యంగ్ బ్యూటీ కీర్తి సురేష్ (Keerthy Suresh) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ప్రియుడు ఆంటోని తట్టిల్ (Antony Thattil)ను గోవాలో పెళ్లి చేసుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆంటోనిగురించి తెలుసుకునేందుకు ఫ్యాన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంటోని తట్టిల్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఆంటోని తట్టిల్ (Antony Thattil) కేరళలోని కొచ్చిలో 1989లో జన్మించాడు. విద్యాబ్యాసం అంతా కొచ్చి, తమిళనాడులోని చెన్నైలో జరిగింది.
ప్రస్తుతం దుబాయ్ కేంద్రంగా పనిచేసే యంగ్ బిజినెస్ మ్యాన్‌గా ఆంటోని రాణిస్తున్నారు. చెన్నై కేంద్రంగా రెండు కంపెనీలను స్థాపించారు.
తొలుత ‘ఎస్పిరోస్ విండో సొల్యూషన్స్ ఎల్‌ఎల్‌పీ’ (Asperos Window Solutions LLP) కంపెనీని చెన్నైలో స్థాపించారు. దానిని దుబాయ్‌కు విస్తరించి అక్కడ కేంద్రంగా పని చేస్తున్నారు.
ఆ తర్వాత కైపాలత్ హబీబ్ ఫారుఖీ అనే బిజినెస్ మెన్‌తో కలిసి మరో కంపెనీని చెన్నైలో రిజిస్టర్ చేశారు. వారితో పాటు మరో ముగ్గురు కంపెనీలో షేర్ హోల్డర్స్‌గా ఉన్నారు.
ఈ రెండు కంపెనీలతో పాటు ఆంటోనీకి పలు రిసార్ట్స్ కూడా ఉన్నాయి. హోమ్ టౌన్ కొచ్చిలో వాటి ద్వారా వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.
ప్రముఖ నటి కీర్తికి 15 ఏళ్లు ఉన్నప్పటి నుంచే అంటోనితో పరిచయం ఉంది. వీరి పరిచయం నాటికి కీర్తి హైస్కూల్లో ఉండగా ఆంటోని డిగ్రీ చదువుతున్నాడు.
కీర్తి బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి రాణిస్తుండగా ఆంటోని ఆమెతో రిలేషన్‌ను కొనసాగిస్తూనే చదువుపై ఫోకస్ పెట్టాడు.
మంచి ఎంటర్‌ప్రెన్యూర్ కావాలని ఆంటోని (Antony Thattil) చిన్నప్పటి నుంచి కలలు కనేవారు. తన లక్ష్యానికి కీర్తితో ఉన్న రిలేషన్ అడ్డురాకుండా రెండింటిని చక్కగా బ్యాలెన్స్ చేసుకున్నారు.
ఫలితంగా అటు బిజినెస్, ఇటు లవ్ లైఫ్‌లోనూ సక్సెస్ అయ్యి ప్రస్తుత యువతకు ఆంటోని ఎంతో ప్రేరణగా నిలస్తున్నారు.
డిసెంబర్ 11, 12 తేదీల్లో గోవాలో వీళ్ల పెళ్లి (Keerthy Suresh Marriage) జరగనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. పెళ్లి పనులు కూడా మెుదలైనట్లు సమాచారం.
అంటోనీ (Antony Thattil)కి తమ కూతుర్ని ఇచ్చేందుకు కీర్తి తల్లిదండ్రులు సురేశ్, మేనక ఎంతో సంతృప్తిగా ఉన్నారట. వీరి పెళ్లికి బంధుమిత్రులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవుతారట.
ఇదిలా ఉంటే ఇటీవల తన పెళ్లి (Keerthy Suresh Marriage) గురించి కీర్తి సురేష్ స్పందించింది. పెళ్లి ఎప్పుడని ఆంగ్ల పత్రిక ప్రశ్నించగా సరైన సమయం వచ్చినప్పుడు చెప్తా అంటూ బదులిచ్చింది.
గతేడాది కూడా అంటోనితో ఉన్న రిలేషన్ గురించి పరోక్షంగా కీర్తి హింట్ ఇచ్చింది. సరైన సమయం వచ్చిన మిస్టరీ మ్యాన్‌ను బయటపెడతానంటు చెప్పుకొచ్చింది.
2013లో గీతాంజలి అనే మలయాళం మూవీ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కీర్తి సురేశ్. ‘నేను శైలజా’ చిత్రంతో తెలుగు ఆడియన్స్‌ను పలకరించి ఇంప్రెస్ చేసింది.
తెలుగులో చేసిన ‘మహానటి’ చిత్రం కీర్తి సురేష్ లైఫ్‌కు టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు అందుకుంది.
ఈ ఏడాది ఇప్పటికే ‘సైరన్’, ‘రఘుతాత’తో అలరించిన కీర్తి ‘రివాల్వర్ రీటా’, ‘కన్నివేడి’, ‘ఉప్పు కప్పురంబు’తో బిజీగా ఉన్నారు. ‘బేబీ జాన్’ (Baby John)తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.