Chandrayaan 4: చంద్రయాన్‌-3 సూపర్‌ సక్సెస్‌.. మరి ‘4’ ఏ రేంజ్‌లో ఉండనుందో తెలుసా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Chandrayaan 4: చంద్రయాన్‌-3 సూపర్‌ సక్సెస్‌.. మరి ‘4’ ఏ రేంజ్‌లో ఉండనుందో తెలుసా?

    Chandrayaan 4: చంద్రయాన్‌-3 సూపర్‌ సక్సెస్‌.. మరి ‘4’ ఏ రేంజ్‌లో ఉండనుందో తెలుసా?

    August 28, 2023

    భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేపట్టిన చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైంది. దీంతో ప్రపంచం నలుమూలల నుంచి భారత్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై భారత్‌ తొలిసారి ప్రజ్ఞాన్ రోవర్‌ను దించింది. దీంతో ఆ ప్రాంతంలో నీటి జాడకు సంబంధించిన సమాచారంతో పాటు జాబిల్లి రహస్యాల ఛేదించే ఛాన్స్‌ ఏర్పడింది. చంద్రయాన్‌-3 (Chandrayaan 3) సక్సెస్‌తో ప్రస్తుతం అందరి దృష్టి చంద్రయాన్‌ 4 (Chandrayaan 4)పై పడింది. మరి ఈ ప్రయోగం ఎలా జరగనుంది. ఆ మిషన్‌ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

    జపాన్‌ భాగస్వామ్యంతో..

    చంద్రయాన్‌ 4 ప్రయోగం 2026లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మిషన్‌లో జపాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ (JAXA) కూడా ఇస్రోతో కలిసి పాలుపంచుకుంటుందని సమాచారం. ఈ కొత్త ప్రాజెక్టును ల్యూనార్ పోలార్ ఎక్స్‌ప్లొరేషన్ మిషన్- ల్యూపెక్స్‌ (LUPEX) అని పిలుస్తారని అంటున్నారు. ఈ ప్రయోగం జపాన్‌కు చెందిన హెచ్3 రాకెట్ ద్వారా సాగనుందని తెలిసింది. 

    ఆ ప్రశ్నలకు ల్యూపెక్స్‌తో చెక్‌.!

    చంద్రయాన్‌-3 ద్వారా పంపిన ప్రజ్ఞాన్ రోవర్ జాబిల్లిపై నీటి జాడను మాత్రమే అన్వేషిస్తుంది. అయితే ఆ నీరు తాగడానికి అనువుగా ఉన్నాయా? లేదా? అని అది పరీక్షించలేదు. కాబట్టి చంద్రయాన్‌ 4 ద్వారా ఆ ప్రశ్నలకు చెక్‌ పెట్టనున్నారు శాస్త్రవేత్తలు. చందమామపై ఉన్న నీటి నాణ్యత ఎలా ఉంది? ఎంత నీరు ఉంది? మెుక్కల పెరుగుదలకు అనువుగా ఉందా? అనే ప్రధాన ప్రశ్నలకు ల్యూపెక్స్ మిషన్ సమాధానం వెతుకుతుంది.

    జపాన్‌ అండతో బెటర్‌ ఔట్‌పుట్‌..!

    చంద్రయాన్‌ 4 మిషన్‌ ద్వారా జాబిల్లిపై మనుషులు జీవించేందుకు అవకాశం ఉంటుందా? లేదా? అనేది కూడా తెలుసుకోనున్నారు. ఇందులో ఇస్రోకు జపాన్‌ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడనుంది. ఎందుకంటే టెక్నాలజీ విషయంలో జపాన్‌కి తిరుగులేదు. అలాంటి జపాన్ శాస్త్రవేత్తలు, ఇస్రోతో కలిస్తే బెటర్ ఔట్‌పుట్‌ రానుంది. చంద్రయాన్-4 భారీ సక్సెస్‌ అయ్యే ఛాన్స్ ఉంది.

    ఇస్రో టార్గెట్ అదే..!

    జాబిల్లిపై మానవళి అడుగు పెట్టేందుకు వీలుగా సానుకూల ఫలితాలు వస్తే ఇక ఇస్రో పూర్తిస్థాయిలో దానిపై ఫోకస్‌ పెట్టనుంది. దక్షిణ ధృవంలో కాలనీలను నిర్మించడం ఇస్రో నెక్ట్స్ టార్గెట్ కావొచ్చని అంటున్నారు. అప్పుడు ఇండియాతో పాటు అమెరికా, చైనా, తదితర దేశాలు కూడా పోటీగా వస్తాయని నిపుణులు భావిస్తున్నారు. తద్వారా చందమామను రెండో ఇల్లుగా ఆయా దేశాలు మార్చుకుంటాయని అభిప్రాయపడుతున్నారు. 

    ఆందోళనలో పర్యావరణ వేత్తలు

    ప్రస్తుతం ప్రపంచ దేశాల ఆశలన్నీ చందమామపైనే ఉన్నాయి. కానీ పర్యావరణ వేత్తలు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూమి నాశనం చేస్తున్నట్లు చందమామను కూడా చేయాలా? అని ప్రశ్నిస్తున్నారు. మనుషులు ఎక్కడ అడుగుపెడితే అక్కడ విధ్వంసం తప్ప, మంచి ఉండదని విమర్శిస్తున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version