• TFIDB EN
  • డియర్ (2024)
    UTelugu

    అర్జున్‌ (జీవి ప్రకాష్‌) న్యూస్‌ రీడర్‌గా గొప్ప పేరు తెచ్చుకునేందుకు యత్నిస్తుంటాడు. అయితే నిద్రలో చిన్న శబ్దం వచ్చినా ఉలిక్కిపడి లేస్తుంటాడు. అటువంటి అర్జున్‌ లైఫ్‌లోకి భార్యగా దీపిక వస్తుంది. ఆమెకున్న గురక సమస్య.. అర్జున్‌కు ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టింది? అన్నది కథ.

    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Netflixఫ్రమ్‌
    ఇన్ ( Telugu, Hindi, Malayalam, Kannada, Tamil )
    Watch
    2024 Apr 2910 days ago
    డియర్ చిత్రం నిన్నటి( ఏప్రిల్28) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
    రివ్యూస్
    How was the movie?

    సిబ్బంది
    ఆనంద్ రవిచంద్రన్దర్శకుడు
    వరుణ్ త్రిపురనేనినిర్మాత
    అభిషేక్ రామిశెట్టినిర్మాత
    జి. పృథ్వీరాజ్నిర్మాత
    కథనాలు
    <strong>My Dear Donga Review: కామెడీతో అదరగొట్టిన అభినవ్‌ గోమఠం.. ‘మై డియర్‌ దొంగ’ ఎలా ఉందంటే?</strong>
    My Dear Donga Review: కామెడీతో అదరగొట్టిన అభినవ్‌ గోమఠం.. ‘మై డియర్‌ దొంగ’ ఎలా ఉందంటే?
    నటీనటులు: అభినవ్ గోమఠం, శాలినీ కొండేపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, శశాంక్ మందూరి, వంశీధర్ గౌడ్ దర్శకుడు: బీఎస్ సర్వజ్ఞ కుమార్ రచన: శాలినీ కొండేపూడి సంగీతం: అజయ్ అరసాద ఎడిటర్: సాయి మురళి సినిమాటోగ్రఫీ: ఎస్ఎస్ మనోజ్ నిర్మాత: మహేశ్వర్ రెడ్డి గోజల స్ట్రీమింగ్‌ వేదిక : ఆహా హాస్యనటుడు 'అభినవ్‌ గోమఠం' ప్రధాన పాత్రలో చేసిన చిత్రం ‘మై డియర్‌ దొంగ’ (My Dear Donga Review). ఇందులో షాలిని కొండెపూడి (Shalini Kondepudi) మరో కీలక పాత్ర పోషించింది. కాగా, ఈ చిత్రం ఓటీటీ ఆడియన్స్‌ను టార్గెట్‌ చేస్తూ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’ (Aha)లో ప్రసారం అవుతోంది. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఓటీటీ ప్రేక్షకులను అలరించిందా? లేదా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం.&nbsp; కథేంటి? సుజాత (షాలిని), డాక్టర్‌ విశాల్‌ (నిఖిల్‌ గాజుల) ప్రేమికులు. తొలుత బాగానే ఉన్న కొంతకాలం తర్వాత విశాల్‌లో మార్పు వచ్చిందని సుజాత భావిస్తుంటుంది. ఎక్కడకు పిలిచినా బిజీ అని చెబుతున్నాడనీ ఫీలవుతుంది. ఈ క్రమంలోనే సురేశ్‌ (అభినవ్‌ గోమఠం) ఆమె ఫ్లాట్‌లో చోరీ చేసేందుకు వెళ్తాడు. అదే సమయానికి షాలిని బర్త్‌డే సెల్రబేషన్‌ చేసేందుకు విశాల్‌ ఆమె ఫ్రెండ్స్‌తో ఇంటికి వస్తాడు. అప్పటికే విశాల్‌తో మాట్లాడిన సుజాత.. ఫ్రెండ్స్‌కు అతడ్ని బాల్య స్నేహితుడిగా పరిచయం చేస్తుంది. దొంగ అని తెలిసినా సుజాత.. సురేశ్‌తో ఎందుకు పరిచయం పెంచుకుంది? వారి కుటుంబ నేపథ్యాలేంటి? విశాల్‌ పోలీసుస్టేషన్‌కు వెళ్లడానికి కారణమేంటి?&nbsp; ఎవరెలా చేశారంటే? నటి షాలిని కథను ముందుండి నడిపించింది. సుజాత పాత్రలో ఆమె చక్కగా ఒదిగిపోయింది. ముఖ్యంగా కొన్ని సీన్స్‌లో ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ చాలా బాగా అనిపిస్తాయి. ఎప్పటిలానే అభినవ్‌ తన కామెడీతో గిలిగింతలు పెట్టాడు. కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు. సుజాతను ప్రేమించిన డాక్టర్‌ విశాల్‌ పాత్రలో నిఖిల్‌ ఫర్వాలేదనిపించాడు. దివ్య శ్రీపాద, ఆమె లవర్‌గా నటించిన శశాంక్‌, వెయిటర్‌గా నటించిన వంశీధర్‌ గౌడ్‌ తమ నటనతో ఓకే అనిపించారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే నేటి ప్రేమికుల మనస్తత్వం ఎలా ఉందో తనదైన శైలిలో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు బీఎస్ సర్వజ్ఞ కుమార్. సుజాత ఉద్యోగ ప్రస్తావన, స్నేహితులు, విశాల్‌తో లవ్‌ ఎపిసోడ్‌తో సినిమాను నెమ్మదిగా స్టార్ట్‌ చేసిన డైరెక్టర్‌.. సుజాత ఫ్లాట్‌లోకి సురేశ్‌ ప్రవేశించడం నుంచి కథలో వేగం పెంచారు. అభినవ్‌ గోమఠం చుట్టూ రాసుకున్న కామెడీ ట్రాక్‌ సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. ప్రతీ ఎపిసోడ్‌ను ప్రేక్షకుడిని నవ్వించాలన్న లక్ష్యంతో రూపొందించినట్లు కనిపిస్తుంది. అయితే సుజాత, సురేశ్‌ తమ కుటుంబాల గురించి ఒకరికొకరు వివరించే తీరు కన్‌ఫ్యూజ్‌ క్రియేట్ చేస్తుంది. ఆ ఎమోషనల్‌ సీన్స్‌ను ఇంకాస్త ప్రభావవంతంగా చూపించి ఉంటే బాగుండేది. కానీ, కామెడీ పేరుతో ఎలాంటి అసభ్యతకు చోటివ్వకుండా ఫ్యామిలీతో ఎంచక్కా చూసేలా దర్శకుడు ఈ మూవీని రూపొందించడం ప్రశంసనీయం. స్లో నేరేషన్‌ కాస్త ఇబ్బంది పెట్టవచ్చు.&nbsp; సాంకేతికంగా&nbsp; సాంకేతిక విభాగానికొస్తే.. మ్యూజిక్‌, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్లు ఉంది.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ షాలిని, అభినవ్‌ గోమఠం నటనకామెడీ సన్నివేశాలు మైనస్‌ పాయింట్స్‌ నెమ్మదిగా సాగే కథనం Telugu.yousay.tv Rating : 3/5
    ఏప్రిల్ 20 , 2024
    <strong>దివ్య శ్రీపాద గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?</strong>
    దివ్య శ్రీపాద గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    టాలీవుడ్‌లో తమ క్రేజ్‌ను క్రమంగా పెంచుకుంటున్న తెలుగు అమ్మాయిల్లో 'దివ్య శ్రీపాద' ఒకరు. రీసెంట్‌గా 'సుందరం మాస్టర్‌' (Sundaram Master) సినిమా ద్వారా ఈ భామ హీరోయిన్‌గా మారిపోయింది. అంతకుముందు 'డియర్‌ కామ్రేడ్‌', 'కలర్ ఫొటో', 'మిస్ ఇండియా', 'జాతి రత్నాలు' వంటి హిట్&nbsp; చిత్రాల్లో సైడ్‌ పాత్రలకే పరిమితమైంది. 'సుందరం మాస్టర్‌'లో చక్కటి నటన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించింది. మరి దివ్య శ్రీపాద వ్యక్తిగత జీవితం గురించి చాలామందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం దివ్య శ్రీపాద అసలు పేరు? దివ్య దృష్టి దివ్య శ్రీపాద ఎప్పుడు పుట్టింది? 1996, సెప్టెంబర్ 5న జన్మించింది దివ్య శ్రీపాద ఎక్కడ పుట్టింది? దివ్య శ్రీపాద హైదరాబాద్‌లో జన్మించింది. దివ్య శ్రీపాద నటించిన తొలి సినిమా? డియర్ కామ్రెడ్ (2019)&nbsp; దివ్య శ్రీపాద నటించిన తొలి వెబ్‌సిరీస్ హెడ్స్ అండ్ టేల్స్(2021) దివ్య శ్రీపాద ఎత్తు ఎంత? 5 అడుగుల 6గుళాలు&nbsp; దివ్య శ్రీపాద అభిరుచులు? కూకింగ్ దివ్య శ్రీపాద&nbsp; ఇష్టమైన ఆహారం? నాన్‌వెజ్ దివ్య శ్రీపాదకు ఇష్టమైన కలర్?&nbsp; వైట్ దివ్య శ్రీపాదకు ఇష్టమైన హీరో? పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ దివ్య శ్రీపాద ఏం చదివింది? MBA దివ్య శ్రీపాద పారితోషికం ఎంత తీసుకుంటుంది? ఒక్కొ సినిమాకు రూ. 30లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది. దివ్య శ్రీపాద సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? దివ్య శ్రీపాద సినిమాల్లోకి రాకముందు IBM కంపెనీలో పనిచేసింది. దివ్య శ్రీపాద ఎన్ని భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు? తెలుగు, హిందీ, ఇంగ్లీష్, అరబిక్, ఫ్రెంచ్, తెలుగు భాషాల్లో అనర్గళంగా మాట్లాడుతుంది. https://www.youtube.com/watch?v=P1fCyBtJyC0 దివ్య శ్రీపాద ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/divyasripada/
    ఏప్రిల్ 29 , 2024
    <strong>Abhinav Gomatam: కామెడీ స్టార్‌ అభినవ్‌ గోమఠం గురించి ఈ విషయాలు తెలుసా?</strong>
    Abhinav Gomatam: కామెడీ స్టార్‌ అభినవ్‌ గోమఠం గురించి ఈ విషయాలు తెలుసా?
    టాలీవుడ్‌లోని టాలెంటెడ్ యంగ్‌ నటుల్లో ‘అభినవ్‌ గోమఠం’ ముందు వరుసలో ఉంటాడు. కమెడియన్‌గా కెరీర్‌ ప్రారంభించిన అభినవ్‌.. అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్‌ సంపాదించాడు. ఓ వైపు హాస్య పాత్రలు పోషిస్తూనే మరోవైపు కథానాయకుడిగా, ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తూ అలరిస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన ‘మస్త్‌ షేడ్స్‌ ఉన్నాయ్‌రా’, ‘మై డియర్‌ దొంగ’ చిత్రాలు ఇటీవల రిలీజై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. అతడు లీడ్‌ రోల్‌ చేసిన ‘సేవ్‌ ద టైగర్స్‌ 1 &amp; 2’ సిరీస్‌లు ఓటీటీలో సూపర్‌ హిట్ అయ్యాయి. దీంతో అభినవ్‌ గురించి తెలుసుకునేందుకు టాలీవుడ్‌ ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. కాబట్టి ఈ ఆర్టికల్‌లో అతడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.&nbsp; అభినవ్‌ గోమఠం ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్‌ అభినవ్‌ గోమఠం ఎప్పుడు పుట్టాడు? జనవరి 1, 1986 అభినవ్‌ గోమఠం ఎత్తు ఎంత? 5 ఫీట్‌ 10 ఇంచెస్‌ (178 సెం.మీ) అభినవ్‌ గోమఠం రాశి ఏది? సింహా రాశి అభినవ్‌ గోమఠం స్కూలింగ్‌ ఎక్కడ జరిగింది? హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో అభినవ్‌.. తన ప్రాథమిక విద్యను అభ్యసించాడు. అభినవ్‌ గోమఠం విద్యార్హత ఏంటి? హైదరాబాద్‌లోని విజ్ఞాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌లో బీటెక్‌ చేశాడు.&nbsp; అభినవ్‌ గోమఠానికి పెళ్లి జరిగిందా? కాలేదు&nbsp;&nbsp; అభినవ్‌ గోమఠం తండ్రి ఏం చేసేవారు? అభినవ్‌ తండ్రి ఎయిర్‌ ఫోర్స్‌లో ఉద్యోగి.&nbsp; అభినవ్‌ గోమఠం కెరీర్‌ ప్రారంభంలో ఏం చేశాడు? నటనపై ఆసక్తితో ఉడాన్‌ థియేటర్‌, అహరం థియేటర్‌ వంటి సంస్థల ఆధ్వర్యంలో పలు నాటకాలు ప్రదర్శించాడు. ఆ తర్వాత లఘు చిత్రాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.&nbsp; అభినవ్‌ గోమఠం చేసిన తొలి షార్ట్‌ ఫిల్మ్‌ ఏది? ఆర్టిఫిషియల్‌ (2012) అభినవ్‌ గోమఠం చేసిన&nbsp; మొదటి చిత్రం ఏది? మైనే ప్యార్ కియా (Maine Pyaar Kiya) అభినవ్‌ గోమఠంను పాపులర్‌ చేసిన చిత్రం? ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindhi) అభినవ్‌ గోమఠం ఇప్పటివరకూ చేసిన చిత్రాలు ఏవి? ‘మైనే ప్యార్ కియా’, ‘బిల్లా రంగ’, ‘జగన్నాటకం’, ‘మళ్ళీరావా’, ‘ఈ నగరానికి ఏమైంది’, ‘జెస్సీ’, ‘ఫలక్‌నుమా దాస్’, ‘సీత’, ‘మీకు మాత్రమే చెప్తా’, ‘రంగ్ దే’, ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’, ‘శ్యామ్ సింగరాయ్’, ‘సెహరి’, ‘విరూపాక్ష’, ‘గూఢచారి’, ‘గాందీవధారి అర్జున’, ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’, ‘కిస్మత్’, ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’, ‘మై డియర్ దొంగ’.. అభినవ్‌ గోమఠం ఇప్పటివరకూ చేసిన వెబ్‌సిరీస్‌లు? ‘అర్థమైందా అరుణ్ కుమార్’, ‘తులసివనం’, ‘సేవ్ ద టైగర్స్’, ‘సేవ్ ది టైగర్స్ 2’ అభినవ్‌ గోమఠంపై వచ్చిన వివాదస్పద ఆరోపణలు ఏంటి? టాలీవుడ్‌ నటి కల్పిక.. అభినవ్‌ గోమఠంపై సంచలన ఆరోపణలు చేసింది. అభినవ్‌ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. తనను వేధించాడని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని అభినవ్‌ కొట్టిపారేశారు.&nbsp; అభినవ్‌ గోమఠం నెట్‌ వర్త్‌ ఎంత? ఏడాదికి రూ.1.5 కోట్లు (అంచనా) అభినవ్‌ గోమఠం ఫేవరేట్‌ హీరో ఎవరు? షారుక్‌ ఖాన్ అభినవ్‌ గోమఠం ఫేవరేట్‌ డైరెక్టర్‌ ఎవరు? మణిరత్నం అభినవ్‌ గోమఠం బెస్ట్‌ డైలాగ్ ఏది? ఈ నగరానికి ఏమైంది సినిమాలో వచ్చే బార్‌ సీన్‌.. అభినవ్‌ను చాలా పాపులర్‌ చేసింది. నలుగురు ఫ్రెండ్స్‌ (విష్వక్‌, కౌషిక్ (అభినవ్‌), ఉప్పు, కార్తిక్‌) బార్‌లో సిట్టింగ్‌ వేస్తారు. ఆ సందర్భంలో అభినవ్‌ వేసే డైలాగ్స్‌ యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అయ్యింది. ఆ సీన్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; అభినవ్‌ : ఈ నగరానికి ఏమైంది. ఓ పక్కన బారు.. ఇంకో పక్కన ఫ్రెండ్స్‌. అయినా ఎవరూ తాగట్లేదేంటి? రేయ్‌.. ఆ వాంట్‌ టూ సే సమ్‌థింగ్‌ రా. విష్వక్‌: వీడొకడు.. అభినవ్‌ : ఎన్నేళ్లు అయ్యిందిరా మనం ఇట్ల కూర్చొని తాగి. ఆల్‌ మోస్ట్ 4 ఇయర్స్‌. ఐ యామ్‌ వెరీ హ్యాపీ. తాగుదాం.&nbsp; ఉప్పు : రేయ్‌.. త్రీ డేస్‌ బ్యాక్‌ పెంట్ హౌస్‌లో కూర్చొని తాగాం మనం. అభినవ్‌ : అది వేరురా.. కార్తిక్‌: లాస్ట్‌ వీకే కదరా.. క్లబ్‌లో ఎంట్రీ కోసం వచ్చి తాగినాం అభినవ్‌ : నేను ఎక్కువ తాగలేదు ఆ రోజు. విష్వక్‌ : టూ డేస్‌ అయ్యింది వీడు మందు తాగాం అని కాల్‌ చేసి.. అభినవ్‌ : అయితే ఏంది ఇప్పుడు.. నేను అనొద్దా ఇట్లా. ఎగ్జామినేషన్‌ హాల్‌లో కూర్చున్నట్లు అందరం సైలెంట్‌గా కూర్చోవాలా. నువ్వేందిరా గ్లాసెస్ వేసుకున్నావ్‌ (విష్వక్‌తో). ఆరింటి తర్వాత కళ్లద్దాలు పెట్టుకుంటే గుడ్లు పెట్టి కొట్టేవాళ్లం నీకు గుర్తు లేదా? ఎందుకు పెట్టుకున్నావ్‌. విష్వక్‌ : పళ్లు రాలతాయ్‌.. అర్థమవుతుందా ఉప్పు : కళ్లల్లో మండే అగ్ని గోళాలను ఆపుకోడానికి ఈ రైబాన్‌ వేసుకున్నాడు చూశావా? అభినవ్‌ : లవ్‌ అయ్యిందా రా? (కార్తిక్‌ తో) కార్తిక్ : లవ్‌ ఏముంది రా.. ఫస్ట్ డెవలప్‌ అవ్వాలి.. పెళ్లి అయ్యాక ఇవన్నీ అయిపోతాయి. నలుగురు ఫ్రెండ్స్‌: డెవలప్‌.. డెవలప్‌.. డెవలప్‌.. డెవలప్‌.. https://youtu.be/qAluEZGqhh8?si=IymIAooV_cchv61s అభినవ్‌ గోమఠంను ఫేమస్‌ చేసిన సింగిల్‌ లైన్‌ డైలాగ్స్‌? ‘ఛీ దీనెమ్మ ఏం టార్చర్‌’ ‘ఏం రా వేడి చేసిందా’ అభినవ్‌ గోమఠం బెస్ట్‌ యాక్టింగ్‌ సీన్‌? ఈ నగరానికి ఏమైంది సినిమాలో అభినవ్‌ పాత్రను పరిచయం చేసే సీన్‌ హైలెట్‌గా ఉంటుంది. ఇందులో అభినవ్‌ తన నటనతో అదరగొట్టాడు. ముఖ్యంగా జంతువులకు డబ్బింగ్‌ చెప్పేటప్పుడు అతడు ఎక్స్‌ప్రెషన్స్‌ నవ్వులు తెప్పిస్తాయి. అభినవ్‌ పర్‌ఫార్మెన్స్‌ ఓ సారి మీరు చూసేయండి.&nbsp; https://youtu.be/9uiW6XzEEWc?si=SxGSZETzIZbJcyzF అభినవ్‌ గోమఠం చిత్రాలు/సిరీస్‌లకు సంబంధించిన పోస్టర్లు? అభినవ్‌ గోమఠం వైరల్‌ వీడియో ఏది? దావత్‌ అనే షోలో అభినవ్‌ మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది. ఇందులో సన్నీ లియోన్‌ ప్రస్తావన రాగా.. ఇంజనీరింగ్‌లో ఉన్నప్పుడు ఆమె ప్రీవియస్‌ వర్క్స్‌ చూసేవాడినని చెప్తాడు. ఈ మాటతో యాంకర్‌ రీతు సహా అక్కడ ఉన్న వారంతా ఇరగపడి నవ్వుతారు. ఇందుకు సంబంధించిన వీడియోపై ఓ లుక్కేయండి. https://www.instagram.com/reel/C5ksjvkpqib/?utm_source=ig_web_copy_link&amp;igsh=MzRlODBiNWFlZA== అభినవ్‌ గోమఠం రీసెంట్‌ ఫొటోలు?
    ఏప్రిల్ 26 , 2024
    <strong>రష్మిక మందన్న (Rashmika Mandanna) గురించి ఈ ఇంట్రెస్టింగ్ నిజాలు తెలుసా?</strong>
    రష్మిక మందన్న (Rashmika Mandanna) గురించి ఈ ఇంట్రెస్టింగ్ నిజాలు తెలుసా?
    నేషనల్ క్రష్‌గా పేరుగాంచిన రష్మిక మందన్న భారతీయ నటి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ప్రధానంగా నటిస్తోంది. 2016లో వచ్చిన కన్నడ చిత్రం కిర్రాక్ పార్టీ ద్వారా నటిగా పరిచయమైంది. తెలుగులో ఛలో(2018) చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. విజయ్ దేవరకొండ సరసన గీతాగోవిందం చిత్రంలో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది.&nbsp; డియర్ కామ్రెడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప, సీతా రామం, వారసుడు, యానిమల్ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. యానిమల్, పుష్ప చిత్రాలు ఆమె కెరీర్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలుగా నిలిచాయి. ప్రస్తుతం మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా కొనసాగుతున్న రష్మిక గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూద్దాం. రష్మిక మందన్న ఎవరు? రష్మిక మందన్న భారతీయ నటి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. రష్మిక మందన్న దేనికి ఫేమస్? రష్మిక మందన్న పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్ర పోషించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. రష్మిక మందన్న వయస్సు ఎంత? రష్మిక 1996 ఏప్రిల్ 5న జన్మించింది. ఆమె వయస్సు 27 సంవత్సరాలు&nbsp; రష్మిక మందన్న ముద్దు పేరు? నేషనల్ క్రష్ రష్మిక రష్మిక మందన్న ఎత్తు ఎంత? 5 అడుగుల 3 అంగుళాలు&nbsp; రష్మిక మందన్న ఎక్కడ పుట్టింది? విరాజ్ పేట, కర్ణాటక రష్మిక మందన్నకు వివాహం అయిందా? లేదు ఇంకా జరగలేదు రష్మిక మందన్న ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఎవరు? రష్మిక మందన్న తొలుత కన్నడ హీరో రక్షిత్ శెట్టిని ఇష్టపడింది. వీరిద్దరికి నిశ్చితార్థం కూడా అయింది. అయితే వ్యక్తిగత కారణాలతో వీరిద్దరు విడిపోయారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో లవ్‌లో ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి. ఈ వార్తలను రష్మిక, విజయ్ దేవరకొండ కొట్టిపారేశారు. రష్మిక మందన్నకు ఇష్టమైన రంగు? బ్లాక్ రష్మిక మందన్న అభిరుచులు? ట్రావెలింగ్ రష్మిక మందన్నకి ఇష్టమైన ఆహారం? చికెన్, చాక్లెట్ రష్మిక మందన్న అభిమాన నటుడు? అక్షయ్ కుమార్ రష్మిక మందన్న ఫెవరెట్ హీరోయిన్? శ్రీదేవి రష్మిక మందన్న తొలి సినిమా? కిరాక్ పార్టీ(కన్నడ), ఛలో(తెలుగు) రష్మిక మందన్నకు గుర్తింపు తెచ్చిన సినిమాలు? గీతాగోవిందం, పుష్ప రష్మిక మందన్న ఏం చదివింది? సైకాలజీలో డిగ్రీ చేసింది రష్మిక మందన్న చౌదరి పారితోషికం ఎంత? రష్మిక ఒక్కొ సినిమాకు రూ.4కోట్లు- రూ.4.5కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. రష్మిక మందన్న తల్లిదండ్రుల పేర్లు? సుమన్, మదన్ మందన్న రష్మిక మందన్న ఎన్ని అవార్డులు గెలుచుకుంది? రష్మిక ఉత్తమ నటిగా వివిధ భాషల్లో 5 సైమా అవార్డులు పొందింది. మరో 4 ఇతర అవార్డులు సొంతం చేసుకుంది. రష్మిక మందన్న మోడ్రన్ డ్రెస్సులు వేస్తుందా? రష్మిక మందన్న అన్నిరకాల డ్రెస్సులు వేస్తుంది. ఎక్కువగా ట్రెడిషన్ వేర్ ధరించేందుకు ఇష్టపడుతుంది. రష్మిక మందన్న సిస్టర్ పేరు? సిమ్రాన్ మందన్న రష్మిక మందన్న ధనవంతుల కుటుంబం నుంచి వచ్చిందా? లేదు, దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. తన చిన్నతనంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపింది. ఇంటి అద్దే కట్టేందుకు కూడా తమ వద్ద డబ్బులు ఉండేవి కాదని పేర్కొంది. రష్మిక మందన్న ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/rashmika_mandanna/?hl=en రష్మిక మందన్న ఎంత మంది హీరోలతో లిప్ లాక్ సీన్లలో నటించింది? రష్మిక తొలుత డియర్ కామ్రెడ్ సినిమాలో విజయ్ దేవరకొండతో ఆ తర్వాత యానిమల్ సినిమాలో రణ్‌బీర్ కపూర్‌తో లిప్‌ లాక్ సీన్లలో నటించింది. https://www.youtube.com/watch?v=-I7Z5-LKCdc
    ఏప్రిల్ 16 , 2024
    Rashmika: హాట్‌ ఫోజుల్లో గ్లామర్‌ ట్రీట్‌ ఇచ్చిన నేషనల్‌ క్రష్‌.. వైరల్‌గా ఫొటోస్‌!
    Rashmika: హాట్‌ ఫోజుల్లో గ్లామర్‌ ట్రీట్‌ ఇచ్చిన నేషనల్‌ క్రష్‌.. వైరల్‌గా ఫొటోస్‌!
    నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న.. మరోమారు తన అందచందాలతో సోషల్‌ మీడియాను షేక్‌ చేసింది. టైట్‌ ఫిట్‌ బ్లాక్‌ డ్రెస్‌లో ఎద అందాలను ఆరబోసింది. కొంటె చూపులతో మత్తెక్కించే ఫోజుల్లో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. వీటికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతున్నాయి.&nbsp; విజయ్‌ దేవరకొండతో రష్మిక మందన్న ప్రేమలో ఉన్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ జంట ఫిబ్రవరిలోనే నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు తాజాగా పుకార్లు రేకెత్తాయి.&nbsp; విజయ్‌, రష్మిక వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించాయని టాక్‌ వినిపించింది. మంచి రోజు చూసుకొని ఎంగేజ్‌మెంట్‌, కొద్ది రోజుల వ్యవధిలోనే వివాహాం కూడా చేయాలని నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి.&nbsp; నెట్టింట వైరల్‌గా మారిన ఈ కథనాలపై విజయ్‌ టీమ్‌ తాజాగా స్పందించింది. అందులో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను నమ్మవద్దని కోరింది.&nbsp; ఇదిలా ఉంటే ‘గీత గోవిందం’, ‘డియర్‌ కామ్రేడ్‌’ కోసం విజయ్‌, రష్మిక కలిసి వర్క్‌ చేశారు. వరుసగా రెండు చిత్రాల్లో నటించడం, టూర్స్‌, డిన్నర్‌ పార్టీలకు కలిసి వెళ్తుండటంతో ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ గాసిప్స్‌ వినిపించాయి.&nbsp; రణ్‌బీర్‌ కపూర్ హీరోగా తెరకెక్కిన యానిమల్‌ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌ కావడంతో రష్మిక క్రేజ్ మరింత పెరిగింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.&nbsp; ఇటీవల రష్మికకు సంబంధించిన డీప్‌ ఫేక్‌ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. రష్మిక డీప్‌నెక్ బ్లాక్‌ డ్రెస్‌ వేసుకుని లిఫ్ట్‌లో ఉన్నట్లు వీడియోను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.&nbsp; ఈ వీడియోపై రష్మిక అభిమానులతోపాటు పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్ఫింగ్‌ వీడియో ఘటనపై బాలీవుడ్‌ హీరో అమితాబ్‌ బచ్చన్ కూడా స్పందించారు. దీన్ని క్రియేట్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఇదిలా ఉంటే.. 2016లో కన్నడలో వచ్చిన కిర్రాక్‌ పార్టీ సినిమాతో రష్మిత సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం కన్నడలో భారీ వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత 'అంజనీ పుత్ర', 'చమక్‌' వంటి కన్నడ చిత్రాల్లో ఈ భామ మెరిసింది.&nbsp; 2018లో వచ్చిన 'ఛలో' సినిమాతో రష్మిక తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో రష్మికకు మంచి పేరు వచ్చింది.&nbsp; అదే ఏడాదిలో వచ్చిన విజయ్‌ దేవరకొండతో చేసిన 'గీతా గోవిందం' సినిమా బ్లాక్‌బాస్టర్‌గా నిలవగా, దేవదాస్‌ మూవీ పర్వాలేదనిపించింది.&nbsp; ఆ తర్వాత వరుసగా మహేష్‌తో ‘సరిలేరు నీకెవ్వరు, నితీన్‌తో ‘బీష్మా’, కార్తీతో ‘సుల్తాన్‌’, బన్నీతో&nbsp; ‘పుష్ప’, శర్వానంద్‌తో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’, సీతారామం, విజయ్‌తో ‘వారసుడు’ వంటి చిత్రాల్లో రష్మిక తళుక్కుమంది.&nbsp; హిందీలో అమితాబ్‌తో కలిసి ‘గుడ్‌ బై’, సిద్దార్థ్‌ మల్హోత్రాతో జంటగా ‘మిషన్‌ మజ్ను’ మూవీలో రష్మిక నటించింది.&nbsp; ప్రస్తుతం తెలుగులో పుష్ప2లో ఈ భామ నటిస్తోంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రష్మిక కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.&nbsp; పుష్ప-2తో పాటు రష్మిక తెలుగులో ‘రెయిన్ బో’ అనే లేడి ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కూడా షూటింగ్‌ను జరుపుకుంటోంది.&nbsp;
    జనవరి 09 , 2024
    <strong>This Week OTT Movies: ఈ వారం మిమ్మల్ని&nbsp; అలరించే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!</strong>
    This Week OTT Movies: ఈ వారం మిమ్మల్ని&nbsp; అలరించే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!
    గత కొన్ని వారాలుగా స్టార్‌ హీరోల చిత్రాలు విడుదలవుతూ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే ఈ వారం మాత్రం చిన్న చిత్రాల హవా కొనసాగనుంది. ఈ వేసవిలో అహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, సిరీస్‌లు డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చేందుకు వచ్చేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు టెనెంట్‌ హాస్య నటుడు సత్యం రాజేష్‌ (Satyam Rajesh) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'టెనెంట్‌' (Tenant). ఏప్రిల్‌ 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. వై. యుగంధర్ దర్శకత్వం వహించారు. ప్రేమ పెళ్లి తర్వాత సంతోషంగా సాగాల్సిన హీరో జీవితం ఎలాంటి అనూహ్య మలుపులు తిరిగింది? అన్నది కథ. శశివదనే రక్షిత్‌ అట్లూరి, కోమలి ప్రసాద్‌ జంటగా నటించిన ప్రేమకథ చిత్రం 'శశివదనే' (Sasivadane). సాయి మోహన్‌ ఉబ్బర దర్శకుడు. ఈ సినిమా ఏప్రిల్‌ 19న విడుదల కానుంది. గోదావరి నేపథ్యంలో ఈ&nbsp; ప్రేమ కథ సాగనుంది. పారిజాత పర్వం సునీల్‌, శ్రద్ధాదాస్‌, చైతన్య రావు, మాళవిక సతీశన్‌ ప్రధాన పాత్రల్లో చేసిన చిత్రం 'పారిజాత పర్వం' (Paarijathaparvam). సంతోష్‌ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 'కిడ్నాప్‌ ఈజ్‌ ఏన్‌ ఆర్ట్‌' అని ఉపశీర్షిక పెట్టారు. ఈ మూవీ ఏప్రిల్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్‌లోని ప్రతీ సన్నివేశం నవ్వులు పూయిస్తోంది.&nbsp; లవ్‌ మౌళి అవనీంద్ర దర్శకత్వంలో నవ్‌దీప్‌ హీరోగా చేసిన సినిమా 'లవ్‌ మౌళి' (Love Mouli). ఇందులు పంకురి గిద్వానీ హీరోయిన్‌గా చేసింది. ఏప్రిల్‌ 19న ఈ సినిమా విడుదల కానుంది. ప్రేమ అనేది లేకుండా మనుషులకు దూరంగా బతుకుతున్న ఒక వ్యక్తికి.. లవ్‌ దొరికితే ఎలా ఉంటుంది? అనే కోణంలో ఈ చిత్రాన్ని తెరక్కించారు. మార్కెట్‌ మహాలక్ష్మీ కేరింత ఫేమ్‌ పార్వతీశం ఈ సినిమా (Market Mahalakshmi)లో హీరోగా చేశాడు. వీఎస్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీతో ప్రణీకాన్వికా హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. అఖిలేష్‌ కలారు నిర్మాత. ఈ చిత్రంలో హర్షవర్ధన్‌, మహబూబ్‌ భాషా, ముక్కు అవినాష్‌ ముఖ్యపాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 19న ఈ మూవీ రిలీజ్‌ కానుంది.&nbsp; శరపంజరం నవీన్‌కుమార్‌ గట్టు హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘శరపంజరం’ (Sarapanjaram). లయ కథానాయిక. ఈ మూవీ ఏప్రిల్‌ 19న థియేటర్‌లలో విడుదల కానుంది. ‘జోగిని వ్యవస్థ, గంగిరెద్దుల్ని ఆడించే సంచార జాతుల కష్టాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. మార‌ణాయుధం సీనియర్‌ నటి మాలాశ్రీ.. పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో నటించిన తాజా చిత్రం ‘మార‌ణాయుధం’ (Maaranaayudham). గురుమూర్తి సునామి ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రం.. గతేడాది కన్నడలో విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులనూ అలరించడానికి సిద్ధమైంది. ఏప్రిల్‌ 19న ‘మారణాయుధం’ థియేటర్‌లలో విడుదల కానుంది. లవ్‌ యూ శంకర్‌&nbsp; దర్శకుడు రాజీవ్‌ ఎస్‌.రియా.. ‘మై ఫ్రెండ్‌ గణేశా’ యానిమేషన్‌ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా ‘లవ్‌ యూ శంకర్‌’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఏప్రిల్‌ 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో శ్రేయాస్‌ తల్పాడే, తనీషా జంటగా నటించారు.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు సైరెన్‌ జ‌యం ర‌వి (Jayam Ravi) క‌థానాయ‌కుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సైరెన్’ (Siren). ఫిబ్రవరి 16న కోలీవుడ్‌లో విడుదలైన ఈ సినిమా యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఏప్రిల్ 19 నుంచి ఈ మూవీ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతోపాటు తెలుగులో కూడా సైరన్ డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఇందులో జయం రవితో పాటు కీర్తి సురేష్, అనుపమా పరమేశ్వరన్‌ ముఖ్యపాత్రలు పోషించారు. మై డియర్ దొంగ&nbsp; ఓటీటీలోకి నేరుగా మరో కామెడీ మూవీ వస్తోంది. అభినవ్ గోమటం, షాలిని, దివ్య శ్రీపాద నటించిన ‘మై డియర్ దొంగ’ (My Dear Donga) మూవీ.. ఏప్రిల్ 19 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది.&nbsp; ఓ అమ్మాయి ఇంట్లోకి దొంగ‌త‌నం చేయ‌డానికి వ‌చ్చిన యువ‌కుడు.. అనుకోని ప‌రిస్థితుల్లో అక్క‌డే బందీగా చిక్కుకుపోతే ఏం జ‌రిగింది? దొంగ‌కు, యువ‌తికి మ‌ధ్య ఏర్ప‌డిన స్నేహం ఎలాంటి మ‌లుపులకు కారణమైంది? అన్న కథతో ఈ మూవీ రూపొందింది. కాటేరా కన్నడ స్టార్‌ హీరో దర్శన్‌ నటించిన చిత్రం కాటేరా (Kaatera). తరుణ్‌ సుధీర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది విడుదలై రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే ఈ సినిమా కన్నడ వెర్షన్‌ ప్రముఖ ఓటీటీ వేదిక ‘జీ5’ (Zee 5)లో స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే తాజాగా తెలుగు, తమిళ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ‘జీ 5’ వర్గాలు ప్రకటించాయి. మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateAnyone but YouMovieEnglishNetflixApril 15Rebel MoonMovieEnglishNetflixApril 19Chief Detective 1958SeriesKoreanDisney + HotstarApril 19SirenMovieTeluguDisney + HotstarApril 19My Dear DongaMovieTeluguAhaApril 19Dream ScenarioMovieEnglishLions Gate PlayApril 19The Tourist S2SeriesEnglishLions Gate PlayApril 19Pon Ondru KandenMovieTamilJio CinemaApril 14The SympathizerSeriesEnglishJio CinemaApril 14Article 370MovieHindiJio CinemaApril 19Quizzer Of The YearSeriesEnglishSonyLIVApril 15Dune: Part TwoMovieEnglishBook My ShowApril 16
    ఏప్రిల్ 15 , 2024
    <strong>This Week OTT Movies: ఉగాది, రంజాన్‌ సందర్భంగా ఈ వారం సినీ ప్రియులకు పండగే.. ఓ లుక్కేయండి!</strong>
    This Week OTT Movies: ఉగాది, రంజాన్‌ సందర్భంగా ఈ వారం సినీ ప్రియులకు పండగే.. ఓ లుక్కేయండి!
    ఈ వేసవిలో తెలుగు ఆడియన్స్‌కు వినోదాన్ని పంచేందుకు ఈ వారం పలు చిత్రాలు విడుదల కాబోతున్నాయి. అగ్ర హీరోల సినిమాలు లేకపోవడంతో చిన్న చిత్రాలు తమ సత్తా ఏంటో చూపించేందుకు వచ్చేస్తున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ పలు చిత్రాలు/ సిరీస్‌లు ఆడియన్స్‌ను ఎంటర్టైన్‌ చేసేందుకు రెడీ అవుతున్నాయి. మరి ఈ వారం థియేటర్‌/ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు గీతాంజలి మళ్లీ వచ్చింది అంజలి లీడ్‌ రోల్‌లో చేసిన ‘గీతాంజలి’ చిత్రం.. గతంలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ (Geethanjali Malli Vachindi) రూపొందింది. అంజలితో పాటు శ్రీనివాస్‌ రెడ్డి, సత్యం రాజేశ్‌, అలీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్ ఆకట్టుకుంటున్నాయి.&nbsp; లవ్‌ గురు ప్రముఖ తమిళ నటుడు విజయ్‌ ఆంటోనీ (Vijay Antony) కథానాయకుడిగా చేసిన లేటెస్ట్‌ చిత్రం.. ‘లవ్‌ గురు’ (Love Guru). మృణాళిని రవి కథానాయిక. వినాయక్‌ వైద్యనాథన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. రంజాన్‌ కానుకగా ఏప్రిల్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమలో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి లవ్‌ గురు ఎలా పరిష్కారం చూపించాడు అన్నది ఈ చిత్ర కథాంశం. డియర్‌ జీవీ ప్రకాష్‌కుమార్‌, ఐశ్వర్య జంటగా నటించిన లేటెస్ట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘డియర్‌’ (Dear). తమిళంలో ఏప్రిల్‌ 11న విడుదలవుతున్న ఈ చిత్రం.. తెలుగులో ఒక రోజు ఆలస్యంగా ఏప్రిల్‌ 12న రాబోతోంది. ఆనంద్‌ రవిచంద్రన్‌ దర్శకుడు. అన్నపూర్ణా స్టూడియోస్‌, ఏషియన్‌ సినిమాస్‌ తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీని విడుదల చేస్తున్నాయి. భార్య గురక వల్ల ఆ భర్త ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? అన్నది స్టోరీ.&nbsp; బడేమియా ఛోటేమియా బాలీవుడ్‌ కథానాయకులు అక్షయ్‌కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌ నటించిన తాజా చిత్రం ‘బడేమియా ఛోటేమియా’ (Bade miyan Chote miyan) ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌, మానుషి చిల్లర్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 10న ఈ మూవీ థియేటర్‌లలో విడుదల కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.&nbsp; మైదాన్‌ భారత ఫుట్‌బాల్‌ దిగ్గజ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీం బయోపిక్‌గా రూపొందిన చిత్రం ‘మైదాన్‌’ (Maidaan). బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవగణ్‌ ఇందులో లీడ్‌ రోల్‌లో చేశాడు. అమిత్‌ శర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రియమణి కథానాయికగా చేసింది. బోనీ కపూర్‌ నిర్మాత. ఏప్రిల్‌ 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం మలయాళ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు.&nbsp; ఓటీటీలో విడులయ్యే చిత్రాలు/ సిరీస్‌లు ఓం భీమ్ బుష్‌ ఈ వారం ఓటీటీలోకి క్రేజీ సినిమా రాబోతోంది. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఓం బీమ్‌ బుష్‌’ (Om Bheem Bush). ఏప్రిల్‌ 12న ఓటీటీలోకి వస్తోంది. అమెజాన్‌ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. థియేటర్లలో విడుదలై మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.&nbsp; గామి యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ లేటెస్ట్ చిత్రం 'గామి' (Gaami).. మార్చి 8న థియేటర్లలో విడుదలై పాజిటివ్‌ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. జీ 5 వేదికగా ఏప్రిల్‌ 12 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడలోనూ ఇది ప్రసారం కానుంది.&nbsp; ప్రేమలు&nbsp; మలయాళంలో విడుదలై భారీ హిట్ అందుకున్న ‘ప్రేమలు’ (Premalu).. తెలుగులోనూ మంచి విజయం సాధించింది. మార్చి 8న విడుదలైన ఈ మూవీ.. తెలుగు వెర్షన్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. కాగా, ఈ సినిమా ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 12 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది. మరోవైపు అదే రోజున హాట్ స్టార్‌లో మలయాళ వెర్షన్‌లో రిలీజ్‌ కాబోతోంది. మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateUnlockedSeriesKoreanNetflixApril 10What Jenniffer DidMovieEnglishNetflixApril 10Baby ReindeerMovieEnglishNetflixApril 11Heartbreak High S2SeriesEnglishNetflixApril 12Amar Singh ChamkeelaMovieHindiAmazon primeApril 12GaamiMovieTeluguAmazon primeApril 12Blood FreeSeriesKoreanDisney + HotstarApril 10The Greatest HitsMovieEnglishDisney + HotstarApril 12KarthikaMovieTelugu&nbsp;AhaApril 09PremaluMovieTelugu&nbsp;AhaApril 12AdrusyamSeriesHindiSonyLIVApril 11Laal SalaamMovieTelugu/TamilSunNXTApril 12
    ఏప్రిల్ 08 , 2024
    <strong>విజయ్ దేవరకొండ (Vijay Devarkonda) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్</strong>
    విజయ్ దేవరకొండ (Vijay Devarkonda) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    అర్జున్ రెడ్డి సినిమా విజయంతో రౌడీ బాయ్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.. తక్కువ కాలంలోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. గీతాగోవిందం, ఖుషి వంటి&nbsp; హిట్ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు. ప్రస్తుతం స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న&nbsp; విజయ్ దేవరకొండ గురించి చాలా మందికి తెలియని ఆసక్తికరమైన సంగతులు మీకోసం.. విజయ్ దేవరకొండ అసలు పేరు? దేవరకొండ విజయ్ సాయి. అభిమానులు ముద్దుకు రౌడీ బాయ్, VDK అని పిలుచుకుంటారు. విజయ్ దేవరకొండ ఎత్తు ఎంత? 5 అడుగుల 10 అంగుళాలు విజయ్ దేవరకొండ తొలి సినిమా? నువ్విలా చిత్రం ద్వారా తొలిసారి నటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత లైఫ్‌ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించాడు. 2016లో వచ్చిన పెళ్లి చూపులు చిత్రం ద్వారా హీరోగా పరిచయం&nbsp;అయ్యాడు విజయ్ దేవరకొండ తొలి బ్లాక్ బాస్టర్ హిట్స్? అర్జున్ రెడ్డి చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. గీతాగోవిందం, ట్యాక్సీవాలా, ఖుషి సినిమాలు హిట్స్‌గా నిలిచాయి. విజయ్ దేవరకొండ క్రష్ ఎవరు? ఖుషి సినిమాలో తనతోపాటు నటించిన సమంత తన క్రష్‌గా విజయ్ ఓ సందర్భంలో చెప్పాడు VDKకు ఇష్టమైన కలర్? తెలుపు, బ్లాక్, బ్రౌన్ విజయ్ దేవరకొండ పుట్టిన తేదీ? మే 9, 1989 విజయ్ దేవరకొండకు నచ్చిన పుస్తకం? విజయ్ దేవరకొండ పుస్తక ప్రియుడు. అతనికి 'ది పౌంటెన్ హెడ్' అనే పుస్తకం అంటే ఇష్టమని చెప్పాడు. ఈ పుస్తకంతో పాటు 'అట్లాస్ ష్రగ్ డ్', 'హూ మూవ్డ్ మై చీజ్' అనే పుస్తకాలు చదవదగినవని పేర్కొన్నాడు. విజయ్ దేవరకొండకు లవర్ ఉందా? విజయ్ దేవరకొండ, రష్మిక మంధాన ప్రేమలో ఉన్నారని చాలా వార్తల్లో వచ్చాయి. వీరిద్దరు కలిసి పలు సందర్భాల్లో కనిపించడం ఆ వార్తలకు బలానిచ్చాయి. గీతాగోవిందం, డియర్ కామ్రెడ్ వంటి హిట్ చిత్రాల్లో ఈ జోడి నటించింది. విజయ్ దేవరకొండ వ్యాపారాలు? రౌడీ బ్రాండ్ పేరుతో క్లాత్ బిజినెస్ ఉంది. ఈ బ్రాండ్ బట్టలు మింత్రా ఆన్‌లైన్‌ స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. 'కింగ్ ఆఫ్ ది హిల్' అనే ప్రొడక్షన్ హౌస్ ఉంది. వోల్ట్స్‌ అనే ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాడు.&nbsp; విజయ్ దేవరకొండకు ఎన్ని అవార్డులు వచ్చాయి? అర్జున్ రెడ్డి చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటుడిగా అవార్డు పొందాడు. 2018 ఫోర్బ్స్ ఇండింయా సెలబ్రెటీ 100 జాబితాలో 72వ స్థానం, టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్‌లో 4 వ స్థానంలో నిలిచాడు. విజయ్ దేవరకొండ సామాజిక సేవ చేస్తాడా? కొవిడ్ టైంలో మిడిల్ క్లాస్ ఫండ్ ద్వారా వంట సామాగ్రిని అందించాడు. ఇందుకోసం రూ.1.7కోట్లు ఖర్చు పెట్టాడు. ఖుషి సినిమా విడుదల సమయంలో తన రెమ్యునరేషన్‌ నుంచి రూ.కోటి ఖర్చు పెట్టి 100 మంది రైతులకు సాయం చేశాడు విజయ్ దేవరకొండ ఎన్ని సినిమాల్లో నటించాడు? విజయ్ దేవరకొండ 2024 వరకు 14 సినిమాల్లో నటించాడు.&nbsp; విజయ్ దేవరకొండకు ఇష్టమే ఆహారం? చికెన్ బిర్యాని, ఇటాలియన్ పస్తా అండ్ పీజా, కాఫీ. https://www.youtube.com/watch?v=6Z_mp4t0QLU
    మార్చి 19 , 2024
    <strong>Tollywood Comedians As Heros: హీరోలుగా సత్తా చాటుతున్న ఈ తరం హాస్యనటులు వీరే..!</strong>
    Tollywood Comedians As Heros: హీరోలుగా సత్తా చాటుతున్న ఈ తరం హాస్యనటులు వీరే..!
    టాలీవుడ్‌కి చెందిన దిగ్గజ హాస్య నటులు గతంలో హీరోలుగా నటించి మంచి విజయాలు సాధించారు. బ్రహ్మానందం (Brahmandam), ‌అలీ (Ali), సునీల్‌ (Sunil), వేణుమాదవ్‌ (Venu Madhav) లాంటి సీనియర్‌ కమెడియన్లు పలు చిత్రాల్లో కథానాయకులుగా చేసి అలరించారు. తాజాగా ఈ జనరేషన్‌ కమెడియన్స్‌ కూడా వారిని ఆదర్శంగా తీసుకుంటున్నారు. కథానాయకులుగా కనిపిస్తూ ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు. సాలిడ్ కథతో వచ్చి మంచి హిట్స్‌ సైతం&nbsp; సాధిస్తున్నారు. అలా రీసెంట్‌గా ఆడియన్స్‌ ముందుకు వచ్చిన వారెవరు? ఆ సినిమాలేంటి? ఇప్పుడు చూద్దాం.&nbsp; సుహాస్‌ (Suhas) ప్రముఖ నటుడు సుహాస్‌.. వరుస హిట్లతో టాలీవుడ్‌లో దూసుకెళ్తున్నాడు. షార్ట్‌ఫిల్మ్స్‌తో ఫేమస్‌ అయిన సుహాస్‌.. 2018లో ‘పడి పడి లేచె మనసు’ సినిమాతో తెరంగేట్రం చేశాడు. తర్వాత ‘మజిలీ’, ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘ప్రతిరోజూ పండగే’, ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ చిత్రాల్లో హాస్య పాత్రలు పోషించి నవ్వులు పంచాడు. ‘కలర్‌ ఫొటో’తో తొలి ప్రయత్నంలోనే హీరోగా విజయం అందుకున్న సుహాస్‌..‘ఫ్యామిలీ డ్రామా’, ‘రైటర్‌ పద్మభూషణ్‌’ చిత్రాలతో మంచి పేరు సంపాదించాడు. రీసెంట్‌గా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ (Ambajipeta Marriage Band)తో కథానాయకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ప్రస్తుతం ‘కేబుల్‌ రెడ్డి’, ‘శ్రీరంగ నీతులు’, ‘ప్రసన్నవదనం’ తదితర చిత్రాల్లో సుహాస్‌ నటిస్తున్నాడు. వైవా హర్ష (Harsha Chemudu)&nbsp; షార్ట్‌ఫిల్మ్స్‌ నుంచి వెండితెరపైకి వచ్చిన ప్రముఖ కమెడియన్స్‌లో వైవా హర్ష ఒకరు. ‘మసాలా’తో సినీ కెరీర్‌ ప్రారంభించిన హర్ష.. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజాది గ్రేట్‌’, ‘పక్కా కమర్షియల్‌’, ‘కార్తికేయ 2’, ‘బింబిసార’ తదితర చిత్రాల్లో నవ్వులు పూయించాడు. తాజాగా ‘సుందరం మాస్టర్‌’ (Sundaram Master) చిత్రంతో హర్ష కథానాయకుడిగా మారాడు. గతనెల ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదలై పాజిటివ్‌ టాక్ సొంతం చేసుకుంది.&nbsp;&nbsp; అభినవ్‌ గోమటం (Abhinav Gomatam) యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న ఈ తరం హాస్య నటుల్లో ‘అభినవ్‌ గోమటం’ (Abhinav Gomatam) ముందు వరుసలో ఉంటాడు. షార్ట్‌ఫిల్మ్స్‌లో ప్రతిభ కనబరిచి సినిమాల్లోకి వచ్చి అభినవ్‌.. తొలి చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘మీకు మాత్రమే చెప్తా’, ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ తదితర చిత్రాల్లోనూ కమెడియన్‌గా వినోదం పంచాడు. రీసెంట్‌గా&nbsp; ‘మస్త్‌ షేడ్స్‌ ఉన్నయ్‌రా..’ (Masthu Shades Unnai Ra) సినిమాతో అభినవ్‌ హీరోగా మారాడు.&nbsp; సుడిగాలి సుధీర్‌ (Sudigali Sudheer) ‘జబర్దస్త్‌’ వేదికగా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సుడిగాలి సుధీర్‌.. ‘అడ్డా’తో సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. ‘రేసుగుర్రం’, ‘సుప్రీం’, ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్’ తదితర చిత్రాల్లో సందడి చేసిన అతడు.. ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’తో హీరో అయ్యాడు. తర్వాత ‘గాలోడు’, ‘కాలింగ్‌ సహస్ర’లో ప్రధాన పాత్రలు పోషించాడు. ప్రస్తుతం ‘జి.ఒ.ఎ.టి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధయ్యాడు. సత్యం రాజేష్‌ (Satyam Rajesh) సత్యం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాజేష్‌.. ఆ మూవీ టైటిల్‌నే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ‘మా ఊరి పొలిమేర’ సినిమాతో హీరోగా మారిన అతడు.. మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కొవిడ్‌ కారణంగా నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి విశేష స్పందన వచ్చింది. దీనికి సీక్వెల్‌గా ఇటీవల వచ్చిన ‘మా ఊరి పొలిమేర 2’ గతేడాది చివర్లో థియేటర్లలో రిలీజై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది.&nbsp; ప్రియదర్శి (Priyadarsi) యంగ్‌ కమెడియన్‌ ప్రియదర్శి కూడా పలు చిత్రాల్లో హీరోగా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించాడు. ‘మల్లేశం’తో తొలిసారి కథానాయకుడిగా మారిన ప్రియదర్శి.. గతేడాది ‘బలగం’ (Balagam) సినిమాతో సాలిడ్‌ విజయాన్ని అందుకున్నాడు. ఇటీవల ‘మంగళవారం’&nbsp; (Mangalavaram) చిత్రంలో ప్రధాన పాత్ర పోషించి అలరించాడు. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించనున్న ఓ సినిమాకి ప్రియదర్శి హీరోగా ఎంపికయ్యాడు. వెన్నెల కిషోర్‌ (Vennela Kishore) టాలీవుడ్‌లోని స్టార్‌ కమెడియన్స్‌లో వెన్నెల కిషోర్‌ ఒకరు. తన తొలి సినిమా ‘వెన్నెల’ టైటిల్‌ను ఇంటి పేరుగా మార్చుకున్న కిషోర్‌.. ‘దూకుడు’, ‘జులాయి’ వంటి పలు సూపర్‌ చిత్రాల్లో హాస్య నటుడిగా మెప్పించాడు. ‘అతడు ఆమె ఓ స్కూటర్‌’తో కథానాయకుడిగా మారిన కిషోర్‌.. రీసెంట్‌గా&nbsp; ‘చారి 111’ (Chari 111)తో మరోమారు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ప్రేక్షకులను అలరించడంలో ఈ సినిమా విఫలమైంది.&nbsp; ధన్‌రాజ్‌ (Dhanraj) జబర్దస్త్‌ షో ద్వారానే మంచి గుర్తింపు తెచ్చుకున్న మరో కమెడియన్‌ ధన్‌రాజ్‌. ‘బుజ్జీ ఇలారా’ చిత్రంలో ప్రధాన పాత్రదారిగా కనిపించిన ధన్‌రాజ్‌.. ప్రస్తుతం ‘రామం రాఘవం’లో లీడ్‌ రోల్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు అతడే దర్శకత్వం వహిస్తుండటం విశేషం. దర్శకుడు సముద్రఖని మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.&nbsp;
    మార్చి 14 , 2024
    Telugu Heroines: టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్ల హవా…! ఆ గోల్డెన్‌ డేస్‌ తిరిగి వచ్చినట్లేనా?&nbsp;
    Telugu Heroines: టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్ల హవా…! ఆ గోల్డెన్‌ డేస్‌ తిరిగి వచ్చినట్లేనా?&nbsp;
    ఒకప్పుడు టాలీవుడ్‌ హీరోయిన్స్‌ అనగానే.. తెలుగు భాష, సంప్రదాయం ఉట్టిపడే సావిత్రి, జమున, శారద, జయసుధ లాంటి వారు గుర్తుకు వచ్చేవారు. రాను రాను టాలీవుడ్‌లో పరిస్థితులు మారిపోయాయి. పర భాష ముద్దు గుమ్మలే ప్రేక్షకులను ఆకర్షిస్తారనే నమ్మకం మన టాలీవుడ్ డైరెక్టర్లలో పడిపోయింది. దీంతో నిన్నటి దాకా కాజల్‌, త్రిష, సమంత.. ప్రస్తుతం రష్మిక, పూజా హెగ్డే, మృణాల్‌ ఠాకూర్‌ వంటి ఇతర భాషల నాయికలు ఇక్కడ స్టార్‌ హీరోయిన్లుగా చెలామణి అవుతున్నారు. అయితే&nbsp; గత కొద్ది కాలంగా&nbsp; ఈ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నట్లు కనిపిస్తోంది. తెలుగు అమ్మాయిల హవా ఇండస్ట్రీలో క్రమంగా పెరుగుతోంది. బడా హీరోలవి మినాహా.. రీసెంట్‌గా వస్తున్న చిన్న సినిమాలను పరిశీలిస్తే ఈ విషయం అవగతమవుతుంది. స్టార్‌ హీరోయిన్ల రేసులోకి దూసుకొస్తున్న తెలుగు భామలు ఎవరో ఇప్పుడు చూద్దాం.&nbsp; గౌరి ప్రియ (Gouri Priya) టాలీవుడ్‌లో ఇటీవల వచ్చి యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌లో ‘మ్యాడ్‌’ (MAD) చిత్రంలో హీరోయిన్‌గా చేసి గౌరి ప్రియ అందరి దృష్టిని ఆకర్షించింది. మంచి నటన, అభినయంతో యూత్‌ను కట్టిపడేసింది. రీసెంట్‌గా తమిళ హీరో మణికందన్‌ పక్కన ‘లవర్‌’ సినిమాలో నటించి కోలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.&nbsp; https://www.youtube.com/watch?v=8dwrE0OCq40 ఆనందిని (Anandhi) వరంగల్‌కు చెందిన ఆనంది.. 2012లో వచ్చిన 'ఈ రోజుల్లో' (Ee Rojullo) సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత చిన్న పాత్రలు చేసుకుంటూ వెళ్లిన ఈ భామ.. తన ఫోకస్‌ను తమిళ మూవీస్‌పై వైపు మళ్లించింది. అక్కడ యంగ్‌ హీరోల సరసన హీరోయిన్‌గా చేసి అందరి ప్రశంసలు అందుకుంది. తెలుగులో జాంబి రెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్‌, ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం చిత్రాల్లో ఈ భామ మెయిన్‌ హీరోగా చేసింది.&nbsp; చాందిని చౌదరి (Chandini Chowdary) ఏపీలోని విశాఖపట్నానికి చెందిన చాందిని చౌదరి.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌' (Life Is Beautiful) మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ‘కుందనపు బొమ్మ’, ‘హౌరా బ్రిడ్జ్‌’, ‘మను’ వంటి చిన్న చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. 'కలర్‌ ఫొటో' (Colour Photo) మూవీతో ఈ అమ్మడి క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. రీసెంట్‌గా 'గామి' (Gaami)లో విష్వక్‌ సేన్‌ సరసన నటించే స్థాయికి చాందిని ఎదిగింది. ఈ భామ సినిమాలతో పాటు 'మస్తీస్‌', 'గాలివాన', 'ఝాన్సీ' వంటి వెబ్‌సిరీస్‌లు సైతం చేసింది.&nbsp; వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ‘బేబీ’ (Baby) సినిమాతో ఒక్కసారిగా ఫేమ్‌లోకి వచ్చిన తెలుగు నటి ‘వైష్ణవి చైతన్య’. అంతకుముందు వరకూ యూట్యూబ్ సిరీస్‌లకు మాత్రమే పరిమితమైన ఈ సుందరి.. ‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’ (Software Developer) సిరీస్‌తో ఒక్కసారిగా యూత్‌లో క్రేజీ సంపాదించుకుంది. తద్వారా ‘బేబీ’ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాలో మెస్మరైజింగ్‌ నటనతో కుర్రకారు హృదయాలను దోచేసింది. ప్రస్తుతం వైష్ణవి.. బేబీ ఫేమ్‌ ఆనంద్‌ దేవరకొండతోనే మరో చిత్రంలో నటిస్తోంది. అలాగే దిల్‌ రాజు ప్రొడక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు అంగీకరించింది.&nbsp; https://www.youtube.com/watch?v=wz5BIbhqhTI దివ్య శ్రీపాద (Divya Sripada) టాలీవుడ్‌లో తమ క్రేజ్‌ను క్రమంగా పెంచుకుంటున్న తెలుగు అమ్మాయిల్లో ‘దివ్య శ్రీపాద’ ఒకరు. రీసెంట్‌గా ‘సుందరం మాస్టర్‌’ (Sundaram Master) సినిమా ద్వారా ఈ భామ హీరోయిన్‌గా మారిపోయింది. అంతకుముందు ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘కలర్ ఫొటో’, ‘మిస్ ఇండియా’, ‘జాతి రత్నాలు’, ‘ఎఫ్‌ 3’, ‘యశోద’, ‘పంచతంత్రం’ వంటి ప్రముఖ చిత్రాల్లో సైడ్‌ పాత్రలకే పరిమితమైంది. 'సుందరం మాస్టర్‌'లో చక్కటి నటన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించడంతో ఈ భామకు హీరోయిన్‌గా మరిన్ని అవకాశాలు దక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శోభిత ధూలిపాళ్ల (Sobhita Dhulipala) ఏపీలోని తెనాలిలో జన్మించిన శోభిత దూళిపాళ్ల.. ‘రామన్‌ రాఘవ్‌ 2.0’ అనే హిందీ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైంది. 2018లో వచ్చిన 'గూఢచారి'తో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామ.. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత కురుప్‌, మేజర్‌, పొన్నిసెల్వన్‌ వంటి హిట్‌ చిత్రాల్లో మెరిసింది. హాలీవుడ్‌ చిత్రం 'మంకీ మ్యాన్‌'లోనూ శోభిత నటించడం విశేషం. ప్రస్తుతం హిందీలో 'సితార' మూవీలో ఈ భామ చేస్తోంది. తెలుగు ఇండస్ట్రీకి చెందిన హాలీవుడ్‌, బాలీవుడ్‌ స్థాయిలో చిత్రాలు చేస్తూ స్థానిక నటీమణులకు ఆదర్శంగా నిలుస్తోంది.&nbsp; రితు వర్మ (Ritu Varma) హైదరాబాద్‌కు చెందిన ఈ సుందరి.. 'బాద్‌ షా' (Badshah) సినిమాలో కాజల్‌ ఫ్రెండ్‌ పాత్రలో తెరంగేట్రం చేసింది. 2015లో వచ్చిన 'పెళ్లి చూపులు' (Pelli Choopulu) హీరోయిన్‌గా మారిన రీతు వర్మ.. తొలి సినిమాతోనే సాలిడ్ హిట్‌ అందుకుంది. ‘కేశవ’, ‘నిన్నిలా నిన్నిలా’, ‘టక్ జగదీష్‌’, ‘వరుడు కావలెను’, ‘ఒకే ఒక జీవితం’.. రీసెంట్‌గా ‘మార్క్‌ ఆంటోనీ’ సినిమాల్లో హీరోయిన్‌గా చేసి స్టార్‌ నటిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ భామ.. విక్రమ్‌ సరనస 'ధ్రువ నక్షత్రం'లోనూ నటిస్తుండటం విశేషం.&nbsp; https://www.youtube.com/watch?v=4hNEsshEeN8 స్వాతి రెడ్డి (Swathi Reddy) వైజాగ్‌కు చెందిన స్వాతి.. కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన 'డేంజర్‌' (2005) తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తమిళంలో 'సుబ్రహ్మణ్యపురం' చిత్రంలో హీరోయిన్‌గా చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా 'అనంతపురం' పేరుతో తెలుగులో రిలీజ్ కావడం గమనార్హం. ఆ తర్వాత టాలీవుడ్‌లో వరుసగా అష్టాచమ్మా,&nbsp; గోల్కొండ స్కూల్‌, స్వామి రారా, కార్తికేయ, త్రిపుర, పంచతంత్రం చిత్రాల్లో స్వాతి నటించింది. రీసెంట్‌గా 'మంత్‌ ఆఫ్‌ మధు'తో ప్రేక్షకులను పలకరించింది.&nbsp; https://www.youtube.com/watch?v=BCwsSk_KKrE డింపుల్‌ హయాతి (Dimple Hayathi) ఏపీలోని విజయవాడలో జన్మించిన నటి డింపుల్‌ హయాతి.. హైదరాబాద్‌లో పెరిగింది. 2017లో వచ్చిన 'గల్ఫ్‌' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమా పెద్దగా విజయం సాధించనప్పటికీ నటన పరంగా డింపుల్‌కు మంచి మార్కులే పడ్డాయి. దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు దక్కాయి. ‘అభినేత్రి 2’, ‘యురేఖ’, హిందీలో ‘అత్రంగి రే’, విశాల్‌తో ‘సామాన్యుడు’, రవితేజతో ‘ఖిలాడీ’, గోపిచంద్‌తో ‘రామబాణం’ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో సినిమాలు లేనప్పటికీ సరైన హిట్‌ తగిలితే డింపుల్ ఎవరూ ఆపలేరని ఇండస్ట్రీలో టాక్ ఉంది.&nbsp; https://twitter.com/CallBoyforwomen/status/1693578673595793606 శివాని నగరం (Shivani Nagaram) ఇటీవల టాలీవుడ్‌లో తళుక్కుమన్న కొత్త హీరోయిన్లలో శివాని నగరం ఒకరు. యంగ్‌ హీరో సుహాస్‌ ప్రధాన పాత్ర పోషించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమాలో శివాని హీరోయిన్‌గా చేసింది. అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో మెప్పించింది. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో శివానికి తెలుగులో మంచి అవకాశాలు దక్కే పరిస్థితులు కనిపిస్తాయి. మానస చౌదరి (Maanasa Choudhary) ఏపీలోని చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన మానన చౌదరి.. రీసెంట్‌గా ‘బబుల్‌గమ్‌’ సినిమాతో టాలీవుడ్‌లో తళుక్కుమంది. రాజీవ్ - సుమ తనయుడు రోషన్‌.. హీరోగా నటించిన ఈ మూవీలో తన అందచందాలతో ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద విఫలమైనప్పటికీ తనలో మంచి స్కిల్స్‌ ఉన్నాయన్న సందేశాన్ని మానస టాలీవుడ్‌ దర్శక నిర్మాతలకు పంపింది. ఒక హిట్‌ పడితే తెలుగులో ఈ భామకు తిరుగుండదని చెప్పవచ్చు.&nbsp; https://twitter.com/i/status/1762802318934950146 అంజలి (Anjali) తూర్పు గోదావరి జిల్లా రాజోల్‌లో జన్మించిన నటి అంజలి.. ఓ దశలో టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ను అందుకుంది. 2006లో 'ఫొటో' అనే తెలుగు చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అంజలి.. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. అక్కడ వరుస సినిమాల్లో నటించి కోలివుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు' సినిమాతో మళ్లీ టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ భామ.. బలుపు, మసాలా, గీతాంజలి, డిక్టేటర్‌, సరైనోడు, వకీల్‌సాబ్‌, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం తెలుగులో గీతాంజలి మళ్లీ వచ్చింది, గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి, గేమ్‌ ఛేంజర్‌లోనూ నటిస్తోంది.&nbsp; https://www.youtube.com/watch?v=3lowhNvIWK0
    మార్చి 06 , 2024
    Rashmika Mandanna: ఛీ.. సిగ్గులేకుండా ఇదేం పని! రణబీర్‌కు లిప్ లాక్‌తో రెచ్చిపోయిన రష్మిక.. ఆగ్రహంతో విజయ్ ఫ్యాన్స్
    Rashmika Mandanna: ఛీ.. సిగ్గులేకుండా ఇదేం పని! రణబీర్‌కు లిప్ లాక్‌తో రెచ్చిపోయిన రష్మిక.. ఆగ్రహంతో విజయ్ ఫ్యాన్స్
    బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌తో అర్జున్‌ రెడ్డి ఫేమ్‌ సందీప్ వంగా తెరకెక్కిస్తున్న చిత్రం యానిమల్‌ (Animal). బుధవారం ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ రిలీజవ్వగా ఇందులో ర‌ణ్‌బీర్‌ క‌పూర్‌ (Ranbir Kapoor), ర‌ష్మిక మంద‌న్న (Rashmika Mandanna) లిప్‌లాక్‌ల‌తో అద‌ర‌గొట్టారు. ‘అమ్మాయి’ అంటూ సాగే ఈ పాట‌లో ఘాటైన ముద్దులతో రెచ్చిపోయారు. https://twitter.com/ilysmnojk/status/1712018933333778570?s=20 డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఈ సాంగ్‌ను ముద్దుతో ప్రారంభించడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. ‘ఈ అబ్బాయిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం.. చూడండి ఏం చేశాడో’ అని రణ్‌బీర్‌పై రష్మిక ఫ్యామిలీ ఫైర్‌ అవుతుంటారు. ఆ మాటలను ఏమాత్రం పట్టించుకోని రణ్‌బీర్‌, రష్మిక.. కుటుంబ సభ్యుల ముందే లిప్‌లాక్‌ చేసుకోవడం షాక్‌కి గురిచేస్తుంది.&nbsp; ఆ త‌ర్వాత ఫ్లైట్ జ‌ర్నీలో ర‌ష్మిక, ర‌ణ్‌బీర్ ముద్దుల్లో మునిగిపోయిన‌ట్లుగా చూపించారు. ఇద్ద‌రు పెళ్లి చేసుకున్న‌ట్లుగా చూపించి పాట‌ను ఎండ్ చేశారు. ఈ ఫ‌స్ట్ సింగిల్‌లో ర‌ణ్‌భీర్‌, ర‌ష్మిక కెమిస్ట్రీ హైలైట్‌గా నిలుస్తోంది. రష్మికకు ఇది హిందీలో మూడో చిత్రం. అంతకుముందు అమితాబ్‌ బచ్చన్‌తో గుడ్ బై (Good Bye), సిద్దార్థ్‌ మల్హోత్రాతో ‘మిషన్‌ మజ్నూ’ (Mission Majnu) చిత్రాలు చేసినప్పటికీ గ్లామర్‌ షో చేసే అవకాశం ఆమెకు దక్కలేదు. తాజాగా రణ్‌బీర్‌ సినిమాలో మాత్రం ఈ భామ రెచ్చిపోయినట్లే కనిపిస్తోంది. రష్మికకు లిప్‌లాక్‌ సీన్‌ కొత్తేమి కాదు. గతంలో విజయ్‌ దేవరకొండతో చేసిన ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంలోనూ ఈ భామ ముద్దు సీన్‌లో నటించింది. తాజాగా యానిమల్‌ చిత్రంలో ఇలా లిప్‌లాక్‌ సీన్‌ చేయడం ద్వారా బాలీవుడ్‌కు గట్టి సందేశాన్ని రష్మిక ఇచ్చినట్లు కనిపిస్తోంది. పాత్ర డిమాండ్‌ చేస్తే ఎటువంటి సాహసాలకైనా రెడీ అనే మెసేజ్‌ను ఈ భామ పంపింది. &nbsp; అటు డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా తన మార్క్‌ను ఈ సినిమాలోనూ కొనసాగించాడు. గతంలో అర్జున్‌ రెడ్డి మూవీ పోస్టర్‌ను సందీప్‌ లిప్‌లాక్‌తోనే రిలీజ్‌ చేశాడు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున వివాదమే చెలరేగింది. తాజాగా యానిమల్‌ ఫస్ట్‌ సింగిల్‌ పోస్టర్‌ను సైతం ఘాటైన ముద్దుతో చూపించడం సందీప్‌ వంగాకే చెల్లింది.  &nbsp; ఇదిలా ఉంటే రణ్‌బీర్‌, రష్మిక లిప్‌లాక్‌ సీన్లను విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే రష్మిక, అర్జున్‌ రిలేషన్‌లో ఉన్నారని వారు నమ్ముతున్నారు. డియర్‌ కామ్రేడ్‌ సినిమా నుంచే వీరి ప్రేమాయణం ప్రారంభమైందని సోషల్‌ మీడియాలో ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే విజయ్‌ ఫ్యాన్స్‌ రష్మికపై మండిపడుతున్నారు. మరికొందరు నెటిజన్లు యానిమల్‌ ఫస్ట్‌ సింగిల్‌పై ఫన్నీగా కామెంట్స్‌ చేస్తున్నారు. లిరిక్స్‌, మ్యూజిక్ కంటే లిప్‌లాక్‌లే హైలైట్ అయ్యాయని పేర్కొంటున్నారు. పాట చూస్తుంటే యానిమ‌ల్ మూవీ అర్జున్‌రెడ్డికి మ‌రో వెర్ష‌న్‌లా ఉంద‌ని ఓ నెటిజ‌న్ కామెంట్ చేశాడు. ఇన్ని లాప్‌లాక్‌లు అవ‌స‌ర‌మా అంటూ మ‌రో నెటిజ‌న్ ప్రశ్నించాడు.&nbsp; యానిమ‌ల్ మూవీ డిసెంబ‌ర్ 1న రిలీజ్ కానుంది. దాదాపు వంద కోట్ల వ్య‌యంతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో అనిల్ క‌పూర్‌, బాబీ డియోల్ ప్ర‌ధాన పాత్ర‌ల‌ు పోషించారు.&nbsp;
    అక్టోబర్ 11 , 2023
    Sai Pallavi: చిరంజీవి నుంచి విజయ్‌ దేవరకొండ వరకు సాయి పల్లవి వదులుకున్న సినిమాలు.. కారణం చెప్పిన హైబ్రిడ్ పిల్ల!
    Sai Pallavi: చిరంజీవి నుంచి విజయ్‌ దేవరకొండ వరకు సాయి పల్లవి వదులుకున్న సినిమాలు.. కారణం చెప్పిన హైబ్రిడ్ పిల్ల!
    టాలీవుడ్‌ అగ్రకథానాయికల్లో ఒకరిగా సాయి పల్లవి గుర్తింపు సంపాదించింది. మలయాళం సినిమా ‘ప్రేమమ్‌’తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన సాయిపల్లవి ఆ సినిమాతో ఎనలేని పేరును సంపాదించింది. ఫిదా చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సాయి పల్లవి.. మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్‌ హృదయాలను గెలుచుకుంది. అద్భుతమైన నటన, మిస్మరైజింగ్‌ డ్యాన్స్‌తో అందరిని ఆకట్టుకుంది. అయితే హీరోయిన్‌కు ఒక హిట్టు వస్తే అవకాశాలు క్యూ కట్టడం కామన్‌గా మారిపోయాయి. అందుకు తగ్గట్లే ఈ తరం హీరోయిన్లు ఎడపెడా సినిమాలు చేస్తూ ఫ్లాపులు మూటగట్టుకుంటున్నారు. అయితే ఈ ధోరణికి సాయి పల్లవి దూరంగా ఉంది. ఎంత పెద్ద సినిమా ఆఫర్‌ వచ్చిన కథ నచ్చితేనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తోంది. పాత్రలో గ్లామర్‌ డోస్‌ ఎక్కువైనా, నటనకు ప్రాధాన్యం తగ్గినా సాయి పల్లవి సున్నితంగా రిజెక్ట్‌ చేస్తుందని ఇండస్ట్రీలో టాక్‌. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ ఈ మలయాళీ భామ వదులుకున్న సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం. 1. భోళా శంకర్‌ (Bhola Shankar) చిరంజీవి హీరోగా, మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భోళాశంకర్‌. ఇందులో చిరంజీవి సరసన తమన్న నటిస్తుండగా చెల్లెలిగా కీర్తి సురేష్‌ చేస్తోంది. అయితే కీర్తి సురేష్‌ పాత్రకు తొలుత సాయిపల్లవిని చిత్రం బృందం సంప్రదించింది. ఈ విషయాన్ని స్వయంగా ఓ ఈవెంట్‌లో సాయిపల్లవే చెప్పింది. తానే ఆ రోల్‌ను రిజెక్ట్‌ చేశానని స్పష్టం చేసింది. రీమేక్‌ సినిమాలపై ఉన్న భయంతోనే ఆ పాత్రను వదులుకున్నట్లు తెలిపింది. కాగా, తమిళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన వేదాలం సినిమాకు రీమేక్‌గా ‘భోళా శంకర్‌’ వస్తోంది.&nbsp; 2. లియో (Leo) తమిళ స్టార్‌ హీరో విజయ్‌ కథానాయకుడు ‌అంటే ఏ హీరోయిన్‌ ‌అయినా ఎగిరి గంతేస్తుంది. కానీ సాయి పల్లవి మాత్రం విజయ్‌ సినిమాను సున్నితంగా తిరస్కరించింది. విజయ్‌ లేటెస్ట్‌ మూవీ ‘లియో’లో హీరోయిన్‌గా తొలుత సాయి పల్లవినే అనుకున్నారట. ఇందుకోసం చిత్ర యూనిట్ సాయి పల్లవిని కూడా సంప్రదించింది. అయితే ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు ప్రాధాన్యత లేకపోవడంతో ఆమె రిజెక్ట్‌ చేసినట్లు సమాచారం. ఆ తర్వాత త్రిషను సంప్రదించగా అందుకు ఆమె గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది.&nbsp; 3. ఛత్రపతి (Chatrapathi) యంగ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ ఛత్రపతి సినిమాతో హిందీలోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తెలుగులో సూపర్‌ హిట్‌గా నిలిచిన రాజమౌళి ‘ఛత్రపతి’కి రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్ పాత్ర కోసం కూడా సాయిపల్లవినే సంప్రదించారని అప్పట్లో టాక్‌ వినిపించింది. గ్లామర్‌ షో ఎక్కువగా చేయాల్సి ఉండటంతో సాయి పల్లని ఈ ఆఫర్‌ రిజెక్ట్‌ చేశారని సమాచారం. దీంతో ఆ పాత్రకు బాలీవుడ్‌ నటి నుస్రత్‌ భరుచ్చాను ఎంపికచేశారు. కాగా, ఈ సినిమా మే 12 రిలీజ్‌ కానుంది.&nbsp; 4. వారసుడు (Varasudu) విజయ్‌ రీసెంట్ మూవీ వారసుడు / వారిసు సినిమాను కూడా సాయి పల్లవి రిజెక్ట్‌ చేసిందట. ఇందులో కూడా హీరోయిన్‌ పాత్రకు ప్రియారిటీ లేకపోవడంతో సున్నితంగా నో చెప్పిందని సమాచారం. దీంతో సాయిపల్లవి చేయాల్సిన పాత్రకు రష్మిక మందన్నను ఎంపిక చేశారు.&nbsp; 5. సరిలేరు నీకెవ్వరు (Sarileru Neekevvaru) మహేష్‌ బాబు, డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి కాంబోలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా హిట్‌ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో హీరోయిన్‌ పాత్రను సైతం సాయిపల్లవినే చేయాల్సి ఉండగా ఆమె రిజెక్ట్‌ చేసింది. దీంతో ఆ అవకాశం మళ్లీ రష్మికకే దక్కింది. హీరోయిన్ పాత్రకు యాక్టింగ్‌ స్కోప్‌ ఎక్కువగా లేకపోవడంతోనే ఈ భామ తిరస్కరించినట్లు తెలుస్తోంది.&nbsp; 6. డియర్ కామ్రేడ్ (Dear Comrade) విజయ్‌ దేవరకొండ - రష్మిక మందన్న కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘డియర్‌ కామ్రేడ్‌’. ఈ సినిమా మంచి టాక్‌ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద మాత్రం దారుణంగా ఫెయిల్‌ అయింది. అయితే ఈ సినిమా హీరోయిన్‌ ఆఫర్‌ కూడా ముందుగా సాయిపల్లవికే వెళ్లింది. అయితే ముద్దు సన్నివేశాలు, గ్లామర్ షో ఉన్న పాత్ర కావడంతో ఈ భామ తిరస్కరించినట్లు అప్పట్లో వార్తల్లో వచ్చాయి. తొలి నుంచి కిస్సింగ్‌ సీన్లకు దూరంగా ఉండే సాయిపల్లవి.. ఇందులో హీరోయిన్, హీరోయిన్ల ఘాటు రొమాన్స్‌ ఉండటంతో నో చెప్పింది.&nbsp; 7. చెలియా (Cheliya) లెజెండరీ డైరెక్టర్‌ మణిరత్నంతో కనీసం ఒక సినిమాలోనైనా వర్క్‌ చేయాలని హీరో, హీరోయిన్లు కలకలలు కంటారు. ఒక చిన్న పాత్ర దొరికినా చాలు అని సంబరపడుతుంటారు. కానీ సాయిపల్లవి మాత్రం ఏకంగా హీరోయిన్ ఆఫర్‌నే తిరస్కరించింది. కార్తిక్‌ హీరోగా తెరకెక్కిన చెలియా సినిమా కోసం తొలుత సాయిపల్లవినే మూవీ యూనిట్‌ సంప్రదించింది. అయితే సినిమా కథతో సంతృప్తి చెందని ఈ భామ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించింది. దీంతో సాయిపల్లవి ప్లేసులో అదితిరావు హైదరినీ తీసుకున్నారు.&nbsp;
    మే 09 , 2023
    <strong>Family Star Weekend Collections: ‘ఫ్యామిలీ స్టార్’ వీకెండ్‌ కలెక్షన్స్‌.. ఓవర్సీస్‌లో డాలర్ల వర్షం!</strong>
    Family Star Weekend Collections: ‘ఫ్యామిలీ స్టార్’ వీకెండ్‌ కలెక్షన్స్‌.. ఓవర్సీస్‌లో డాలర్ల వర్షం!
    విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) - మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం 'ఫ్యామిలీ స్టార్‌' (Family Star). పరుశురామ్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు (Dil Raju) నిర్మించిన ఈ చిత్రం గత శుక్రవారం భారీ అంచనాల మధ్య విడుదలైంది. అయితే మిక్స్‌డ్‌ టాక్ రావడంతో తొలి రోజు కలెక్షన్స్‌ దారుణంగా పడిపోయాయి. విజయ్‌ కెరీర్‌లోనే అతి తక్కువ డే 1 కలెక్షన్స్ ఈ సినిమాకే వచ్చాయని ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. మరి వీకెండ్‌కైనా ఈ మూవీ కలెక్షన్లలో పురోగతి వచ్చిందా? శుక్ర, శని, ఆది వారాల్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది? వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే? ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం ఈ వీకెండ్‌ ముగిసే సరికి భారత్‌లో రూ.11.95 కోట్ల నెట్‌ వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. తొలి రోజున ఈ చిత్రం రూ.5.75 కోట్లు, రెండో రోజు రూ.3.2 కోట్లు, మూడో రోజు రూ. 3 కోట్ల నెట్‌ వసూళ్లను రాబట్టినట్లు ప్రకటించాయి. దీన్ని బట్టి ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రంపై వస్తోన్న ట్రోల్స్, నెగిటివ్‌ ప్రచారం.. ఈ సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.&nbsp; ఓవర్సీస్‌లో డాలర్ల వర్షం అయితే ఓవర్సీస్‌లో ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తోంది. తొలి మూడు రోజుల్లో ఈ చిత్రం 5లక్షలకు పైగా డాలర్లను వసూలు చేసింది. ఎన్‌ఆర్‌ఐ ఆడియన్స్‌ ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. రానున్న రోజుల్లో ఓవర్సీస్‌ కలెక్షన్లు మరింత పెరుగుతాయని మేకర్స్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు.&nbsp; ప్రీ-రిలీజ్‌ బిజినెస్ ఎంతంటే? భారీ అంచనాలతో వస్తోన్న ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రం.. గణనీయ సంఖ్యలో ప్రీరిలీజ్‌ బిజినెస్‌ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 43 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులు అమ్ముడుపోయాయి. ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ కలిపి రూ. 34.50 కోట్లు నమోదు చేసింది. తెలంగాణ (నైజాం)లో రూ. 13 కోట్లు, రాయలసీమ (సీడెడ్) రూ. 4.5 కోట్లు, ఏపీలో రూ.17 కోట్లకు థియేట్రికల్‌ రైట్స్‌ను మేకర్స్ విక్రయించారు. అటు కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ రూ. 3 కోట్లు, ఓవర్సీస్ రూ. 5.5 కోట్లతో కలిపి మెుత్తంగా ఈ సినిమా రూ.43 కోట్లకు అమ్ముడుపోయినట్లు ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. ఫలితంగా ఫ్యామిలీ స్టార్‌ బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రూ.44 కోట్లకు చేరింది. ప్రస్తుత కలెక్షన్లు బట్టి చూస్తే ఈ సినిమా లాభాల్లోకి రావడం కష్టమే. కథేంటి? గోవ‌ర్ధ‌న్ (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కుడు. కుటుంబానికి దూరంగా వెళ్ల‌డం ఇష్టం లేక హైద‌రాబాద్‌లోనే ప‌నిచేస్తుంటాడు. కుటుంబ బాధ్యతలను మోస్తూ చాలి చాలని జీతంతో నెట్టుకొస్తుంటాడు. ఇలా సాగుతున్న అతడి జీవితంలోకి ఓ రోజు ఇందు (మృణాల్ ఠాకూర్‌) వ‌స్తుంది. ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డతారు. ఇంత‌లో ఊహించ‌ని విధంగా ఇందు రాసిన ఓ పుస్తకం గోవ‌ర్ధ‌న్ చేతికందుతుంది. ఇంత‌కీ ఆ పుస్త‌కంలో ఏం ఉంది? అది వారి ప్రేమను ఎలా ప్ర‌భావితం చేసింది? అస‌లు ఇందు ఎవ‌రు? గోవ‌ర్ధ‌న్ తన కుటుంబ క‌ష్టాల నుంచి గట్టెక్కాడా లేదా? అన్నది కథ.&nbsp;
    ఏప్రిల్ 08 , 2024
    CHIYAAN VIKRAM: పాత్ర కోసం ప్రాణాన్ని లెక్క చేయడీ హీరో.. చియాన్ విక్రమ్ చేసిన డిఫరెంట్ రోల్స్ ఇవే!
    CHIYAAN VIKRAM: పాత్ర కోసం ప్రాణాన్ని లెక్క చేయడీ హీరో.. చియాన్ విక్రమ్ చేసిన డిఫరెంట్ రోల్స్ ఇవే!
    విభిన్నమైన పాత్రలకు పెట్టింది పేరు జాన్ కెన్నడీ విక్టర్‌. ఆయన ఎవరో కాదు చియాన్‌ విక్రమ్. ఎలాంటి గెటప్‌నైనా వేసి నటనతో మెప్పించగలిగిన సామర్థ్యం ఈ హీరోది. ఇప్పటివరకు నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినప్పటికీ.. చియాన్ ఫ్యాన్ బేస్ ఏ మాత్రం తగ్గలేదు. ఎన్నో మర్చిపోలేని క్యారెక్టర్లతో అవార్డులు, రివార్డులు అందుకున్నాడు విక్రమ్. అతడికి పేరు సంపాదించి పెట్టిన కొన్ని ప్రత్యేకమైన పాత్రల గురించి తెలుసుకోండి.&nbsp; శివ పుత్రుడు పితమగాన్ సినిమాను తెలుగులో శివ పుత్రుడు పేరుతో రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో అమాయకుడి పాత్రలో చియాన్ విక్రమ్‌ అదరగొట్టాడు. క్రూరంగా కనిపిస్తూ జాలి, దయ కలిగున్న మనిషిగా నటించాడు. రస్టీ లుక్‌లో విక్రమ్ నటనకు జాతీయ అవార్డు లభించింది. బాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సూర్య కూడా మరో క్యారెక్టర్‌లో నటించాడు. అపరిచితుడు&nbsp; శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడులో విక్రమ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో మూడు డిఫరెంట్ రోల్స్‌లో చేశాడు. తప్పులను ప్రశ్నించే అమాయకమైన రామానుజం, తప్పు చేసిన వారిని శిక్షించే అపరిచితుడు, ప్రియురాలి ప్రేమ కోసం తపించే రెమో క్యారెక్టర్‌లో నటనతో ప్రేక్షకులను మెప్పించాడు విక్రమ్. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.&nbsp; మల్లన్న విక్రమ్ సినిమా తీస్తున్నాడంటే ఏదో ప్రత్యేకత ఉందని అభిమానులు భావించేలా చిత్రాల్ని ఎంచుకున్నాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన మల్లన్న చిత్రంలోనూ వివిధ గెటప్‌లతో అలరించాడు చియాన్. కోడి మాస్క్‌ ధరించి నటించడంతో పాటు లేడీ గెటప్‌లోనూ నటించాడు. కానీ, సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది.&nbsp; ఐ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఐ సినిమాలో విక్రమ్‌ చేసిన రోల్స్‌ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇందులో విచిత్రమైన వ్యాధి సోకి వృద్ధాప్యం వచ్చిన పాత్రలో మెప్పించాడు విక్రమ్. ఇందుకోసం చాలా కష్టపడ్డాడు. ఓ పాటలో బీస్ట్‌ గెటప్‌లోనూ మెరిశాడు. బాడీ బిల్డర్‌గానూ నటించిన ఈ టాప్ హీరో… చాలా రోజుల పాటు కేవలం మంచినీళ్లు మాత్రమే తీసుకున్నట్లు ఇంటర్వ్యూల్లో చెప్పాడు.&nbsp; నాన్న విక్రమ్ కెరీర్‌లో నాన్న సినిమా ప్రత్యేకం. సరైన మతిస్థిమితం లేని వ్యక్తి కుమార్తెతో కలిసి ఉండే ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో విక్రమ్ చేసిన క్యారెక్టర్‌కి కూడా మంచి మార్కులు పడ్డాయి. తండ్రి, కూతురు మధ్య కేవలం సైగలతో వచ్చే సీన్‌ ఇప్పటికే చాలామందిని మెప్పించింది. ఇంకొక్కడు ఇరుముగన్‌గా వచ్చిన తమిళ్‌ సినిమా తెలుగులో ఇంకొక్కడు పేరుతో అనువాదం అయ్యింది. ఇందులో రెండు క్యారెక్టర్స్‌లో విక్రమ్ కనిపించాడు. లేడీ విలన్‌ రోల్‌లో అదరగొట్టాడు. ఆ గెటప్ చూస్తే నిజంగా విక్రమ్ ఇలాంటి రోల్‌ చేశాడా అనిపిస్తుంది. అంతలా మెప్పించాడు విక్రమ్. సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బాగానే ఆడింది. తంగలాన్ విక్రమ్ తదుపరి చిత్రం తంగలాన్. ఇందులో మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు.&nbsp; https://telugu.yousay.tv/thangalan-the-chian-mark-terror.html
    ఏప్రిల్ 18 , 2023
    <strong>EXCLUSIVE : ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ పదే పదే వాయిదా పడటానికి కారణాలు ఇవే!</strong>
    EXCLUSIVE : ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ పదే పదే వాయిదా పడటానికి కారణాలు ఇవే!
    యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen).. ఇటీవల ‘గామి’ (Gaami) సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. డిఫరెంట్‌ స్టోరీ లైన్‌తో రూపొందిన ఈ చిత్రంలో అఘోరా శంకర్‌ పాత్రలో అదరగొట్టాడు. మరోవైపు విశ్వక్‌ నటించిన లేటెస్ట్ చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి’ (Gangs Of Godavari) రిలీజ్‌కు సిద్ధమవుతోంది. మెున్నటి వరకూ ఎలాంటి అప్‌డేట్‌ లేని ఈ చిత్రం నుంచి టీజర్‌ రిలీజ్‌ డేట్‌ లాక్‌ అవ్వడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ చిత్రంపై పడింది. వాస్తవానికి గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి గతే ఏడాదే రిలీజ్‌ కావాల్సింది. రిలీజ్‌ తేదీని ప్రకటించి కూడా పలుమార్లు సినిమాను వాయిదా వేశారు. అందుకు కారణాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; పోస్ట్‌పోన్‌పై విష్వక్‌ అసహనం! గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి చిత్రానికి ఛల్‌ మోహన్‌ రంగ ఫేమ్‌ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్‌గా చేసింది. మే 17న ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విడుదల తేదీ కూడా దగ్గర పడుతుండటంతో ఏప్రిల్‌ 27 సా. 4.01 గం.లకు టీజర్‌ రిలీజ్‌ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. వాస్తవానికి ఈ చిత్రం 2023 డిసెంబర్లోనే రిలీజ్‌ అవ్వాల్సింది. అయితే ‘హాయ్ నాన్న’ (Hi Nanna), ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ (Extra Ordinary Man) వంటి సినిమాలతో పోటీ కారణంగా ఆ సినిమాను నిర్మాతలు వాయిదా వేశారు. ఒకవేళ గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి అనుకున్న సమయానికి రాకపోతే తాను ఆ సినిమాను ప్రమోట్‌ చేయనని అప్పట్లో విశ్వక్‌ ప్రకటించడం వివాదస్పదంగా మారింది.&nbsp; నిర్మాత రియాక్షన్‌ ఇదే! ‘ఆదికేశవ’ ప్రమోషన్‌ ఈవెంట్‌ సందర్భంగా అప్పట్లో నిర్మాత నాగ వంశీ.. విష్వక్‌ వ్యాఖ్యలపై స్పందించారు. సినిమాను ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్‌ 8న విడుదల చేయాలన్నది విష్వక్‌ మాటల వెనక ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. తమ సినిమా విడుదల తేదీని ప్రకటించిన సందర్భంలో వరుణ్‌ తేజ్ నటించిన 'ఆపరేషన్‌ వాలెంటైన్‌' పోటీకి సిద్ధంగా ఉందని అన్నారు. అనుకోకుండా హాయ్‌ నాన్న, ఎక్ట్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌, సలార్‌ తెరపైకి వచ్చాయని పేర్కొన్నారు. అంత కాంపింటీషన్‌కు వెళ్లి సినిమాను రిలీజ్‌ చేయడం ఎందుకని అంటానని భావించి&nbsp; విష్వక్‌ ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని నాగ వంశీ అభిప్రాయపడ్డారు. సినిమా షూటింగ్‌ దశలోనే ఉన్నందున దీనిపై ఇద్దరం చర్చించి నిర్ణయం తీసుకుంటామని అప్పట్లో సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ ఏదోక కారణంతో వాయిదా పడుతూనే వచ్చింది.&nbsp; https://www.youtube.com/watch?v=hpFNP5gptFU ఐటెం సాంగ్‌తో గ్యాప్ ఈ ఏడాది ప్రారంభంలోనే గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరిని రిలీజ్‌ చేయాలని మేకర్స్ భావించినప్పటికీ అది జరగలేదు. ఐటెం సాంగ్‌ షూట్‌లో జరిగిన మార్పు వల్ల సినిమా షూటింగ్‌ ఆలస్యమైంది. తొలుత ఈ సినిమాలో ఐటెం సాంగ్‌ కోసం ఈషా రెబ్బను మూవీ టీమ్ ఎంపిక చేసింది. ఒక రోజు షూటింగ్‌ కూడా నిర్వహించింది. మళ్లీ ఈషాను కాదని ఆమె స్థానంలో అయేషా ఖాన్‌ను రంగంలోకి దింపారు. అటు ఇళయరాజా ఇంట విషాధం కూడా ఈ మూవీ వాయిదాకు కారణమైంది. ఈ చిత్రానికి ఇళయరాజా తనయుడు యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించారు. జనవరి 25న అతడి సోదరి చనిపోవడంతో అతను సినిమా పనుల్లో పాల్గొనలేకపోయారు. దీంతో టెక్నికల్‌ వర్క్‌ పనులు ఆలస్యం అయ్యాయి.&nbsp; ఈ సారి విశ్వక్ వల్లే వాయిదా? దీంతో మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా సినిమాను రిలీజ్‌ చేస్తామని చిత్ర యూనిట్‌ ప్రకటించింది. అయితే ఈ శివరాత్రికి ‘గామి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు విశ్వక్‌ అనౌన్స్‌ చేశారు. దీంతో వెనక్కి తగ్గిన గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి యూనిట్‌ ఎప్పటిలాగే సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మే 17న ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్‌ చేయాలని సంకల్పంతో ఉన్నారు. సినిమా ప్రమోషన్స్‌పైనా టీమ్‌ ఫోకస్‌ పెట్టింది. నెల రోజుల క్రితం అయేషా ఖాన్‌ నటించిన ‘మోతా’ అనే ఐటెం సాంగ్‌ లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేసింది. లేటెస్ట్‌గా టీజర్‌ అప్‌డేట్‌ను ఇచ్చింది. త్వరలోనే ట్రైలర్‌ కూడా రిలీజ్‌ చేయాలని మూవీ టీమ్‌ భావిస్తోంది.&nbsp;
    ఏప్రిల్ 24 , 2024
    Saif Ali Khan in Devara: మరో అమ్రిష్ పురి దొరికినట్టేనా.. విలన్‌గా షేక్ చేస్తున్న సైఫ్..!
    Saif Ali Khan in Devara: మరో అమ్రిష్ పురి దొరికినట్టేనా.. విలన్‌గా షేక్ చేస్తున్న సైఫ్..!
    తెలుగులో విలన్ అంటే కొందరే గుర్తుకొస్తారు. రావు గోపాల్‌రావు, అమ్రిష్ పురి, సోనూ సూద్ వంటి నటులు విలన్లుగా మరపురాని పాత్రలు పోషించారు. వీరి డైలాగ్, డిక్షన్, యాక్టింగ్.. యూనిక్‌గా ఉంటాయి. ఆ తర్వాత బాలకృష్ణ లెజెండ్ సినిమాతో విలన్‌గా ఎంట్రీ ఇచ్చాడు జగపతి బాబు. నెరిసిన గడ్డంతో ఓ రెండు, మూడు సినిమాల్లో నటించి మెప్పించాడు. కానీ, పర్మనెంట్‌గా ఈ పాత్రలో ఒదగలేక పోయాడు. ఇక, ఇద్దరు, ముగ్గురు నటులు విలన్ రోల్స్‌లో ట్రై చేసినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేక పోయారు. ఎప్పటి నుంచో అలా ఈ విలన్ సీటు ఖాళీగా ఉంటూ వస్తోంది. ఈ సమయంలో విలన్ పాత్రలకు కేరాఫ్‌గా నిలుస్తున్నాడు బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan). విలన్ రోల్స్‌కి తానే పర్మనెంట్ సొల్యూషన్ అంటూ ముందుకు వస్తున్నాడు.&nbsp;&nbsp; https://twitter.com/tarak9999/status/1691728962731589669?s=20 దేవరలో ‘భైరా’గా జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘దేవర’. ఇందులో విలన్‌గా&nbsp; సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే. నేడు(August 16) సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan BirthDay) పుట్టినరోజు సందర్భంగా దేవర నుంచి అతడి లుక్ విడుదలైంది. ఈ లుక్ ఆకట్టుకుంటోంది. పొడవాటి ఉంగరాల జుట్టుతో కనిపించి సినిమాపై మరింత అంచనాలు పెంచాడు. మాసిన గడ్డం, చూసే చూపుతో నెగెటివ్ ఛాయలను ముఖంలో ప్రదర్శించేశాడు. మరి, ‘భైరా’గా సైఫ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతోందో తెరపై చూడాల్సిందే.&nbsp; ఆదిపురుష్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో సైఫ్ ‘లంకేష్’ పాత్రను పోషించాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ విలన్‌గా సైఫ్ మెప్పించాడు. తన నటనతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు. తన పాత్రకు న్యాయం చేశాడు.&nbsp; హిందీ చిత్రాలు 30 ఏళ్ల సినీ కెరీర్‌లో సైఫ్ అలీ ఖాన్ పలు విలన్ పాత్రల్లో నటించి మెప్పించాడు. ఆదిపురుష్ సినిమాకు ముందు సైఫ్ అలీ ఖాన్ ‘తానాజీ’(Tanhaji) చిత్రంలో నటించాడు. ఇందులో ‘ఉదయ్ భాను సింగ్ రాథోడ్’ అనే పాత్రను పోషించి మంచి మార్కులు కొట్టేశాడు. ఈ చిత్రాన్ని కూడా ‘ఆదిపురుష్’ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించడం గమనార్హం.&nbsp; 2009లో విడుదలైన కుర్భాన్(Kurbaan) సినిమాలోనూ సైఫ్ విలన్ రోల్ చేశాడు. రాడికల్ టెర్రరిస్టు ‘ఖలీద్’ పాత్రలో నటించి ప్రేక్షకులను భయపెట్టాడు. 2006లో విడుదలైన ‘ఓంకార’(Omkara) సినిమాను మాత్రం ఎవరూ మర్చిపోలేరు. ఇందులో సైఫ్ చేసిన రోల్ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండి పోతుంది. సైఫ్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. అంతకుముందు 2004లో వచ్చిన ‘ఏక్ హసన్ థీ’ సినిమాలోనూ కరణ్ సింగ్ రాథోడ్‌గా నటించాడు.&nbsp; ఫ్యూచర్ విలన్ ప్రస్తుతం టాలీవుడ్‌ బలమైన విలన్ క్యారెక్టర్ కోసం ఎదురు చూస్తోంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు ప్రాధాన్యత తగ్గడమూ ఇందుకు కారణం. అయితే, పవర్ ఫుల్ విలన్ రోల్స్ కోసం స్టార్ నటులను, ఇతర ఇండస్ట్రీ యాక్టర్లను ఒప్పించే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో సైఫ్ ‘దేవర’ సినిమాతో వస్తున్నాడు. కండలు తిరిగిన దేహం సైఫ్‌కి ఉండటం మరో అడ్వాంటేజీ. ఒకవేళ ఈ సినిమా విజయం సాధిస్తే ఇక సైఫ్ అలీ ఖాన్‌కి తిరుగుండదు. సైఫ్ యాక్టింగ్ తెలిసిన వారు ఈ విషయాన్ని కచ్చితంగా చెబుతున్నారు. టాలీవుడ్‌లో ఫ్యూచర్ విలన్‌గా సైఫ్ మారగలడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.&nbsp;
    ఆగస్టు 16 , 2023

    @2021 KTree