FILMFARE AWARDS 2022: ఇటు మాస్.. అటు క్లాస్.. దక్షిణాది చిత్రాలకు అవార్డుల నీరాజనం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • FILMFARE AWARDS 2022: ఇటు మాస్.. అటు క్లాస్.. దక్షిణాది చిత్రాలకు అవార్డుల నీరాజనం

    FILMFARE AWARDS 2022: ఇటు మాస్.. అటు క్లాస్.. దక్షిణాది చిత్రాలకు అవార్డుల నీరాజనం

    October 10, 2022

    67వ ఫిల్మ్‌ఫేర్ వేడుకలు బెంగుళూరులో ఘనంగా జరిగాయి. 2020, 2021కి గాను జ్యూరీ సభ్యులు ఈ అవార్డులను ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాల భాషల్లో అలరించిన సినిమాలకు, తారలకు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాన్ని అందజేశారు. ఇందులో తెలుగు నుంచి ‘పుష్ప’, తమిళ్‌ నుంచి ‘సూరారై పొట్రు’, మళయాలం నుంచి ‘అయ్యప్పనుమ్ కొషియమ్’, కన్నడ నుంచి ‘యాక్ట్ 1978’ సినిమాలు అత్యధిక విభాగాల్లో అవార్డులను గెలుచుకున్నాయి. దక్షిణాది సినిమా ప్రేక్షకులకు ఈ అవార్డుల ప్రదానోత్సవం ఓ కన్నుల పండుగగా నిలిచింది. October 16న తమిళ, కన్నడ భాషల్లో; తెలుగు, మళయాలంలో October 23న ‘జీ’ ఛానెళ్లలో ఈ వేడుక ప్రసారం కానుంది. 

    తెలుగులో బన్నీ సినిమాలదే హవా..

    తెలుగులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’, ‘అల వైకుంఠపురంలో’ సినిమాలదే హవా నడిచింది. ఈ రెండు సినిమాలు కలిపి 10 అవార్డులను సొంతం చేసుకున్నాయి. ‘పుష్ప’ తగ్గేదెలే అంటూ ఏకంగా 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సొంతం చేసుకుంది.  ఉత్తమ చిత్రం, ఉత్తమ డైరెక్టర్(సుకుమార్), ఉత్తమ నటుడు(అల్లు అర్జున్), ఉత్తమ సినిమాటోగ్రఫర్(మిరొస్లో బ్రొజెక్), ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్(దేవీశ్రీ ప్రసాద్), ఉత్తమ గాయకుడు(సిద్ శ్రీరాం), ఉత్తమ గాయని(ఇంద్రావతి చౌహాన్) విభాగాల్లో అవార్డులను గెల్చుకుంది. 2021లో విడుదలైన పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ముఖ్యంగా తగ్గేదెలే డైలాగు, ‘ఊ అంటావా మామ’ పాట జనాల్లో నాటుకుపోయింది. ‘అలవైకుంఠపురంలో’ చిత్రం మూడు అవార్డులను గెల్చుకుంది. ఉత్తమ సహాయ నటుడు(మురళిశర్మ), ఉత్తమ సహాయ నటి(టబు), ఉత్తమ డ్యాన్స్ కొరియోగ్రఫర్(శేఖర్ మాస్టర్) అవార్డులను గెల్చుకున్నారు.

    శ్యాంసింగరాయ్ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది. ఈ విభాగంలో ఉత్తమ నటుడిగా నేచురల్ స్టార్ ‘నాని’, నటిగా సాయిపల్లవి గౌరవం దక్కించుకున్నారు.  అటు డెబ్యూ విభాగంలో ‘ఉప్పెన’ రెండు అవార్డులను బుట్టలో వేసుకుంది. ఉత్తమ హీరోగా పంజా వైష్ణవ్ తేజ్, హీరోయిన్‌గా ‘కృతి శెట్టి’లను పురస్కారం వరించింది. ఉత్తమ గేయ రచయితగా దివంగత ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’ని మరోసారి గౌరవించింది. జాను సినిమాను ఈ విభాగానికి జ్యురీ ఎంపిక చేసింది. 

    సాయిపల్లవికి రెండు అవార్డులు

    తన డ్యాన్స్, అభినయంతో యువతను ఉర్రూతలూగించిన ‘సాయిపల్లవి’ అవార్డుల్లోనూ సత్తాచాటింది. రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సొంతం చేసుకుని అరుదైన ఘనత సాధించింది. పాపులర్, క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ హీరోయిన్‌గా నిలిచింది. పాపులర్ విభాగం కింద ‘లవ్‌స్టోరీ’ సినిమాను ఎంపిక చేయగా.. ‘శ్యాంసింగరాయ్’ సినిమాలో ‘రోసీ’ పాత్రకు గాను క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటిగా మన్ననలు పొందింది. అటు ‘లవ్‌స్టోరీ’ సినిమాలోనూ ‘మౌనీ’గా ఈ లేడీ పవర్‌స్టార్ మెప్పించింది.

    ఏయే సినిమాకు.. ఏయే అవార్డులు..!

    ఉత్తమ చిత్రం : పుష్ప

    ఉత్తమ దర్శకుడు : సుకుమార్(పుష్ప)

    ఉత్తమ నటుడు : అల్లు అర్జున్(పుష్ప)

    ఉత్తమ నటి : సాయిపల్లవి(లవ్‌స్టోరీ)

    ఉత్తమ నటుడు(క్రిటిక్స్): నాని(శ్యాంసింగరాయ్)

    ఉత్తమ నటి(క్రిటిక్స్) : సాయిపల్లవి(శ్యాంసింగరాయ్)

    ఉత్తమ సహాయనటుడు: మురళీశర్మ(అలవైకుంఠపురంలో)

    ఉత్తమ సహాయనటి : టబు(అలవైకుంఠపురంలో)

    ఉత్తమ సంగీత దర్శకుడు: దేవీశ్రీప్రసాద్(పుష్ప)

    ఉత్తమ గేయ రచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి(జాను)

    ఉత్తమ గాయకుడు : సిద్ శ్రీరామ్(పుష్ప)

    ఉత్తమ గాయని : ఇంద్రావతి చౌహాన్(పుష్ప)

    ఉత్తమ సినిమాటోగ్రఫర్: మిరోస్లా బ్రొజెక్(పుష్ప)

    ఉత్తమ నటుడు(డెబ్యూ): పంజా వైష్ణవ్ తేజ్(ఉప్పెన)

    ఉత్తమ నటి(డెబ్యూ) : కృతి శెట్టి(ఉప్పెన)

    ఉత్తమ డ్యాన్స్ కొరియోగ్రఫర్: శేఖర్ మాస్టర్(అల వైకుంఠపురంలో)

    Tamil

    ఉత్తమ చిత్రం : సూరారై పొట్రు

    ఉత్తమ దర్శకుడు : సుధా కొంగర(సూరారై పొట్రు)

    ఉత్తమ నటుడు : సూర్య(సూరారై పొట్రు)

    ఉత్తమ నటి : లిజోమోల్ జోస్(జై భీమ్)

    ఉత్తమ సహాయనటుడు: పశుపతి(సర్పట్ట పరంపరై)

    ఉత్తమ సహాయనటి : ఊర్వశి(సూరారై పొట్రు)

    ఉత్తమ సంగీత దర్శకుడు: జీవీ ప్రకాశ్ కుమార్(సురారై పొట్రు)

    ఉత్తమ గాయకుడు : క్రిస్టిన్ జోస్, గోవింద్(సూరారై పొట్రు)

    ఉత్తమ గాయని : దీ(సూరారై పొట్రు)

    ఉత్తమ సినిమాటోగ్రఫర్: నికేత్ బొమ్మిరెడ్డి(సూరారై పొట్రు)

    ఉత్తమ డ్యాన్స్ కొరియోగ్రఫర్: దినేశ్ కుమార్(మాస్టర్)

    Kannada

    ఉత్తమ చిత్రం : యాక్ట్ 1978

    ఉత్తమ దర్శకుడు : రాజ్ బి శెట్టి(గరుడ గమన వృషభ వాహన)

    ఉత్తమ నటుడు : ధనంజయ్(బడవ రాస్కెల్)

    ఉత్తమ నటి : యజ్ఞ శెట్టి (యాక్ట్ 1978)

    ఉత్తమ సహాయనటుడు: సురేశ(యాక్ట్ 1978)

    ఉత్తమ సహాయనటి : ఉమశ్రీ(రత్నన్ ప్రపంచ)

    ఉత్తమ సంగీత దర్శకుడు: వాసుకి వైభవ్(బడవ రాస్కెల్)

    ఉత్తమ గేయ రచయిత: జయంతి కైకిని(యాక్ట్ 1978)

    ఉత్తమ గాయకుడు : రఘు దీక్షిత్(నిన్న సనిహకే)

    ఉత్తమ గాయని : అనురాధ భట్(బిచ్చుగట్టి)

    ఉత్తమ సినిమాటోగ్రఫర్: శ్రీషా కుడువల్లి(రత్నన్ ప్రపంచ)

    ఉత్తమ డ్యాన్స్ కొరియోగ్రఫర్: జానీ మాస్టర్(యువరత్న)

    Malayalam

    ఉత్తమ చిత్రం : అయ్యప్పనుమ్ కొషియమ్

    ఉత్తమ దర్శకుడు : సెన్నా హెగ్దే(తింకలజ్చా నిశ్చయం)

    ఉత్తమ నటుడు : బిజు మేనన్(అయ్యప్పనుమ్ కొషియమ్)

    ఉత్తమ నటి : నిమిషా సజయాన్ (ద గ్రేట్ ఇండియన్ కిచెన్)

    ఉత్తమ సహాయనటుడు: జోజు జార్జ్(నయట్టు)

    ఉత్తమ సహాయనటి : గౌరీ నందా(అయ్యప్పనుమ్ కొషియమ్)

    ఉత్తమ సంగీత దర్శకుడు: ఎం.జయచంద్రన్(సుఫియం సుజాతయుమ్)

    ఉత్తమ గేయ రచయిత: రఫీక్ అహ్మద్(అయ్యప్పనుమ్ కొషియమ్)

    ఉత్తమ గాయకుడు : షెహబాజ్ అమన్(వేళ్లం)

    ఉత్తమ గాయని : కేఎస్ చిత్ర(మాలిక్)

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version