అక్కినేని కుటుంబంలో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. పెళ్లి ఏర్పాట్లు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. కొన్నిరోజుల క్రితం శోభిత ధూళిపాళ్ల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోతో ఈ శుభకార్యం గురించి క్లారిటీ వచ్చింది. తాజాగా, పెళ్లి ఆహ్వాన పత్రికలు పంపిణీ చేయడం కూడా స్టార్ట్ అయింది. ఈ క్రమంలో అమ్మాయి తరఫు నుంచి పంపిన పెళ్లి ఆహ్వాన పత్రిక ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది. మరి ఆ పత్రికలో ఎలాంటి వివరాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
వైరల్ అవుతున్న పెళ్లి కార్డ్
పెళ్లి ఆహ్వాన పత్రికలో నాగచైతన్య-శోభితల వివాహం డిసెంబరు 4న జరగనుందని తెలిపారు. ఆహ్వానం అందించిన వాళ్లు ఈ శుభకార్యానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. అయితే ఈ పెళ్లి పత్రిక కేవలం సాధారణ కార్డ్ మాత్రమే కాదు. ఒక ప్రత్యేకమైన వెదురు బుట్టలో చీర, పసుపు కుంకుమ, వెండి వస్తువులను ఉంచి వెడ్డింక్ కార్డు అందించడం ప్రత్యేకతగా నిలిచింది. ఇది చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సాంప్రదాయానికి అక్కినేని కుటుంబం పెద్ద పీట వేసిందని కామెంట్ చేస్తున్నారు.
తల్లిదండ్రులుగా లక్ష్మీ, శరత్ విద్యారాఘవన్
మరోవైపు పెళ్లి ఆహ్వాన పత్రికలో నాగచైతన్య తల్లిదండ్రుల స్థానంలో నాగార్జున– అమలతో పాటు, శరత్ విద్యారాఘవన్, లక్ష్మీ పేర్లు కనిపించడం విశేషం. నాగ చైతన్య తల్లి లక్ష్మీ నాగార్జునతో విడిపోయాక శరత్ రాఘవన్ను రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. శుభలేఖలో శరత్ విద్యారాఘవన్, లక్ష్మీ పేర్లు పెట్టడం పట్ల అభిమానులు నాగార్జునపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
వేదిక మాత్రం రహస్యమే
పెళ్లి పత్రికలో వివాహ తేదీగా డిసెంబరు 4ను పేర్కొన్నప్పటికీ, వేదిక గురించి మాత్రం ఎలాంటి వివరాలు అందించలేదు. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం, ఈ పెళ్లి అక్కినేని కుటుంబానికి సొంతమైన అన్నపూర్ణ స్టూడియోలోనే ప్రత్యేకంగా నిర్మించిన మండపంలో జరగనుందని తెలుస్తోంది. ఈ వేడుక కోసం సిద్ధమైన ఏర్పాట్లు త్వరలోనే పూర్తికానున్నాయి. ఇప్పటికే శుభలేఖలు టాలీవుడ్, బాలీవుడ్ సెలెబ్రెటీలతో పాటు.. రాజకీయ ప్రముఖులకు కూడా చేరినట్లు సమాచారం.
పెళ్లి పనుల్లో నడుమ నిమగ్నమైన కుటుంబాలు
అప్పుడే శోభిత తరఫు నుంచి పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. అబ్బాయి కుటుంబం నుంచి కూడా మరో రెండు మూడు రోజుల్లో ఏర్పాట్లు ప్రారంభమవుతాయని సమాచారం. ఇద్దరు కుటుంబాలు పెద్ద ఎత్తున ఈ శుభకార్యాన్ని ఘనంగా నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నాయి.
అక్కినేని అభిమానుల్లో ఆనందం
ఈ శుభకార్యం అక్కినేని అభిమానులకు ఆనందం కలిగించడంతో, పెళ్లికి సంబంధించిన ప్రతి అప్డేట్ను ఆసక్తిగా గమనిస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఈ పెళ్లి వేడుకలో పాల్గొనే అవకాశం ఉంది.
అక్కినేని నాగచైతన్య-శోభిత వివాహం పెళ్లి సీజన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మరి ఈ వేడుక ఎలాంటి జ్ఞాపకాలను అందిస్తుందో చూడాలి!
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!