సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఆగస్ట్ 9న పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా పోకిరి, ఒక్కడు సినిమాలు స్పెషల్ షోలు వేస్తున్న సంగతి తెలిసిందే. విదేశాల్లో పోకిరీ స్పెషల్ షోస్‌కి భారీ క్రేజ్ ఏర్పడింది. దీంతో లొకేషన్లను కూడా పెంచుతున్నారు. ఇప్పటికే స్పెషల్ షో ప్రీ-బుకింగ్ కలెక్షన్లలో కొత్త రికార్డును క్రియేట్ చేసింది. పోకిరికి పోటీగా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఒక్కడు సినిమా ప్రత్యేక షోలు నిర్వహించారు. థియేటర్లలో ఫ్యాన్స్ హల్‌చల్ మామూలుగా లేదు. మహేశ్ కెరీర్‌లో ఒక్కడు, పోకిరి సినిమాలకు ఎందుకంత క్రేజ్?. మహేశ్‌ను మాస్ హీరోగా నిలబెట్టిన ఈ సినిమాల్లో ప్రత్యేకత ఏమిటి?. తెలుసుకుందాం..
ఒక్కడు
ఒక్కడు మూవీ మహేశ్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మణిరత్నం మ్యూజిక్ అందించాడు. భూమిక హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీలో మహేశ్ కబడ్డీ ప్లేయర్‌గా నటించాడు. కథ, స్క్రీన్‌ప్లేతో పాటు మహేశ్ యాక్షన్ సినిమాను ఒక రేంజ్‌కు తీసుకెళ్లాయి. అప్పటివరకు సాఫ్ట్ సినిమాలు చేసుకుంటూ వచ్చిన మహేశ్ ఆ సినిమాతో ఒక్కసారిగా తనలో ఉన్న మాస్ హీరోను చూపించాడు. కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద జరిగే యాక్షన్ సీన్ సినిమాలో హైలెట్‌గా నిలిచింది. ఇప్పటికీ కర్నూలు కొండారెడ్డి బురుజు అనగానే గుర్తొచ్చే సీన్ అదే. సరిలేరు నీకెవ్వరులో మళ్లీ ఆ మ్యాజిక్‌ను క్రియేట్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఒక్కడు సీన్ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుంది.
పోకిరి
పోకిరి చిత్రం వచ్చి 16 ఏళ్లు పూర్తయినప్పటికీ సినిమా ఇప్పడు చూసినా ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. పూరీ జగన్నాథ్ డైలాగ్స్, మహేశ్ పూర్తి మాస్ లుక్ అప్పట్లో కుర్రాళ్లు పోకిరి మేనియాలో మునిగిపోయేలా చేశాయి. ఎవడుకొడితే, పద్మావతి హ్యాపీయా ఇలాంటి డైలాగ్స్ ఇప్పటికీ ట్రెండవుతుంటాయి. ఆ రోజుల్లో 175 రోజులు ఆడిన సినిమా అది. మూవీలో ప్రారంభం నుంచి హీరో ఒక పోకిరిలా తిరుగుతుంటాడు. చివరికి మహేశ్ పోలీస్ అని తండ్రి చెప్తూ రివీల్ చేసే సీన్ హైలెట్‌గా నిలుస్తుంది. అప్పటివరకు ఒక రౌడీలా ప్రకాశ్ రాజ్ గ్యాంగ్‌తో చేరి వాళ్ల సీక్రెట్స్ అన్ని తెలుసుకుంటాడు. ప్రకాశ్‌రాజ్ తన తండ్రిని చంపబోయేముందు నా కొడుకు వ్యవసాయం చేస్తున్నాడు. నీలాంటి పురుగులను ఏరివేస్తాడు అని చెప్పే డైలాగ్స్‌కు మహేశ్ బాబు పోలీస్ డ్రెస్‌లో ఇచ్చిన ఎంట్రీతో గూస్‌బంప్స్ వస్తాయి. తర్వాత అందరూ పండుగాడే ఆ స్పెషల్ ఆఫీసర్ అని తెలుసుకొని షాకవుతారు.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది