Satyadev: ‘జీబ్రాను అలా కానివ్వకండి’.. తెలుగు ఆడియన్స్‌ను వేడుకున్న సత్యదేవ్‌ 
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Satyadev: ‘జీబ్రాను అలా కానివ్వకండి’.. తెలుగు ఆడియన్స్‌ను వేడుకున్న సత్యదేవ్‌ 

    Satyadev: ‘జీబ్రాను అలా కానివ్వకండి’.. తెలుగు ఆడియన్స్‌ను వేడుకున్న సత్యదేవ్‌ 

    November 26, 2024

    సత్యదేవ్‌ (Satyadev) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘జీబ్రా’ (Zibra). ‘పుష్ప’లో జాలిరెడ్డి పాత్రలో ఆకట్టుకున్న కన్నడ ధనంజయ ఇందులో కీలక పాత్ర పోషించాడు. ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్‌, జెన్నిఫర్‌ పిషినాటో హీరోయిన్లుగా చేశారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. తొలిరోజు మోస్తరు రెస్పాన్స్ తెచ్చుకున్నప్పటికీ మౌత్‌ టాక్‌తో రెండో రోజు నుంచి మంచి ఆదరణ సంపాదించింది. రీసెంట్‌గా సక్సెస్‌ మీట్‌ను సైతం చిత్ర బృందం నిర్వహించింది. ఇదిలాఉంటే నటుడు సత్యదేవ్‌ ప్రేక్షకులను ఉద్దేశించి తాజాగా బహిరంగ లేఖ రాశారు. గతంలో చేసిన ‘బ్లఫ్‌ మాస్టర్‌’ గురించి ప్రస్తావిస్తూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. 

    సత్యదేవ్‌ ఏం రాశారంటే?

    ‘జీజ్రా’ (Zibra) చిత్రానికి వస్తోన్న విశేష ఆదరణ చూసి సత్యదేవ్‌ (Satyadev) సంతోషం వ్యక్తం చేశాడు. అభిమానులకు థ్యాంక్స్‌ చెబుతూ సోషల్‌ మీడియాలో ఓ నోట్‌ రిలీజ్‌ చేశాడు. ‘ఇది మీరిచ్చిన విజయం. మీరు ఈ సినిమా బాగుందన్నారు. ఇంతకన్నా నాకేం కావాలి. ఇలాంటి హిట్ కోసం 5 సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్నా. మీకు నచ్చే సినిమా చేయడానికి, మీతో హిట్ కొట్టావ్‌ అని అనిపించుకోవడానికి ఎంతో ఎదురుచూశాను. నేను హిట్ కొడితే, మీరు ఆనందిస్తున్నారు. నాకెంతో సంతోషంగా ఉంది. బ్లఫ్‌ మాస్టర్‌ సినిమాని మీరు థియేటర్‌లో చూడలేకపోయారు. తర్వాత ఓటీటీ, యూట్యూబ్‌లో చూసి ఎంతో ఆదరించారు. జీబ్రా విషయంలో అలా జరగకూడదని కోరుకుంటున్నా. దయచేసి ఈ చిత్రాన్ని థియేటర్‌లో చూడండి. మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’ అని రాసుకొచ్చారు.

    ప్రతీ సినిమాకు ఎదురీతే

    టాలెంట్ ఉన్న సరైన గుర్తింపునకు నోచుకోని హీరోలలో సత్యదేవ్‌ (Satyadev) ఒకరు. ప్రతీ పాత్రకు 100 శాతం న్యాయం చేసే సత్యదేవ్‌ జీబ్రాతో తన రాత మారుతుందని భావించారు. పాజిటివ్‌ టాక్‌ రావడంతో సంబరపడిపోయాడు. అయితే ఆ ప్రభావం కలెక్షన్స్‌లో కనిపించకపోవడంతో సత్యదేవ్‌ కొంత ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితి సత్యదేవ్‌కు కొత్తేమి కాదు. అతడి తొలి ఫిల్మ్‌ నుంచి ఇదే పరిస్థితిని ఫేస్‌ చేస్తూ వస్తున్నాడు. హీరోగా తన ఫస్ట్‌ ఫిల్మ్‌ ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ కొవిడ్‌ కారణంగా ఓటీటీలోకి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత చేసిన ‘తిమ్మరుసు’పై కూడా కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ప్రభావం పడింది. 50 శాతం మందినే థియేటర్లలోకి అనుమతించడంతో అనుకున్న సక్సెస్‌ రాలేదు. అనంతరం చేసిన ‘బ్లఫ్‌ మాస్టర్‌’ విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత చేసిన ‘కృష్ణమ్మ’ రెండేళ్ల పాటు ఆగిపోయింది. ఈ ఏడాది థియేటర్లలోకి వచ్చినా వారం వ్యవధిలోనే ఓటీటీలోకి వచ్చేసింది. ‘గాడ్‌ఫాదర్‌’లో చిరంజీవికి ప్రతినాయకుడిగా చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో సత్యదేవ్‌కు అవకాశాలు దక్కలేదు. ఇలా ఎదురుదెబ్బలు తింటూ వస్తోన్న సత్యదేవ్‌ ‘జీబ్రా’ విషయంలో మళ్లీ రిపీట్ కాకూడదని భావించారు. ఈ నేపథ్యంలో అభిమానులకు థ్యాంక్స్‌ చెబుతూనే తన సినిమాను ఆదరించాలని రిక్వెస్ట్ చేసుకున్నారు. 

    ‘జీబ్రా’ నిజంగానే బాగుందా?

    దర్శకుడు ఈశ్వర్‌ కార్తీక్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థలోని ఆర్థిక నేరాల్ని ఆధారంగా చేసుకొని జీబ్రాను రూపొందించారు. గ్యాంగస్టర్‌ ప్రపంచంతో స్టోరీని ముడిపెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. బ్యాంక్‌ ఉద్యోగి సూర్య పాత్రలో సత్యదేవ్‌ (Satyadev) ఆకట్టుకున్నాడు. తన సెటిల్డ్‌ నటనతో మెప్పించాడు. రూ.5 కోట్ల ఫ్రాడ్‌ విషయంలో గ్యాంగ్‌స్టర్ అయిన విలన్‌ చేతికి హీరో చిక్కడం, ఆ డబ్బు సంపాదించేందుకు హీరో పడే కష్టాలు ఆకట్టుకుంటాయి. అయితే దేశ రాజకీయాలనే శాసించే అపరకుభేరుడైన విలన్ కేవలం రూ.5 కోట్ల కోసం హీరో వెంటపడటమే కాస్త సిల్లీగా అనిపిస్తుంది. కిక్కిచ్చే మూమెంట్స్‌ పెద్దగా లేకపోవడం కూడా మైనస్‌గా మారింది. కథలో కొత్తదనం కోరుకునేవారికి, థ్లిల్లింగ్ సినిమాలను ఇష్టపడేవారికి జీబ్రా తప్పక నచ్చుతుందని చెప్పవచ్చు. 

    స్టోరీ ఏంటంటే?

    మిడిల్‌ క్లాస్‌కు చెందిన సూర్య (సత్యదేవ్‌) బ్యాంక్‌ ఆఫ్‌ ట్రస్ట్‌లో రిలేషన్‌ షిప్‌ మేనేజర్‌గా పని చేస్తుంటాడు. తోటి ఉద్యోగిని స్వాతి (ప్రియ భవానీ శంకర్‌)ని ఇష్టపడతాడు. ఓ రోజు స్వాతి తప్పుడు అకౌంట్‌కు రూ.4 లక్షల డబ్బును ట్రాన్‌ఫర్‌ చేస్తుంది. సదరు వ్యక్తిని సంప్రదించగా డబ్బు వాడేసుకున్నట్లు చెబుతాడు. దీంతో ఆ సమస్య నుంచి స్వాతిని కాపాడేందుకు సూర్య రంగంలోకి దిగుతాడు. సమస్యను పరిష్కరించే క్రమంలో అనుకోకుండా రూ.5 కోట్ల బ్యాంక్‌ ఫ్రాడ్‌లో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలతో రాష్ట్రంలోనే ఎంతో ప్రమాదకారి అయిన ఆది (ధనంజయ్‌)ని సూర్య ఢీ కొట్టాల్సి వస్తుంది. సూర్య అతడ్ని ఎలా ఎదుర్కొన్నాడు? సూర్య లైఫ్‌లోకి ఆది ఎలా వచ్చాడు? రూ.5 కోట్ల ఫ్రాడ్‌ కేసు సూర్యను ఇంకెంత పెద్ద సమస్యలోకి నెట్టివేసింది? ఈ సమస్యల నుంచి చివరికీ బయటపడ్డాడా? లేదా? అన్నది స్టోరీ.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version