ఒకప్పుడు థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులు వినోదాన్ని పొందారు. ఓటీటీ రాకతో ఆ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రతీ ఇంటికి వచ్చేసింది. ఇంట్లోనే ఎంచక్కా కొత్త సినిమాలు / సిరీస్‌లు చూసే వెసులుబాటును ఓటీటీలు కల్పిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థలు ప్రతీవారం కొత్త సినిమాలను తీసుకొస్తూ ఆడియన్స్‌కు వినోదాన్ని పంచుతున్నాయి. ఈ వీకెండ్ కూడా పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీలోకి రాబోతున్నాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయి? వాటి ప్లాట్స్ ఏంటి? ఇప్పుడు చూద్దాం.
బఘీరా (Bagheera)
శ్రీమురళి (Sriimurali), రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) ప్రధాన పాత్రల్లో దర్శకుడు డాక్టర్ సూరి తెరకెక్కించిన చిత్రం ‘బఘీర’ (Bagheera). దీపావళి సందర్భంగా అక్టోబరు 31న పలు భాషల్లో బాక్సాఫీసు ముందుకొచ్చింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో ఈ నెల 21 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ప్లాట్ ఏంటంటే ‘వేదాంత్ ప్రభాకర్(శ్రీ మురళి) తన బాల్యం నుంచి అందరికీ సహాయపడే ఓ సూపర్ హీరో కావాలని కలలు కంటాడు. కానీ తన తల్లి మాటలతో ఒక పవర్ఫుల్ పోలీస్ అధికారిగా ఉద్యోంగ చేస్తాడు. అతని హయాంలో మంగళూరులో క్రైమ్ పూర్తిగా కంట్రోల్ అవుతుంది. ఒక సిన్సియర్ ఆఫీసర్‌గా కొనసాగుతున్న వేదాంత్ జీవితంలో జరిగిన ఎమోషనల్ టర్నింగ్ ఏంటి? ఎంతో నిజాయితీగా ఉండే తాను ఎందుకు అవినీతి అధికారిగా మారుతాడు? అతు బఘీరగా మారేందుకు దారితీసిన అంశాలు ఏమిటి? అవయవ రవాణా చేస్తున్న రానా(గరుడ రామ్)ను ఎలా ఎదుర్కొన్నాడు?’ అనేది మిగతా కథ.
మార్టిన్ (Martin)
ధృవ సర్జా (Dhruva Sarja), వైభవి శాండిల్య (Vaibhavi Sandilya) నటించిన చిత్రం ‘మార్టిన్’ (Martin).ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ ఆహాలో నవంబర్ 19 నుంచి తెలుగులో ప్రసారం అవుతోంది. మరో ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లోనూ తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో ఈ సినిమా ప్రసారం అవుతోంది. ప్లాట్ ఏంటంటే ‘భారత్‌కు చెందిన అర్జున్ పాకిస్తాన్‌లో అరెస్టు అవుతాడు. అక్కడి నుంచి తప్పించుకున్న అర్జున్‌కి తను జైలుకు వెళ్లడానికి కారణం మార్టిన్ అని తెలుస్తుంది. అసలు మార్టిన్ ఎవరు? అర్జున్‌ను ఎందుకు టార్గెట్ చేశాడు? అసలు అర్జున్ పాక్‌కు ఎందుకు వెళ్లాడు?’ అన్నది స్టోరీ.
కిష్కింద కాండం (Kishkindha Kaandam)
ఈ వీకెండ్ మంచి సైకాలజీ థ్రిల్లర్ చూడాలని భావించేవారికి కిష్కింద కాండం బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. అసీఫ్ అలీ (Asif Ali), అపర్ణ బాలమురళి (Aparna Balamurali) జంటగా చేసిన ఈ మలయాళ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సాధించింది. నవంబర్ 19 నుంచి హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. తెలుగులోనూ వీక్షించవచ్చు. ప్లాట్ ఏంటంటే ‘అపర్ణ (అపర్ణ బాలమురళి), అజయ్ (ఆసిఫ్ అలీ) ప్రేమించి పెళ్లిచేసుకుంటారు. అజయ్ తండ్రి అప్పు పిళ్లై ఓ రిటైర్డ్ ఆర్మీ మేజర్. ఓ రోజు అతడి గన్ మిస్సవుతుంది. ఆ గన్ గురించి ఎంక్వైరీ చేసే క్రమంలో అపర్ణకు అనూహ్య విషయాలు తెలుస్తాయి. అసలు అప్పు పిల్లై గతం ఏంటి? అతడి భార్య, రెండో కుమారుడు ఎలా కనిపించకుండా పోయారు? వారి మిస్సింగ్‌కు అజయ్‌కు ఏమైనా సంబంధం ఉందా?’ అన్నది స్టోరీ.
లగ్గం (Laggam)
సాయి రోనక్, ప్రగ్యా నగ్రా ప్రధాన పాత్రదారులుగా తెరకెక్కిన చిత్రం ‘లగ్గం‘. తెలంగాణ పెళ్లి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి రమేశ్ చెప్పాల దర్శకుడు. అక్టోబర్ 25న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. నవంబర్ 22 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. ప్లాట్ ఏంటంటే ‘మేనల్లుడి సాఫ్ట్‌వేర్ లైఫ్‌కి ఫిదా అయిన సదానందం కూతురు మానసను చైతన్యకు ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇందుకోసం లగ్గం కూడా చేసుకుంటాడు. ఈ క్రమంలోనే చైతన్య తన ఉద్యోగానికి రిజైన్ చేస్తాడు. అది తెలిసిన సదానందం పెళ్లి ఆపాలని నిర్ణయించుకుంటాడు. అప్పటివరకూ పెళ్లి ఇష్టం లేని మానస చైతన్యపై మనసు పారేసుకుంటుంది. మరి ఈ పెళ్లి జరిగిందా? లేదా?’ అన్నది స్టోరీ.
ఏలియన్: రొములున్ (Alien: Romulus)
హాలీవుడ్ చిత్రాలను ఇష్టపడే వారికోసం ఈ వారం అదిరిపోయే సైన్స్ ఫిక్షన్ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. ప్రపంచ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిన ఏలియన్: రొములస్ చిత్రం తాజాగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. నవంబర్ 21 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీషుతో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వీక్షించవచ్చు. ప్లాట్ ఏంటంటే ‘అంతరిక్ష వలసదారులు ఓ పాడుబడిన స్పేస్ స్టేషన్ నుంచితమకు పనికి వచ్చే వస్తువులను సేకరిస్తుంటారు. ఆ సమయంలో విశ్వంలోని ఓ ఏలియన్స్ వింత జీవి రూపంలో వాళ్లపై దాడి చేస్తాయి. వాటి నుంచి వారు తప్పించుకున్నారా? లేదా?’ అన్నది స్టోరీ.
ఐ హేట్ లవ్ ( I Hate Love)
సుబ్బు, శ్రీవల్లి, కిట్టయ్య ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘ఐ హేట్ లవ్’. ‘నేనూ ప్రేమలో పడ్డాను’ అనేది ఉపశీర్షిక. వెంకటేష్. వి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 16న ఈ చిత్రం థియేటర్లోకి వచ్చింది. ఇప్పుడు 9 నెలల తర్వాత నవంబర్ 21 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘రామబాబుకు ప్రేమంటే ఇష్టముండదు. కానీ నాటకీయంగా అతను సీత అనే యువతితో ప్రేమలో పడుతాడు. కానీ యువతి తండ్రి ఊరి పెద్దలకు భయపడి వారి పెళ్లికి అంగీకరించడు. మరి రాంబాబు తన ప్రేమను గెలిపించుకునేందుకు ఏం చేశాడు?’ అనేది మిగతా కథ.
రేపటి వెలుగు (Repati Velugu)
ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్‌లో ఈ వారం మరో లవ్ ఎంటర్‌టైనర్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. శత్రు, ప్రశాంత్ కార్తీ, విస్మయ శ్రీ, ఆద్విక్ బండారు వంటి కొత్త వాళ్లు చేసిన ‘రేపటి వెలుగు’ నేరుగా నవంబర్ 21 నుంచి స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఈ చిత్రానికి వీరన్ దర్శకత్వం వహించారు. సమాజంలోని కొన్ని ప్రధాన సమస్యలను టచ్ చేస్తూ సాగే ఎమోషన్ డ్రామాగా రేపటి వెలుగు రూపొందింది.
ఉషా పరిణయం (Usha Parinayam)
ఇదిలా ఉంటే గతవారం పలు ఆసక్తికర చిత్రాలు ఓటీటీలోకి వచ్చాయి. అవి ఇప్పటివరకూ చూడకుండా ఉంటే ఈ వీకెండ్‌తో ఎంచక్కా చూసేయండి. కుమారుడు శ్రీకమల్‌ను హీరోగా పెట్టి స్టార్ డైరెక్టర్ కె. విజయ్‌భాస్కర్ తెరకెక్కించిన ‘ఉషా పరిణయం’ చిత్రం నవంబర్ 14న ఓటీటీలోకి వచ్చింది. ఈటీవీ విన్‌లో వీక్షించవచ్చు. ఇందులో తాన్వీ ఆకాంక్ష కథానాయిక. ఈ ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ యువతను మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ప్లాట్ ఏంటంటే ‘హనీ (శ్రీకమల్) పెళ్లి చూపుల్లో ఉషాను రిజెక్ట్ చేస్తాడు. అయితే అతడు జాయిన్ అయిన ఫ్యాషన్ కంపెనీలోనే ఉషా పనిచేస్తుంటుంది. క్రమంగా ఆమెను ఇష్టపడతాడు. అయితే ఉషాకు వేరొకరితో నిశ్చితార్థం జరుగుతుంది. అప్పుడు హనీ ఏం చేశాడు? ఉషా ప్రేమను పొందగలిగాడా?’ అన్నది స్టోరీ.
మా నాన్న సూపర్ హీరో (Maa Nanna Super Hero)
తెలుగు హీరో సుధీర్‌బాబు నటించిన లేటెస్ట్ చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో‘. అభిలాష్ రెడ్డి దర్శకుడు. అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. నవంబర్ 13 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్లాట్ ఏంటంటే ‘చిన్నప్పుడే తండ్రి (సాయిచంద్) జైలుకు వెళ్లడంతో జానీ (సుధీర్‌బాబు) అనాథగా మారతాడు. అతడ్ని స్టాక్ బ్రోకర్ శ్రీనివాస్ (షాయాజీ షిండే) దత్తత తీసుకుంటాడు. జానీ రాకతో శ్రీనివాస్ లైఫ్ తలకిందులై అప్పులపాలవుతాడు. దీంతో జానీపై శ్రీనివాస్ ద్వేషం పెంచుకుంటాడు. కానీ జానీ మాత్రం పెంపుడు తండ్రిపై ప్రేమను చూపిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రాజకీయ నాయకుడి వద్ద శ్రీనివాస్ పీకల్లోతు సమస్యలో చిక్కుకుంటాడు. అప్పుడు జానీ ఏం చేశాడు? తన తండ్రిని ఎలా రక్షించాడు? మరి సొంత తండ్రిని కలుసుకున్నాడా? లేదా?’ అన్నది స్టోరీ.
డెడ్‌పూల్ అండ్ వోల్వరైన్ (Deadpool & Wolverine)
హాలీవుడ్ నుంచి వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న డెడ్‌పూల్ అండ్ వోల్వరైన్ చిత్రం గతవారమే ఓటీటీలోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగు, హిందీ, తమిళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో వోల్వారిన్‌గా హ్యూగ్ జాక్‌మాన్ నటించగా, డెడ్‌పూల్‌గా ర్యాన్ రేనాల్డ్స్ చేశాడు. ప్లాట్ ఏంటంటే ‘డెడ్‌పూల్ అలియాస్ వేడ్ విల్సన్ కార్ల సేల్స్ మ్యాన్‌గా పని చేస్తూ సాధారణ జీవితం గడుపుతుంటాడు. ఓ రోజు అతడ్ని టైమ్ వేరియెన్స్ అథారిటీని నిర్వహించే పారాడాక్స్ మనుషులు ఎత్తుకెళ్తారు. ఎర్త్ 616కు తీసుకెళ్తారు. అక్కడకు వెళ్లిన డెడ్‌పూల్‌కు వాల్వెరైన్ సాయం అవసరం అవుతుంది. అసలు ఎర్త్ 616 అంటే ఏంటి? డెడ్‌పూల్‌ను ఎందుకు అక్కడికి తీసుకెళ్లారు? అక్కడ డెడ్‌పూల్ – వాల్వెరైన్ చేసిన సాహసాలు ఏంటి?’ అన్నది స్టోరీ.
త్వరలో ఓటీటీలోకి రానున్న చిత్రాలు, సిరీస్‌లు..
Title | Category | Language | Platform | Release Date |
Sandeham | Movie | Telugu | ETV Win | Nov 23 |
Vikatakavi | Series | Telugu | Zee 5 | Nov 28 |
Bloody Beggar | Movie | Telugu Dub | Amazon | Nov 29 |
Lucky Bhaskar | Movie | Telugu | Netflix | Nov 30 |
Amaran | Movie | Telugu Dub | Netflix | Dec 11 |
Squid Games S2 | Series | Telugu Dub | Netflix | Dec 26 |