AUTOMOBILE ROUNDUP: Hyundai EXTER, HERO Xtreme 200S, MARUTI SUZUKI Fronx, KTM Duke…ధరలు, మార్కెట్‌లోకి రాబోతున్న వాహనాలివే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • AUTOMOBILE ROUNDUP: Hyundai EXTER, HERO Xtreme 200S, MARUTI SUZUKI Fronx, KTM Duke…ధరలు, మార్కెట్‌లోకి రాబోతున్న వాహనాలివే!

    AUTOMOBILE ROUNDUP: Hyundai EXTER, HERO Xtreme 200S, MARUTI SUZUKI Fronx, KTM Duke…ధరలు, మార్కెట్‌లోకి రాబోతున్న వాహనాలివే!

    April 25, 2023

    ఆటో మెుబైల్ రంగం నుంచి మార్కెట్‌లోకి సరికొత్త మోడల్స్ విడుదలవుతున్నాయి. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా కార్లు, ద్విచక్ర వాహనాలు వచ్చాయి. మరికొన్ని వచ్చేందుకు సిద్దంగా ఉన్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం మార్కెట్‌లో హల్‌చల్‌ చేస్తున్న వాహనాలు ఏంటో ఓ లుక్కేయండి. 

    Hyundai EXTER

    మైక్రో SUV సెగ్మెంట్‌లో హుందాయ్‌ నుంచి ఎక్స్టర్‌ కారు రాబోతుంది. ఇందుకు సంబంధించి స్కెచ్ డిజైన్‌ను విడుదల చేశారు. బాక్స్‌ షేప్‌లో స్క్వేర్ మోడల్‌లో కారు ఉంది.  ఇందులో పెద్ద టచ్‌ స్క్రీన్‌తో పాటు సన్‌ రూఫ్‌, వైర్‌లెస్‌ ఫోన్‌ ఛార్జర్‌ ఉండనున్నాయి. ధర రూ. 6 లక్షల నుంచి ప్రారంభమవుతుందని అంచనా. సెఫ్టీకి సంబంధించి 6 ఎయిర్‌ బ్యాగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. టాటా పంచ్‌కు ఇది గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.

    KTM 890 SMT

    కేటీఎంలో SMT సిరీస్‌ కమ్‌ బ్యాక్ ఇస్తోంది. KTM 890 పేరుతో వస్తున్న ఈ బైక్‌ వెడల్పైన హ్యాండిల్స్‌, అత్యంత దూరం ప్రయాణించేలా సస్పెన్షన్స్‌, స్పోర్ట్‌ లుక్‌లో మోడల్ రిలీజ్ చేస్తున్నారు. ముందు భాగంలో 19-21 ఇంచుల టైర్‌ బదులు రెండువైపులా 17 ఇంచుల వీల్స్‌ అమర్చారు. దీనివల్ల లుక్‌ మారిపోయింది. ఇందులో స్ట్రీట్, స్పోర్ట్, రెయిన్‌ అనే మూడు రైడ్‌ మోడ్స్‌ ఉన్నాయి.  889సీసీ ఇంజిన్‌తో పాటు 106PS పవర్‌, 100NM టార్క్‌తో రూపొందించారు.

    Xtreme 200S

    హీరోలోని Xtreme 200S నుంచి సరికొత్త కలర్‌లో బైక్‌ రానుంది. హరో సూపర్‌ హిట్‌ మోడల్ కరిష్మా మాదిరిగా  యెల్లో షేడ్‌లో వస్తున్న ఈ బైక్‌ ఓ ఈవెంట్‌లో కనిపించింది. ఎక్స్‌ పల్స్‌ మాదిరిగా 199.6 సీసీ ఇంజిన్‌ ఉండగా.. 19.1PS పవర్‌, 17.35nM టార్క్‌ కలిగి ఉంటుంది. డిజైన్‌లో ఎలాంటి మార్పులు లేవు కానీ, స్పోర్ట్స్‌ లుక్‌లో యెల్లో షేడ్‌లో వస్తుంది ఈ బైక్‌. గతంలోని మోడల్‌తో పోలిస్తే రూ. 4 నుంచి 5 వేలు ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే మార్కెట్ ధర రూ. 1,35,360. 

    రేంజ్‌ రోవర్‌ SV

    రేంజ్‌ రోవర్‌ నుంచి వచ్చిన మరో SUV ఇది.ఇందులో కొన్ని సాంకేతికలను మెుదటిసారి ఉపయోగించారు. 4.4 లీటర్‌ ట్విన్‌ టర్బో V8 ఇంజిన్‌ను ఉపయోగించారు. ప్రపంచవ్యాప్తంగా మే 31న మోడల్ బయటకు వస్తుంది. ఎప్పుడు లాంఛ్ చేస్తారనే విషయాన్ని అప్పుడే చెబుతారు. భారత్‌లో బహుశా 2024 చివరి కల్లా అందుబాటులోకి రావచ్చు. ఈ స్పోర్ట్‌ SV మోడల్‌లో 29 స్పీకర్‌ మెరిడియన్ సౌండ్ సిస్టమ్‌, 3D వ్యూ కెమెరా, సన్‌ రూఫ్, నాయిస్‌ క్యాన్సిలేషన్, దీని ధర రూ. 1.64 కోట్ల నుంచి రూ. 1.84 కోట్లుగా ఉండవచ్చు. 

    RE బాబర్‌

    రాయల్‌ ఎన్‌ ఫీల్డ్‌ 650ccను పోలి ఉండే నాలుగో బైక్‌ రూపుదిద్దుకుంటుంది. ఇందుకు సంబంధించిన మోడల్‌ను బోబర్‌ తయారు చేసింది. 648cc ప్యార్లెల్‌ ఇంజిన్‌ 47.5 హార్స్‌ పవర్‌, 52.3NM టార్క్ కలిగి ఉంటుంది. 320mm ఫ్రంట్‌, 300mm రేర్ డిస్క్‌ సౌకర్యం ఇచ్చారు. డ్యూయల్‌ షాక్స్‌తో సస్పెన్షన్‌ అదిరిపోయేలా ఉంది. ఈ సంవత్సరంలోనే మార్కెట్‌లోకి వస్తుంది. ధర దాదాపు రూ. 3.15 లక్షలు ఉంటుందని అంచనా. సింగిల్‌ సీట్‌ బాబర్‌ మోడల్ అయినా వెనక సీటు యాక్సెసరీ కింద ఇచ్చే అవకాశముంది. 

    మారుతి సుజుకీ Fronx

    మారుతి సుజుకీ నుంచి రాబోతున్న Fronx కారు ధరలను ప్రకటించింది. రూ.7.46 లక్షల నుంచి రూ. 13.13 లక్షల మధ్య ఉండనున్నాయి. సిగ్మా, డెల్టా, డెల్టా+, జెటా, ఆల్ఫా అనే ఐదు ట్రిమ్స్‌లో అందుబాటులోకి వస్తుంది. 9 ఇంచ్ టచ్ స్క్రీన్‌, 360 డిగ్రీ కెమెరా, ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌ ఇస్తున్నారు. ఆటో ఎక్స్‌పో 2023లో దీన్ని లుక్ రిలీజ్ చేశారు. ప్రీ బుకింగ్స్‌ ఇప్పటికే మెుదలయ్యాయి. మారుతి సుజుకీలోనే ఏదైనా కారు కొనాలంటే Fronx ని కళ్లుమూసుకొని ఎంచుకోవచ్చు. 

    KTM 390 DUKE

    సరికొత్త స్పై షాట్‌ KTM 390 బైక్ నెట్టింట్లు చక్కర్లు కొడుతోంది. తయారీ దశలో ఉన్న ఇలాంటి బైక్ లుక్ బయటకు రావటం ఇదే తొలిసారి. ఇందులో అడ్జస్టబుల్‌ USD FORK సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. భారత్‌లో రిలీజ్‌ అయ్యే మోడల్‌కి కూడా ఈ సౌలభ్యం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2023 చివరికల్లా మార్కెట్‌లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version