టైస‌న్ మెరిశాడు. విజ‌య్ ఇందులో మాట్లాడ‌టానికి ఇబ్బందిప‌డుతున్న వ్య‌క్తిగా న‌టించాడు. బాక్స‌ర్‌గా ప‌వ‌ర్‌ఫుల్ లుక్‌లో క‌నిపించాడు. అన‌న్య పాండే విజ‌య్‌కి జంట‌గా న‌టించింది. ఈ ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను మ‌రింత పెంచింది. పూరీ క‌నెక్ట్స్‌, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ క‌లిసి ఈ … Read more

    Categories Uncategorized

    తండ్రి కోసం పోరాడే ‘గార్గి’..ట్రైల‌ర్ అదిరిపోయింది

    సాయిప‌ల్ల‌వి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ‘గార్గి’ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ అయింది. రాణా, నాని ఇద్ద‌రు హీరోలు క‌లిసి ఈ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. సాయిప‌ల్ల‌వి ఈ సినిమాలో గార్గి అనే ఒక స్కూల్ టీచ‌ర్ పాత్ర‌లో న‌టిస్తుంది. త‌న‌ తండ్రిని పోలీసులు కార‌ణం లేకుండా తీసుకెళ్లి పోలీస్ స్టేష‌న్‌లో పెట్ట‌డంతో.. అత‌డిని విడిపించేందుకు పోరాడే ఒక అమ్మాయి క‌థ‌గా గార్గి తెర‌కెక్కింది. సాయిప‌ల్ల‌వి ఎప్ప‌టిలాగే త‌న న‌ట‌న‌తో అద‌ర‌గొట్టింది. గౌత‌మ్ రామ‌చంద్ర‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. తెలుగు, త‌మిళం రెండు భాష‌ల్లో … Read more

    క‌ళ్యాణ్ రామ్ ‘బింభీస‌ర’ ట్రైల‌ర్ వ‌చ్చేస్తుంది

    క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టిస్తున్న ‘బింభీస‌ర’ ట్రైల‌ర్ జులై 4న వ‌స్తుంద‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించిన గ్లింప్స్‌ను తాజాగా విడుద‌ల చేశారు. ఈ సినిమాలో క‌ళ్యాణ్‌రామ్ మొద‌టిసారిగా మైథాల‌జిక‌ల్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఈ సినిమాలో క్యాథ‌రిన్ త్రెసా, సంయుక్త మీన‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. వ‌శిష్ఠ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఎన్‌టీఆర్ ఆర్ట్స్ ప‌తాకంపై క‌ళ్యాణ్‌రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆగ‌స్ట్ 5న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.