ఈ వారం థియేట‌ర్/ ఓటీటీలో రాబోయే సినిమాలు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఈ వారం థియేట‌ర్/ ఓటీటీలో రాబోయే సినిమాలు

    ఈ వారం థియేట‌ర్/ ఓటీటీలో రాబోయే సినిమాలు

    August 9, 2022

    ఆగ‌స్ట్ రెండో వారంలో బ‌డా సినిమాలు థియేట‌ర్ల‌లోకి రాబోతున్నాయి. బాలీవుడ్ హీరోలు అమీర్ ఖాన్ న‌టించిన లాల్‌సింగ్ చ‌డ్డా, అక్ష‌య్ కుమార్ రక్షా బంధ‌న్ ఒకేసారి బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ ప‌డ‌బోతున్నాయి. మ‌రోవైపు ఓటీటీలో కూడా స‌రికొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సంద‌డి చేయ‌బోతున్నాయి.

    లాల్ సింగ్ చ‌డ్డా: ఆగ‌స్ట్ 11

    చాలాసార్లు వాయిదా ప‌డుతూ వ‌స్తున్న అమీర్‌ఖాన్ ‘లాల్‌సింగ్ చ‌డ్డా’ మూవీ మొత్తానికి ఆగ‌స్ట్ 11న థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతుంది. నాలుగేళ్ల త‌ర్వాత అమీర్‌ను తెర‌పై చూసేందుకు ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ రీమేక్‌గా ఇది తెర‌కెక్కింది. క‌రీనా క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. నాగ‌చైత‌న్య ఒక కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. తెలుగులో ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి  ప్రెజెంట్ చేస్తున్నాడు.

    ర‌క్షా బంధ‌న్: ఆగ‌స్ట్ 11

    మ‌రోవైపు బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అక్ష‌య్ కుమార్ ఆగ‌స్ట్ 11న ‘ర‌క్షా బంధ‌న్’ సినిమాతో మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఆనంద్ ఎల్.రాయ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇద్దరు బ‌డాస్టార్స్ ఒకేరోజు బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ ప‌డుతుండ‌టంతో ఆస‌క్తి ఏర్పాడింది.

    మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం: ఆగ‌స్ట్ 12

    నితిన్ హీరోగా న‌టించిన ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ మూవీ ఆగ‌స్ట్ 12న ప్రేక్ష‌కులు ముందుకు రానుంది. నితిన్ ఇందులో ఐఏఎస్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. క్యాథ‌రిన్, కృతి శెట్టి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

    కార్తికేయ 2: ఆగ‌స్ట్ 13

    నిఖిల్ హీరోగా న‌టించిన ‘కార్తికేయ 2’ మూవీ ప‌లుమార్లు వాయిదా ప‌డుతూ చివ‌రికి ఆగ‌స్ట్ 13న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. శ్రీకృష్ణుడు, ద్వార‌క నేపథ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్‌కు మంచి స్పంద‌న ల‌భిస్తుంది.

    ఓటీటీ రిలీజ్‌లు:

    TitleCategoryLanguagePlatformRelease Date
    Happy BirthdayMovieTeluguNetflixAugust 8
    The WarriorrMovieTelugu, TamilHotstarAugust 11
    Rashtra Kavach OmMovieHindiZee5August 11
    Beautiful BilloMoviePunjabiZee5August 11
    Window SeatMovieKannadaZee5August 11
    Thank You the MovieMovieTeluguPrime VideoAugust 12
    GargiMovieTam,Tel,MalSony LivAugust 12
    CadaverMovieTam,Tel,Mal, KanHotstarAugust 12
    Maha ManishiMovieTeluguAha VideoAugust 12
    MalikMovieTeluguAha VideoAugust 12
    ShrimatiMovieBengaliZee5August 12
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version