చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ అయిన తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఇప్పుడు సూర్యుడిపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఆదిత్య ఎల్1 మిషన్ (Aditya L1 Mission) సెప్టెంబర్ 2న లాంచ్ చేయనుంది. ఆ రోజు ఉదయం 11.50 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. అయితే భారత్ చేపట్టిన తొలి సోలార్ మిషన్ ఇదే కావడంతో యావత్ దేశం దృష్టి దీనిపై నెలకొంది. ఈ నేపథ్యంలో Aditya L1 Mission ముఖ్య ఉద్దేశ్యం, బడ్జెట్, ప్రత్యేకతలు వంటి అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.
15 లక్షల కి.మీ ప్రయాణం
ఆదిత్య ఎల్-1 మిషన్‌ను ఇస్రో సూర్యుడి పైకి పంపదు. కానీ, దీన్ని లాగ్రేంజ్ ఎల్-1 అనే పాయింట్ వద్దకు పంపిస్తారు. ఈ పాయింట్ భూమికి 15 లక్షల కిలో మీటర్ల దూరంలో ఉంది. అక్కడ సూర్యుడు, భూగ్రహానికి మధ్య ఉండే గురుత్వాకర్షణ శక్తులు సమానంగా ఉంటాయి. కాబట్టి అక్కడ ఒక శాటిలైట్‌ను తక్కువ ఇంధన ఖర్చుతో ఎక్కువ కాలం ఆపరేట్ చేయవచ్చు. అంటే తక్కువ ఖర్చుతో మనం దాన్ని మూవ్ చేయవచ్చు.
అదే ఎందుకంటే?
ఎల్-1 పాయింట్‌నే ఈ మిషన్‌కు ఎంచుకోవడానికి మరో కారణం కూడా ఉంది. ఇక్కడ నుంచి సూర్యుడ్ని ఎలాంటి అవాంతరాలు లేకుండా పరిశోధించడానికి వీలు ఏర్పడుతుంది. అంటే సూర్యగ్రహణం, ఇతర గ్రహాల వల్ల సూర్యుడిని తాత్కాలికంగా చూడలేని పరిస్థితులు ఈ పాయింట్ వద్ద ఉండవు.
ఏడు పేలోడ్లు
ఆదిత్య-ఎల్ 1 (Aditya-L1) మొత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్లనుంది. ఇందులో ప్రధానమైన ‘విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ (వీఈఎల్‌సీ)తో పాటు సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పెరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, సోలార్ లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, హైఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, మాగ్నెటోమీటర్ పేలోడ్‌లు ఉన్నాయి.
ఆ రహస్యాలపై ఫోకస్!
ఈ పేలోడ్ల ద్వారా సూర్యగోళంలో అపార వేడిమిని రగిల్చే సోలార్ కరోనా మెకానిజం, సోలార్ విండ్, సూర్యుడి అయస్కాంత క్షేత్రం గురించి అర్థం చేసుకోనున్నారు. వీటికితోడు సూర్యుడి రేడియేషన్ భూ ఆవరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? రోదసిలో దాని ప్రభావం ఎలా ఉంటుంది? వంటి అంశాలపైనా పరిశోధనలు చేయడానికి ఈ మిషన్ ఉపకరించనుంది.
బడ్జెట్ ఎంతంటే?
ఆదిత్య L1 మిషన్‌ను ఇస్రో 2019 డిసెంబర్‌లో చేపట్టింది. అప్పటినుంచి ఈ సోలార్ మిషన్ కోసం నిర్విరామంగా కృషి చేస్తోంది. ఈ మిషన్ కోసం ఇస్రో దాదాపు రూ. 400 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!