దర్శకులు : జీవన్ జె కాంగ్, నవీన్ జాన్
సంగీతం: కాలభైరవ
ఎడిటింగ్: తరుణ్ ప్రసాద్
నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ ఎస్ రాజమౌళి, జీవన్ జే. కాంగ్, శరద్ దేవరాజన్, షేక్ మక్బూల్
విడుదల తేదీ: 17 మే, 2024
ఓటీటీ వేదిక: డిస్నీ + హాట్‌స్టార్
భారత చిత్ర పరిశ్రమను మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రం ‘బాహుబలి’ (Bahubali). ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నా, సత్యరాజ్, నాజర్ కీలకపాత్రల్లో నటించిన ‘బాహుబలి’ రెండు భాగాలు బాక్సాఫీస్ వద్ద కోట్లు వసూళ్లు చేశాయి. దీంతో మూడో పార్ట్‌పై సినీప్రియులు ఆసక్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే బాహుబలి యానిమేషన్ వెర్షన్‌ను తీసుకొచ్చారు. ఇది ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ పేరుతో డిస్నీ+హాట్‌స్టార్ (Disney+ Hotstar) వేదికగా మే 17 నుంచి స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మెుత్తం 9 ఎపిసోడ్స్‌గా అందుబాటులో ఉంది. మరి ఈ యానిమేషన్ సిరీస్ ఎలా ఉంది? ఓటీటీ ప్రేక్షకులను అలరించిందా? లేదా? అన్నది కథ.
కథేంటి
ఈ సిరీస్ కథాంశం బాహుబలి (Baahubali: Crown of Blood Review) చనిపోవడానికి ముందు జరుగుతుంటుంది. మహా క్రూరుడైన రక్తదేవ్.. మాహిష్మతి సామ్రాజ్యం చుట్టు పక్కల రాజ్యాలపై దండేత్తి ఆక్రమించుకుంటాడు. తర్వాత అతడి కన్ను మాహిష్మతిపై పడుతుంది. దానిని కూడా ఎలాగైన సొంతం చేసుకోవాలని భావిస్తాడు. దీంతో అతడ్ని అడ్డుకునేందుకు బాహుబలి, భల్లాలదేవ రంగంలోకి దిగుతారు. అయితే అనూహ్యంగా కట్టప్ప రక్తదేవ్ కోసం పనిచేయడం మెుదలు పెడతాడు. అసలు రక్తదేవ్ ఎవరు? కట్టప్ప అతడి కోసం ఎందుకు పని చేశాడు? రక్తదేవ్ వల్ల మాహిష్మతికి వాటిల్లిన ముప్పు ఏంటి? బాహుబలి, భల్లాల తమ రాజ్యాన్ని కాపాడుకున్నారా? లేదా? అన్నది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
‘బాహుబలి : క్రౌన్ ఆఫ్ బ్లడ్’ సిరీస్‌లో గ్రాఫిక్ వర్క్స్, యుద్ద సన్నివేశాలు, కొన్ని పాత్రలు, ట్విస్టులు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా విలన్ రక్తదేవ్ పాత్రను చాలా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారు. అతడ్ని ప్రెజెంట్ చేసిన విధానమూ బాగుంది. జక్కన్న సినిమాల్లో విలన్ ఎంత క్రూరంగా ఉంటాడో అదే మార్క్‌ను రక్తదేవ్ పాత్రలోనూ చూపించే ప్రయత్నం చేశారు. ఇక రక్తదేవ్‌కు కట్టప్ప సహాయం చేయడం అనేది సిరీస్‌లో కీలకమైన ఆసక్తికర అంశంగా ఉంది. ఈ యానిమేషన్ సిరీస్‌లో డిఫరెంట్ ఆయుధాలను చూపించారు. అయితే బాహుబలి స్థాయిలో ఈ యానిమేషన్ సిరీస్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకోదు. బాహుబలి పాత్ర తాలుకూ ప్రభాస్ యానిమేషన్ వెర్షన్ అభిమానులకు అంతగా రుచించదు. తెలుగు డబ్బింగ్ కూడా సెట్ కాలేదు. ఇతర పాత్రలకు సంబంధించిన డబ్బింగ్ కూడా ఏమాత్రం ఆకట్టుకోదు. అయితే చివరి నాలుగు ఎపిసోడ్స్ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటాయి.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే (Baahubali: Crown of Blood Review).. నేపథ్య సంగీతం పర్వాలేదు. కీరవాణి రేంజ్‌లో మాత్రం లేదు. ఎడిటింగ్ బాగానే ఉంది. గ్రాఫిక్స్ డిపార్ట్‌మెంట్ చక్కటి పనితీరు కనబరిచింది. బాహుబలి పాత్ర మినహా మిగత పాత్రల తాలుకూ యానిమేషన్ బాగుంది. నిర్మాణ విలువలు సిరీస్‌కు తగ్గట్టు ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
- కథ, స్క్రీన్‌ప్లే
- యానిమేషన్ వర్క్స్
- యుద్ధ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
- తెలుగు డబ్బింగ్
- కొరవడిన ఎమోషన్స్
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!