• TFIDB EN
  • గురు
    UTelugu2h 56m
    వెంకటేష్ ఒక పేరున్న బాక్సింగ్ కోచ్‌. అతను ఓ స్లమ్‌లోని యువతిని బాక్సింగ్ ఛాంపియన్‌గా మార్చడం కోసం అనేక సవాళ్లను ఎదుర్కొంటాడు.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtubeఫ్రమ్‌
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    వెంకటేష్
    ఆదిత్య ఆది రావు
    రితికా సింగ్
    రామేశ్వరి రాములు
    నాసర్
    పంచ్ చెరువులు
    తనికెళ్ల భరణి
    మురళి
    జాకీర్ హుస్సేన్
    దేవ్ ఖత్రి
    ముంతాజ్ సోర్కార్
    లక్ష్మి లక్స్
    రఘు బాబు
    సూములు
    అనిత చౌదరిరాజ్యం
    అనంత్ బాబు
    బాక్సింగ్ అసోసియేషన్ సభ్యుడు
    సంచనా నటరాజన్
    బాక్సింగ్ విద్యార్థిని
    సిబ్బంది
    సుధా కొంగర
    దర్శకుడు
    ఎస్. శశికాంత్నిర్మాత
    సంతోష్ నారాయణన్
    సంగీతకారుడు
    సతీష్ సూర్య
    ఎడిటర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Mirnalini Ravi: ‘లవ్‌ గురు’ ఫేమ్‌ మృణాళిని రవి గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?
    Mirnalini Ravi: ‘లవ్‌ గురు’ ఫేమ్‌ మృణాళిని రవి గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?
    యంగ్‌ బ్యూటీ మృణాళిని రవి (Mirnalini Ravi).. తెలుగు, తమిళ చిత్రాలలో వరుసగా నటిస్తూ చాలా బిజీగా ఉంది. ఆమె నటించిన లేటెస్ట్ చిత్రం 'లవ్‌ గురు' ఏప్రిల్‌ 11న తెలుగులో విడుదల కాబోతోంది. తమిళ స్టార్‌ హీరో విజయ్‌ ఆంటోని ఇందులో హీరోగా చేశాడు. కాగా, ఇటీవల ట్రైలర్‌లో మృణాళిని నటన అందర్నీ ఫిదా చేసింది. ముఖ్యంగా శోభనం గదిలో భర్త విజయ్ ఆంటోనికి గ్లాసులో మందు పోసే సీన్‌ ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. దీంతో ఈ బ్యూటీ గురించి తెలుసుకునేందుకు ఆడియన్స్ తెగ వెతుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.. మృణాళిని రవి ఎక్కడ పుట్టింది? తమిళనాడులోని పాండిచ్చేరిలో మృణాళిని జన్మించింది.  మృణాళిని రవి పుట్టిన తేదీ ఏది? 10 మే, 1995 మృణాళిని రవి విద్యాభ్యాసం ఎక్కడ సాగింది? బెంగళూరు మృణాళిని రవి.. ఏ స్కూల్‌లో చదువుకుంది? లేక్‌ మౌంట్‌ఫోర్ట్‌ స్కూల్‌, బెంగళూరు మృణాళిని రవి ఏం చదువుకుంది? బెంగళూరులోని ఈస్ట్‌ పాయింట్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌లో మృణాళిని బీటెక్‌ చేసింది. ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం కూడా చేసింది.  మృణాళిని రవి తల్లిదండ్రులు ఎవరు? తండ్రి పేరు విశాల్‌ రవి, తల్లి పేరు ఎక్కడా ప్రస్తావించబడలేదు. మృణాళిని రవి వయసు ఎంత? 29 సంవత్సరాలు (2024) మృణాళిని రవి బరువు ఎంత? 60 కేజీలు మృణాళిని రవి ఎత్తు ఎంత? 5 అడుగుల 7 అంగుళాలు మృణాళిని రవి ఎలా ఫేమస్‌ అయ్యింది? టిక్‌ టాక్‌, డబ్‌స్మాష్‌లో రీల్స్‌ చేసి మృణాళిని అందరి దృష్టిని ఆకర్షించింది.  మృణాళిని రవి తొలి చిత్రం? 2019లో వచ్చిన తమిళ చిత్రం 'సూపర్‌ డీలక్స్‌'.. మృణాళిని చేసిన మెుట్ట మెుదటి చిత్రం. దర్శకుడు త్యాగరాజన్‌ కుమారరాజా సోషల్‌ మీడియాలో ఈ భామ వీడియోలు చూసి అవకాశం ఇచ్చారు.  మృణాళిని రవి తొలి తెలుగు చిత్రం? గద్దల కొండ గణేష్‌ మృణాళిని రవి.. ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు? గద్దల కొండ గణేష్‌, ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్ అల్లుడు మృణాళిని రవి.. ఇప్పటివరకూ చేసిన తమిళ చిత్రాలు? ‘సూపర్‌ డీలక్స్‌’, ‘ఛాంపియన్‌’, ‘ఎనిమీ’, ‘ఎంజీఆర్‌ మగన్‌’, ‘జంగో’, ‘కోబ్రా’.. మృణాళిని రవి హాబీస్‌? ట్రావెలింగ్‌, రీడింగ్‌, సింగింగ్‌ మృణాళిని రవికి పెళ్లైందా? కాలేదు  మృణాళిని రవి నాన్‌-వెజ్‌ వంటకాలు తింటుందా? ఆమెకు నాన్ వెజ్‌ ఐటెమ్స్‌ను ఆమె ఎంతో ఇష్టంగా ఆరగించేస్తుందట. మృణాళిని రవికి ఇష్టమైన హీరో, హీరోయిన్లు? ఫేవరేట్‌ హీరో, హీరోయిన్ల గురించి మృణాళిని ఎక్కడా రివీల్ చేయలేదు.  మృణాళిని రవి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా లింక్‌? https://www.instagram.com/mirnaliniravi/
    ఏప్రిల్ 10 , 2024
    Shanmukh Jaswanth: ‘షణ్ముఖ్’ గురించి సంచలన నిజాలు బయటపెట్టిన ఫ్రెండ్స్.. ఎలాంటి వాడంటే?
    Shanmukh Jaswanth: ‘షణ్ముఖ్’ గురించి సంచలన నిజాలు బయటపెట్టిన ఫ్రెండ్స్.. ఎలాంటి వాడంటే?
    యూట్యూబర్‌, బిగ్‌బాస్‌ ఫేమ్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌ గంజాయి తీసుకుంటూ గురువారం పోలీసులకు పట్టబడ్డ విషయం తెలిసిందే. షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ తనను మోసం చేశాడంటూ డాక్టర్‌ మౌనిక అనే యువతి పెట్టిన కేసును విచారించేందుకు వెళ్లిన పోలీసులకు ఫ్లాటులో షన్ను కనిపించాడు. అతడు గంజాయి తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో సోదరుడు సంపత్‌తో పాటు షణ్ముఖ్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి. అతడికి వైద్య పరీక్షలు చేయించగా బాడీలో గంజాయి ఆనవాళ్లు గుర్తించినట్లు ఫోరెన్సిక్‌ వైద్యులు సైతం నివేదిక ఇచ్చారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి షణ్ముఖ్‌ స్నేహితులు సంచలన విషయాలు బయటపెట్టారు. షణ్ముఖ్, అతడి సోదరుడు ఎలాంటి వారో కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. ‘గంజాయి తీసుకుంది నిజమే’ యాంకర్ ధనుష్‌.. షణ్ముఖ్ జస్వంత్ అరెస్టు వెనుక అసలు నిజాలను అతడి ఫ్రెండ్స్‌ను అడిగి తెలుసుకున్నట్లు చెప్పాడు. బిగ్‌బాస్‌ ఫేమ్‌ గలాటా గీతు యూట్యూబ్‌ ఛానెల్ ద్వారా ఆ విషయాలను అతడు పంచుకున్నాడు. షన్ను గంజాయి తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన మాట వాస్తవమేనని అతడి ఫ్రెండ్స్‌ కూడా ఒప్పుకున్నట్లు ధనుష్‌ చెప్పాడు. అయితే వార్తల్లో వస్తున్నట్లుగా డ్రగ్స్, కొకైన్, ఇతర డ్రగ్ పిల్స్ కానీ అతడి వద్ద లభించలేదని స్పష్టం చేశాడు. 16 గ్రాములు గంజాయి మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం కేసు కొనసాగుతున్నందున మరిన్ని విషయాలు పంచుకునేందుకు షన్ను స్నేహితులు వెనకాడినట్లు ధనుష్ చెప్పుకొచ్చాడు.  ఆ వార్తలు అవాస్తవం : గీతూ అదే యూట్యూబ్ వీడియోలో గీతూ రాయల్‌ మాట్లాడారు. షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ మరొకర్ని పెళ్లి చేసుకున్నాడని, లివింగ్‌ రిలేషన్‌లో ఉన్నాడని వస్తోన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. వాస్తవానికి 2021లోనే వినయ్‌కు.. అతడిపై ఫిర్యాదు చేసిన మౌనికకు ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు గీతూ చెప్పారు. అప్పట్లోనే పెళ్లి అంటూ మౌనిక తనతో చెప్పిందని పేర్కొన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల సంపత్‌ - మౌనికల పెళ్లికి గ్యాప్ వచ్చిందని.. ఈ నెల 28న పెళ్లి డేట్‌ కూడా ఫిక్స్ చేసుకున్నారని వివరించారు. ఈ క్రమంలోనే మౌనిక.. వినయ్‌ స్నేహితుల్లో ఒకరికి ఫోన్‌ చేసిందని తెలిపారు. వినయ్‌ ఇంకో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు స్నేహితుడు చెప్పడంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిందని గీతూ వెల్లడించారు. ‘అలా చేయడం సరికాదు’ ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకుని.. ఇప్పుడు మరో పెళ్లి ఆలోచన చేయడం ఏంటో తనకు అర్థం కావడం లేదని గీతూ రాయల్ అన్నారు. సమస్య ఉంటే ఇద్దరు మాట్లాడుకుని విడిపోవాలి కానీ ఇలా చేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. తనకు మౌనిక కొన్ని సంవత్సరాలుగా తెలుసని ఆమె చాలా సున్నిత మనస్కురాలని గీతు చెప్పుకొచ్చారు. వినయ్‌కు పెళ్లి అయితే కాలేదని, కానీ లివింగ్ రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు అనిపిస్తోందని గీతూ పేర్కొన్నారు. ఇది ఏమైనా ఈ సమస్యను ఇద్దరూ సామరస్యంగా పరిష్కరించుకొని ఉంటే బాగుండేదని గీతూ అభిప్రాయపడ్డారు.  మౌనిక చేసిన ఆరోపణలు ఇవే! బాధిత యువతి మౌనిక(Mounika).. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అన్న సంపంత్‌తో పాటు షణ్ముఖ్‌పైనా సంచలన ఆరోపణలు చేసింది. యూట్యూబ్‌లో అవకాశం ఇస్తానని చెప్పి షణ్ముఖ్‌ తనను మోసం చేశాడని తెలిపింది. మరోవైపు సంపత్‌ తనను హోటల్స్, విల్లాలకు తీసుకెళ్లి లైంగిక దాడి చేసినట్లు ఆరోపించింది. ఈ క్రమంలో తాను గర్భవతిని కాగా, సంపత్‌ భయపెట్టి అబార్షన్‌ కూడా చేయించాడని పేర్కొంది. తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో ఓ రింగ్‌ తొడిగి నిశ్చితార్థం అయిపోయిందని చెప్పాడని వివరించింది. అటు షణ్ముఖ్‌ దగ్గర గంజాయి, డ్రగ్స్‌ పిల్స్ ఉన్నాయని మౌనిక ఆరోపించింది. తన దగ్గర వీడియో ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పింది. ఓ కానిస్టేబుల్‌ షణ్ముఖ్‌కు సాయపడాలని చూశాడని ఆమె ఆరోపించింది. తనకు ప్రాణ భయం ఉందని.. రక్షణ కల్పించాలంటూ మౌనిక పోలీసులను వేడుకుంది.  షణ్ముఖ్‌కు ఇది తొలిసారి కాదు! షణ్ముఖ్ అరెస్టు కావడం ఇది మొదటి సారి కాదు. గతంలో హిట్ అండ్ రన్ కేసులో షణ్ముఖ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు మద్యం సేవించి లేకపోవడంతో ఆ కేసు నుండి షణ్ముఖ్‌ త్వరగానే బయపడగలిగాడు. అయితే తనపై పడ్డ మచ్చను తుడిపేసుకోవాలన్న లక్ష్యంతో షణ్ముఖ్‌ బిగ్‌బాస్‌ సీజన్‌-5లో అడుగుపెట్టాడు. కానీ అక్కడ అక్కడ తోటి హౌస్‌మేట్‌ సిరి హనుమంత్‌తో హద్దులు మీరడంతో విన్నర్‌ కావాల్సిన షణ్ముఖ్‌ రన్నర్‌ కావాల్సి వచ్చింది. ఆ సీజన్‌ విజేతగా సన్నీ నిలిచాడు.  బిగ్‌బాస్‌ ఎఫెక్ట్‌తో బ్రేకప్‌! బిగ్‌బాస్‌ వెళ్లడానికి ముందు వరకూ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ దీప్తి సునైనాతో షణ్ముఖ్‌ డీప్‌ లవ్‌లో ఉండేవాడు. అప్పట్లో ఎక్కడ చూసిన ఈ జంటే కనిపించింది. సోషల్‌ మీడియాలోనూ వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు చక్కర్లు కొట్టేవి. అయితే బిగ్‌బాస్‌ ఇంట్లో సిరితో చేసిన సిల్లీ పనుల వల్ల వారి ప్రేమకు బ్రేకప్‌ పడింది.  అయితే బ్రేకప్ బాధలో ఉన్న తమ్ముడికి ఆ సమయంలో  అన్న సంపత్‌ ప్రేమ పాఠాలు చెప్పి కళ్లు తెరిపించాడు. ప్రేమలో ఓడి పోయావని దిగులు చెందవద్దని ముందు ముందు దేశం మెుత్తం నిన్ను ప్రేమిస్తుందని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ పోస్టు పెట్టాడు. అయితే అప్పుడు తమ్ముడికి ప్రేమ సూక్తులు, జీవిత పాఠాల గురించి చెప్పి ఇప్పుడు ప్రేయసి మోసం చేసిన కేసులో సంపత్ అరెస్టు కావడం విడ్డూరంగా ఉంది. షణ్ముఖ్‌తో క్లోజ్‌.. వైష్ణవి లవ్‌ బ్రేకప్‌! బేబీ (Baby Movie)సినిమాతో బాగా పాపులర్ అయిన హీరోయిన్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya).. ఆ చిత్రానికి ముందు యూట్యూబ్‌ సిరీస్‌లలో నటించేది. ముఖ్యంగా షణ్ముఖ్ జస్వంత్‌తో చేసిన ‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్’ సిరీస్‌ ఆమెకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇందులో షన్ను, వైష్ణవి జోడీ సూపర్‌గా ఉందంటూ కామెంట్స్ వినిపించాయి. వీటికి తోడు అప్పట్లో ఈ జంట కలిసి చేసి డ్యూయెట్‌ రీల్స్‌ కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. అయితే ‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’ సిరీస్‌కు ముందు వైష్ణవి.. బిగ్‌బాస్‌ ఫేమ్‌ మెహబూబ్‌ దిల్సేతో చాలా క్లోజ్‌గా ఉండేదట. వారిద్దరూ రిలేషన్‌లో ఉన్నట్లు సోషల్‌ మీడియా గుసగుసలు వినిపించాయి. అయితే షన్నుతో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ చేసినప్పటి నుంచి వారి మధ్య దూరం పెరిగిందట. షన్నుతో వైష్ణవి క్లోజ్‌గా ఉండటంతో మెహబూబ్‌ దూరంగా వెళ్లిపోయినట్లు గాసిప్స్‌ వచ్చాయి.  షణ్మఖ్‌ను ఫేమస్‌ చేసిన సిరీస్‌లు ఇవే! 2018లో వచ్చిన 'నన్ను దోచుకుందువటే' చిత్రంలో ఓ చిన్న పాత్ర ద్వారా షణ్ముఖ్‌ తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో యూట్యూబ్‌పై తన ఫోకస్ పెట్టాడు. 2020లో అతడు చేసిన ‘ది సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’ (The Software Developer) అతడి కెరీర్‌ను మలుపు తిప్పింది. యూత్‌లో ఎనలేని క్రేజ్‌ను తీసుకువచ్చింది. ఆ తర్వాత వరుసగా ‘సూర్య’, ‘స్టూడెంట్‌’ వంటి యూట్యూబ్‌ సిరీస్‌లలో నటించి షణ్ముఖ్‌ తన క్రేజ్‌ను మరింత పెంచుకున్నాడు. రుక్మిణి, మలుపు, Shanmukh Anthem, జాను, అయ్యయ్యో వంటి మ్యూజిక్ ఆల్బమ్స్‌తోనూ షణ్మఖ్‌ మంచి పేరు సంపాదించాడు.
    ఫిబ్రవరి 23 , 2024
    <strong>Lokesh Kanagaraj: రజనీకాంత్‌ ఆరోగ్యంపై లోకేష్‌ కనగరాజ్‌ తాజా అప్‌డేట్</strong>
    Lokesh Kanagaraj: రజనీకాంత్‌ ఆరోగ్యంపై లోకేష్‌ కనగరాజ్‌ తాజా అప్‌డేట్
    తమిళ సూపర్ స్టార్‌ రజనీకాంత్‌ ఇటీవల అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఆయన గురువారం (అక్టోబర్‌ 3) రాత్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. అయితే రజనీ అనారోగ్యానికి కూలి షూటింగ్‌కు ముడిపెడుతూ కొన్ని వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. షూటింగ్‌ ఒత్తిడి వల్లే ఆయన ఆరోగ్యం చెడిపోయిందంటూ కొన్ని యూట్యూబ్‌ ఛానెల్స్‌, నెటిజన్లు కామెంట్స్‌ చేశారు. దీనిపై కూలి సినిమా డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా పలు యూట్యూబ్‌ ఛానల్స్‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చారు.&nbsp; ‘రజనీ కంటే షూటింగ్‌ ముఖ్యం కాదు’ రజనీకాంత్‌ ఆరోగ్యం విషయంలో కూలి చిత్ర బృందాన్ని తప్పుబడుతూ చక్కర్లు కొడుతున్న వార్తలపై డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ స్పందించారు. ఆయా వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. అలాంటి ప్రచారాలు చూస్తుంటే బాధగా ఉంటుందని చెప్పుకొచ్చారు. 'దాదాపు నెల రోజుల క్రితం వైజాగ్‌ షెడ్యూల్‌లో తన ఆరోగ్యం గురించి రజనీకాంత్‌ మాతో చెప్పారు. తానొక సర్జరీ చేయించుకోవాల్సి ఉందన్నారు. ఈ క్రమంలోనే మేము సెప్టెంబర్‌ 28 నాటికి ఆయనకు సంబంధించిన ముఖ్యమైన షూటింగ్‌ పోర్షన్‌ పూర్తి చేశాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. నేను ఆయనతో మాట్లాడాను. ఆయన ఆరోగ్యం కంటే షూటింగ్‌ మాకు ముఖ్యం కాదు. కాబట్టి ఏదైనా విషయంపై పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే ఇలాంటి వార్తలు రాయండి అని కోరుతున్నా’ అని లోకేశ్‌ కనగరాజ్‌ మండిపడ్డారు. అక్టోబర్‌ 15 తర్వాత రజనీకాంత్‌ తిరిగి సెట్‌లోకి అడుగుపెడతారని ఆయన స్పష్టం చేశారు.&nbsp; రజనీ అనారోగ్య సమస్య ఏంటంటే? రజనీకాంత్‌ ఆరోగ్యం విషయానికి వస్తే సెప్టెంబర్‌ 30న ఆయన చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రిలో చేరారు. గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడినట్లు వైద్యులు గుర్తించారు. ట్రాన్స్‌కాథెటర్‌ పద్ధతి ద్వారా చికిత్స అందించి స్టెంట్ అమర్చారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆయన్ని గురువారం రాత్రి డిశ్చార్జ్‌ చేశారు. కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరమని రజనీకి సూచించారు. దీంతో ప్రస్తుతం కుటుంబ సమక్షంలో రజని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకొని షూటింగ్‌లో పాల్గొనాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.&nbsp; కూలీలో స్టార్ క్యాస్ట్‌! రజనీకాంత్‌ 171 చిత్రంగా ‘కూలీ’ (Coolie Movie) సినిమా రూపుదిద్దుకుంటోంది. ‘మాస్టర్‌’, ‘విక్రమ్‌’, ‘లియో’ వంటి వరుస హిట్స్‌ తర్వాత లోకేష్‌ కనగరాజ్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం కావడంతో సహజంగానే ‘కూలి’పై అంచనాలు ఏర్పడ్డాయి. బంగారం స్మగ్లింగ్‌ నేపథ్యంతో దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ‘కూలీ నెంబర్‌ 1421’ దేవాగా రజనీకాంత్‌ కనిపించనున్నారు. ఇందులో టాలీవుడ్‌ దిగ్గజ నటుడు నాగార్జున ఓ స్పెషల్‌ పాత్ర చేస్తున్నాడు. సైమన్‌ అనే క్రూయల్‌ పాత్రలో నాగ్ కనిపించనున్నాడు. అలాగే కన్నడ స్టార్‌ హీరో ఉపేంద్ర కూాడా ఇందులో నటిస్తున్నాడు. అలాగే సౌబిన్‌ షాహిర్‌, శ్రుతి హాసన్‌, సత్యరాజ్‌ వంటి పాపులర్‌ నటులు ఈ బిగ్‌ ప్రాజెక్టులో భాగమయ్యారు.&nbsp; సైమన్‌ యాక్షన్‌ సీన్‌ లీక్‌ రజనికాంత్‌, లోకేష్‌ కనగరాజ్‌ కాంబోలో వస్తోన్న ‘కూలీ’ చిత్రంలో నాగార్జున ఓ స్పెషల్‌ రోల్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. నాగ్‌ పోషిస్తున్న సైమన్‌ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను సైతం చిత్ర యూనిట్‌ గతంలో రిలీజ్‌ చేసింది. ఇదిలా ఉంటే షూటింగ్‌లో నాగార్జునకు సంబంధించిన వైలెంట్‌ సీన్‌ ఇటీవల లీకయ్యింది. ఇందులో నాగ్‌ రూత్‌ లెస్‌గా కనిపించాడు. రోలెక్స్‌ (విక్రమ్‌ సినిమాలో సూర్య పాత్ర) తరహాలో చాలా క్రూరంగా కనిపించాడు. ఓ వ్యక్తిని కొట్టి కొట్టి చంపేస్తున్నాడు. తమిళ్‌లో డైలాగ్‌ కూడా చెప్పాడు. ఈ క్లిప్‌ క్షణాల్లో నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నాగార్జునను ఇంత వైలెంట్‌గా ఎప్పుడు చూడలేదని కామెంట్స్‌&nbsp; చేశారు..&nbsp; https://twitter.com/pakkatelugunewz/status/1836362784348737582 లోకేష్‌పై పవన్‌ ప్రశంసలు కోలీవుడ్‌లో తనకు ఇష్టమైన దర్శకుడి గురించి పవన్‌ కల్యాణ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దర్శకుల విషయానికి వస్తే తనకు మణిరత్నం (Maniratnam) అంటే చాలా ఇష్టమని పవన్‌ అన్నారు. ప్రస్తుత దర్శకుల్లో లోకేష్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) ఫిల్మ్‌ మేకింగ్‌ ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘లియో’, ‘విక్రమ్‌’ సినిమాలు తాను చూశానని అన్నారు. అవి తనకు బాగా నచ్చాయని ప్రశంసించారు. పవన్‌ వంటి స్టార్‌ హీరో తనను మెచ్చుకోవడంతో దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ స్పందించారు. ‘మీ నుంచి అలాంటి మాటలు వినడం ఎంతో ఆనందంగా గౌరవంగా ఉంది సర్. నా వర్క్ మీకు నచ్చడం ఎంతో గ్రేట్‌గా ఆహ్లదంగా అనిపిస్తుంది. మీకు నా కృతజ్ఞతలు’ అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు.&nbsp; https://twitter.com/i/status/1841446808888758277 https://twitter.com/Dir_Lokesh/status/1841691807983534592
    అక్టోబర్ 05 , 2024
    Teachers Day 2023: తెలుగు తెరపై పంతులమ్మ పాత్రల్లో అలరించిన టాలీవుడ్ ముద్దుగుమ్మలు వీళ్లే..!
    Teachers Day 2023: తెలుగు తెరపై పంతులమ్మ పాత్రల్లో అలరించిన టాలీవుడ్ ముద్దుగుమ్మలు వీళ్లే..!
    భారతీయ సంస్కృతిలో ఉపధ్యాయ వృత్తికి అత్యున్నత గౌరవం ఉంది. పురాణాలు, చరిత్రలో గురువులకు సముచిత స్థానం కల్పించారు మన పూర్వికులు. "గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః" అంటూ గురువును త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పొల్చారు. విద్యార్థుల్లో అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రబోధించే గురువులకు అప్పటికీ, ఇప్పటికీ ఉన్నారు. వారందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. ఈ సందర్భంగా తెలుగు తెరపై టీచర్లుగా నటించి మంచి గుర్తింపు పొందిన నటీమణులు చాలా మంది ఉన్నారు. ఆ పంతులమ్మలు ఎవరో ఓసారి చూద్దాం... విజయశాంతి: తెలుగు తెరపై ఎన్ని సినిమాలు వచ్చినా అందులో విజయశాంతి నటించిన ‘రేపటి పౌరులు’, ‘ప్రతిఘటన’ చిత్రాలు ఎప్పటికీ ప్రత్యేకమైనవే. ప్రతిఘటనలో లెక్చరర్‌గా ఆమె పాత్ర ఎప్పటికీ గుర్తిండిపోతుంది. ఆ సినిమాలో గతి తప్పిన విద్యార్థులను ఉద్దేశిస్తూ విజయశాంతి పాడిన పాట సినిమాకే హైలెట్. "ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతలోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో మరో మహాభారతం ఆరవవేదం మానభంగపర్వంలో మాతృహృదయ నిర్వేదం నిర్వేదం... ఆసిన్ విజయశాంతి తర్వాత టీచర్ పాత్ర చేసి అంత గుర్తింపు పొందిన హీరోయిన్ ఆసిన్. విక్టరీ వెంకటేష్ నటించిన ఘర్షణ చిత్రంలో మ్యాథ్య్ టీచర్‌గా సీరియస్‌ రోల్‌ నటించి మెప్పించింది. కమలినీ ముఖర్జీ హ్యాపీ డేస్ చిత్రంలో తన గ్లామర్‌తో మాయ చేసింది కమలినీ ముఖర్జీ. ఇంగ్లిష్ లెక్చరర్‌గా కనువిందు చేసింది. ఇలియానా రవితేజ నటించిన ‘ఖతర్నాక్’ మూవీలో చేసిన టీచర్ పాత్రకు కాస్త గ్లామర్ అద్దింది ఇలియానా. ఈ రోల్‌పై అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. టీచర్‌ పాత్రను ఇలా చూపించడం ఏమిటంటూ పలువురు పెదవి విరిచారు. నయనతార లేడీ బాస్ నయనతార సైతం పలు చిత్రాల్లో పంతులమ్మ క్యారెక్టర్లో నటించి మెప్పించింది. ‘నేనే అంబానీ మూవీలో టీచర్‌ క్యారెక్టర్‌లో నటించి మెప్పించింది. అనుపమ పరమేశ్వరన్ క్యూట్ డాల్ అనుపమ పరమేశ్వరన్ కూడా టీచర్ రోల్‌ మెప్పించి ఔరా అనిపించింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ‘రాక్షసుడు’ చిత్రంలో టీచర్ పాత్రలో కనిపించింది. సాయి పల్లవి ఈ తరం కుర్రకారును లెక్చరర్ పాత్రలో బాగా మెప్పించిన రోల్‌ ఏదైన ఉందంటే&nbsp; 'ప్రేమమ్'(మలయాళం) సినిమాలో సాయిపల్లవి చేసిన అధ్యాపకురాలి పాత్ర. ఈ పాత్రలో సాయిపల్లవి పరకాయ ప్రవేశం చేసి అలరించింది. శృతిహాసన్ తెలుగులో వచ్చిన 'ప్రేమమ్' సినిమాలోనూ లెక్చరర్ పాత్రలో ఒదిగిపోయింది శృతిహాసన్‌. ఆ సినిమాలో హీరోగా నాగచైతన్య నటించిన సంగతి తెలిసిందే. సన్నిలియోన్ మంచు మనోజ్ హీరోగా నటించిన ‘కరెంటు తీగ’ సినిమాలో కాసేపు టీచర్ పాత్రలో నటించి కాసేపు కనువిందు చేసింది సన్ని లియోన్. షకిలా నితిన్-సదా జంటగా నటించిన జయం సినిమాలో షకిలా లెక్చరర్ పాత్రలో నటించి నవ్వులు పూయించింది. అప్పట్లో ఈ క్యారెక్టర్ వివాదాస్పదమైంది. &nbsp; కలర్స్ స్వాతి సుమంత్ హీరోగా నటించిన గోల్కొండ హై స్కూల్ చిత్రంలో టీచర్ పాత్రలో మెరిసింది కలర్స్ స్వాతి&nbsp; సంయుక్త మీనన్ ధనుష్ హీరోగా నటించిన 'సార్' మూవీలో లెక్చరర్ పాత్రలో నటించి కనువిందు చేసింది సంయుక్త మీనన్. బయాలజీ టీచర్‌ రోల్‌లో నటించి అలరించింది. ఈ సినిమా సూపర్ హిట్&nbsp; సుహాసిని ఇక పాత తరంలో 'ఆరాధన' సినిమాలో సుహాసిని చేసిన టీచర్ పాత్ర ఎప్పటికీ గుర్తిండిపోతుంది. ఈ చిత్రంలో చిరంజీవి హీరోగా నటించిన సంగతి తెలిసిందే.
    సెప్టెంబర్ 05 , 2023
    <strong>Saripodhaa Sanivaaram Weekend Collections: భారీ వర్షాల్లోనూ ఆగని ‘సరిపోదా శనివారం’ జోరు.. 4 రోజుల కలెక్షన్స్‌ ఎంతంటే?</strong>
    Saripodhaa Sanivaaram Weekend Collections: భారీ వర్షాల్లోనూ ఆగని ‘సరిపోదా శనివారం’ జోరు.. 4 రోజుల కలెక్షన్స్‌ ఎంతంటే?
    నాని హీరోగా నటించిన లేటెస్ట్‌ చిత్రం 'సరిపోదా శనివారం' (Saripodhaa Sanivaaram Weekend Collections). గురువారం (ఆగస్టు 29) విడుదలైన ఈ చిత్రం హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో నానితో పాటు విలన్‌గా చేసిన ఎస్‌.జే. సూర్య నటనపై ఆడియన్స్‌ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.&nbsp; ఫలితంగా బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం దుమ్మురేపుతోంది. గత మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నప్పటికీ నాని సినిమా జోరు ఏమాత్రం తగ్గలేదు. పైగా రోజు రోజుకు థియేటర్‌ అక్యుపెన్సీ పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో వీకెండ్‌లో నాని చిత్రం ఎంత వసూలు చేసింది? తొలి నాలుగు రోజుల్లో ఏమేరకు కలెక్షన్స్‌ కొల్లగొట్టింది? ఇప్పుడు చూద్దాం.&nbsp; వీకెండ్‌ కలెక్షన్స్ ఎంతంటే? నాని హీరోగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ జంటగా నటించిన ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram Day 1 Collections) చిత్రం అందరి అంచనాలను అందుకుంటూ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలి నాలుగు రోజుల్లో వరల్డ్‌ వైడ్‌గా రూ.68.52  కోట్లు (GROSS) సాధించినట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్‌ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశారు. ఇదిలా ఉంటే ట్రేడ్‌ వర్గాల లెక్కల ప్రకారం ‘సరిపోదా శనివారం’ దేశంలో రూ.33.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.18 కోట్లు వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఇప్పటివరకూ రూ.29.65 వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. అటు కర్ణాటకలో రూ. 4.65 కోట్లు, తమిళనాడులో రూ.3.23 కోట్లు, కేరళలో రూ.27 లక్షలు, రెస్ట్‌ ఆఫ్‌ ఇండియాలో రూ.1.45 కోట్లు రాబట్టినట్లు వివరించాయి.  రూ.100 కోట్ల మార్క్‌ దిశగా.. బాక్సాఫీస్‌ వద్ద సరిపోదా శనివారం దూకుడు చూస్తుంటే ఈజీగానే రూ.100 కోట్ల మార్క్ అందుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తొలి నాలుగు రోజుల్లోనే దాదాపు రూ.70 కోట్లు వసూలు చేసింది. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో వాయు గుండం ప్రభావం లేకుండా ఉంటే ఇంకా ఎక్కువ కలెక్షన్స్‌ వచ్చేవని ట్రేడ్‌ వర్గాలు అభిప్రాయపడ్డాయి. వర్ష ప్రభావం తగ్గితే ‘సరిపోదా శనివారం’ వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేశాయి. తద్వారా అలవోకగా రూ.100 కోట్లు వసూలు చేస్తుందని పేర్కొన్నాయి. నాని కెరీర్‌లో ‘దసరా’ మాత్రమే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టింది. దీంతో రెండో చిత్రం లోడింగ్‌ అంటూ నాని ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు.  నెలలోపే ఓటీటీలోకి..! నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో వచ్చిన 'సరిపోదా శనివారం' (Saripodhaa Sanivaaram OTT) నెల రోజుల లోపే ఓటీటీలోకి రానున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా సెప్టెంబర్‌ 26 నుంచి ప్రసారం అవుతుందని స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ఆ రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి వస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే హిందీ వెర్షన్‌పై మాత్రం స్పష్టమైన సమాచారం లేదని అంటున్నారు. నెట్‌ఫ్లిక్స్‌తో పాటు జియో సినిమాలోనూ హిందీ వెర్షన్‌ స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. అయితే కలెక్షన్స్‌, ఆడియన్స్‌ రెస్పాన్స్‌ను బట్టి ఓటీటీ రిలీజ్‌ డేట్‌లో మార్పులు జరిగే అవకాశం లేకపోలేదు.&nbsp; సినిమాలో అవే హైలెట్స్‌ ‘మెంటల్‌ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’, ‘అంటే సుందరానికి’ చిత్రాలతో క్లాసిక్‌ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన వివేక్‌ ఆత్రేయ తనలోని ఊర మాస్‌ను ఈ చిత్రం ద్వారా పరిచయం చేశారు. తన శైలికి భిన్నంగా అదిరిపోయే యాక్షన్‌ సన్నివేశాలతో సినిమాను రూపొందించి ప్రశంసలు అందుకుంటున్నాడు. నాని, ఎస్‌.జే సూర్య నటన, యాక్షన్ సీక్వెన్స్‌, జేక్స్‌ బేజోయ్‌ నేపథ్య సంగీతం సినిమాకు హైలెట్స్‌గా నిలిచాయి. ముఖ్యంగా హీరో - విలన్‌ మధ్య వచ్చే టామ్‌ అండ్‌ జెర్రీ తరహా సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి. అయితే నిడివి మరి ఎక్కువగా ఉండటం, పెద్దగా మలుపులు లేకపోవడం, కమర్షియల్‌ హంగులు మిస్సవడం, ప్రిడిక్టబుల్‌గా స్టోరీ ఉండటం సినిమాకు కాస్త మైనస్‌లుగా మారాయి. ‘సరిపోదా శనివారం’ స్టోరీ ఇదే.. సూర్య (నాని) ఎల్‌ఐసీ ఎజెంట్‌గా పనిచేస్తుంటాడు. కళ్లెదుట అన్యాయం జరిగితే అసలు సహించలేడు. తన కోపాన్ని ప్రదర్శించడానికి శనివారాన్ని సూర్య ఎంచుకుంటాడు. మరోవైపు సోకులపాలెం ప్రాంతంలోని ప్రజలు కష్టాలు అనుభవిస్తుంటారు. పోలీసు ఆఫీసర్‌ దయా (ఎస్‌.జే సూర్య) వారిని హింసిస్తుంటాడు. తన అధికార బలంతో చిత్ర హింసలకు గురిచేస్తుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హీరో సోకులపాలెం ప్రజలకు అండగా నిలవాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత క్రూరమైన పోలీసు అధికారిని సూర్య ఎలా ఎదిరించాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? హీరో శనివారమే విజృంభించడానికి కారణమేంటి? హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌తో అతడి లవ్‌ ట్రాక్‌ ఏంటి? హీరో-విలన్‌ మధ్య జరిగిన నువ్వా నేనా పోటీలో ఎవరు గెలిచారు? అన్నది స్టోరీ.
    సెప్టెంబర్ 02 , 2024
    <strong>Kalki 2898 AD Day1 Collections Target: అదే జరిగితే ప్రభాస్‌ చరిత్ర సృష్టించడం ఖాయం..!</strong>
    Kalki 2898 AD Day1 Collections Target: అదే జరిగితే ప్రభాస్‌ చరిత్ర సృష్టించడం ఖాయం..!
    బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిసేందుకు సరిగ్గా ఒక రోజే మిగిలి ఉంది. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో తొలి రోజు కలెక్షన్స్‌లో ఎలాంటి రికార్డ్స్‌ బద్దలు అవుతాయోనని యావత్ సినీ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే కల్కి సినిమా ప్రీ బుకింగ్స్‌ టికెట్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. ముంబయి వంటి నగరాల్లో ఒక్కో టికెట్‌ రూ.3000 వేలకు సైతం విక్రయించారు. అటు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం టికెట్ ధరలు పెంచేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాయి. దీంతో డే1 కలెక్షన్స్‌ పరంగా కల్కి సరికొత్త రికార్డ్‌ సృష్టించే అవకాశముందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నారు. తొలి రోజు రూ.230 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టి.. ఇండియన్‌ బాక్సాఫీస్‌ చరిత్రను తిరగరాస్తుందని విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లో డే 1 కలెక్షన్స్‌ పరంగా టాప్‌-10 చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; యూఎస్‌లో రికార్డు వసూళ్లు 'కల్కి 2898 ఏడీ' చిత్రం యూఎస్‌లో దుమ్మురేపుతోంది. విడుదలకు ముందే పలు రికార్డులు బ్రేక్‌ చేస్తోంది. ఇప్పటికే యూఎస్‌లో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ కలెక్షన్స్‌ 3 మిలియన్లు దాటిపోయాయి. కల్కికి పాజిటివ్‌ టాక్‌ వస్తే ఈజీ గానే 'ఆర్‌ఆర్‌ఆర్‌', ‘బాహుబలి 2’ రికార్డ్స్‌ను చెరిపేస్తుందని అక్కడి వారు అంటున్నారు. యూఎస్‌లోని కొన్ని ఏరియాల్లో కల్కి టికెట్‌ ధర గరిష్టంగా రూ.1.5 లక్షలు కూడా పలికినట్లు చెబుతున్నారు. ఈ ఊపు చూస్తుంటే కల్కికి ఏమాత్రం పాటిజివ్‌ టాక్‌ వచ్చినా ఓవర్సీస్‌ రికార్డులు బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తోంది.&nbsp; Top 10 Highest Opening Day Collections in India 1. ఆర్‌ఆర్‌ఆర్‌ (2022) ఎన్టీఆర్‌ (Jr.NTR), రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోలుగా ఎస్‌.ఎస్‌. రాజమౌళి (S.S. Rajamouli) తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) చిత్రం తొలిరోజు అత్యధిక గ్రాస్‌ వసూలు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ మూవీ మెుదటి రోజే రూ.223.5 కోట్లను కొల్లగొట్టి అప్పటివరకూ ఉన్న అన్ని రికార్డులను చెరిపేసింది. ఆర్‌ఆర్‌ఆర్‌ వసూళ్లను చూసి ట్రేడ్‌ వర్గాలు సైతం ఆశ్యర్యపోవడం గమనార్హం. 2. బాహుబలి 2 (2017) రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ (Baahubali 2) ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఈ సినిమా తొలి రోజు వరల్డ్‌ వైడ్‌గా రూ. 214.5 కోట్లను రాబట్టింది. RRR రిలీజ్‌కు ముందు వరకూ ఐదేళ్ల పాటు ఈ మూవీనే హైయస్ట్‌ ఇండియన్‌ ఓపెనింగ్‌ గ్రాసర్‌ మూవీగా (Highest Indian Opening Grosser Movie)గా కొనసాగుతూ వచ్చింది.&nbsp; 3. సలార్‌ (2023) ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందిన సలార్‌ చిత్రం.. తొలిరోజున రూ.178.7 కోట్ల వసూళ్లను రాబట్టింది. 2023 ఏడాదిలో అత్యధిక డే1 వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలో ప్రభాస్‌ విశ్వరూపం చూపించాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టాడు. ప్రభాస్‌ కటౌట్‌కు తగ్గ సినిమా ఇదని ఫ్యాన్స్‌ తెగ మెచ్చుకున్నారు.&nbsp; 4. కేజీఎఫ్‌ 2 (2022) ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యష్‌ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్‌ 2 (KGF 2) చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పలు రికార్డులను కొల్లగొట్టింది. ఈ క్రమంలో తొలి రోజు అత్యధిక వసూళ్లను రాబట్టిన మూడో చిత్రంగాను సత్తా చాటింది. ఈ చిత్రం మెుదటి రోజు రూ.164.5 కలెక్షన్స్‌ సాధించింది. ఈ జాబితాలోని తొలి మూడు చిత్రాలు దక్షిణ సినీ రంగానికి చెందినవి కావడం విశేషం.&nbsp; 5. ఆదిపురుష్‌ (2023) ప్రభాస్‌ రాముడిగా, కృతి సనన్‌ సీతగా బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్‌’ (Adipurush). ఈ మూవీ ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ తొలి రోజు మాత్రం మంచి గ్రాస్‌ వసూళ్లనే సాధించింది. ఆదిపురుష్‌ మెుదటి రోజు కలెక్షన్స్‌ రూ.136.8 కోట్లుగా రికార్డ్‌ అయ్యాయి. 6. జవాన్‌ (2023) బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ నటించిన జవాన్‌ చిత్రం.. గతేడాది సెప్టెంబర్‌లో విడుదలై తొలిరోజున రూ.129.6 కోట్లు కొల్లగొట్టింది. హిందీ సినిమా హిస్టరీలో తొలి రోజున ఆ స్థాయి కలెక్షన్స్ రాబట్టిన మెుదటి చిత్రంగా నిలిచింది. ప్రముఖ సౌత్‌ ఇండియన్‌ డైరెక్టర్‌ అట్లీ తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి విలన్‌గా చేశారు. లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ఈ సినిమాలో తొలిసారి షారుక్‌తో జత కట్టింది. 7. సాహో (2019) ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన సాహో (Saaho) కూడా ఫస్ట్‌డే రోజున రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టింది. తొలి రోజున ఈ మూవీ రూ.125.6 కోట్లు సాధించినట్లు అప్పట్లో చిత్ర వర్గాలు ధ్రువీకరించాయి. సుజిత్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రభాస్‌కు జోడీగా శ్రద్ధా కపూర్‌ చేసింది.&nbsp; 8. రోబో 2.0 (2018) తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా చేసిన ‘రోబో 2.0’ చిత్రం అత్యధిక గ్రాస్‌ వసూళ్లు రాబట్టిన ఆరో భారతీయ చిత్రంగా రికార్డు కెక్కింది. ఈ మూవీ తొలి రోజున రూ.105.6 కోట్లు రాబట్టడం విశేషం. అయితే ఫ్లాప్‌ టాక్‌ రావడంతో ఫస్ట్‌డే పరంపరను రోబో 2.0 కొనసాగించలేకపోయింది. శంకర్‌ డైరెక్ట్‌ చేసిన ఈ మూవీలో అక్షయ్‌ కుమార్‌ విలన్‌గా నటించాడు.&nbsp; 9. పఠాన్‌ (2023) ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన షారుక్‌ ఖాన్‌ పఠాన్‌ (Pathaan) చిత్రం ఫస్ట్‌డే రూ.104.8 కోట్లు కొల్లగొట్టింది. తద్వారా తాజా జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది. సరైన హిట్‌ కోసం ఎదురుచూస్తున్న షారుక్‌కు పఠాన్‌ మూవీ మంచి బూస్టప్‌ ఇచ్చింది. తాజాగా రిలీజైన జవాన్‌ కూడా హిట్‌ సాధించడంతో షారుక్‌తో పాటు, ఆయన ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు.&nbsp; 10. జైలర్‌ (2023) రజనీకాంత్‌ లేటెస్ట్‌ మూవీ ‘జైలర్‌’ (Jailer) సైతం తొలిరోజు వరల్డ్‌ వైడ్‌గా రూ.91.2 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. ఈ స్థాయి కలెక్షన్స్‌ సాధించిన తొలి తమిళ చిత్రంగానూ రికార్డు సృష్టించింది. ఈ చిత్రం ఓవరాల్‌గా రూ.650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. తాజాగా ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ అక్కడ కూడా దూసుకుపోతోంది.&nbsp;
    జూన్ 26 , 2024
    <strong>Kalki 2898 AD: విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ క్యామియో కన్ఫార్మ్‌ చేసిన నాగ్ అశ్విన్.. రోల్స్ ఏమిటంటే?</strong>
    Kalki 2898 AD: విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ క్యామియో కన్ఫార్మ్‌ చేసిన నాగ్ అశ్విన్.. రోల్స్ ఏమిటంటే?
    పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ఫ్యాన్స్‌తో పాటు యావత్‌ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఈ చిత్రం గురువారం (జూన్‌ 27) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌, టీజర్‌ ఇప్పటికే విడుదలవ్వగా.. వాటికి విశేష ఆదరణ లభిస్తోంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌లతో పాటు కుర్ర హీరోలు విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌ సైతం నటిస్తున్నారని గత కొంత కాలంగా టాక్‌ వినిపిస్తోంది. అయితే ఇది నూటికి నూరు శాతం నిజమని తెలుస్తోంది. ఈ విషయాన్ని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ స్వయంగా వెల్లడించారు.&nbsp; వీడియో వైరల్‌..! ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన కల్కి చిత్రం.. రేపు (జూన్‌ 27) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌.. నాగ్‌ అశ్విన్‌ సోషల్‌ మీడియాలో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌.. విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌ పేర్లను ప్రస్తావిస్తూ.. కల్కిలో భాగమైనందుకు ధన్యవాదాలు చెప్పారు. అటు ప్రభాస్‌ సైతం వారు సినిమాలో అతిథి పాత్రలు పోషించినందుకు థ్యాంక్స్‌ తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్ తెగ ట్రెండ్‌ చేస్తున్నారు. విజయ్‌ క్యామియోతో కల్కి థియేటర్లు బద్దలవుతాయని రౌడీ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/AyyoEdits/status/1805955173459656978 విజయ్‌ పాత్ర అదేనా? తాజాగా కల్కి రెండో ట్రైలర్‌ రిలీజ్‌ కాగా.. అందులో విజయ్‌ దేవరకొండను చూపకనే చూపించారంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ ట్రైలర్‌లో మహాభారత సంగ్రామం సీక్వెన్స్‌ను కొద్దిసేపు చూపించారు. ఇందులో అశ్వత్థామ పాత్ర పోషించిన అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) అర్జునుడితో తలపడ్డారు. అయితే అర్జునుడి పాత్ర ముఖాన్ని స్పష్టంగా చూపించలేదు. దీంతో అది విజయ్‌ కావొచ్చని నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ స్వయంగా విజయ్ ఉన్నట్లు స్పష్టం చేయడంతో తమ హీరో అర్జునుడిగా కనిపించడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ ప్రశ్నకు జూన్‌ 27న క్లారిటీ వచ్చే అవకాశముంది.&nbsp; https://twitter.com/TheDEVERA_fan/status/1804410479642841242 సీనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నారా? కల్కి సినిమాకు సంబంధించి లేటెస్ట్ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా కనిపించనున్నారని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ఉపయోగించి వీఎఫ్‍ఎక్స్‌లో ఎన్టీఆర్ పాత్రను ఈ చిత్రంలో మేకర్స్ చూపించనున్నారని తెలుస్తోంది. శ్రీకృష్ణుడి పాత్రను ఎన్టీఆర్ చాలా సినిమాల్లో చేశారు. కృష్ణుడు అంటేనే తెలుగు వారికి ఆయనే గుర్తు వస్తారు. శ్రీకృష్ణుడి అవతారంలో ఎన్టీఆర్ ఉన్న విగ్రహాలు కూడా చాలా చోట్ల ఉన్నాయి. దీంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన కల్కి 2898 ఏడీ సినిమాలో ఎన్టీఆర్ ఉండాలని మేకర్స్ భావించినట్టు తెలుస్తోంది. విశ్వామిత్రునిగా రాజమౌళి? కల్కి చిత్రంలో దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి (S.S. Rajamouli) కూడా ఓ కీలక పాత్ర పోషించినట్లు స్ట్రాంగ్ బజ్‌ వినిపిస్తోంది. అయితే ఆయన విశ్వామిత్రుని పాత్రలో కనిపిస్తారని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. సినిమాలోని కీలక సన్నివేశంలో రాజమౌళి పాత్ర తెరపైకి వస్తుందని అంటున్నారు. రెండు నుంచి మూడు నిమిషాల నిడివి లోపే రాజమౌళి పాత్ర ముగుస్తుందని సమాచారం. మరోవైపు డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ నుంచి కూడా ఓ క్యామియో ఉంటుందని స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. ఆర్‌జీవీ పాత్ర చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని చెబుతున్నారు. కల్కి కోసం ఆర్జీవీ ఫస్ట్‌ టైమ్‌ యాక్టర్‌గా మారడం గమనార్హం.
    జూన్ 26 , 2024
    <strong>Box Office Collections: ‘మట్కా’, ‘కంగువా’కు చెత్త ఓపెనింగ్స్.. మరీ ఇంత దారుణంగానా?</strong>
    Box Office Collections: ‘మట్కా’, ‘కంగువా’కు చెత్త ఓపెనింగ్స్.. మరీ ఇంత దారుణంగానా?
    ఈ వారం రెండే చిత్రాలు థియేటర్లలో రిలీజయ్యాయి. ఒకటి తమిళ స్టార్‌ హీరో సూర్య (Suriya) నటించిన ‘కంగువా’ (Kanguva) కాగా, మరొకటి మెగా హీరో వరుణ్‌ తేజ్‌ (Varun Tej) చేసిన ‘మట్కా’ (Matka) మూవీ. భారీ అంచనాలతో విడుదలైన ఈ రెండు చిత్రాలు ప్రేక్షకులను నిరాశ పరిచాయి. తెలుగు రాష్ట్రాల్లో దారుణ ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్‌ వద్ద చతికిలపడ్డాయి. అంచనా వేసిన కలెక్షన్స్‌లో కనీసం సగం కూడా రాబట్టలేక అందరికీ షాకిచ్చాయి. తొలి రోజు ఈ మూవీ కలెక్షన్స్ ఎంత? వాటి ఫ్లాప్‌కు కారణాలు ఏంటి? ఇప్పుడు చూద్దాం.&nbsp; కంగువా కలెక్షన్స్‌ కోలీవుడ్ స్టార్‌ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'కంగువా' (Kanguva Day 1 Collections). బాహుబలితో ఈ సినిమాను పోల్చడం, పాన్‌ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించడంతో అందరిలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో గురువారం (నవంబర్‌ 14) వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్‌ చేశారు. అయితే ప్రీమియర్స్‌ నుంచి కంగువాపై నెగిటివ్‌ టాక్ వచ్చింది. దీంతో డే 1 కలెక్షన్స్‌పై మేకర్స్‌ పెట్టుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. తొలి రోజు ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.40 కోట్ల గ్రాస్‌ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఒక్క తమిళనాడులోనే రూ.12 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. హిందీ బెల్ట్‌లో రూ.4 కోట్లు వసూలు చేసినట్లు టాక్. సూర్యకు మంచి మార్కెట్ ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రూ. 6 కోట్లు మాత్రమే వసూలు చేయడం గమనార్హం. తొలి రోజు రూ.100 కోట్లు పైనే కలెక్షన్స్‌ ఆశించిన మూవీ టీమ్‌కు అందులో సగం కూడా రాకపోవడం పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పవచ్చు. ఈ కలెక్షన్స్‌ కూడా పెద్ద ఎత్తున అడ్వాన్స్‌ బుకింగ్స్‌ జరగడం వల్లే వచ్చాయని ఫిల్మ్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నేటి నుంచి కలెక్షన్స్‌లో మరింత కోత పడే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నాయి.&nbsp; ‘కంగువా’ లెక్క ఎక్కడ తప్పిందంటే! దర్శకుడు శివ కంగువాను వెయ్యేళ్ల కిందటి ఓ జానపద కథకి, ప్రస్తుత కాలానికి ముడిపెతూ రూపొందించారు. బలమైన కథనే దర్శకుడు ఎంచుకున్నప్పటికీ దానిని అర్థవంతంగా చెప్పడంలో పూర్తిగా తడబడ్డారు. క‌థ‌ని వ‌ర్త‌మానంతో ముడిపెట్టే క్ర‌మంలో తొలి 20 నిమిషాల స‌న్నివేశాలు ప్రేక్ష‌కుడి స‌హ‌నాన్ని ప‌రీక్షించాయి. కంగువా పాత్ర తెరపైకి వచ్చాకైనా కథపై పట్టుసాధించాడా అంటే అదీ లేదు. ప్ర‌ణ‌వ‌కోన‌, క‌పాల కోన‌, సాగ‌ర కోన‌, అర‌ణ్య‌కోన‌, హిమ కోన అంటూ ఐదు వంశాలను ప‌రిచయం చేస్తూ గ‌జిబిజి వాతావ‌ర‌ణాన్ని సృష్టించారు. ఏ కోన‌తోనూ ఆడియన్స్ కనెక్ట్‌ అయ్యే అవకాశం ఇవ్వలేదు. ప్ర‌తి పాత్ర బిగ్గ‌ర‌గా అరుస్తూ సంభాషించుకోవడం వల్ల ప్రేక్షకుల్లో ఒకవిధమైన అసహనం కలిగింది. అయితే ఫ్రాన్సిస్‌, కంగువా పాత్రల్లో సూర్య నటన, రుధిర అనే పాత్రలో బాబీ దేవోల్‌ విలనిజం సినిమాకు కొంతమేర ఊపిరినిచ్చాయి.&nbsp; మట్కా ఓపెనింగ్స్‌ మరీ దారుణం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా, మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary) హీరోయిన్‌గా చేసిన ‘మట్కా’ (Matka Day 1 Collections) చిత్రానికి కరుణ కుమార్‌ దర్శకత్వం వహించారు. గురువారం రిలీజైన ఈ చిత్రం కూడా నెగిటివ్‌ టాక్‌ను మూటగట్టుకుంది. దీంతో తొలిరోజు ఈ మూవీకి షాకింగ్‌ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. వరల్డ్‌ వైడ్‌గా కేవలం రూ. 1.2 కోట్ల గ్రాస్‌ మాత్రమే వచ్చినట్లు ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కనీసం రూ.కోటీ కూడా రాబట్టలేకపోయిందని పేర్కొన్నాయి. రూ.80 లక్షల నుంచి రూ.కోటి లోపు మాత్రమే వసూళ్లు వచ్చాయని స్పష్టం చేశాయి. తొలి రోజు ఆక్యూపెన్సీ 20 శాతం కంటే తక్కువగా ఉందని తెలిపాయి. భారీ అంచనాలతో రిలీజైన ఈ చిత్రానికి ఇంత తక్కువ స్థాయిలో రెస్పాన్స్‌ రావడాన్ని చూసి ట్రెడ్‌ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి.&nbsp; మట్కా ఫ్లాప్‌కు కారణాలు ఇవే! దర్శకుడు కరుణ కుమార్‌ చాలా రొటీన్‌ స్టోరీని మట్కాకు ఎంచుకున్నాడు. ‘చేతిలో చిల్లిగవ్వ లేని యువకుడు ఓ పెద్ద నేర సామ్రాజ్యాన్ని స్థాపించడం’ ప్లాట్‌తో గతంలో చాలా చిత్రాలే వచ్చాయి. కథ వరకూ కాస్త పర్వాలేదని అనుకున్నా మూవీలోని పాత్రల మధ్య సంఘర్షణ పూర్తిగా కొరవడింది. ముఖ్యంగా హీరో ఎదుగుతున్న క్రమం మరీ సినిమాటిక్‌గా అనిపిస్తుంది. ఎక్కడా సహజంగా ఎదుగుతున్న ఫీల్ అనిపించదు. హీరో ఏం చేస్తున్నా ఒక్క సవాలు ఎదురుకాదు. దేశానికి ముప్పుగా మారిన వాసును పట్టుకునేందుకు సీబీఐ చేసే ప్రయత్నాలు ఏమాత్రం ఇంట్రస్టింగ్‌గా అనిపించవు. అతడ్ని పడగొట్టేందుకు ప్రత్యర్థులు వేసే ఎత్తులు మరీ పేలవంగా ఉంటాయి. వరుణ్‌ తేజ్‌ నటన మినహా సినిమాలో ప్రేక్షకులను ఇంప్రెస్‌ చేసే ఒక్క పాయింట్‌ కూడా లేదని సినిమా చూసిన ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
    నవంబర్ 15 , 2024
    <strong>Matka Promotions: ట్రెండ్ సెట్‌ చేసిన వరుణ్ తేజ్‌ ఇది కదా ప్రమోషన్ అంటే.. వీడియో వైరల్‌!</strong>
    Matka Promotions: ట్రెండ్ సెట్‌ చేసిన వరుణ్ తేజ్‌ ఇది కదా ప్రమోషన్ అంటే.. వీడియో వైరల్‌!
    మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ (Varun Tej) హీరోగా దర్శకుడు కరుణ కుమార్‌ తెరకెక్కించిన చిత్రం 'మట్కా' (Matka). మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేసింది. బాలీవుడ్ భామా నోరా ఫతేహి మరో కీలక పాత్రలో నటించింది. గురువారం(నవంబర్‌ 14న) గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రం బృందం చురుగ్గా ప్రమోషన్స్‌ నిర్వహిస్తూ ఆడియన్స్‌లో తమ మూవీపై హైప్‌ క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే నటుడు వరుణ్‌ తేజ్‌ సైతం వినూత్న ప్రమోషన్స్‌ (Matka Promotions)కు తెరతీశాడు. తన పాత్ర చిత్రాలను రిఫరెన్స్‌గా తీసుకొని అతడు చేసిన ఓ వీడియో సినీ ఆడియన్స్‌ను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇదెక్కడి మాస్‌ ప్రమోషన్స్! మెగా హీరో వరుణ్‌ తేజ్‌ (Varun Tej) నాగబాబు తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. 2014లో వచ్చిన 'ముకుంద'తో తెలుగు ఆడియన్స్‌కు తొలిసారి పరిచయమయ్యాడు. ఆ తర్వాత ‘కంచె’, ‘ఫిదా’, ‘ఎఫ్‌ 2’, ‘ఎఫ్‌ 3’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలు చేశాడు. అలాగే లోఫర్‌, మిస్టర్‌, ‘గాండీవధారి అర్జున’ వంటి ఫ్లాప్‌లు కూడా తీశాడు. ఇదిలా ఉంటే 'మట్కా' ప్రమోషన్స్‌లో భాగంగా తన చిత్రాలను రిఫరెన్స్‌గా తీసుకొని వరుణ్ ఓ ఆసక్తికర వీడియోను చేశాడు. కెరీర్‌లో ఇప్పటివరకూ చేసిన హిట్‌, ఫ్లాప్‌ చిత్రాలు ఎదురుపడితే తన రియాక్షన్‌ ఎలా ఉంటుందో చేసి చూపించాడు. ఒక్కో వ్యక్తిని ఒక్కో సినిమాగా భావిస్తూ తన ఫీలింగ్స్‌ను పంచుకున్నాడు. చివర్లో 'మట్కా'గా వచ్చిన వ్యక్తికి బిగ్‌ హగ్‌ ఇచ్చి బాగా ప్రమోట్‌ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోపై మీరు ఓ లుక్కేయండి. https://twitter.com/SivaKri54096510/status/1856617018276839798 తిరుమలలో ‘మట్కా’ టీమ్‌! తిరుమల శ్రీవారిని ‘మట్కా’ (Matka Promotions) చిత్రబృందం ఇవాళ (నవంబర్‌ 13) తెల్లవారుజామున దర్శించుకుంది. వీఐపీ దర్శన సమయంలో నటుడు వరుణ్‌ తేజ్‌, చిత్ర యూనిట్‌ సభ్యులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో చిత్ర యూనిట్‌కు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. గురువారం ‘మట్కా’ సినిమా విడుదల సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నట్లు వరుణ్‌ తెలిపారు. తిరుమలలో మట్కా టీమ్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.&nbsp; https://twitter.com/baraju_SuperHit/status/1856530909580677270 వరుణ్‌ మేకోవర్‌ చూశారా? మట్కా సినిమాలో వరుణ్‌ తేజ్ శివ అనే పాత్ర పోషించాడు. మట్కా జూదాన్ని ప్రారంభించిన రతన్ ఖాత్రి అనే వ్యక్తి జీవిత కథ ఆధారంగా దీన్ని రూపొందించారు. 1970-90 ప్రాంతంలో వైజాగ్‌ పరిస్థితులను ఈ చిత్రంలో కళ్లకు కట్టనున్నారు. ఇదిలా ఉంటే వాసు పాత్ర కోసం వరుణ్‌ తేజ్‌ పూర్తిగా తన గెటప్‌ను మార్చుకున్నాడు. తన హెయిర్‌స్టైల్, కాస్ట్యూమ్స్‌ను 1970వ దశకానికి అనుగుణంగా మార్చుకున్నాడు. ఆ పాత్రలకు వరుణ్‌ ఏ విధంగా మారాడో తెలియజేసే వీడియోను మేకర్స్‌ తాజాగా రిలీజ్‌ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు ఓవర్సీస్‌లో ఏ ఏ థియేటర్లలో తమ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నారో ఓ పోస్టర్‌ ద్వారా మట్కా టీమ్‌ తెలియజేసింది.&nbsp; https://www.youtube.com/watch?v=b3CRE3IMdzA https://twitter.com/baraju_SuperHit/status/1856380138553802773 సెన్సార్‌ రివ్యూ వరుణ్‌ తేజ్‌ మట్కా (Matka Promotions) చిత్రం తాజాగా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. సెన్సార్‌ సభ్యులు యూఏ (U/A) సర్టిఫికేట్‌ జారీ చేశారు. ఈ విషయాన్ని వరుణ్‌ తేజ్‌ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలియజేశారు. ఇంటర్వెల్ ముందు నాలుగు ఫైట్స్ ఉంటాయని సమాచారం. ఆ నాలుగూ బాగా వచ్చాయని టాక్. ఇక క్లైమాక్స్‌లో వచ్చే భారీ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. దర్శకుడు కరుణ కుమార్ రాసిన కథ, తీసిన తీరు సెన్సార్‌ సభ్యులకు బాగా నచ్చిందట. డైలాగులు కూడా నెక్స్ట్ లెవల్లో ఉన్నాయని వారు ఫీలయ్యారట. మట్కా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకూ చాలా ఎంగేజింగ్‌గా ఉన్నట్లు వారు భావించారట. క్యారెక్టర్ పరంగా వరుణ్ తేజ్ గెటప్స్ హైలైట్ అవుతాయని టాక్. నటుడిగా వరుణ్ తేజ్ మరో మెట్టు ఎక్కే సినిమా 'మట్కా'&nbsp; అవుతుందని అంటున్నారు.&nbsp;
    నవంబర్ 13 , 2024
    <strong>Prabhas: ట్రెండింగ్‌లోకి ప్రభాస్‌ - అనుష్క జోడి.. ఎందుకంటే?</strong>
    Prabhas: ట్రెండింగ్‌లోకి ప్రభాస్‌ - అనుష్క జోడి.. ఎందుకంటే?
    టాలీవుడ్‌లో బెస్ట్ పెయిర్‌ అనగానే ముందుగా ప్రభాస్, అనుష్క జంట గుర్తుకు వస్తుంది. వారిద్దరి కెమెస్ట్రీకి సెపరేట్‌ ఫ్యాన్స్ బేసే ఉంది. వీరిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిమానులు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. ఇందుకు తగ్గట్లే వీరి పెళ్లికి సంబంధించి వార్తలు సైతం షికారు చేశాయి. కానీ అవన్నీ ఒట్టి పుకార్లే అని తేలిపోయింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్‌ రాజాసాబ్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. అటు స్వీటీ సైతం ‘ఘాటీ’ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇటీవల ప్రభాస్‌ బర్త్‌డే సందర్భంగా రాజాసాబ్‌ నుంచి ఓ స్పెషల్‌ పోస్టర్ రిలీజైన సంగతి తెలిసిందే. అదే విధంగా గురువారం (నవంబర్‌ 8) అనుష్క పుట్టిన రోజు పురస్కరించుకొని ఘాటీ నుంచి ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ వచ్చింది. అయితే ఈ రెండు పోస్టర్లు సిమిలర్‌గా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; నోటిలో సిగార్‌తో.. అనుష్క శెట్టి ఫీమేల్‌ లీడ్‌గా 'ఘాటి' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గురువారం ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేయగా ఇందులో అనుష్క చాలా డిఫరెంట్‌గా కనిపించింది. ముఖంపై రక్తంతో సిగార్‌ తాగుతూ ఆ పొగ మధ్యలో కనిపించింది. ఇటీవల వచ్చిన రాజాసాబ్‌ పోస్టర్‌లోనూ ప్రభాస్‌ ఈ తరహా గెటప్‌లోనే కనిపించడం గమనార్హం. అనుష్క తరహాలోనే నోట్లో సిగార్‌ పెట్టుకొని కనిపించాడు. స్మోకీ లుక్‌తో అందరినీ మెస్మరైజ్ చేశాడు. ఇద్దరూ సిగార్‌ తాగుతూ పోస్టర్‌లో కనిపించడంతో ఆ పోస్టర్లు పక్క పక్కన పెట్టి ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. రాజావారు రాణి వారు అంటూ ట్యాగ్‌లు ఇస్తున్నారు అసలు మీరిద్దరూ ఎందుకు కలిసి సినిమా తీయకూడదంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/subhaashiniii/status/1854377730575397055 కసిగా తల తెంపిన అనుష్క గురువారం ఉదయం 'ఘాటి' ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేసిన మేకర్స్ అదే రోజు సాయంత్ర సాలిడ్‌ గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు. గత చిత్రాలకు భిన్నంగా చాలా వైలెంట్‌గా స్వీటిని చూపించారు. అత్యంత క్రూరంగా ఒక మనిషి తలని, అది కూడా బస్‌ మిర్రర్‌లో చూస్తూ కసిగా కోయడం గ్లింప్స్‌లో కనిపించింది.&nbsp; ఆ తర్వాత ఆ తలని చేత్తో తీసుకెళ్లి.. ఒక చోట పెట్టి తాపీగా సిగార్‌ తాగుతూ రిలాక్స్ అవుతున్నట్లు చూపించారు. అది తాగే సమయంలో అనుష్క చేతుల నిండా రక్తం ఉంటుంది. గతంలో క్రిష్ దర్శకత్వంలో అనుష్క శెట్టి వేదం సినిమాలో నటించింది. ఆ సినిమాలో వేశ్య పాత్రలో నటించి మెప్పించింది. అరుంధతి, భాగమతి తర్వాత ఆ తరహాలో పవర్‌ఫుల్ రోల్‌ను ఘాటీలో చేస్తోంది. https://www.youtube.com/watch?v=W5FkYULk3Ls స్వీటీ ఆశలన్నీ 'ఘాటి' పైనే! ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అనుష్క ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. స్టార్‌ హీరోల చిత్రాల్లో ఈ అమ్మడికి అవకాశాలు రావడం లేదు. ఇటీవల ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ సినిమాతో పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్నా అది ఆమె స్థాయికి తగ్గ హిట్‌ మాత్రం కాదు. దీంతో ఇండస్ట్రీలో తిరిగి నిలదొక్కుకోవాలంటే 'ఘాటి' సక్సెస్‌ చాలా కీలకంగా మారింది. మరోవైపు దర్శకుడు క్రిష్‌కు సైతం ఈ చిత్ర విజయం ఎంతో అవసరం. ఇటీవల హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ చేజారడంతో ఘాటీతో గట్టి కమ్‌బ్యాక్ ఇవ్వాలని క్రిష్‌ భావిస్తున్నారు. ప్రభాస్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో అరడజను పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ‘రాజా సాబ్‌’ (Raja Saab)తో పాటు సందీప్‌ రెడ్డి వంగాతో ‘స్పిరిట్‌’ (Spirit), నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో ‘కల్కి 2’ (Kalki 2), ప్రశాంత్‌ నీల్‌తో ‘సలార్‌ 2’ (Salaar 2), హను రాఘవపూడితో ‘ఫౌజీ’ (Fouji) చిత్రం చేయనున్నాడు. అలాగే మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ 'కన్నప్ప'లోనూ ప్రభాస్‌ స్పెషల్‌ రోల్ చేస్తున్నాడు. ఇది కాకుండా హనుమాన్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మతో ఓ సినిమా చేయబోతున్నట్లు తాజాగా ప్రచారం జరిగింది. కథను ప్రశాంత్‌ వర్మ వినిపించగా అది ప్రభాస్‌కు బాగా నచ్చిందని కూడా టాక్‌ వచ్చింది. అలాగే తమిళ స్టార్ డైరెక్టర్‌ లోకేషన్‌ కనకరాజ్, బాలీవుడ్ పాపులర్‌ ఫిల్మ్‌ మేకర్‌ రాజ్‌కుమార్‌ హిరానీతోను త్వరలో ప్రాజెక్ట్స్‌ అనౌన్స్‌ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విధంగా వరుస ప్రాజెక్ట్స్‌తో ప్రభాస్‌ కెరీర్‌ పరంగా దూసుకుపోతున్నాడు.&nbsp;
    నవంబర్ 08 , 2024
    <strong>Diwali Movies Weekend Collections: దీపావళి చిత్రాల వీకెండ్ కలెక్షన్స్‌.. ఏకైక చిత్రంగా ఆ మూవీ రికార్డ్‌!</strong>
    Diwali Movies Weekend Collections: దీపావళి చిత్రాల వీకెండ్ కలెక్షన్స్‌.. ఏకైక చిత్రంగా ఆ మూవీ రికార్డ్‌!
    దీపావళి పండుగ సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పలు చిత్రాలు విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా ‘లక్కీభాస్కర్‌’ (Lucky Bhaskar), ‘క’ (KA), ‘అమరన్‌’ (Amaran) చిత్రాలు మంచి హిట్‌ టాక్‌ సొంతం చేసుకున్నాయి. అంతేకాకుండా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు సైతం సాధిస్తున్నాయి. తొలి రోజు సాలిడ్‌ కలెక్షన్స్‌ రాబట్టిన ఈ మూడు చిత్రాలు వీకెండ్‌కు వచ్చే సరికి తమ వసూళ్లను గణనీయంగా పెంచుకున్నాయి. తొలి నాలుగు రోజుల్లో ఏ మూవీ, ఎంత వసూలు చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం.&nbsp; లక్కీ భాస్కర్‌ (Lucky Bhaskar Weekend Collections) మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ‘లక్కీ&nbsp; భాస్కర్‌’ (Lucky Bhaskar) చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. దీపావళి కానుకగా గురువారం (అక్టోబర్‌ 31) రిలీజైన ఈ మూవీ తొలి నాలుగు రోజుల్లో రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వీకెండ్‌ పూర్తయ్యేసరికి రూ.55.4 కోట్ల (GROSS) కలెక్షన్స్‌ను 'లక్కీ భాస్కర్‌' రాబట్టినట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు హీరో, దర్శకుడితో పాటు నిర్మాత నాగవంశీ ఉన్న స్పెషల్‌ పోస్టర్‌ను మూవీ టీమ్‌ రిలీజ్‌ చేసింది. ట్రేడ్‌ వర్గాల విశ్లేషణల ప్రకారం ఒక్క ఏపీ, తెలంగాణల్లోనే ఈ చిత్రం రూ.19.10 కోట్లు (GROSS) రాబట్టింది. కేరళలో రూ.8.75 కోట్లు, కర్ణాటకలో రూ. 2.65 కోట్లు, తమిళనాడులో రూ. 3.40 కోట్లు, రెస్ట్‌ ఆఫ్‌ ఇండియాలో రూ.95 లక్షలు, ఓవర్సీస్‌లో రూ.13.40 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు వివరించాయి. క (KA Weekend Collections) టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన లేటెస్ట్ మూవీ ‘క’ (KA Movie). అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి షోతోనే పాజిటివ్ టాక్‌ను అందుకుంది. గురువారం ఈ మూవీ రిలీజవ్వగా శని, ఆదివారాల్లో కలెక్షన్స్ మరింత పెరిగినట్లు సమాచారం. తొలి నాలుగు రోజుల్లో రూ.26.52 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశారు. అటు తొలి మూడు రోజుల్లోనే ‘క’ చిత్రం బ్రేక్‌ ఈవెన్‌ సాధించినట్లు ఫిల్మ్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఇకపై వచ్చేవన్ని లాభాలే అంటూ తెలిపాయి. అంతేకాదు రోజురోజుకు ఈ మూవీ కలెక్షన్స్ మరింత పెరుగుతున్నాయని సంతోషం వ్యక్తం చేసింది.&nbsp; అమరన్‌ శివ కార్తికేయన్ (Sivakarthikeyan) సాయిపల్లవి (Sai Pallavi) కాంబోలో తెరకెక్కిన ‘అమరన్’ (Amaran Movie) పాన్‌ ఇండియా స్థాయిలో అదరగొడుతోంది. అక్టోబర్‌ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద చితక్కొడుతోంది. తొలి నాలుగు రోజుల్లో వరల్డ్‌ వైడ్‌గా రూ.136 కోట్ల (GROSS) వసూళ్లు సాధించినట్లు ట్రెడ్ వర్గాలు ప్రకటించాయి. ఒక్క తమిళనాడులోనే రూ. 65.05 కోట్లు రాబట్టినట్లు పేర్కొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.15.45 కోట్లు, కర్ణాటకలో రూ.8.05 కోట్లు, కేరళలో రూ.4.45 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.1.15 కోట్లు ఖాతాలో వేసుకున్నట్లు వివరించాయి. అటు ఓవర్సీస్‌లో ఏకంగా రూ.41.85 రాబట్టినట్లు స్పష్టం చేశాయి. రానున్న రోజుల్లో కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. దీపావళికి రిలీజైన చిత్రాల్లో ప్రస్తుతం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన ఏకైక చిత్రంగా ‘అమరన్’ నిలిచింది.&nbsp;
    నవంబర్ 04 , 2024
    <strong>Kasthuri Controversy: తెలుగు వారు లేకుండా తమిళుల ఉనికి ఉందా? చరిత్ర ఏం చెబుతోంది?</strong>
    Kasthuri Controversy: తెలుగు వారు లేకుండా తమిళుల ఉనికి ఉందా? చరిత్ర ఏం చెబుతోంది?
    ‘భారతీయుడు’ సహా పలు సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించిన తమిళ నటి కస్తూరి (Kasthuri Shankar)&nbsp; తాజాగా తెలుగువారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. తెలుగు మాట్లాడే ప్రజల్ని బానిసలతో పోలుస్తూ కస్తూరి షాకింగ్ కామెంట్స్ చేశారు. చరిత్రలో ఏం జరిగిందో వివరిస్తూ కస్తూరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆమె చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో సైతం చర్చనీయాంశంగా మారాయి. అయితే నటి కస్తూరికి చరిత్ర తెలిసి ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయరు. తమిళ నేలపై తెలుగు రాజులు, నేతలు, వ్యక్తులు ఎంతటి ఘనత సాధించారో తెలుసుకొని మాట్లాడి ఉంటే బాగుండేది.&nbsp; అసలేం జరిగిందంటే? తమిళ నటి కస్తూరి చేసిన తాజా కామెంట్స్‌ తెలుగు రాష్ట్రాల్లో తీవ్రదుమారం రేపాయి. భాజాపాలో చేరిన ఆమె చెన్నైలోని గురుమూర్తి నగరంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. డీఎంకే (DMK), కరుణానిధి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ విరుచుకుపడ్డారు. 300 ఏళ్ల క్రితం ఓ రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగువారని అన్నారు. రాణులకు సేవలు చేయడానికి ఇక్కడికి వచ్చిన తెలుగువారు ఇప్పుడు తమది తమిళ జాతి అంటుంటే మరి ఎప్పుడో ఇక్కడికి వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదు అని చెప్పడానికి మీరెవరు అంటూ ప్రశ్నించారు. ఇతరుల భార్యలపై కన్నేయవద్దని బ్రాహ్మణులు చెబుతున్నందుకే ద్రవిడ (Dravida) వాదులు వాళ్లని వ్యతిరేకిస్తున్నారని, అందుకే సనాతన ధర్మాన్ని (Sanathana Dharmam) డీఎంకే వ్యతిరేకిస్తోందన్నారు. తెలుగు మాట్లాడితే చాలు తమిళనాడు కేబినెట్‌లో మంత్రులు అవుతున్నారని, డీఎంకే ప్రభుత్వంలో ఐదుగురు తెలుగు మంత్రులు ఉన్నారని వ్యాఖ్యానించారు. తమిళ చరిత్రపై ప్రభావం తమిళనాడును పరిపాలించిన ప్రముఖ రాజవంశాల్లో చోళులు ఒకరు. వారిలో కుళోత్తంగ చోళుడు తెలుగువాడు. అతడి తండ్రి రాజ రాజ నరేంద్రుడు వేంగి చాళుక్య రాజు. ఈయన ఏపీలోని కృష్ణ- గోదావరి మధ్య ప్రాంతాన్ని పాలించాడు. కుళుత్తోంగ చోళుడి&nbsp; తల్లి అమ్మాంగైదేవి చోళ రాజ్యపు యువరాణి.&nbsp; ఆమె తండ్రి మరణం తర్వాత చోళ రాజ్యంలో అస్థిరత నెలకొంటుంది. దీంతో కులుత్తోంగ చోళుడు తన తాతా సామ్రాజ్యాన్ని కాపాడి చక్రవర్తిగా అక్కడే కొనసాగుతాడు. ఆ తర్వాత ఆయన వారసులు కూడా తమిళనాడుని దిగ్విజయంగా ఏలారు. (క్రీ.శ. 1061-1118) మధ్య చాళుక్యుల చక్రవర్తిగా కులోత్తుంగుడు వ్యవహరించారు. అయితే అతడి కుమారుడు విక్రమ చోళుడు.. చోళ రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. తెలుగు వారైన చాళుక్యుల రక్తం విక్రమ చోళుడిలో ఉంది. దీన్ని బట్టి గొప్ప తమిళ రాజ్యంగా చెప్పుకుంటున్న చోళ సామ్రాజ్యాన్ని ఓ తెలుగు వ్యక్తి పరిపాలించాడని చరిత్రకారులు చెబుతుంటారు. ఆ ప్రకారం చూసుకుంటే తమిళ చరిత్రపైనా మనవారి ముద్ర స్పష్టంగా ఉందని చెప్పవచ్చు.&nbsp; Image credit: Wikimedia Commons తెలుగు రాజు పేరు మీద ‘చెన్నై’ తమిళనాడు రాజధానిగా ఉన్న చెన్నైకి ఆ పేరు ఓ తెలుగు వ్యక్తి ద్వారా వచ్చింది. ఆంధ్ర పద్మనాయక ప్రభువైన వెంకటపతి నాయకుని కుమారుడైన దామెర్ల చెన్నప్ప నాయకుడు క్రీ.శ. 1639లో ఈ పట్టణాన్ని పాలించాడు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ పేరుతో వచ్చిన బ్రిటిషర్లు ఆ ప్రాంతాన్ని స్థావరంగా చేసుకొని మద్రాసు పట్టణంగా మార్చారు. కాలక్రమణా ఆ పట్టణం మద్రాసుగా మారింది. కానీ స్థానికులు మాత్రం చెన్న పట్టణం లేదా చెన్నపురి అని పిలవడానికే ఇష్టపడేవారు. స్థానికుల కోరిక మేరకు స్వాతంత్రం అనంతరం 1996 ఆగస్టులో మద్రాసు పేరును చెన్నైగా మార్చారు.&nbsp; Image credit: Wikimedia Commons మద్రాసుపై తెలుగు వారి ప్రభావం ఒకప్పడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, మద్రాసు (ప్రస్తుత తమిళనాడు) రాష్ట్రం ఒక్కటిగా కలిసి ఉండేది. పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష కారణంగా 1953 అక్టోబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైంది. ఒకప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగువారే అన్ని రంగాల్లో కీలకపాత్రలు పోషించారు. రాష్ట్రాభివృద్ధికి కృషి చేశారు. 1925-29 మధ్య శ్రీకాళహస్తి జమీందారు పానగంటి రామారాయనం జస్టిస్ పార్టీ అధ్యక్షులుగా, మద్రాసు ముఖ్యమంత్రిగా పనిచేశారు. వారి హయాంలోనే ప్రస్తుత త్యాగరాయనగర్ రూపుదిద్దుకుంది. 1932-36 మధ్యకాలంలో బొబ్బిలి రాజు శ్రీ రామకృష్ణ రంగారావు మద్రాసు ప్రెసిడెన్సీకి ముఖ్య మంత్రిగా వ్యవహరించారు. రావు బహదూర్ కూర్మా వెంకట రెడ్డి మద్రాసు గవర్నర్‌గా పనిచేశారు. అంతేకాదు వీడిపోయే ముందువరకూ కూడా తెలుగు వ్యక్తి ప్రకాశం పంతులు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి సీఎం చేశారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి మొట్టమొదటి న్యాయ శాస్త్రంలో పట్టా పొందిన ముగ్గురు వ్యక్తులు తెలుగువారే. ఇలా రాజకీయాలతో పాటు విద్య, వైద్యం, న్యాయశాస్త్రం, వ్యాపారం ఇలా అన్ని రంగాల్లో తమదైన ముద్ర వేశారు. Image credit: Wikimedia Commons వందల్లో తెలుగు గ్రంధాలు విజయనగర రాజు శ్రీకృష్ణ దేవరాయలు అంటే తెలియని తెలుగు వారు ఉండరేమో. అటువంటి దేవరాయలు తన ఆస్థానంలోని అష్టదిగ్గజాల సాక్షిగా రాసిన ‘ఆముక్తమాల్యద’ తాళపత్ర గ్రందం ఇప్పటికీ తమిళనాడులోని తంజావూరు గ్రంథాలయంలో భద్రంగా ఉంది. దానితో పాటు 778 తాళపత్ర గ్రంథాలు అక్కడి లైబ్రరీలో ఉన్నాయి. గణితం, వైజ్ఞానిక శాస్త్రం, గణితం, పురాణాలు ఇలా ఎన్నో ఉన్నాయి. దీన్నిబట్టి తెలుగు సంస్కృతి ప్రభావం తమిళనాడుపై ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పటి రాజుల సాంస్కృతిక కళా పోషణకు తమిళనాడు ప్రతీకగా నిలవడాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాలి.&nbsp;
    నవంబర్ 04 , 2024
    <strong>Dussehra Movies Weekend Collections: దసరా చిత్రాల వీకెండ్ కలెక్షన్స్‌.. విజేత ఎవరంటే?</strong>
    Dussehra Movies Weekend Collections: దసరా చిత్రాల వీకెండ్ కలెక్షన్స్‌.. విజేత ఎవరంటే?
    దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని గతవారం బాక్సాఫీస్‌ వద్ద పెద్ద ఎత్తున చిత్రాలు రిలీజ్‌ అయ్యాయి. వీటిలో ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రాలు నాలుగు ఉన్నాయి. ‘వేట్టయన్‌’, ‘విశ్వం’, ‘మా నాన్న సూపర్‌ హీరో’, ‘జిగ్రా’ మూవీస్‌ దసరా కానుకగా రిలీజై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. మరి వీకెండ్‌ పూర్తయ్యే సరికి ఏ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఏ చిత్రం వసూళ్ల పరంగా టాప్‌లో నిలిచింది? ఇప్పుడు పరిశీలిద్దాం.&nbsp; వేట్టయన్‌ (Vettaiyan) రజనీకాంత్‌ హీరోగా టి. జే. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రూపొందిన ‘వేట్టయన్‌’ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంపర కొనసాగిస్తోంది. గురువారం (అక్టోబర్ 10)న విడుదలైన ఈ చిత్రం తొలి నాలుగు రోజుల్లో వరల్డ్‌ వైడ్‌గా రూ. 201.21 కోట్లు (GROSS) కొల్లగొట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. ఒక్క తమిళనాడులోనే రూ.81 కోట్లను తన ఖాతాలో వేసుకున్నట్లు తెలిపాయి. తెలుగుల రాష్ట్రాల్లో రూ.15.50 కోట్లు, కేరళలో రూ.13.20 కోట్లు, కర్ణాటకలో రూ. 19.25 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.5 కోట్లు రాబట్టినట్లు చెప్పాయి. అటు ఓవర్సీస్‌లో ఏకంగా రూ. 67.26 కోట్లు వసూలు చేసినట్లు వివరించాయి. కలెక్షన్ల పరంగా చూస్తే వేట్టయన్‌ రూ.200 కోట్ల క్లబ్‌లో చేరి దసరా విజేతగా నిలిచిందని చెప్పవచ్చు.&nbsp; https://twitter.com/Filmy_Track/status/1845727131768082555 విశ్వం (Viswam) మాస్ సినిమాల స్పెషలిస్ట్ గోపీచంద్, కామెడీ కింగ్‌ శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన విశ్వం చిత్రం దసరా సందర్భంగా రిలీజై పర్వాలేదనిపించింది. అక్టోబర్‌ 11 (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దారుణంగా ఫెయిల్‌ అయినట్లు తెలుస్తోంది. తొలి మూడు రోజుల్లో ఈ చిత్రం రూ. 7 కోట్ల గ్రాస్‌ మాత్రమే సాధించినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి. ఏపీలో రూ.3.60 కోట్లు, నైజాంలో రూ. 2.20 కోట్లు, కర్ణాటకలో రూ.30 లక్షలు, రెస్ట్‌ ఆఫ్ ఇండియాలో రూ.20 లక్షలు మాత్రమే రాబట్టినట్లు అభిప్రాయపడ్డాయి. అటు ఓవర్సీస్‌లో కేవలం రూ.20 లక్షలు మాత్రమే వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. అయితే రెండో రోజు నాటికే డిస్టిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి 100 శాతం రికవరీ అయినట్లు నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధికారిక పోస్టు పెట్టడం గమనార్హం. https://twitter.com/AndhraBoxOffice/status/1845695019199463627 https://twitter.com/Colliderreview/status/1845720361499083121 మా నాన్న సూపర్‌ హీరో (Maa Nanna Super Hero) సుధీర్ బాబు&nbsp; (Sudheer Babu)&nbsp; హీరోగా తెరకెక్కిన మరో వైవిధ్యమైన సినిమా ‘మా నాన్న సూపర్ హీరో’ (Maa Nanna Superhero). అక్టోబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి ఫీల్‌గుడ్‌ మూవీగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం కలెక్షన్స్‌ పరంగా మాత్రం తీవ్రంగా నిరాశ పరుస్తోంది. ఈ చిత్రం వీకెండ్‌ పూర్తయ్యేసరికి రూ. 75 లక్షలు (GROSS) మాత్రమే వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో రూ.68 కోట్లు నెట్‌ వసూళ్లుగా ఉన్నట్లు తెలిపాయి. తొలి రోజు రూ.19 లక్షలు, రెండో రోజు రూ.26 లక్షలు, మూడో రోజు రూ.23 లక్షలు మాత్రమే రాబట్టినట్లు వివరించాయి. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌ సాధించాలంటే రూ.5.2 కోట్లు రాబట్టాల్సి ఉంది. ప్రస్తుత వసూళ్లను బట్టి చూస్తే ఈ సినిమా లాభాల్లోకి రావడం కష్టంగానే కనిపిస్తోంది.&nbsp; జిగ్రా (Jigra) బాలీవుడ్‌ బ్యూటీ లీడ్‌ రోల్‌లో నటించిన లేటెస్ట్ చిత్రం 'జిగ్రా'. వాసన్ బాలా దర్శకత్వం వహించారు. తెలుగు నటుడు రాహుర్‌ రవీంద్రన్‌ ముఖ్య పాత్ర పోషించాడు. అక్టోబర్‌ 11న తెలుగు, హిందీతో పాటు పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్‌ అయ్యింది. ఈ చిత్రం తొలి మూడు రోజుల్లో వరల్డ్‌ వైడ్‌గా ఈ చిత్రం రూ.26 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి. ఒక్క హిందీ బెల్ట్‌లోనే రూ.16.47 కోట్లు వసూలు చేసినట్లు వివరించాయి. హిందీలో రాజ్‌కుమార్‌ రావు, త్రిప్తి దిమ్రీ కాంబోలో రిలీజైన 'విక్కీ ఔర్‌ విద్యా కా వోహ్‌ వాలా' మూవీ నుంచి జిగ్రాకు గట్టి పోటీ ఎదురైనట్లు ట్రేడ్ పండితులు తెలిపారు. దీంతో జిగ్రా కలెక్షన్స్‌లో కొంతమేర కోత పడినట్లు అభిప్రాయపడుతున్నారు.&nbsp;
    అక్టోబర్ 14 , 2024
    <strong>Vettaiyan Day 1 Collections: బాక్సాఫీస్‌ వద్ద తలైవా దూకుడు.. రికార్డు స్థాయిలో ‘వేట్టయన్‌’ డే 1 కలెక్షన్స్‌!</strong>
    Vettaiyan Day 1 Collections: బాక్సాఫీస్‌ వద్ద తలైవా దూకుడు.. రికార్డు స్థాయిలో ‘వేట్టయన్‌’ డే 1 కలెక్షన్స్‌!
    సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన సినిమా 'వేట్టయన్ - ద హంటర్' (Vettaiyan Movie Review In Telugu). లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మించారు. అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, మంజూ వారియర్, ఫహాద్ ఫాజిల్, దుషారా విజయన్, రితికా సింగ్ ముఖ్య పాత్రలు పోషించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గురువారం (అక్టోబర్‌ 10) ఈ సినిమా విడుదలైంది. అన్ని చోట్ల పాజిటివ్‌ టాక్‌ సంపాదించింది. మరి తొలి రోజు ఈ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? బాక్సాఫీస్‌ వద్ద ఎన్ని కోట్లు రాబట్టింది? ఇప్పుడు చూద్దాం. డే 1 కలెక్షన్స్ ఎంతంటే? రజనీకాంత్‌ హీరోగా నటించిన ‘వేట్టయాన్‌’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సాలిడ్‌ కలెక్షన్స్‌ రాబట్టినట్లు తెలుస్తోంది. తొలిరోజు ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ. 60-68 కోట్లు (GROSS) వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒక్క తమిళనాడులోనే రూ.20 కోట్లకు పైగా గ్రాస్‌ను తన ఖాతాలో వేసుకున్నట్లు చెబుతున్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక కలిపి రూ.10 కోట్లు, కేరళలో రూ.4 కోట్లు, హిందీ బెల్ట్‌లో రూ.60 లక్షలు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది అత్యధిక డే 1 కలెక్షన్స్‌ సాధించిన తమిళ చిత్రాల్లో వేట్టయాన్‌ రెండో స్థానంలో నిలిచినట్లు పేర్కొంటున్నాయి. ఓవరాల్‌గా 8 స్థానంలో చోటు దక్కించుకున్నట్లు తెలిపాయి. దసరా సెలవుల నేపథ్యంలో ఈ మూవీ కలెక్షన్స్‌ మరింత పెరిగే అవకాశముందని ట్రేడ్‌ పండితులు అభిప్రాయపడుతున్నారు.&nbsp; ఎప్పటికీ తలైవా ఒక్కరే..&nbsp; ‘వేట్టయన్’ మంచి విజయం సాధించడంపై రజనీ కుమార్తె సౌందర్య రజనీకాంత్‌ హర్షం వ్యక్తంచేశారు. చిత్రబృందాన్ని అభినందిస్తూ ఎక్స్‌ వేదికగా పోస్ట్ పెట్టారు. ‘ఎప్పటికీ ఒక్కరే తలైవా ఉంటారు. జ్ఞానవేల్‌ను చూస్తుంటే గర్వంగా ఉంది. నా సోదరుడు అనిరుధ్‌ బెస్ట్‌ మ్యూజిక్‌ అందించారు. వేట్టయన్‌ కంటెంట్‌కు తలైవా మాస్‌ యాక్షన్‌కు ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. దీన్ని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు’ అంటూ సౌందర్య ఎక్స్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆమె ట్వీట్‌ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తలైవా ఎప్పటికీ ఒక్కరే అంటూ రజనీ ఫ్యాన్స్‌ సైతం కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/soundaryaarajni/status/1844388762458976334 ‘వేట్టయన్‌’లో ఇవే హైలెట్స్‌! 'జై భీమ్' వంటి క్లాస్ సబ్జెక్ట్ తీసిన దర్శకుడు టీజే జ్ఞానవేల్ 'వేట్టయన్‌'తో కూడా మంచి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆడియన్స్‌ కోరుకునే మాస్‌ మూమెంట్స్‌, హీరోయిజం ఎలివేషన్స్‌, కమర్షియల్‌ హంగులు కథకు జతచేయడం బాగా ప్లస్‌ అయ్యింది. స్మార్ట్‌ ఎడ్యుకేషన్‌ పేరుతో ఎలా దోచుకుంటున్నారు? అన్న సున్నితమైన పాయింట్‌ను ఎంతో బలంగా చెప్పే ప్రయత్నం చేశారు డైరెక్టర్‌. రజనీకాంత్‌ ఇంట్రడక్షన్‌, గంజాయి మాఫియాపై ఉక్కుపాదంతో కమర్షియల్‌గా మూవీని మెుదలుపెట్టిన డైరెక్టర్‌, శరణ్య రేప్‌ కేసు తర్వాత అసలు కథలోకి తీసుకెళ్లారు. అమితాబ్‌ బచ్చన్‌ - రజనీ మధ్య వచ్చే సీన్స్‌ సినిమాను ఆసక్తికరంగా మార్చేశాయి. రజనీ చెప్పే డైలాగ్స్‌, ఫహాద్‌ ఫాజిల్‌, రానా వంటి స్టార్‌ క్యాస్ట్‌ను డైరెక్టర్ ఉపయోగించుకున్న విధానం మెప్పిస్తుంది. క్లైమాక్స్‌ కూడా సంతృప్తికరంగా అనిపిస్తుంది. ముఖ్యంగా అనిరుధ్‌ రవిచంద్రన్ అందించిన సంగీతం సినిమాను నెక్స్ట్‌ లెవల్‌కు తీసుకెళ్లింది.&nbsp; కథేంటి పోలీసు ఆఫీసర్‌ అదియన్ (రజనీకాంత్) కన్యాకుమారిలో ఎస్పీగా పనిచేస్తుంటాడు. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా డిపార్ట్‌మెంట్‌లో పేరు తెచ్చుకుంటాడు. స్కూల్ టీచర్ శరణ్య (దుషారా విజయన్) ఫిర్యాదు ఆధారంగా గంజాయి మాఫియా నడిపే వ్యక్తిని ఎన్‌కౌంటర్‌ చేస్తాడు. ఆ తర్వాత శరణ్య చెన్నైకు ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. అక్కడ అనూహ్యంగా ఆమె హత్యాచారానికి గురవుతుంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ఈ కేసును అదియన్‌కు అప్పగిస్తారు. ఆదియన్‌ 48 గంటల్లో గుణ అనే వ్యక్తిని పట్టుకొని అతడే నిందితుడని చెప్పి ఎన్‌కౌంటర్‌ చేస్తాడు. దానిపై జడ్జి సత్యదేవ్ (అమితాబ్ బచ్చన్) నేతృత్వంలో విచారణ కమిటీ ఏర్పాటవుతుంది. సత్యదేవ్ కమిటీ ఏం తేల్చింది? శరణ్య మరణానికి కారణం ఏంటి? ఆమె మరణం వెనకున్న ఎడ్యుకేషన్ మాఫియా ఏంటి? ఈ కేసులో ప్యాట్రిక్ (ఫహాద్ ఫాజిల్), నటరాజ్ (రానా దగ్గుబాటి), ఏసీపీ రూప కిరణ్ (రితికా సింగ్), హను రెడ్డి (సంపత్ రాజ్) పాత్రలు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp;
    అక్టోబర్ 11 , 2024
    <strong>The Goat Weekend Collections: రూ.300 కోట్లు జస్ట్‌ మిస్‌.. ‘ది గోట్‌’ 4 రోజుల కలెక్షన్స్‌ ఎంతంటే?</strong>
    The Goat Weekend Collections: రూ.300 కోట్లు జస్ట్‌ మిస్‌.. ‘ది గోట్‌’ 4 రోజుల కలెక్షన్స్‌ ఎంతంటే?
    తమిళ స్టార్‌ హీరో విజయ్‌ (Vijay) నటించిన లేటెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ది గోట్‌’ (ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌). వెంకట్‌ ప్రభు దర్శకుడు. మీనాక్షి చౌదరి కథానాయిక. స్నేహ, లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ‘డీ-ఏజింగ్‌ టెక్నాలజీ’తో రూపొందింది. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన తరువాత చేసిన చివరి సినిమా అని ప్రచారం జరగడంతో ఈ సినిమా మీద అంచనాలు ఎక్కువగానే ఏర్పడ్డాయి. అయితే గురువారం (సెప్టెంబర్‌ 5)న వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా రిలీజైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. తమిళనాడులో మాత్రం విజయ్‌ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షించి హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఈ మూవీ తొలి రోజే రూ.120 కోట్లకు పైగా కొల్లగొట్టింది. మరీ వీకెండ్‌కు వచ్చేసరికి ఈ మూవీ వసూళ్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.&nbsp; వీకెండ్‌ కలెక్షన్స్ ఎంతంటే? విజయ్‌ హీరోగా నటించిన ‘ది గోట్‌’ (ది గ్రేటెస్ట్ ఆఫ్‌ ఆల్‌టైమ్‌) అంచనాలకు తగ్గట్లే బాక్సాఫీస్‌ వద్ద రాణిస్తోంది. తొలి నాలుగు రోజుల్లో ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.282.5 కోట్లు (GROSS) కొల్లగొట్టింది. కొద్దిలో రూ.300 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాన్ని చేజార్చుకుంది. అయితే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన తమిళ చిత్రంగా ‘ది గోట్‌’ రికార్డు సృష్టించింది. ధనుష్‌ రీసెంట్‌ చిత్రం 'రాయన్‌' రూ.154 కోట్ల (GROSS) లైఫ్‌టైమ్‌ వసూళ్లను తొలి రెండ్రోజుల్లోనే క్రాస్‌ చేసి ఈ ఫీట్‌ సాధించింది. ఒక్క తమిళనాడులోనే ‘ది గోట్‌’ రూ.106.40 కోట్లు వసూలు చేయడం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.10.10 కోట్లు, కర్ణాటకలో రూ.21.1 కోట్లు, కేరళ రూ.10.4 కోట్లు, రెస్ట్‌ ఆఫ్‌ ఇండియాలో రూ.13.9 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్‌లో రూ.120.15 కోట్ల మేర విజయ్‌ చిత్రం రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం రూ.300 కోట్ల క్లబ్‌ దిశగా దూసుకుపోతోంది. 'ది గోట్‌' ఎలా ఉందంటే? దర్శకుడు వెంకట్‌ ప్రభు రాసుకున్న కథలో కొత్తదనం కనిపించదు. రక్షణ విభాగాల్లో హీరో పనిచేయడం, హీరో కొడుకుని విలన్ పెంచి తిరిగి అతడి మీదే ప్రయోగించే సినిమాలు ఇప్పటికే చాలా వచ్చాయి. అయితే హీరో కొడుకు రివేంజ్‌ తీర్చుకునే క్రమంలో రాసుకున్న సీన్స్‌ ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో క్యారెక్టర్ ఇంట్రడక్షన్‌తో పాటు ఇతర క్యారెక్టర్ల పరిచయాలకే సరిపోతుంది. ప్రీ ఇంటర్వెల్‌ వరకూ కథ అంతా ఊహించే విధంగానే సాగింది. ఇంటర్వెల్‌ సీన్‌తో సెకండాఫ్‌పై ఆసక్తి పెంచారు డైరెక్టర్‌. అయితే సెకండాఫ్‌లోనూ చాలా వరకూ ఊహకు తగ్గట్లే కథను నడిపారు. అయితే క్లైమాక్స్‌ను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యారు. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు కూడా ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తాయి. కామెడీ, డైలాగ్స్‌లలో తమిళ వాసనలు నిండిపోవడం వల్ల తెలుగు ఆడియన్స్‌కు అంతగా రుచించకపోవచ్చు. అయితే విజయ్‌ ఫ్యాన్స్‌ను మాత్రం ఈ చిత్రం ఓ రేంజ్‌లో అలరిస్తుందని చెప్పవచ్చు.&nbsp; కథేంటి గాంధీ (విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. తన టీమ్‌మేట్స్ సునీల్ ( ప్రశాంత్), అజయ్ (అజ్మల్), కళ్యాణ్ సుందరం (ప్రభుదేవా)తో కలిసి పలు విజయవంతమైమ మిషన్స్‌ నిర్వహిస్తాడు. అయితే తను చేసే పని గురించి భార్య అను (స్నేహా)కు చెప్పడు. మిషన్‌లో భాగంగా విదేశాలకు వెళ్లిన క్రమంలో అతడి ఐదేళ్ల కొడుకు మరణిస్తాడు. తన కుమారుడి మరణానికి భర్తే కారణమని భావించి గాంధీని దూరంగా పెడుతుంది. ఆ బాధతో గాంధీ ఫోర్స్‌కు దూరమవుతాడు. కొన్నేళ్ల తర్వాత ఓ పనిమీద మాస్కోకి వెళ్తాడు. అక్కడ చనిపోయాడు అనుకుంటున్న తన కుమారుడు జీవన్‌ (విజయ్‌)ను చూస్తాడు. ఎంతో సంతోషించి భారత్‌కు తీసుకొస్తాడు. అప్పటినుంచి గాంధీ సన్నిహితులు ఒక్కొక్కరిగా చనిపోతుంటారు. ఆ మరణాలకు కారకులు ఎవరు? చనిపోయిన జీవన్‌ ఎలా తిరిగొచ్చాడు? తన వాళ్ల మరణాలను గాంధీ ఎలా ఆపాడు? అన్నది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే.&nbsp;
    సెప్టెంబర్ 09 , 2024
    <strong>The Goat Day 1 Collections: తొలి రోజున ‘ది గోట్‌’ వసూళ్ల సునామీ.. ‘లియో’తో పోలిస్తే ఎదురుదెబ్బే!</strong>
    The Goat Day 1 Collections: తొలి రోజున ‘ది గోట్‌’ వసూళ్ల సునామీ.. ‘లియో’తో పోలిస్తే ఎదురుదెబ్బే!
    తమిళ స్టార్‌ హీరో విజయ్‌ (Vijay) నటించిన లేటెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ది గోట్‌’ (ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌). వెంకట్‌ ప్రభు దర్శకుడు. మీనాక్షి చౌదరి కథానాయిక. స్నేహ, లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ‘డీ-ఏజింగ్‌ టెక్నాలజీ’తో రూపొందింది. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన తరువాత చేసిన చివరి సినిమా అని ప్రచారం జరగడంతో ఈ సినిమా మీద అంచనాలు ఎక్కువగానే ఏర్పడ్డాయి. అయితే గురువారం (సెప్టెంబర్‌ 5)న వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా రిలీజైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. అయితే తమిళనాడులో మాత్రం విజయ్‌ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షించి హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ తొలి రోజు కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.&nbsp; డే 1 కలెక్షన్స్ ఎంతంటే విజయ్‌ హీరోగా నటించిన ‘ది గోట్‌’ (ది గ్రేటెస్ట్ ఆఫ్‌ ఆల్‌టైమ్‌) అంచనాలకు తగ్గట్లే తొలిరోజు భారీ వసూళ్లను సాధించింది. ఒక్క ఇండియాలోనే ఈ చిత్రం రూ.55 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రూ.43 కోట్ల నెట్ వసూళ్లు వచ్చినట్లు పేర్కొన్నాయి. ఒక్క తమిళనాడులోనే అత్యధికంగా రూ.38.3 కోట్లు (GROSS) వసూలైనట్లు తెలిపాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.3 కోట్లు, హిందీలో రూ.1.7 కోట్ల గ్రాస్‌ కలెక్ట్‌ చేసినట్లు ప్రకటించాయి. ఇక వరల్డ్‌వైడ్‌ గ్రాస్‌ కలుపుకుంటే రూ.80 కోట్లు (GROSS)పైనే తొలి రోజు రాబట్టే అవకాశముందని అంచనా వేస్తున్నాయి. అయితే ట్రేడ్‌ వర్గాల అంచనాల ప్రకారం ‘ది గోట్‌’ చిత్రం ‘లియో’ రికార్డ్‌ను దాటలేకపోయినట్లు తెలుస్తోంది. విజయ్‌ గత చిత్రం ‘లియో’ తొలి రోజున రూ. రూ.148.5 కోట్ల వసూళ్లు సాధించింది. ఆ రికార్డును ‘ది గోట్‌’ అధిగమించలేకపోయింది.&nbsp; 'ది గోట్‌' ఎలా ఉందంటే? దర్శకుడు వెంకట్‌ ప్రభు రాసుకున్న కథలో కొత్తదనం కనిపించదు. రక్షణ విభాగాల్లో హీరో పనిచేయడం, హీరో కొడుకుని విలన్ పెంచి తిరిగి అతడి మీదే ప్రయోగించే సినిమాలు ఇప్పటికే చాలా వచ్చాయి. అయితే హీరో కొడుకు రివేంజ్‌ తీర్చుకునే క్రమంలో రాసుకున్న సీన్స్‌ ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో క్యారెక్టర్ ఇంట్రడక్షన్‌తో పాటు ఇతర క్యారెక్టర్ల పరిచయాలకే సరిపోతుంది. ప్రీ ఇంటర్వెల్‌ వరకూ కథ అంతా ఊహించే విధంగానే సాగింది. ఇంటర్వెల్‌ సీన్‌తో సెకండాఫ్‌పై ఆసక్తి పెంచారు డైరెక్టర్‌. అయితే సెకండాఫ్‌లోనూ చాలా వరకూ ఊహకు తగ్గట్లే కథను నడిపారు. అయితే క్లైమాక్స్‌ను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యారు. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు కూడా ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తాయి. కామెడీ, డైలాగ్స్‌లలో తమిళ వాసనలు నిండిపోవడం వల్ల తెలుగు ఆడియన్స్‌కు అంతగా రుచించకపోవచ్చు. అయితే విజయ్‌ ఫ్యాన్స్‌ను మాత్రం ఈ చిత్రం ఓ రేంజ్‌లో అలరిస్తుందని చెప్పవచ్చు.&nbsp; కథేంటి గాంధీ (విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. తన టీమ్‌మేట్స్ సునీల్ ( ప్రశాంత్), అజయ్ (అజ్మల్), కళ్యాణ్ సుందరం (ప్రభుదేవా)తో కలిసి పలు విజయవంతమైమ మిషన్స్‌ నిర్వహిస్తాడు. అయితే తను చేసే పని గురించి భార్య అను (స్నేహా)కు చెప్పడు. మిషన్‌లో భాగంగా విదేశాలకు వెళ్లిన క్రమంలో అతడి ఐదేళ్ల కొడుకు మరణిస్తాడు. తన కుమారుడి మరణానికి భర్తే కారణమని భావించి గాంధీని దూరంగా పెడుతుంది. ఆ బాధతో గాంధీ ఫోర్స్‌కు దూరమవుతాడు. కొన్నేళ్ల తర్వాత ఓ పనిమీద మాస్కోకి వెళ్తాడు. అక్కడ చనిపోయాడు అనుకుంటున్న తన కుమారుడు జీవన్‌ (విజయ్‌)ను చూస్తాడు. ఎంతో సంతోషించి భారత్‌కు తీసుకొస్తాడు. అప్పటినుంచి గాంధీ సన్నిహితులు ఒక్కొక్కరిగా చనిపోతుంటారు. ఆ మరణాలకు కారకులు ఎవరు? చనిపోయిన జీవన్‌ ఎలా తిరిగొచ్చాడు? తన వాళ్ల మరణాలను గాంధీ ఎలా ఆపాడు? అన్నది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే.&nbsp; https://telugu.yousay.tv/the-goat-review-if-dalapati-vijay-had-to-face-himself-is-the-goat-great-or.html
    సెప్టెంబర్ 06 , 2024
    <strong>Saripodhaa Sanivaaram: తీవ్ర ఆందోళనలో హీరో నాని ఫ్యాన్స్‌.. అదే జరిగితే ఫలితం ఫసక్కేనా?</strong>
    Saripodhaa Sanivaaram: తీవ్ర ఆందోళనలో హీరో నాని ఫ్యాన్స్‌.. అదే జరిగితే ఫలితం ఫసక్కేనా?
    స్వయం కృషితో పైకొచ్చిన ఈ తరం హీరో అనగానే అందరికీ ముందుగా కథానాయకుడు నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. ఎటువంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాని తనకంటూ సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ను సృష్టించుకున్నాడు. ఇదిలా ఉంటే నాని లేటెస్ట్ చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) గురువారం పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అదిరిపోవడంతో సినిమా సక్సెస్‌పై నాని ఫ్యాన్స్‌ ధీమాగా ఉన్నారు. అయితే తాజాగా నాని అభిమానుల్లో కొత్త భయాలు మెుదలయ్యాయి. దీంతో వారు ఆందోళనలకు గురవుతున్నారు. ఇంతకీ వారిని వేధిస్తున్న సమస్య ఏంటి? అందుకు గల కారణాలు ఏంటి? ఈ కథనంలో చూద్దాం.&nbsp; రన్‌ టైమ్‌ భయాలు! నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా 'సరిపోదా శనివారం' రూపొందింది. వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించారు. ఇందులో నానికి జోడీగా ప్రియాంక మోహన్‌ నటిస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్‌ కంప్లీట్‌ అయ్యింది. సెన్సార్‌ టీమ్‌ యు/ఏ సర్టిఫికేట్‌ జారి చేసింది. అలాగే రన్‌ టైమ్‌ను 2 గంటల 46 నిమిషాలుగా ఫిక్స్‌ చేసింది. దీంతో నాని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గతంలో నాని - వివేక్ ఆత్రేయ కాంబోలో ‘అంటే సుందరానికి’ మూవీ తెరకెక్కింది. 3 గంటల నిడివి కలిగిన ఈ చిత్రం ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేసింది. ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ కూడా ఎక్కువ నిడివితో వస్తుండటంతో గత అనుభవం తిరిగి రీపిట్‌ అవుతుందా? అని ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కథ ఎంత బాగున్నా నిడివి ఎక్కువగా ఉంటే ప్రేక్షకులు బోర్ ఫీలయ్యే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.&nbsp; విలన్‌దే పైచేయి..! 'సరిపోదా శనివారం' చిత్రంలో నానికి ప్రత్యర్థిగా తమిళ నటుడు ఎస్‌.జే. సూర్య (S.J. Suryah) నటించారు. దుర్మార్గమైన పోలీసు ఆఫీసర్‌గా అతడు కనిపించనున్నారు. అయితే ఇందులో నాని పాత్ర కంటే ఎస్‌. జే. సూర్య పాత్రనే ఎక్కువగా హైలెట్‌ కానున్నట్లు తెలుస్తోంది. హీరో పాత్ర చాలా వరకూ సైలెంట్‌గా ఉండిపోవాల్సి వస్తుందని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. శనివారం మాత్రమే చెలరేగిపోయే హీరో మిగిలిన రోజుల్లో కూల్‌ అండ్‌ కామ్‌గా ఉంటాడని మూవీ టీమ్‌ పరోక్షంగా ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎస్‌.జే. సూర్య పాత్ర సినిమాపై బలమైన ముద్ర వేస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ను గమనిస్తే నాని నటన బాగున్నప్పటికీ విలన్‌గా ఎస్‌.జే. సూర్య ఎక్కువగా ఇంపాక్ట్‌ చూపించారు. తన నటనతో ఇరగదీశాడు. దీంతో నాని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ హీరో కంటే ఎస్‌.జే. సూర్య యాక్టింగ్‌ హైలెట్ అయితే పరిస్థితి ఏంటని సమాలోచనల్లో పడ్డారు. అదే గనుక నిజమైతే నాని ఫ్యాన్స్‌కు నిరూత్సాహ పడక తప్పదు.&nbsp; కథని ముందే రివీల్‌ చేస్తున్నాడు! ‘సరిపోదా శనివారం’ టీమ్‌కు నటుడు ఎస్‌.జే. సూర్య కొత్త చిక్కులు తీసుకొస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా చేస్తున్న ఇంటర్యూల్లో కథను నేరుగా చెప్పేస్తూ అందరికీ షాకిస్తున్నారు. హీరో శనివారం మాత్రమే ఎందుకు చెలరేగిపోతాడో ఆయన ఓ ఇంటర్యూలో రివిల్‌ చేసేశారు. అలాగే ఇటీవల నిర్వహించిన ఓ ప్రమోషన్ ఈవెంట్‌లో నిడివి గురించి సైతం సెన్సార్‌ పూర్తి కాకుండానే చెప్పేశారు. ఇలా సినిమాలోని మెయిన్‌ పాయింట్స్‌ను రివీల్ చేస్తుండటంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ముందే అన్ని చెప్పేస్తే సినిమాపై ఆసక్తి ఏముంటుందని సోషల్‌ మీడియా వేదికగా కామెంట్స్‌ చేస్తున్నారు. ‘మానాడు’ చిత్రంలో ఎస్‌.జే. సూర్య చెప్పిన ‘వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు రిపీట్‌’ డైలాగ్‌ను అతడికే అన్వయిస్తూ నెటిజన్స్‌ ట్రోల్స్‌ చేస్తున్నారు.&nbsp; ‘థియేటర్లలో శివ తాండవం చూస్తారు’ ‘సరిపోదా శనివారం’ గురించి ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో హీరో నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘వివేక్‌ చేసే శివ తాండవం ఆగస్టు 29న థియేటర్‌లో చూస్తారు. అందరూ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఇదొక మైలురాయి. సినిమా గురించి టెన్షన్‌ పడుతున్న సమయంలో జేక్స్‌ బిజోయ్‌ మ్యూజిక్‌ వింటే ఆ టెన్షన్‌ మొత్తం ఎగిరిపోయింది. ఒక బస్తా పేపర్లు ఎక్కువే తీసుకెళ్లండి. జేక్స్‌ అంతగా పని పెట్టాడు.&nbsp; నిర్మాత దానయ్యగారు మంచి పాజిటివ్‌ మనిషి. సినిమా బాగా రావాలని ఆశిస్తారు. అందుకే మంచి కథలు ఆయన్ను వెతక్కుంటూ వస్తున్నాయి’ అని నాని అన్నారు.&nbsp;
    ఆగస్టు 27 , 2024
    <strong>Kalki 2898 AD Weekend Collections: ‘కల్కి’ కలెక్షన్ల సునామి.. తొలి 4 రోజుల్లోనే 90% మేర బడ్జెట్‌ వసూల్‌!</strong>
    Kalki 2898 AD Weekend Collections: ‘కల్కి’ కలెక్షన్ల సునామి.. తొలి 4 రోజుల్లోనే 90% మేర బడ్జెట్‌ వసూల్‌!
    పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. శుక్రవారం (జూన్‌ 27) విడుదలైన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. అన్ని ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు కల్కి సినిమా చూసి అదిరిపోయిందంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ఇక తొలిరోజు రూ.191.5 కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. వీకెండ్‌ పూర్తయ్యేసరికి ఏ స్థాయి కలెక్షన్స్‌ రాబట్టిందోనని యావత్‌ సినీ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో తాజాగా నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ ప్రకటించిన వీకెండ్ కలెక్షన్స్ అంకెలు మతిపోగొడుతున్నాయి. హీరో ప్రభాస్‌ బాక్సాఫీస్‌ స్టామినాకు అద్దం పడుతున్నాయి.&nbsp; వీకెండ్‌ కలెక్షన్స్ ఎంతంటే? ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం.. వీకెండ్‌లో (గురు, శుక్ర, శని, ఆదివారాలు) వరల్డ్‌ వైడ్‌గా రూ.555 కోట్లు (GROSS) కొల్లగొట్టినట్లు నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు హీరో ప్రభాస్, అమితాబ్ బచ్చన్‌, దీపికా పదుకొనే ఇతర ప్రధాన తారాగణం ఉన్న స్పెషల్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. ‘గ్లోబల్ బాక్స్ ఆఫీస్‌లో అతిపెద్ద శక్తులు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. నెమ్మదించే సూచనలు కనిపించడం లేదు’ అంటూ ఈ పోస్టర్‌కు క్యాప్షన్‌ ఇచ్చింది. రూ.1000 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగిన కల్కి.. తొలి నాలుగు రోజుల్లోనే సగం కలెక్షన్స్‌ సాధించడంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇదిలా ఉంటే.. కల్కి నిర్మాణానికి రూ.600 కోట్లు ఖర్చు అయినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తొలి నాలుగు రోజుల్లోనే 90% మేర బడ్జెట్‌ను కల్కి రికవరి చేయడం విశేషం. కాగా, మరోవారం రోజులపాటు కొత్త సినిమాలు ఏవి విడుదలకు సిద్ధంగా లేకపోవడంతో కల్కి కలెక్షన్స్ ఊహించిన దానికంటే ఎక్కువగా వసూలు అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ‘కల్కి’ కొత్త చరిత్ర ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ఓవర్సీస్‌లో దూసుకెళ్తోంది. ముఖ్యంగా నార్త్‌ అమెరికా ఆడియన్స్‌ కల్కి చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. ఫలితంగా అక్కడ కల్కి కొత్త చరిత్రను సృష్టించింది. నార్త్‌ అమెరికాలో మెుదటి వారంతంలో 11 మిలియన్‌ డాలర్ల వసూళ్లను ‘కల్కి 2898 ఏడీ’ రాబట్టింది. ఒక ఇండియన్‌ సినిమా.. వీకెండ్‌లో ఈ స్థాయి వసూళ్లు సాధించడం నార్త్‌ అమెరికాలో ఇదే తొలిసారి. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువు దాదాపు రూ.91 కోట్లకు సమానం. ఏడేళ్లుగా నార్త్ అమెరికాలో పదిలంగా ఉన్న బాహుబలి 2 రికార్డ్స్‌ను ‘కల్కి’ తొలి నాలుగు రోజుల్లోనే చెరిపేయడం విశేషం. ప్రస్తుత అడ్వాన్స్‌ బుకింగ్స్‌ చూస్తుంటే రానున్న రోజుల్లో కల్కి మరిన్ని రికార్డులను నార్త్‌ అమెరికాలో క్రియేట్‌ చేస్తుందని చెప్పవచ్చు.&nbsp; నార్త్‌లో కల్కి ప్రభంజనం ప్రభాస్‌ కల్కి చిత్రం.. నార్త్‌ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీంతో బాలీవుడ్‌ ప్రేక్షకులు కల్కి చిత్రాన్ని చూసేందుకు విశేష ఆదరణ కనబరుస్తున్నారు. ఫలితంగా హిందీ భాషలో కల్కి తొలి నాలుగు రోజుల్లో ఏకంగా రూ.115 కోట్లకు (GROSS) పైగా వసూళ్లు సాధించినట్లు నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ ప్రకటించింది. ప్రత్యేక ధన్యవాదాలు అంటూ అమితాబ్‌ అశ్వత్థామ పాత్రలో ఉన్న పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. అటు తెలుగు రాష్ట్రాల్లో (ఏపీ, తెలంగాణ కలిపి) వీకెండ్‌లో రూ.171.15 కోట్లను ప్రభాస్‌ చిత్రం వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. కర్ణాటక + రెస్ట్‌ ఆఫ్ ఇండియా రూ.19.80 కోట్లు రాబట్టినట్లు పేర్కొన్నాయి. కల్కి బాక్సాఫీస్‌ సునామి మరిన్ని రోజులు కొనసాగనున్నట్లు స్పష్టం చేశాయి.&nbsp;
    జూలై 01 , 2024
    <strong>Kalki 2898 AD Day 1 Collections: టికెట్ రేట్లు పెంచిన నిరాశ పరిచిన కలెక్షన్లు.. కారణం ఏమిటంటే?</strong>
    Kalki 2898 AD Day 1 Collections: టికెట్ రేట్లు పెంచిన నిరాశ పరిచిన కలెక్షన్లు.. కారణం ఏమిటంటే?
    పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas) హీరోగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) తెరకెక్కిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రం.. గురువారం (జూన్‌ 27) వరల్డ్‌ వైడ్‌గా విడుదలై అదరగొడుతోంది. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్‌ టాక్‌ రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. కల్కి సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో ప్రస్తుతం అందరి దృష్టి.. ఈ మూవీ తొలిరోజు కలెక్షన్స్‌పై పడింది. మైథాలజీ - ఫ్యూచరిక్‌ జానర్‌లో విజువల్‌ వండర్‌గా రూపొందిన కల్కి ఫిల్మ్‌.. మెుదటి రోజు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబడుతుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తూ వచ్చాయి. మరి కల్కి ఆ మార్క్‌ను అందుకుందా? బాక్సాఫీస్‌ వద్ద ప్రభాస్‌ మేనియా ఏ స్థాయిలో పని చేసింది? అటు యూఎస్‌లో కల్కి సృష్టించిన ఆల్‌టైమ్‌ రికార్డ్‌ ఏంటి? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; డే1 కలెక్షన్స్‌ ఎంతంటే? 'కల్కి 2898 ఏడీ' మూవీ డే 1 కలెక్షన్స్‌పై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌.. మెుదటి రోజు వసూళ్లను అధికారికంగా ప్రకటించింది. ‘కల్కి’ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.191.5 కోట్లు (GROSS) కొల్లగొట్టినట్లు మేకర్స్‌ ప్రకటించారు. ‘లెట్స్‌ సెలబ్రేట్‌ సినిమా’ అనే క్యాప్షన్‌తో స్పెషల్‌ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశారు. వాస్తవానికి కల్కి చిత్రం తొలిరోజు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని ట్రైడ్‌ వర్గాలు ముందు నుంచి లెక్కలు వేశాయి. ఇప్పటివరకూ ఉన్న డే1 రికార్డ్స్‌ అన్ని తుడిచిపెట్టుకుపోతాయంటూ విశ్లేషణలు వచ్చాయి. అయితే కొద్దిలో రూ.200 కోట్ల మార్క్‌ను ‘కల్కి’ మిస్‌ చేసుకుంది. కానీ, ఈ వారంతంలో కల్కి కచ్చితంగా రూ.500 కోట్ల క్లబ్‌లో చేరుతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆల్‌టైమ్‌ రికార్డు ప్రభాస్‌ ‘కల్కి’ సినిమా నార్త్‌ అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది. ప్రభాస్‌తో (Prabhas) పాటు అగ్రతారల నటనకు అక్కడి ఆడియన్స్‌ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే నార్త్‌ అమెరికాలో కల్కి ఆల్‌టైమ్‌ రికార్డును క్రియేట్‌ చేసింది. నార్త్‌ అమెరికా ప్రీమియర్స్‌ కలెక్షన్స్‌లో కల్కి ఏకంగా 3.8 మిలియన్‌ డాలర్ల వసూళ్లను సాధించింది. నార్త్ అమెరికాలో ఒక ఇండియన్‌ చిత్రం ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం ఇదే తొలిసారి. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా కల్కి రికార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాతి స్థానాల్లో ‘ఆర్‌ఆర్ఆర్‌’ (3.46 మిలియన్లు), ‘సలార్‌’ (2.6 మిలియన్లు), ‘బాహుబలి2’ (2.45 మిలియన్లు) ఉన్నాయి. ఓవర్సీస్‌లో ఎంతంటే? ప్రీమియర్స్‌, ఫస్ట్‌డే కలెక్షన్స్‌ కలిపి అమెరికాలో తొలి రోజు 5 మిలియన్‌ డాలర్ల వసూళ్లను కల్కి రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. అమెరికాలో ఎక్కువ కలెక్షన్లు సాధించిన తెలుగు సినిమాల్లో ‘కల్కి’ ఒక్క రోజులోనే 5వ స్థానాన్ని సొంతం చేసుకుంది. అలాగే అత్యంత వేగంగా 5 మిలియన్లు వసూలు చేసిన సినిమాగానూ రికార్డు నెలకొల్పింది. ఈ కలెక్షన్లు ఇలాగే కొనసాగితే ఓవర్సీస్‌లో కల్కి బెంచ్‌మార్క్‌ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వీకెండ్‌కు కలెక్షన్స్‌ మరింత పెరిగే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' రికార్డ్‌ సేఫ్‌! ట్రేడ్‌ వర్గాలు లెక్కలను బట్టి.. 'ఆర్‌ఆర్‌ఆర్‌' రికార్డును 'కల్కి 2898 ఏడీ' బీట్‌ చేయలేకపోయింది. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం తొలిరోజు రూ.223 కోట్లు (GROSS) రాబట్టి అత్యధిక డే1 వసూళ్లు సాధించిన ఇండియన్‌ చిత్రంగా టాప్‌లో ఉంది. ట్రేడ్‌ వర్గాల అంచనాల ప్రకారం 'కల్కి 2898 ఏడీ' రూ.180 కోట్ల వద్దే ఆగిపోవడంతో 'ఆర్‌ఆర్‌ఆర్‌' రికార్డ్‌ అలాగే భద్రంగా ఉంది. ఆ తర్వాత 'బాహుబలి 2' రూ.217 కోట్లతో రెండో స్థానంలో నిలించింది. అయితే రెండింటి రికార్డులను కల్కి బ్రేక్‌ చేయలేకపోయింది. కానీ, కేజీఎఫ్ 2 (రూ.164.5 కోట్లు), సలార్ (రూ.158 కోట్లు), ఆదిపురుష్ (136.8 కోట్లు), సాహో (రూ.125.6 కోట్లు) రికార్డ్స్‌ను బ్రేక్‌ చేసి టాప్‌-3లో నిలిచింది. కలెక్షన్లపై మ్యాచ్ ఎఫెక్ట్! 'కల్కి 2898 ఏడీ' సినిమాను ‘బాహుబలి 2’, ‘RRR’ చిత్రాల మాదిరిగా ప్రమోట్ చేయడంలో చిత్రబృందం వెనుకబడింది. ఇంకా పెద్ద స్థాయిలో ప్రమోషన్స్ చేసి ఉంటే ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేసే అవకాశం ఉండేది. అటు ఈ సినిమా కలెక్షన్లపై టీ-20 వరల్డ్ కప్ ఎఫెక్ట్ పడింది. గురువారం సాయంత్రం జరిగిన ఇండియా-ఇంగ్లాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ ను చూసేందుకు ఆడియన్స్ మొగ్గు చూపడం కొంత మైనస్ గా మారింది. దీనికి తోడు గురువారం వర్కింగ్‌ డే కావడం కూడా కల్కి కలెక్షన్స్‌పై ప్రభావం చూపింది. అయితే సర్వత్రా పాజిటివ్‌ టాక్‌ రావడంతో ఈ వీకెండ్‌లో కల్కి వసూళ్లు గణనీయంగా పెరిగే అవకాశముంది.&nbsp; Top 10 Highest Opening Day Collections in India 1. ఆర్‌ఆర్‌ఆర్‌ (2022) ఎన్టీఆర్‌ (Jr.NTR), రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోలుగా ఎస్‌.ఎస్‌. రాజమౌళి (S.S. Rajamouli) తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) చిత్రం తొలిరోజు అత్యధిక గ్రాస్‌ వసూలు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ మూవీ మెుదటి రోజే రూ.223.5 కోట్లను కొల్లగొట్టి అప్పటివరకూ ఉన్న అన్ని రికార్డులను చెరిపేసింది. ఆర్‌ఆర్‌ఆర్‌ వసూళ్లను చూసి ట్రేడ్‌ వర్గాలు సైతం ఆశ్యర్యపోవడం గమనార్హం. 2. బాహుబలి 2 (2017) రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ (Baahubali 2) ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఈ సినిమా తొలి రోజు వరల్డ్‌ వైడ్‌గా రూ. 214.5 కోట్లను రాబట్టింది. RRR రిలీజ్‌కు ముందు వరకూ ఐదేళ్ల పాటు ఈ మూవీనే హైయస్ట్‌ ఇండియన్‌ ఓపెనింగ్‌ గ్రాసర్‌ మూవీగా (Highest Indian Opening Grosser Movie)గా కొనసాగుతూ వచ్చింది.&nbsp; 3. సలార్‌ (2023) ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందిన సలార్‌ చిత్రం.. తొలిరోజున రూ.178.7 కోట్ల వసూళ్లను రాబట్టింది. 2023 ఏడాదిలో అత్యధిక డే1 వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలో ప్రభాస్‌ విశ్వరూపం చూపించాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టాడు. ప్రభాస్‌ కటౌట్‌కు తగ్గ సినిమా ఇదని ఫ్యాన్స్‌ తెగ మెచ్చుకున్నారు.&nbsp; 4. కేజీఎఫ్‌ 2 (2022) ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యష్‌ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్‌ 2 (KGF 2) చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పలు రికార్డులను కొల్లగొట్టింది. ఈ క్రమంలో తొలి రోజు అత్యధిక వసూళ్లను రాబట్టిన మూడో చిత్రంగాను సత్తా చాటింది. ఈ చిత్రం మెుదటి రోజు రూ.164.5 కలెక్షన్స్‌ సాధించింది. ఈ జాబితాలోని తొలి మూడు చిత్రాలు దక్షిణ సినీ రంగానికి చెందినవి కావడం విశేషం.&nbsp; 5. ఆదిపురుష్‌ (2023) ప్రభాస్‌ రాముడిగా, కృతి సనన్‌ సీతగా బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్‌’ (Adipurush). ఈ మూవీ ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ తొలి రోజు మాత్రం మంచి గ్రాస్‌ వసూళ్లనే సాధించింది. ఆదిపురుష్‌ మెుదటి రోజు కలెక్షన్స్‌ రూ.136.8 కోట్లుగా రికార్డ్‌ అయ్యాయి. 6. జవాన్‌ (2023) బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ నటించిన జవాన్‌ చిత్రం.. గతేడాది సెప్టెంబర్‌లో విడుదలై తొలిరోజున రూ.129.6 కోట్లు కొల్లగొట్టింది. హిందీ సినిమా హిస్టరీలో తొలి రోజున ఆ స్థాయి కలెక్షన్స్ రాబట్టిన మెుదటి చిత్రంగా నిలిచింది. ప్రముఖ సౌత్‌ ఇండియన్‌ డైరెక్టర్‌ అట్లీ తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి విలన్‌గా చేశారు. లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ఈ సినిమాలో తొలిసారి షారుక్‌తో జత కట్టింది. 7. సాహో (2019) ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన సాహో (Saaho) కూడా ఫస్ట్‌డే రోజున రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టింది. తొలి రోజున ఈ మూవీ రూ.125.6 కోట్లు సాధించినట్లు అప్పట్లో చిత్ర వర్గాలు ధ్రువీకరించాయి. సుజిత్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రభాస్‌కు జోడీగా శ్రద్ధా కపూర్‌ చేసింది.&nbsp; 8. రోబో 2.0 (2018) తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా చేసిన ‘రోబో 2.0’ చిత్రం అత్యధిక గ్రాస్‌ వసూళ్లు రాబట్టిన ఆరో భారతీయ చిత్రంగా రికార్డు కెక్కింది. ఈ మూవీ తొలి రోజున రూ.105.6 కోట్లు రాబట్టడం విశేషం. అయితే ఫ్లాప్‌ టాక్‌ రావడంతో ఫస్ట్‌డే పరంపరను రోబో 2.0 కొనసాగించలేకపోయింది. శంకర్‌ డైరెక్ట్‌ చేసిన ఈ మూవీలో అక్షయ్‌ కుమార్‌ విలన్‌గా నటించాడు.&nbsp; 9. పఠాన్‌ (2023) ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన షారుక్‌ ఖాన్‌ పఠాన్‌ (Pathaan) చిత్రం ఫస్ట్‌డే రూ.104.8 కోట్లు కొల్లగొట్టింది. తద్వారా తాజా జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది. సరైన హిట్‌ కోసం ఎదురుచూస్తున్న షారుక్‌కు పఠాన్‌ మూవీ మంచి బూస్టప్‌ ఇచ్చింది. తాజాగా రిలీజైన జవాన్‌ కూడా హిట్‌ సాధించడంతో షారుక్‌తో పాటు, ఆయన ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు.&nbsp; 10. జైలర్‌ (2023) రజనీకాంత్‌ లేటెస్ట్‌ మూవీ ‘జైలర్‌’ (Jailer) సైతం తొలిరోజు వరల్డ్‌ వైడ్‌గా రూ.91.2 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. ఈ స్థాయి కలెక్షన్స్‌ సాధించిన తొలి తమిళ చిత్రంగానూ రికార్డు సృష్టించింది. ఈ చిత్రం ఓవరాల్‌గా రూ.650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. తాజాగా ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ అక్కడ కూడా దూసుకుపోతోంది.&nbsp;
    జూన్ 28 , 2024
    <strong>Kalki 2898 AD Tickets: ఆన్‌లైన్‌లో ‘కల్కి’ టికెట్ల గోల్‌మాల్‌..? థియేటర్ల కక్కుర్తిపై ఫ్యాన్స్‌ ఆగ్రహం!</strong>
    Kalki 2898 AD Tickets: ఆన్‌లైన్‌లో ‘కల్కి’ టికెట్ల గోల్‌మాల్‌..? థియేటర్ల కక్కుర్తిపై ఫ్యాన్స్‌ ఆగ్రహం!
    ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) సినిమా కోసం యావత్‌ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం గురువారం (జూన్‌ 27) వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ కాగా.. హాట్‌ కేకుల్లా టికెట్స్‌ అమ్ముడుపోతున్నాయి. ఏపీ, తెలంగాణలో కల్కి సినిమాకు టికెట్ రేట్లు పెంచడానికి పర్మిషన్స్ రావడంతో అన్ని థియేటర్స్‌లో టికెట్ ధరలు భారీగా పలుకుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్‌లోనూ ఈ సినిమా అడ్వాన్స్‌ బుకింగ్స్‌ జోరుగా జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే టికెట్ల అమ్మకాల్లో కొన్ని థియేటర్లు అనుసరిస్తున్న వైఖరి వివాదస్పదమవుతోంది. దీనిపై ఫ్యాన్స్‌ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.&nbsp; ఫ్యాన్స్ అసంతృప్తి ఎందుకంటే? కల్కి సినిమాపై ఉన్న ఆసక్తిని సొమ్ము చేసుకునేందుకు కొన్ని థియేటర్లు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆన్‌లైన్‌లో టికెట్స్‌ అందుబాటులో ఉన్నట్లు చూపిస్తున్నా.. బుక్‌ చేసుకునేందుకు వీలుపడకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ‘బుక్‌మై షో’.. థియేటర్లలో టికెట్స్ ఉన్నట్లు గ్రీన్‌ కలర్‌లో షోవారిగా టికెట్స్‌ను చూపిస్తున్నాయి. అయితే వాటిని క్లిక్‌ చేస్తే అభిమానులకు ‘Sorry! Something is not right’ సందేశం వస్తోంది.దీనిపై ప్రభాస్‌ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టికెట్స్‌ను బ్లాక్‌లో ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చన్న ఉద్దేశంతోనే థియేటర్‌ యాజమాన్యాలు ఇలా చేస్తున్నాయని మండిపడుతున్నారు. ఓ వైపు టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయన్న ఆందోళన ఉన్నప్పటికీ అభిమాన హీరో అయినందువల్ల బుకింగ్స్‌ కోసం ట్రై చేస్తున్నట్లు కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. కానీ.. థియేటర్ యాజమన్యాల కక్కుర్తి చర్యలు.. అసహనానికి గురిచేస్తున్నాయని మండిపోతున్నారు. ఇలా చేస్తే భవిష్యత్‌లో థియేటర్లకు రావాలన్న ఆసక్తి కూడా సన్నగిల్లుతుందని కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; రూ.1000 కోట్ల క్లబ్‌లో.. ఇదిలా ఉంటే.. కల్కి సినిమా అడ్వాన్స్‌ బుకింగ్స్‌కు ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. సాధారణంగా ఏదైనా స్టార్‌ హీరో సినిమా అంటే టైర్‌-1 సిటీస్‌లో ఎక్కువగా అడ్వాన్స్‌ బుకింగ్స్ జరుగుతుంటాయి. కానీ, కల్కికి మాత్రం టైర్‌-2 సిటీస్‌లోనూ జోరుగా టికెట్స్‌ బుక్‌ అవుతున్నాయి. నగరవాసులు మాత్రమే కాకుండా చిన్న చిన్న పట్టణాలు, గ్రామాలలోని ప్రేక్షకులు సైతం కల్కి చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలి రోజున ఏమాత్రం పాజిటివ్‌ టాక్‌ వచ్చినా.. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురవడం ఖాయమని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అదే జరిగితే ‘కల్కి’ ఈజీగానే రూ.1000 కోట్లు కొల్లగొడుతుందని అంటున్నారు.&nbsp; ఫస్ట్‌డే టార్గెట్‌ ఎంతంటే? గతంలో రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘బాహుబలి 2’ (Bahubali 2) సినిమా మొదటి రోజు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అలాగే రాజమౌళి తదుపరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (RRR) కూడా రూ.200 కోట్ల గ్రాస్ మార్క్‌ను క్రాస్ చేసింది. ‘బాహుబలి 2’ తర్వాత మరోసారి ఆ మార్క్‌ను ప్రభాస్ టచ్ చేయలేకపోయాడు. గత ఏడాది ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయిన ‘సలార్’ కూడా తొలిరోజు రూ.200 కోట్లు రాబట్టలేకపోయింది. దీంతో ప్రభాస్ ‘కల్కి’ ఫస్ట్ డే టార్గెట్ రూ.200 కోట్లు పైనే అని తెలుస్తోంది. రాజమౌళి బ్రాండ్‌తో సంబంధం లేకుండా ప్రభాస్‌ సోలోగా రూ.200 కోట్లు కొల్లగొడతాడా? లేదా? అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ప్రభాస్‌ ఈ ఫీట్‌ సాధిస్తే.. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘కల్కి’ నిలవడం ఖాయమని చెప్పవచ్చు.&nbsp; టికెట్ రెట్లు పెంపు కల్కి టికెట్‌ ధరలు పెంపునకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం టికెట్స్‌ పెంపునకు అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చింది. జూన్‌ 27 నుంచి జులై 4 వరకూ సింగిల్ స్క్రీన్‌పై రూ.75, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 వరకూ పెంచుకోవచ్చని సూచించింది. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా కల్కి టీమ్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పింది. సింగిల్ స్క్రీన్‌లకి రూ.75, మల్టీప్లెక్స్‌లకి రూ.125 వరకూ టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. అంతేకాక అదనపు షోలకి కూడా పర్మిషన్ ఇచ్చింది. ప్రతి థియేటర్‌లో 5 షోలు వేసుకునేందుకు అవకాశం కల్పించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కల్కి టికెట్‌ ధరలు భారీ ఎత్తున పెరిగాయి. మల్టీప్లెక్స్‌లో సినిమా చూడాలంటే సగటున ఒక్కో టికెట్‌కు రూ.500 (ట్యాక్స్‌లతో కలిపి) వరకూ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అదే సింగిల్‌ స్క్రీన్స్‌లో అయితే రూ.200-300 వరకూ పెట్టాల్సిందే. ఫ్యామిలీ అంతా సినిమా చూడాలంటే వేలల్లో ఖర్చు పెట్టాల్సి వస్తోందని కొందరు నెటిజన్లు నెట్టింట పోస్టులు పెడుతున్నారు.&nbsp; ఒక్కో టికెట్‌ రూ.3 వేలు..! కల్కి సినిమా ప్రభావం నార్త్‌లోనూ గణనీయంగా కనిపిస్తోంది. పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌ చిత్రాన్ని చూసేందుకు బాలీవుడ్‌ ప్రేక్షకులు ఆసక్తికనబరుస్తున్నాయి. దీన్ని గమనించిన థియేటర్‌ వర్గాలు సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా ముంబయిలో కల్కి అడ్వాన్స్‌ బుకింగ్‌ టికెట్‌.. భారీ ధర పలుకుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మల్టీప్లెక్స్ లలో కల్కి సినిమా ఒక్కో టికెట్ ధర రూ.2000 రూపాయలు ఉన్నట్టు తెలుస్తోంది. అదే డ్రైవ్ ఇన్ థియేటర్స్‌లో అయితే ఏకంగా రూ. 3000 రూపాయలకు విక్రయిస్తున్నారట. ఢిల్లీ మల్టీప్లెక్స్‌లో రూ.1300 నుంచి రూ.2000 వరకు టికెట్ రేట్లు ఉన్నట్లు సమాచారం. అటు బెంగళూరులోని కొన్ని మల్టీప్లెక్సుల్లో టికెట్‌ ధర రూ.1100-1500 వరకు ఉన్నాయని సమాచారం. ఇక హైదరాబాద్‌లో బెనిఫిట్ షోకి రూ.3000 వరకూ టికెట్స్ బ్లాక్‌లో అమ్ముతున్నారని టాక్.&nbsp; అక్కడ కల్కి రికార్డ్‌ షోస్.. హైదరాబాద్‌లో ఇటీవల ప్రారంభం అయిన అపర్ణ మల్టీప్లెక్స్‌లో తొలిరోజున కల్కి కోసం ఏకంగా 47 షోలు ప్రదర్శిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. అంతేకాకుండా అన్ని షోలకు సంబంధించిన టికెట్స్‌ సైతం ఇప్పటికే అమ్ముడి పోయినట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి స్పెషల్‌&nbsp; పోస్టర్‌ను సైతం వారు రిలీజ్‌ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది. ప్రభాస్‌ సినిమా అంటే ఆమాత్రం ఉంటుందని కొందరు పోస్టులు పెడుతున్నారు.&nbsp; https://twitter.com/gopaladusumalli/status/1805502440420303323
    జూన్ 25 , 2024

    @2021 KTree