• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మంచి ప్రదర్శనే.. అయినా విమర్శలు

    గతంలో తాను మంచి ప్రదర్శన చూపినప్పటికీ క్రికెట్ అభిమానుల నంచి విమర్శలు వచ్చేవని, అలాంటి సమయంలో బాధగా అనిపించేదని ఇండియన్ క్రికెటర్ కేఎల్ రాహుల్ అన్నాడు. ఐపీఎల్ సమయంలో గాయపడి మ్యాచ్‌లకు దూరంగా ఉన్న రాహుల్ ఆసియా కప్‌లో తిరిగి జట్టులో చేరాడు. 5 నెలల పాటు ఆటకు దూరంగా ఉన్నానని చెప్పాడు. ప్రపంచకప్‌లో ఆడడం ప్రతి ఒక్కరి కల అని, ఇప్పడు సంతోషంగా ఉందని రాహుల్ పేర్కొన్నాడు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంలో రాహుల్ కీలకంగా వ్యవహరించాడు.

    ఏడ్చేసిన బాబర్ అజామ్

    మ్యాచ్ చివరి వరకూ పోరాడినా ఓటమి పాలవ్వడంతో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఏడ్చేశాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో పాక్ చివరి బంతికి ఓడిపోవడం బాబర్ జీర్ణించుకోలేకపోయాడు. ఆఖరి వరకూ పోరాడినా ఫలితం దక్కకపోవడంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా నిన్న పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక చివరి బంతికి 2 పరుగులు చేయాల్సి రావడంతో రెండు రన్స్ కొట్టి ఫైనల్‌కు చేరింది. https://x.com/shubham84777556/status/1702498485457522932?s=20

    పాక్‌లోనే ఆసియా కప్; భారత్ మాత్రం..

    పాకిస్తాన్‌లోనే ఆసియా కప్ జరుగుతుందని ఏసీసీ స్పష్టం చేసింది. ‘‘టీమిండియా ఆసియా కప్ ఆడుతుంది. ఆసియా కప్ పాక్‌లోనే జరుగుతుంది. కానీ తటస్థ వేదికలపై మాత్రమే భారత్ ఆడుతుంది. ఒమన్, శ్రీలంక, యూఏఈ, ఇంగ్లండ్ వేదికలు సూచించాం. ఈ వేదికల్లో ఎక్కడో ఒక చోట భారత్ తన మ్యాచ్‌లు ఆడుతుంది. ఒక వేళ భారత్ ఫైనల్ చేరినా.. ఫైనల్ కూడా తటస్థ వేదికలోనే జరుపుతాం. ఇందుకు పీసీబీ కూడా అంగీకరించింది. ఆసియా కప్‌ను వన్డే ఫార్మాట్‌లోనే నిర్వహిస్తాం.’’ అంటూ ఏసీసీ పేర్కొంది. ప్రపంచకప్ సమరాల … Read more