ఈ వేసవిలో తెలుగు ఆడియన్స్‌కు వినోదాన్ని పంచేందుకు ఈ వారం పలు చిత్రాలు విడుదల కాబోతున్నాయి. అగ్ర హీరోల సినిమాలు లేకపోవడంతో చిన్న చిత్రాలు తమ సత్తా ఏంటో చూపించేందుకు వచ్చేస్తున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ పలు చిత్రాలు/ సిరీస్‌లు ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. మరి ఈ వారం థియేటర్/ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు
గీతాంజలి మళ్లీ వచ్చింది
అంజలి లీడ్ రోల్‌లో చేసిన ‘గీతాంజలి’ చిత్రం.. గతంలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ (Geethanjali Malli Vachindi) రూపొందింది. అంజలితో పాటు శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేశ్, అలీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ ఆకట్టుకుంటున్నాయి.
లవ్ గురు
ప్రముఖ తమిళ నటుడు విజయ్ ఆంటోనీ (Vijay Antony) కథానాయకుడిగా చేసిన లేటెస్ట్ చిత్రం.. ‘లవ్ గురు’ (Love Guru). మృణాళిని రవి కథానాయిక. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. రంజాన్ కానుకగా ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమలో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి లవ్ గురు ఎలా పరిష్కారం చూపించాడు అన్నది ఈ చిత్ర కథాంశం.
డియర్
జీవీ ప్రకాష్‌కుమార్, ఐశ్వర్య జంటగా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘డియర్’ (Dear). తమిళంలో ఏప్రిల్ 11న విడుదలవుతున్న ఈ చిత్రం.. తెలుగులో ఒక రోజు ఆలస్యంగా ఏప్రిల్ 12న రాబోతోంది. ఆనంద్ రవిచంద్రన్ దర్శకుడు. అన్నపూర్ణా స్టూడియోస్, ఏషియన్ సినిమాస్ తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీని విడుదల చేస్తున్నాయి. భార్య గురక వల్ల ఆ భర్త ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? అన్నది స్టోరీ.
బడేమియా ఛోటేమియా
బాలీవుడ్ కథానాయకులు అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన తాజా చిత్రం ‘బడేమియా ఛోటేమియా’ (Bade miyan Chote miyan) ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, మానుషి చిల్లర్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 10న ఈ మూవీ థియేటర్‌లలో విడుదల కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
మైదాన్
భారత ఫుట్‌బాల్ దిగ్గజ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం బయోపిక్‌గా రూపొందిన చిత్రం ‘మైదాన్’ (Maidaan). బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఇందులో లీడ్ రోల్‌లో చేశాడు. అమిత్ శర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రియమణి కథానాయికగా చేసింది. బోనీ కపూర్ నిర్మాత. ఏప్రిల్ 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం మలయాళ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు.
ఓటీటీలో విడులయ్యే చిత్రాలు/ సిరీస్‌లు
ఓం భీమ్ బుష్
ఈ వారం ఓటీటీలోకి క్రేజీ సినిమా రాబోతోంది. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఓం బీమ్ బుష్’ (Om Bheem Bush). ఏప్రిల్ 12న ఓటీటీలోకి వస్తోంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
గామి
యంగ్ హీరో విశ్వక్ సేన్ లేటెస్ట్ చిత్రం ‘గామి’ (Gaami).. మార్చి 8న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. జీ 5 వేదికగా ఏప్రిల్ 12 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడలోనూ ఇది ప్రసారం కానుంది.
ప్రేమలు
మలయాళంలో విడుదలై భారీ హిట్ అందుకున్న ‘ప్రేమలు’ (Premalu).. తెలుగులోనూ మంచి విజయం సాధించింది. మార్చి 8న విడుదలైన ఈ మూవీ.. తెలుగు వెర్షన్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. కాగా, ఈ సినిమా ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 12 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది. మరోవైపు అదే రోజున హాట్ స్టార్‌లో మలయాళ వెర్షన్‌లో రిలీజ్ కాబోతోంది.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
Title | Category | Language | Platform | Release Date |
Unlocked | Series | Korean | Netflix | April 10 |
What Jenniffer Did | Movie | English | Netflix | April 10 |
Baby Reindeer | Movie | English | Netflix | April 11 |
Heartbreak High S2 | Series | English | Netflix | April 12 |
Amar Singh Chamkeela | Movie | Hindi | Amazon prime | April 12 |
Gaami | Movie | Telugu | Amazon prime | April 12 |
Blood Free | Series | Korean | Disney + Hotstar | April 10 |
The Greatest Hits | Movie | English | Disney + Hotstar | April 12 |
Karthika | Movie | Telugu | Aha | April 09 |
Premalu | Movie | Telugu | Aha | April 12 |
Adrusyam | Series | Hindi | SonyLIV | April 11 |
Laal Salaam | Movie | Telugu/Tamil | SunNXT | April 12 |
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!