పీరియాడిక్ రోల్స్‌లో తళుక్కుమన్న 10 మంది  అందాల తారలు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పీరియాడిక్ రోల్స్‌లో తళుక్కుమన్న 10 మంది  అందాల తారలు

    పీరియాడిక్ రోల్స్‌లో తళుక్కుమన్న 10 మంది  అందాల తారలు

    March 29, 2023

    సాధారణంగా హీరోయిన్స్‌ అంటే గ్లామర్‌ పాత్రలు, నటనకు ఆస్కారం లేని క్యారెక్టర్‌లే గుర్తుకు వస్తాయి. కథానాయికలు కేవలం కొన్ని సీన్లకు, పాటలకు మాత్రమే పరిమితమైన చిత్రాలు ఇటీవల కాలంలో  కోకొల్లలుగా వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ కొందరు హీరోయిన్లు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పిరియాడిక్‌ పాత్రల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదిస్తున్నారు. ఓ వైపు కమర్షియల్‌ సినిమాల్లో నటిస్తూనే నటనకు ఆస్కారముండే పాత్రలూ చకా చకా చేసేస్తున్నారు. అలాంటి ఓ 10 మంది తారలను ఇప్పుడు చూద్దాం.

    సమంత:

    సమంత ఇప్పటివరకు అందం, అభినయం కలగలిపిన పాత్రల్లో చేశారు. కొన్ని సినిమాల్లో ప్రేయసి క్యారెక్టర్‌లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఇందుకు భిన్నంగా తన లేటెస్ట్‌ మూవీ ‘శాకుంతలం’లో సమంత కనిపించబోతున్నారు. కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలము’ నాటకం ఆధారంగా డైరెక్టర్‌ గుణశేఖర్‌ ఈ సినిమాను రూపొందించారు. ఇందులో సామ్‌ శాకుంతల పాత్ర పోషిస్తున్నారు. సమంత ఇలా పౌరణిక పాత్రలో కనిపించడం ఇదే తొలిసారి. ఈ సినిమా తన కెరీర్‌లోనే అత్యుత్తమంగా నిలిచిపోతుందని సమంత అంటున్నారు. ఏప్రిల్‌ 14న శాంకుతులం రిలీజ్‌ కానుండగా ఫ్యాన్స్‌ను సమంత ఏమేరకు మెప్పిస్తారో చూడాలి. 

    కృతి సనన్‌: 

    ప్రభాస్‌ లేటెస్ట్‌ మూవీ ‘ఆదిపురుష్‌’ను రామాయణం కథ ఆధారంగా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా ‘కృతి సనన్‌’ సీత పాత్ర చేస్తున్నారు. ఇప్పటివరకూ గ్లామర్ పాత్రల్లో మాత్రమే నటించిన కృతి.. సీత క్యారెక్టర్‌ చేస్తుండటం ఆసక్తిరేపుతోంది. సీత పాత్రను పోషించి అందరి మన్ననలు పొందడమంటే సాధారణ విషయం కాదు. సీత మృధుస్వభావి, మిత భాషి. అంతేగాక సీత పాత్ర ఎంతో సుకుమారమైంది. ఎన్నో సవాళ్లతో కూడిన సీత పాత్రను కృతి చేస్తుండటం గొప్ప విషయమనే చెప్పాలి. తన నటనతో ప్రేక్షకులను కృతి మెప్పించినట్లయితే ఆమె క్రేజ్‌ అమాంతం పెరుగుతుందనడంలో సందేహం లేదు. 

    అలియా భట్‌:

    బాలీవుడ్‌ బ్యూటీ అలియభట్‌ వరుస విజయాలతో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. తాజాగా ఆమె హిస్టారికల్‌ మూవీలో నటిస్తున్నారు. మెుగల్ కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ‘టక్త్‌’ చిత్రంలో బాను భేగంగా ఆలియా నటిస్తున్నారు. ఈ పాత్రలో ఆలియా నటన సినిమాకే హైలెట్‌గా ఉంటుందని మేకర్స్‌ చెబుతున్నారు. నటన పరంగా ఆలియా మరో మెట్టు ఎక్కుతుందని చెబుతున్నారు. కరణ్‌ జోహర్‌ నిర్మిస్తున్న టక్త్‌ చిత్రంలో త్వరలోనే విడుదల కానుంది. 

    త్రిష:

    నీ మనసు నాకు తెలుసు చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన త్రిష.. వర్షం మూవీతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. త్రిష తన కెరీర్‌లో ఎక్కువగా ప్రేమికురాలి పాత్రల్లో కనిపించి మెప్పించారు. కానీ ‘పొన్నియన్‌ సెల్వన్‌’ పార్ట్‌ 1, 2 చిత్రాల ద్వారా త్రిష తన రూటు మార్చారు. చోళుల రాజకుమారి కుందువై పాత్రలో కనిపించి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నారు. యువరాణిలా ఎంతో హుందాగా నటించడంతో పాటు రాజనీతిజ్ఞత కలిగిన మహిళగా త్రిష తన హావభావాలను చక్కగా పలికించారు.

    ఐశ్వర్యరాయ్‌:

    బాలీవుడ్ అగ్రకథానాయిక ఐశ్వర్యరాయ్‌ గ్లామర్‌ పాత్రలతోపాటు.. నటనకు ఆస్కారమున్న హిస్టారికల్‌ పాత్రల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదివరకే హృతిక్‌తో ‘జోదా అక్భర్‌’ లో నటించిన ఐశ్వర్య.. మహారాణి ‘జోధా బాయి’ పాత్రతో మెప్పించారు. తాజాగా పొన్నియన్‌ సెల్వన్‌లో సైతం ఐశ్వర్య ‘నందిని’ పాత్రలో కనిపించారు. చోళ సామ్రాజ్యపు కోశాధికారి అయిన పెరియా పళవెట్టారియార్‌కు భార్యగా నటించారు. 

    అనుష్క:

    టాలీవుడ్‌ అగ్ర కథానాయికల్లో ఒకరైన అనుష్క విభిన్న పాత్రలకు పెట్టింది పేరు. అరుంధతి చిత్రంతో టాప్‌ హీరోయిన్‌గా ఎదిగిన ఈ భామ బాహుబలి సినిమాలో దేవసేన పాత్రతో ఆ స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు. కాకతీయ సామ్రాజ్యపు వీర వనిత రుద్రమదేవి పాత్రను సైతం అలవోకగా చేసిన అనుష్క ఈ తరం హీరోయిన్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రుద్రమదేవి చిత్రంలో అనుష్క నటన హైలెట్‌ అనే చెప్పాలి. ధైర్యవంతురాలైన రాణి పాత్రలో ఆమె చక్కగా ఒదిగిపోయారు. 

    కంగనా రనౌత్‌:

    బాలీవుడ్‌ బ్యూటీ కంగనా రనౌత్‌ మూస ధోరణి పాత్రలంటే ఆమాడ దూరం పాటిస్తారు. సవాలు విసిరే పాత్రల్లో నటించడమంటే ఆసక్తి చూపించే కంగనా ఝాన్సీ లక్ష్మీ బాయి పాత్రలో నటించి అదరగొట్టారు. 2019లో వచ్చిన ‘మణికర్ణిక’ చిత్రంలో కంగనా ఝాన్సీ లక్ష్మీ బాయిగా కనిపించారు. పోరాట సన్నివేశాల్లో అద్భుతంగా నటించి క్రిటిక్స్‌ సైతం మెచ్చుకునే స్థాయికి ఎదిగారు. ఈ చిత్రంలో ఆమె నటనకు జాతీయ అవార్డు వచ్చింది. 67వ జాతీయ సినీ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందించారు. 

    కాజల్‌:

    టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరిగా కాజల్‌ ఎదిగారు. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన మగధీర చిత్రం కాజల్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఇందులో కాజల్‌ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించారు. ముఖ్యంగా యువరాణి మిత్రవింద పాత్రలో ఆమె అద్భుతంగా నటించారు. తొలిసారి పిరియాడిక్‌ పాత్ర పోషించినప్పటికీ నటనలో కాజల్ ఎంతో పరివర్తన కనబరిచారు. చరణ్‌తో పోటీపడి మరీ నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. మగధీర చిత్రంతో కాజల్‌ కెరీర్‌ పూర్తిగా మారిపోయింది.

    రిచా పనాయ్:

    అల్లరి నరేష్‌ హీరోగా తెరకెక్కిన యుముడికి మెుగుడు చిత్రంలో యుముడి కూతురిగా ‘రిచా పనాయ్‌’ నటించారు. ఈ చిత్రం ద్వారానే తొలిసారి టాలీవుడ్‌లో అడుగుపెట్టిన రిచా.. యమజ పాత్రలో నటించి అలరించారు. ‘మెుగుడా.. మెుగుడా’ అని అల్లరి నరేష్‌ను పిలుస్తూ థియేటర్లలో నవ్వులు పూయించారు.

    ఈ చిత్రంతో రిచా మంచి గుర్తింపునే సంపాదించినప్పటికీ ఆమెకు సినిమా అవకాశాలు పెద్దగా రాలేదు. ఆ తర్వాత చందమామ కథలు, రక్షక భటుడు వంటి చిత్రాల్లో నటించినా కూడా ఆమె పెద్దగా ఆకట్టులేకపోయింది. అవకాశాలు లేకపోవడంతో రిచా నెమ్మదిగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.

    రీమా సేన్:

    2010లో టాలీవుడ్‌లో విడుదలైన యుగానికి ఒక్కడు చిత్రం మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. పాండ్య రాజుల కథాంశంతో రూపొందిన ఈ సినిమాతో హీరో కార్తీకి చెరి సమానమైన క్రేజ్‌ను రీమాసేన్‌ సంపాదించారు. అనితా పాండియన్‌ పాత్రలో ఆమె అద్భుత నటన కనబరిచారు. ఓవైపు మోడ్రన్‌ పాత్రలో అదరగొట్టిన ఆమె పాండ్యుల దేవతగా నటించి మెప్పించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version