IPL PLAYERS: లక్షల నుంచి కోట్లకు ఎగబాకిన ఐపీఎల్‌ ఆటగాళ్లు… ఒక్కొక్కరి ధర చూస్తే షాక్‌ అవ్వాల్సిందే !
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • IPL PLAYERS: లక్షల నుంచి కోట్లకు ఎగబాకిన ఐపీఎల్‌ ఆటగాళ్లు… ఒక్కొక్కరి ధర చూస్తే షాక్‌ అవ్వాల్సిందే !

    IPL PLAYERS: లక్షల నుంచి కోట్లకు ఎగబాకిన ఐపీఎల్‌ ఆటగాళ్లు… ఒక్కొక్కరి ధర చూస్తే షాక్‌ అవ్వాల్సిందే !

    April 20, 2023

    ఐపీఎల్‌ ప్రారంభమైనప్పట్నుంచి ఇప్పటివరకు ఆడుతున్న ఆటగాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఒకప్పుడు వారిని వేలంలో కొనుకున్న ధర కంటే ఇప్పుడు ఎక్కువే చెల్లిస్తున్నారు. అలాంటి ఆటగాళ్లు ఎవరు? ప్రస్తుతం ఫ్రాంఛైజీలు వారికి ఎంత ముట్టజెప్పుతున్నాయో తెలుసుకుందాం?

    మహేంద్ర సింగ్ ధోని

    ఐపీఎల్‌లో జరిగిన మెుదటి వేలంలో ధోనిని చెన్నై సూపర్ కింగ్స్ రూ.6 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పట్నుంచి ఇప్పటివరకు రిటైన్ చేసుకుంటూ వస్తుంది. 2018లో ఫ్రాంఛైజీ రూ. 15 కోట్లు చెల్లించగా.. 2022 నుంచి ధోని రూ. 12 కోట్లు మాత్రమే తీసుకుంటున్నాడు.

    విరాట్‌ కోహ్లీ

    విరాట్ కోహ్లీ మెుదట్నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్నాడు. మెుదటిసారి వేలంలో రూ. 12లక్షలకు కొనుగోలు చేయగా… ప్రస్తుతం రూ. 15 కోట్లు చెల్లిస్తున్నారు. 

    గ్లెన్ మాక్స్‌వెల్‌

    ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్  మాక్స్‌వెల్‌ను ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ 2012లో రూ. 10 లక్షలకు దక్కించుకుంది. తర్వాత రాజస్థాన్‌ తరఫున ఆడిన మాక్సీని గతేడాది వేలంలో రూ. 11 కోట్లకు కొనుగోలు చేసింది ఆర్సీబీ.

    సూర్య కుమార్ యాదవ్‌

    సూర్య కుమార్‌ను ముంబై 2011లో రూ. 10 లక్షలకు వేలంలో కొనుగోలు చేసింది. తర్వాత అద్భుతంగా ఆడుతుండటంతో రూ. 8 కోట్లు చెల్లిస్తుంది ఫ్రాంచైజీ.

    అజింక్యా రహానే

    ముంబయి ఇండియన్స్‌ తరఫున రహానే మెుదటి సీజన్ ఆడాడు. అప్పుడు అతడ్ని రూ. 12 లక్షలకు కొనుగోలు చేసింది. తర్వాత రాజస్థాన్‌కి కొద్ది రోజులు సేవలందించాడు. ఇప్పుడు చెన్నై రూ. 50 లక్షలు చెల్లిస్తోంది. 

    శిఖర్ ధావన్

    శిఖర్ ధావన్‌ను 2008లో రూ. 12 లక్షలు చెల్లించి తీసుకుంది ఢిల్లీ. ఆ తర్వాత సన్‌రైజర్స్‌కు ఆడిన ధావన్‌కు… ప్రస్తుతం పంజాబ్‌ రూ. 8.25 కోట్లు ఇస్తుంది. 

    దినేశ్ కార్తీక్‌

    స్టార్ ప్లేయర్లలో ఒకడైన దినేశ్ కార్తీక్‌ మెుదటి సీజన్‌లో ఢిల్లీ తరఫున ఆడాడు. అప్పుడు రూ. 2.1 కోట్లు పెట్టి కార్తీక్‌ను కొన్నారు. తర్వాత కేకేఆర్‌కు కెప్టెన్‌గా చాలాకాలం సేవలందించాడు కార్తీక్. ప్రస్తుతం ఆర్సీబీ రూ. 5.5 కోట్లు చెల్లిస్తోంది.

    సంజూ శాంసన్‌ 

    యంగ్ క్రికెటర్ సంజూ శాంసన్‌ను కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ 2012లో రూ. 8 లక్షలకు వేలంలో కొనుగోలు చేసింది. ప్రస్తుతం అతడికి రూ. 14 కోట్లు ఇస్తోంది రాజస్థాన్ రాయల్స్ . కెప్టెన్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడు సంజూ. 

    రవీంద్ర జడేజా 

    స్టార్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను మెుదట రాజస్థాన్ రాయల్స్‌ రూ.10 లక్షలకు వేలంలో తీసుకుంది. ప్రస్తుతం చెన్నై అతడికి రూ. 16 కోట్లు ఇస్తోంది. 

    హార్దిక్ పాండ్యా

    హార్దిక్ పాండ్యా చాలాకాలం పాటు ముంబై తరఫున కొనసాగాడు. 2015లో అతడిని రూ. 10 లక్షలు ఇచ్చి తీసుకుంది. ప్రస్తుతం గుజరాత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పాండ్యాకు… రూ. 15 కోట్లు ఇస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version