OTT Suggestion: ఓటీటీ తెలుగులో ఉన్న ఈ బోల్డ్ మూవీ చూశారా? బెడ్ రూమ్ సీన్స్, ఇల్లీగల్ ఎఫైర్స్!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • OTT Suggestion: ఓటీటీ తెలుగులో ఉన్న ఈ బోల్డ్ మూవీ చూశారా? బెడ్ రూమ్ సీన్స్, ఇల్లీగల్ ఎఫైర్స్!

    OTT Suggestion: ఓటీటీ తెలుగులో ఉన్న ఈ బోల్డ్ మూవీ చూశారా? బెడ్ రూమ్ సీన్స్, ఇల్లీగల్ ఎఫైర్స్!

    April 16, 2024

    ప్రస్తుత ఓటీటీ యుగంలో అన్ని రకాల కంటెంట్‌ అందుబాటులో ఉంది. కామెడీ, హర్రర్‌, యాక్షన్‌, సైంటిఫిక్‌, రొమాంటిక్‌ ఇలా ఏ జానర్‌లో చిత్రాన్ని చూడాలన్న వెంటనే చూసేయచ్చు. అయితే రొమాంటింక్‌ & కామెడీ కంటెంట్‌తో చాలా అరుదుగా చిత్రాలు వస్తుంటాయి. ఆ కంటెంట్‌తో వచ్చే చిత్రాలను చూసేందుకు ఓ వర్గం ప్రేక్షకులు ఎప్పుడు రెడీగానే ఉంటారు. అటువంటి వారి కోసం YouSay ఓ అద్భుతమైన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ను సజీషన్స్‌ రూపంలో తీసుకొచ్చింది. ఆ చిత్రం పేరు ‘మన్మథ లీల’ (Manmadha Leelai). పేరే ఇలా ఉందంటే ఇక కథ ఎలా ఉంటుందోనని ఆలోచిస్తున్నారా? ఆ విశేషాలంటే ఇప్పుడు చూద్దాం. 

    స్ట్రీమింగ్ ఎక్కడంటే?

    తమిళ చిత్రసీమ (Kollywood)లో దర్శకుడు వెంకట్ ప్రభు (Venkat Prabhu)కు ప్రత్యేక శైలి ఉంటుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రయోగాలకు ప్రాధాన్యతనిస్తూ ఆయన సినిమాలు చేస్తుంటారు. అలా ఆయన దర్శకత్వం వహించిన తమిళ చిత్రమే ‘మన్మథలీలై’ (Manmadha Leelai). దానిని ‘మన్మథలీల’ పేరుతో తెలుగులో తీసుకొచ్చారు. ఇందులో అశోక్ సెల్వన్, రియా సుమన్, సంయుక్త హెగ్డే నాయకానాయికలుగా నటించారు. 2022లో ఆహా (Aha) వేదికగా స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ చిత్రం అప్పట్లో టాప్ వ్యూస్‌తో దూసుకెళ్లింది. ఈ సినిమాను చూసేందుకు యూత్‌ ఇప్పటికీ విపరీతంగా ఆసక్తి కనబరుస్తున్నారు.

    మూవీ ప్రత్యేకత ఏంటంటే?

    గమ్మత్తుగా సాగే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు వెంకట్‌ ప్రభు ఈ మూవీని రూపొందించారు. ఓ యువ‌కుడి జీవితంలో ఒకేలాంటి సంఘ‌ట‌న‌లు రెండు భిన్నమైన సమయాల్లో జ‌రిగితే ఎలా ఉంటుంద‌నే ఐడియాతో ఈ సినిమాను తెరకెక్కించాడు. నేరుగా కథను చెబితే అందులో ప్రత్యేకత ఏముండదని భావించిన దర్శకుడు.. కంటెంట్‌లో రొమాన్స్, పడగ గది సన్నివేశాలు, అక్రమ సంబంధాలు, ప్రేమను అడ్డం పెట్టుకొని చేసే తొందరపాటు పనులను మిక్స్‌ చేశాడు. అడ‌ల్ట్ కామెడీ, క్రైమ్ అంశాల‌ను జోడిస్తూ తనదైన స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్‌ చేశాడు. ఈ అదనపు హంగులే చిత్రాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది. అయితే సెన్సార్‌బోర్డు సభ్యులు ఈ చిత్రానికి ‘A’ సర్టిఫికేట్‌ జారీ చేశారు. కాబట్టి యూత్‌ ఈ సినిమాను ఒంటరిగా చూడాల్సిందే. ఫ్యామిలీతో మాత్రం చూడలేము అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. 

    కథేంటి

    సత్య (అశోక్ సెల్వన్) అనే యువకుడి జీవితంలో రెండు భిన్నమైన కాలాాల్లో సాగే కథ ఇది. 2010లో కాలేజ్ లైఫ్‌ పూర్తి చేసిన స‌త్య‌.. డ్రెస్ డిజైన‌ర్ బొటిక్‌ను సొంతంగా ప్రారంభించే ప్రయత్నాల్లో ఉంటాడు. ఈ క్రమంలో అత‌డికి పూర్ణి (సంయుక్త హెగ్డే) ప‌రిచ‌యం అవుతుంది. కొద్ది రోజుల చాటింగ్ తర్వాత సత్యను త‌న ఇంటికి ర‌మ్మ‌ని పూర్ణి ఆహ్వానిస్తుంది. పూర్ణి మాటలు నమ్మిన సత్య ఆమె ఇంట్లోనే నైట్ ఉండిపోతాడు. అనుకోకుండా తర్వాత రోజు ఉదయం పూర్ణి తండ్రి తిరిగివ‌స్తాడు. ఆ త‌ర్వాత సత్య, పూర్ణిలకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి?

    2020లో స‌త్య సిటీలోనే ఫేమ‌స్ డిజైన‌ర్‌గా పేరు తెచ్చుకుంటాడు. ప్రాణంగా ప్రేమించే భార్య అను, కూతురితో హ్యాపీలైఫ్‌ను లీడ్ చేస్తుంటాడు. ఒక‌రోజు అత‌డి వైఫ్ ఊరికి వెళుతుంది. ఆ స‌మ‌యంలో అనుకోకుండా లీల అనే అమ్మాయి ఓ అడ్ర‌స్ కోసం వెతుకుతూ సత్య ఇంటికి వ‌స్తుంది. వ‌ర్షం కార‌ణంగా స‌త్య ఇంటిలోనే లీల ఆ రాత్రి ఉండిపోవాల్సి వ‌స్తుంది. ఆమెతోనే నైట్ ఆనందంగా గ‌డుపుతాడు స‌త్య‌. తర్వాత రోజు ఉదయమే సత్య భార్య ఇంటికి తిరిగి వ‌స్తుంది. లీలను భార్య కంటపడకుండా దాచేందుకు సత్య ఏం చేశాడు? లీల‌, పూర్ణి జీవితాలు ఏ విధంగా ముగిసాయి? ఆ స‌మ‌స్య‌ల వ‌ల‌యం నుండి స‌త్య క్షేమంగా బయటపడ్డాడా? లేదా? అన్నదే మన్మథలీల కథ.

    Telugu.yousay.tv Rating : 3/5 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version