KGF-2 మూవీ రివ్యూ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • KGF-2 మూవీ రివ్యూ

    KGF-2 మూవీ రివ్యూ

    July 20, 2022

    ప్రతి ప్రేక్షకుడికి KGF కథేంటో తెలుసు. బంగారు గనులు, అక్కడ విలన్ గ్యాంగ్, అమాయక ప్రజలు, ఆ గనులను సొంతం చేసుకునేందుకు కాపు కాసేవారు. ఇలా అక్కడికి వెళ్లిన హీరో ఒక్కొక్కరిగా అందర్నీ మట్టుబెడుతూ నరాచీకి ఓనర్ అయిన గరుడనే చివరికి తుద ముట్టిస్తాడు. అక్కడితో ప్రథమ భాగం పూర్తవుతుంది. దాంతో సెకండ్ చాప్టర్ మీద ప్రతి ఒక్కరికీ అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఫస్ట్ చాప్టర్ విడుదలయినపుడు ఇంత బజ్ లేకున్నా కానీ అది జనాల అంచనాలను మించి హిట్ అయింది. కానీ ఇప్పుడు సెకండ్ చాప్టర్ రిలీజ్ కోసం కేవలం శాండిల్‌వుడ్ ఇండస్ట్రీ అనే కాకుండా సినీ ప్రపంచం మొత్తం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసింది. షూటింగ్ మధ్యలో కరోనా మహమ్మారి పంజా విసరడంతో సినిమా కాస్త ఆలస్యమయింది. అయినా సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరిగాయే తప్ప ఏ మాత్రం తగ్గలేదు.

    కథేంటంటే

    KGF-1 ఎక్కడ ముగుస్తుందో అక్కడి నుంచే KGF-2 మొదలవుతుంది. KGF-1లో నరాచీకి రాజయిన గరుడను యశ్ (రాఖీ) చంపడంతో నరాచీ పీఠం ఖాళీ అవుతుంది. దీంతో అధీరా (సంజయ్ దత్) కన్ను దాని మీద పడుతుంది. అధీరను ఫస్ట్ చాప్టర్‌లో లైట్ గా చూపిస్తారు. అధీరా నరాచీని స్థాపించిన హర్షవర్దన్‌కు తమ్ముడు. అధీరాకు రాజకీయం తెలియదని హర్షవర్ధన్ నరాచీకి దూరంగా ఉండమంటాడు. అన్న మాట మీద గౌరవంతో అధీరా నరాచీని వదిలి వెళ్లిపోతాడు. కానీ అధీరాకు మాత్రం నరాచీ మీద ఆశ చావదు. తర్వాత హర్షవర్దన్ తన కొడుకైన గరుడకు నరాచీ బాధ్యతలను అప్పగిస్తాడు. కానీ నరాచీ మీద కొంత మంది కన్ను ఉందని హర్షవర్దన్ గ్రహిస్తాడు. దీంతో కొడుకును జాగ్రత్తగా ఉండమని చెబుతాడు. నరాచీని హస్తగతం చేసుకునేందుకు పలువురు ప్రయత్నిస్తున్నట్లు గరుడకు కూడా అర్థమవుతుంది. కానీ గరుడ వారిని ఏం చేయకుండా అలాగే వదిలేస్తాడు. ఇలా ఉండగా.. నరాచీలోకి హీరో రాఖీ ఎంట్రీ ఇచ్చి.. గరుడను అంతమొందిస్తాడు. ఈ కథను KGF-1లో చెప్పిన దర్శకుడు ప్రశాంత్ నీల్ KGF-2 సినిమాను ఇక్కడి నుంచే కొనసాగించాడు.

    KGF-2 సాగిందిలా.. 

    గరుడను చంపి నరాచీని తన గుప్పిట్లోకి తెచ్చుకున్న రాఖీ భాయ్‌కి అందరూ జేజేలు పలుకుతారు. అక్కడ పని చేసే అమాయక ప్రజలకు కూడా రాఖీ భాయ్ అంటే ఎనలేని గౌరవం ఏర్పడుతుంది. ఇక గరుడను అంతమొందించి నరాచీని రాఖీభాయ్ స్వాధీనం చేసుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో హీరోయిన్ తండ్రి రాజేంద్ర దేశాయ్, గరుడ సోదరుడు దయ, అండ్రూస్ రాఖీతో చేతులు కలుపుతారు. కానీ వీరిని మాత్రం రాఖీ భాయ్ అంతగా విశ్వసించడు. వీరిని ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూనే ఉంటాడు. ఇక హీరోయిన్ రీనాను తనతోపాటుగా నరాచీకి తీసుకుని వెళ్లిపోతాడు. వీరు ఇలా కుట్రలు పన్నుతున్న సమయంలోనే అధీరా బతికే ఉన్నాడనే విషయం వీరికి తెలుస్తుంది. ఏదేమైతేనేమి తమ కుయుక్తులను ఉపయోగించి రాఖీ భాయ్‌ని నరాచీ నుంచి బయటకు తీసుకొస్తారు. అప్పుడే అధీరా సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చి రాఖీని చావు దెబ్బ తీస్తాడు. అధీరాతో పోరాడేందుకు ఇది సమయం కాదని గ్రహించిన రాఖీ అక్కడి నుంచి దుబాయ్‌కి వెళ్లిపోతాడు. అరే రాఖీ ఇలా అధీరాకు భయపడి దుబాయ్‌కి వెళ్లిపోయాడే అని ప్రేక్షకులు ఫీల్ అయ్యే తరుణంలో రాఖీ మరలా ఎంట్రీ ఇచ్చి అధీరాకు చుక్కలు చూపిస్తాడు. ఇక ఇండియన్ ప్రైమ్ మినిస్టర్‌గా బాలీవుడ్ నటి రవీనా టండన్ నటించింది. ఎలాగైనా సరే నరాచీ మీద ఆధిపత్యం సాధించాలనే కోరికతో ఆమె ఉంటుంది. ఇలా ఆలోచిస్తున్న ఆమెకు సాయం చేసే సీబీఐ ఆఫీసర్  పాత్రలో రావు రమేష్ నటించారు. ఇక దుబాయ్ నుంచి వచ్చిన రాఖీ భాయ్ అధీరాను ఎలా దెబ్బకొట్టాడు? ఎలా నరాచీని తిరిగి హస్తగతం చేసుకున్నాడు? ఇందులోకి ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు ఎంట్రీ ఇస్తుంది? అసలు సీబీఐ ఆఫీసర్ పాత్ర ఏమిటి? అనేదే మిగతా కథ.

    అక్కడ సక్సెస్ అయిన దర్శకుడు..

    దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ కథను చెప్పడంలో ఏ మాత్రం తడబాటుకు గురికాలేదు. అక్కడక్కడ కొన్ని సీన్లు చూసే ప్రేక్షకుడికి మరీ ఓవర్‌గా అనిపించినా కానీ ఆ ఇంపాక్ట్ మాత్రం పెద్దగా సినిమా మీద పడదు. అసలు నరాచీ విషయంలోకి పార్లమెంట్ ఎందుకు ఎంటర్ అవుతుందని చాలా మందికి అనుమానం కలుగుతుంది. ఇక వయొలెన్స్ కూడా మరీ ఎక్కువగా ఉందని అక్కడక్కడ అనిపిస్తుంటుంది. అయినా కానీ సినిమా చూసిన ప్రేక్షకుడు సీట్లకు అతుక్కుపోయేలా దర్శకుడు చేసి చూపించాడు. 

    అంతగా పండని ఎమోషన్స్

    KGF-1లో పండిన విధంగా ఇక్కడ ఎమోషన్స్ పండలేదని చాలా మంది పెదవి విరుస్తున్నారు. కానీ సినిమా మాత్రం పరవాలేదని కామెంట్లు చేస్తున్నారు. KGF-2 సినిమా KGF-1కు బాప్ అని కొంత మంది అంటున్నారు. 

    బలాలివే..

    KGF-2 సినిమా మెయిన్ వెపన్ KGF-1 లాంటి బిగ్గెస్ట్ హిట్ మూవీకి సీక్వెల్ కావడం

    ఇక ఈ సినిమాలో యశ్ నటన మరో లెవల్‌

    ప్రతినాయకుడి పాత్రలో నటించిన సంజయ్ దత్ పాత్రలో ఒదిగిపోయిన విధానం వారిద్దరి మధ్య వచ్చే సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి

    ఇక ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించిన భువనగౌడ మ్యాజిక్ చేశారు

    బలహీనతలివే

    బలాలు చెప్పుకుని బలహీనతల గురించి చర్చించకపోతే అది కంప్లీట్ కాదు. ఈ సినిమాకు ప్రధాన బలహీనత

    యాక్షన్ సీన్స్ డోస్ మితిమీరిపోవడం.

    KGF-1లోలా సెంటిమెంట్ పండలేదు

    రేటింగ్: 2.75/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version