అందుకే చాలా సినిమాలు వదిలేశా: హీరోయిన్
శృంగార సన్నివేశాల్లో నటించడం తనకు ఇష్టం లేదని.. అందుకే చాలా సినిమాలు వదులుకున్నానని హీరోయిన్ మీనాక్షి చౌదరి తెలిపింది. ‘‘సినిమా కథ ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటా. ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు చేస్తాను. సినిమాల్లోకి రాకముందే బోల్డ్ సీన్స్‌లో నటించకూడదని నిర్ణయించుకున్నా. అందుకే చాలా సినిమాలు వదులుకున్నా. కథకు అవసరమైతేనే ముద్దు సీన్స్‌లో నటిస్తా. లేదంటే ముందుగానే తిరస్కరిస్తా.’’ అంటూ చెప్పుకొచ్చింది.