ఏప్రిల్ 1నుంచి ఇళ్ల ధరలకు రెక్కలు!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏప్రిల్ 1నుంచి ఇళ్ల ధరలకు రెక్కలు!

    ఏప్రిల్ 1నుంచి ఇళ్ల ధరలకు రెక్కలు!

    March 31, 2023
    in India, News

    © Envato

    దేశంలో కొత్త ఏడాదిలో ఇళ్ల ధరలు మరింత పెరగనున్నాయని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ తెలిపింది. 2022-23 ఆర్థిక ఏడాదిలో 8-10 శాతం వరకు ఇళ్ల ధరలు పెరిగాయని తెలిపింది. వచ్చే ఏడాదిలో మరో 5శాతం పెరుగుతాయట. ఓ వైపు ఆటంకాలు ఎదురైనా స్థిరాస్తి రంగం క్రమంగా కోలుకుందని వెల్లడించింది. నిర్మాణ వ్యయం, రుణ వడ్డీ రేట్ల పెంపు, ద్రవ్యోల్బణం రూపంలో ఎదురైన సమస్యలతో స్థిరాస్తి రంగం సమర్థంగా మనుగడ సాగించిందని తెలిపింది. 2023-24 ఫైనాన్షియల్ ఇయర్‌లో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ సెక్టార్ అంచనాలను ‘ఇంప్రూవింగ్’ నుంచి ‘న్యూట్రల్’కి మార్చింది.

    మరోవైపు దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రతికూలతలు ఉన్నా 2022-23లో 8 ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు గణనీయంగా పెరిగినట్లు ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ చెప్పింది. వార్షిక ప్రాతిపదికన 15 శాతం పెరిగాయని వివరించింది. 2022 మే నుంచి ఆర్‌బీఐ వరుసగా రెపో రేటు పెంచడం ఇళ్ల ధరలను ప్రభావితం చేసినట్లు అంచనా వేసింది. మరోవైపు ఇళ్ల నిర్మాణ వ్యయం 20 శాతం నుంచి 25 శాతానికి పెరిగిందని రియల్టర్ల సంస్థ క్రెడాయ్‌ చెప్పింది. గత 45 రోజుల్లో భారీగా పెరుగుదల చోటుచేసుకున్నట్లు అంచనా వేసింది. సిమెంటు, ఇసుక, ఉక్కు వంటి ముడి ఉత్పత్తుల ధరలు పెరగడం ఇందుకు కారణంగా అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో బిల్డర్లు ఏప్రిల్‌ నుంచి ప్రాపర్టీ ధరలను పెంచక తప్పని పరిస్థితి తలెత్తిందని చెప్పింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version