Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది

    Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది

    November 21, 2024

    దిగ్గజ నటుడు వెంకటేష్‌ (Venkatesh) హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) రూపొందిస్తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam). ఇందులో వెంకీకి జోడీగా యంగ్‌ హీరోయిన్‌ మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary) నటిస్తోంది. ఐశ్వర్య రాజేష్‌ (Aishwarya Rajesh) కూడా రెండో హీరోయిన్‌గా అలరించనుంది. ఈ చిత్రానికి దిల్‌ రాజు సమర్పులు వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ఓ ప్రెస్‌ మీట్‌ నిర్వహించింది. ఈ క్రమంలో దర్శకుడు అనిల్‌ రావిపూడి షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.

    ‘తెలియక రియల్‌ గన్‌ గురిపెట్టా’

    ‘బీస్ట్’ సినిమాలో ‘ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావు’ అనే ఒక్క డైలాగ్‌తో తమిళ నటుడు వీటీవీ గణేష్‌ (VTV Ganesh) తెలుగు ప్రేక్షకుల అభిమాన యాక్టర్‌గా మారిపోయారు. ప్రస్తుతం వెంకటేష్‌ చేస్తోన్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) మూవీలోనూ ఆయన ఓ కీలక పాత్ర పోషించారు. తాజా ప్రెస్‌మీట్‌ నేపథ్యంలో దర్శకుడు అనిల్‌ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీటీవీ గణేష్‌తో సెట్‌లో జరిగిన ఇంట్రెస్టింగ్‌ ఘటనను పంచుకున్నారు. ‘గణేష్‌ గారు నీకు రియల్‌ గన్‌ తెలుసా? అంటూ ప్రశ్నించారు. అప్పుడు సెట్‌లో ఉన్న నరేష్‌ గారు తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్‌ గన్‌ తెప్పించారు. ఆ గన్‌ను గణేష్‌కు పాయింట్‌ బ్లాంక్‌లో గురి పెట్టగానే నరేష్‌ కంగారు పడ్డారు. వెంటనే గన్‌ నుంచి బుల్లెట్స్‌ తీశారు. అది జస్ట్‌ ఇలా టచ్‌ చేస్తే బుల్లెట్లు దూసుకు వస్తాయని నరేష్‌ చెప్పారు. ఆ చిన్న గన్ రియల్‌ గన్‌ అని తెలియక గణేష్‌ తలకు గురిపెట్టా. తృటిలో పెను ప్రమాదం తప్పింది. మీకు చాలా ఫ్యూచర్ ఉంది గనుకే ఆ రోజు తప్పించుకున్నారు’ అంటూ గణేష్‌ను ఉద్దేశించి చెప్పారు. ఇలాంటి ఫన్నీ ఘటనలు షూటింగ్‌లో చాలానే జరిగాయని అనిల్‌ రావిపూడి తెలిపారు. 

    ‘అప్పుడే పరిశ్రమ బాగుంటుంది’

    ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రెస్‌మీట్‌లో హీరో వెంకటేష్‌ (Venkatesh)కూడా మాట్లాడారు. సంక్రాంతికి రిలీజ్‌ చేయాలన్న లక్ష్యంతోనే ఈ సినిమా (Sankranthiki Vasthunnam)ను మెుదలుపెట్టినట్లు తెలిపారు. అనుకున్నట్లుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చెప్పారు. అభిమానులు, కుటుంబ ప్రేక్షకులకు తప్పకుండా ఈ సినిమా (సంక్రాంతికి వస్తున్నాం) నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు. పండగకి ఒక అద్భుతమైన సినిమా చూస్తారని ప్రేక్షకులకు చెప్పారు. ఈ సారి రామ్‌చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer), బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ (Daku Magaraj) కూడా విడుదలవుతున్నాయని, అవి కూడా మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. అప్పుడే సినీ పరిశ్రమ బాగుంటుందని వెంకటేష్‌ అభిప్రాయపడ్డారు. సీనియర్‌ నటుడు నరేష్‌ (Naresh) మాట్లాడుతూ ఇండియాలో ఎలాంటి క్యారెక్టర్ అయిన చేయగల యాక్టర్‌ వెంకటేష్ అని కొనియాడారు. 

    సంక్రాంతికి హ్యాట్రిక్‌ చిత్రాలు!

    2025 సంక్రాంతి నిర్మాత దిల్‌రాజు ఎంతో కీలకం కాబోతోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సహా ఆయన నుంచి ఏకంగా మూడు చిత్రాలు సంక్రాంతి బరిలో నిలవబోతున్నాయి. రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా తమిళ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ (Director Shankar) రూపొందిస్తున్న ‘గేమ్ ఛేంజర్‌’ (Game Changer)కు దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా 2025 జనవరి 10న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ కాబోతోంది. అలాగే బాలకృష్ణ హీరోగా దర్శకుడు బాబీ రూపొందిస్తున్న ‘డాకు మహారాజ్‌’ (Daku Maharaj) కూడా సంక్రాంతికే రానుంది. ఈ మూవీని కూడా తామే డిస్ట్రిబ్యూట్‌ చేయబోతున్నట్లు తాజా ప్రెస్‌మీట్‌లో దిల్‌రాజు తెలిపారు. ఈ మూడు చిత్రాలు పెద్ద విజయాలు సాధిస్తాయని దిల్‌రాజు ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో దర్శకుడు అనిల్‌ రావిపూడి గురించి ఫన్నీ కామెంట్స్‌ చేశారు. గేమ్‌ ఛేంజర్‌ నేపథ్యంలో సంక్రాంతికి ఎక్కడ సైడ్‌ చేస్తారోనని భావించి తెలివిగా ఈ సినిమాకు ‘సంక్రాంతి వస్తున్నాం’ అనే టైటిల్‌ను అనిల్‌ పెట్టారని వ్యాఖ్యానించారు. 

    70% థియేటర్లు దిల్‌రాజుకే!

    2025 సంక్రాంతికి రెండు చిత్రాలను నేరుగా రిలీజ్‌ చేస్తుండటంతో పాటు మరో సినిమా థియేట్రికల్‌ హక్కులను దక్కించుకోవడంతో దిల్‌రాజుకు థియేటర్లు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటి నుంచే దిల్‌రాజు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లతో సంప్రదింపులు జరిపి తమ చిత్రాన్ని థియేటర్లో ప్రసారం చేసేలా ఆయన అడుగులు వేస్తున్నట్లు ఫిల్మ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సంక్రాంతి నేపథ్యంలో ఇప్పటికే 70 శాతం థియేటర్లు దిల్‌రాజు ఖాతాలోకి వెళ్లిపోయాయని స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. మిగిలిన చిత్రాలు రీమైనింగ్ 30 శాతం థియేటర్లతో సర్దుకోవాల్సి ఉంటుందనిఅంటున్నారు. ప్రస్తుతానికి ఇది ప్రచారమే అయినప్పటికీ త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version