• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అల్లరి నరేశ్‌ ‘ఉగ్రం’ ట్రైలర్‌ వచ్చేసింది

    విజయ్‌ కనకమేడల- అల్లరి నరేశ్ కాంబినేషన్‌లో వస్తున్న మరో సీరియస్‌ మూవీ ఉగ్రం. అల్లరి నరేశ్ మునుపెన్నడూ లేని రీతిలో ఓ సీరియస్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. మే 5న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

    ఉగ్రం: గాలి శీను, CI శివ కుమార్‌ను కలిస్తే..!

    విజయ్‌ కనక మేడల, అల్లరి నరేశ్‌ నుంచి వస్తున్న రెండో చిత్రం ‘ఉగ్రం’. నాంది వంటి సూపర్‌ హిట్‌ తర్వాత మే 5న ఈ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ను చిత్రబృందం ఫన్నీగా అనౌన్స్‌ చేసింది. అల్లరి నరేశ్‌ సూపర్‌హిట్‌ పాత్ర ‘గాలి శీను’ ఉగ్రంలోని సీఐ శివకుమార్‌తో వీడియో కాల్‌లో మాట్లాడుతున్నట్లు ఈ వీడియో ఉంది. రేపు సాయంత్రం 6.03కు ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

    అదిరిపోయిన ‘ఉగ్రం’ మేకింగ్ వీడియో

    అల్లరి నరేష్‌గా హీరోగా తెరకెక్కుతున్న ఉగ్రం సినిమా మేకింగ్ వీడియో విడుదలైంది. ప్రస్తుతం ఈ వీడియో విశేషంగా ఆకట్టుకుంటోంది. ఉగ్రం చిత్రానికి విజయ్‌ కనకమేడల దర్శకత్వం వహిస్తుండగా, శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. షైన్‌ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. కాగా, ఈ చిత్రం మే 5న థియేటర్లలో సందడి చేయనుంది.

    ‘ఉగ్రం’ టీజర్‌: అల్లరి నరేశ్‌ ఉగ్రరూపం

    కెరీర్‌లో సింహభాగం కామెడీ రోల్స్‌ చేసిన అల్లరి నరేశ్‌…. నటనా ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనూ మెప్పించాడు. కానీ సీరియస్‌గా ఫైట్స్‌ చేసే రోల్‌ ఇప్పటిదాకా పడలేదు. ప్రస్తుతం అలాంటి ఓ రోల్‌లోనే ఉగ్రంలో నటిస్తున్నాడు. విజయ్‌ కనకమేడలతో రెండోసారి జత కట్టిన నరేశ్.. మరోసారి ప్రేక్షకులను పక్కాగా అలరిస్తామనే ధీమాతో ఉన్నాడు. తాజాగా ఉగ్రం టీజర్‌ విడుదల చేయగా.. అది సినిమాపై మరింత ఆసక్తి పెంచేలా ఉంది.

    అల్ల‌రి న‌రేశ్ ‘ఉగ్రం’ షూటింగ్ స్టార్ట్

    అల్ల‌రి న‌రేశ్, విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న రెండో సినిమా ‘ఉగ్రం’. నేటి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైన‌ట్లుగా చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి రిలీజ్ చేసిన వీడియోలో అల్ల‌రి న‌రేశ్ మొహానికి మ‌సి పూసుకొని భ‌యంక‌రంగా ఉగ్ర‌రూపంలో క‌నిపిస్తున్నాడు. మ‌రో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో ఆయ‌న క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తుంది. మిర్నా మీన‌న్ ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తుంది. షైన్ స్క్రీన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.