పండుగ సీజన్ సందర్భంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో కీలక నిర్ణయం తీసుకుంది. తన తాజా స్మార్ట్‌ఫోన్ ఒప్పో F27 5G (Oppo F27 5G) ధరను తగ్గించింది. ఈ స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో ఆగస్టులో లాంచ్ అయింది. లాంచ్ చేసిన కొన్ని నెలలకే, సంస్థ ఈ హ్యాండ్‌సెట్ ధరను తగ్గిస్తూ వినియోగదారులకు ఆకర్షణీయమైన ఆఫర్‌ను అందిస్తోంది. ఆకట్టుకునే డిజైన్, శక్తివంతమైన కెమెరా సిస్టమ్‌తో ఈ హ్యాండ్‌సెట్ ప్రత్యేకతను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, అలాగే 32MP సెల్ఫీ కెమెరా అట్రాక్ట్ చేస్తోంది.
ఒప్పో F27 ధర
ఒప్పో F27 5G స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది – 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ మరియు 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్లు. ప్రస్తుతం ఈ రెండు వేరియంట్ల ధరలను రూ. 2000 చొప్పున తగ్గించారు. తాజా ధరల ప్రకారం, 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ. 20,999 కాగా, 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ. 22,999గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఎమరార్డ్ గోల్డ్ మరియు అంబర్ ఆరెంజ్ రంగుల్లో అందుబాటులో ఉంది. ఒప్పో వెబ్‌సైట్‌తో పాటు ఇతర ప్రధాన ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంల ద్వారా కూడా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. అదనంగా, ఎంచుకున్న బ్యాంక్ కార్డులపై అదనపు డిస్కౌంట్‌ను పొందవచ్చు.
ఒప్పో F27 5G స్పెసిఫికేషన్లు
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.67 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఉంది, ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 2400 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 394 PPI, 2100 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే గేమింగ్, వీడియోల వీక్షణ కోసం అనుకూలంగా ఉంటుంది.
ప్రాసెసింగ్ శక్తికి ఒప్పో F27 5G స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC ప్రాసెసర్‌ను ఉపయోగించారు. Mali G57 MP2 GPUతో జతచేయడంతో ఇది గేమింగ్ మరియు ఇతర గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ కార్యకలాపాలకు బాగా సరిపోతుంది. అదనంగా, ఈ ఫోన్ మైక్రో SD కార్డు ద్వారా గరిష్టంగా 2TB వరకు స్టోరేజీని పెంచుకునే సదుపాయాన్ని కూడా అందిస్తుంది.
కెమెరా
ఒప్పో F27 5G స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు రెండు కెమెరాలను కలిగి ఉంది – ప్రధానంగా 50MP కెమెరా, అదనంగా 2MP కెమెరా కూడా ఉంది. సెల్ఫీల కోసం ముందు వైపు 32MP కెమెరా అందుబాటులో ఉంది. ఈ కెమెరా సిస్టమ్ మంచి ఫోటోలు తీసేందుకు మరియు వీడియో కాలింగ్‌లో మంచి అనుభవాన్ని అందించేందుకు ఉద్దేశించబడింది.
బ్యాటరీ
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఉంది, ఇది 45W SuperVOOC ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. అంటే, చాలా వేగంగా బ్యాటరీని ఛార్జ్ చేసుకునే వీలుంది.
ఇతర ఫీచర్లు
ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత colorOS 14.0 తో పనిచేస్తుంది. కనెక్టివిటీ పరంగా, ఒప్పో F27 5G డ్యూయల్ సిమ్, 5G, 4G LTE, బ్లూటూత్ 5.3, Wi-Fi 5, USB Type-C 2.0, GPS, Glonass, Beidou, QZSS వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ SGS మరియు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కలిగిన ఆర్మర్ బాడీని కలిగి ఉంది, అలాగే IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
Celebrities Featured Articles Telugu Movies
Samantha: నన్ను ‘సెకండ్ హ్యాండ్, యూజ్డ్’ అంటున్నారు!