• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ఇండియన్2’లో డింపుల్ ఐటెమ్ సాంగ్!

    టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతీ ఓ బంపర్ ఆఫర్ దక్కించుకున్నట్లు సమాచారం. క్రేజీ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేస్తోన్న ‘ఇండియన్2’ సినిమాలోని స్పెషల్ సాంగ్‌లో డింపుల్ స్టెప్పులు వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పాటలో కమల్‌హాసన్ కూడా స్టెప్స్ వేయనున్నట్లు టాక్. ప్రస్తుతం ఈ సాంగ్‌తో డింపుల్ దశ తిరిగినట్లేనని ఫ్యాన్స్ అంటున్నారు. కాగా డింపుల్ ఇంతకుముందు ‘గద్దలకొండ గణేష్’ చిత్రంలో కూడా ఐటెమ్ సాంగ్ చేసింది. డింపుల్ నటించిన ‘రామబాణం’ మూవీ ఇటీవలే విడుదలైంది.

    నాపై కేసును కొట్టివేయండి: డింపుల్ హయాతి

    తనపై పెట్టిన కేసును కొట్టివేయాలంటూ టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే ఒత్తిడితో తనపై తప్పుడు కేసు పెట్టారని పిటీషన్‌లో పేర్కొన్నారు. కాగా డింపుల్ వాదనలు విన్న న్యాయస్థానం 41A నిబంధనల మేరకే వ్యవహరించాలని పోలీసులను ఆదేశించింది. కాగా ఐపీఎస్ ఆఫీసర్, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారుపై దాడి చేశారన్న ఆరోపణతో ఆయన డ్రైవర్ ఫిర్యాదు మేరకు డింపుల్‌పై కేసు నమోదు చేశారు.

    డింపుల్ ఇంట్లోకి చొరబడిన అగంతకులు

    హీరోయిన్ డింపుల్ హయాతీ ఇంట్లోకి ఓ యువతీ, యువకుడు చొరబడడం కలకలం రేపింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న ఎస్‌కేఆర్ ఎన్‌క్లేవ్‌లో తన బాయ్‌ఫ్రెండ్ విక్టర్ డేవిడ్‌తో డింపుల్ నివసిస్తోంది. ఈ క్రమంలో డింపుల్ నివసించే ఫ్లాట్‌లోకి రాజమండ్రికి చెందిన కొప్పిశెట్టి సాయిబాబు, శృతిలు ప్రవేశించారు. పనిమనిషి ఎవరా అని ఆరాతీయగా వారు పారిపోయారు. వెంటనే డింపుల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు యువతీ, యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    హీరోయిన్ డింపుల్ హయాతీ కేసులో మరో ట్విస్ట్

    ‘ఖిలాడీ’ హీరోయిన్ డింపుల్ హయాతీ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. డింపుల్ హయాతీ అసలు ఐపీఎస్ ఆఫీసర్ రాహుల్ హెగ్డే కారును తన్నలేదని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఈ ఫుటేజ్ ప్రకారం డింపుల్ కారుకు ట్రాఫిక్ కోన్స్ తగలగా.. ఆమె కారు దిగి వాటిని తన్నింది. ఈ ఫుటేజీలో పోలీస్ అధికారి కారును తన్నినట్లు ఎక్కడా కనిపించలేదు. కాగా డింపుల్, రాహుల్ ఒకే అపార్ట్‌మెంట్లో ఉంటుండగా పార్కింగ్ విషయంలో గొడవలు జరుగుతున్నాయి. Video is here #DimpleHayathi pic.twitter.com/dM7f2CCq9s … Read more

    గుడి కట్టిస్తానన్న అభిమానికి షాకిచ్చిన హీరోయిన్

    గుడి కట్టిస్తానన్న అభిమానికి దిమ్మతిరిగే ఆన్సర్‌ ఇచ్చింది హీరోయిన్ డింపుల్ హయాతి. రామబాణం ప్రమోషన్లలో భాగంగా ఫ్యాన్స్‌, మీమర్స్‌తో హీరో, హీరోయిన్లు ముచ్చటించారు. ఈ క్రమంలో ఓ అభిమాని “ మీకు గుడికట్టాలని అనుకుంటున్నాను. పాలరాతితో కట్టించాలా? లేక ఇటుకలతో కట్టించాలా?” అని అడిగాడు. దీనికి డింపుల్ సమాధానమిస్తూ “ నాకు బంగారంతో గుడి కట్టించండి.. చాలా బాగుంటుంది” అని పేర్కొంది. Screengrab Instagram: dimplehayathi Courtesy Instagram: dimplehayathi

    డింపుల్ అందాలు చూడతరమా

    టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతీ తన అందంతో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. తన అందానికి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. క్యూట్ లుక్స్‌తో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. హయాతీ తాజాగా తన ఫొటో షూట్‌కు సంబంధించిన ఫొటోలను నెట్టింట్లో షేర్ చేసింది. ఈ పిక్స్‌ను చూసి నెటిజెన్లు పండగ చేసుకుంటున్నారు. కాగా గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ‘రామబాణం’ మూవీలో డింపుల్ హయాతీ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా వచ్చే నెల 5న విడుదల కానుంది. Screengrab Instagram: dimplehayathi Screengrab Instagram: dimplehayathi Screengrab … Read more

    డింపుల్ హయాతి క్యూట్ అందాలు

    బెజవాడ బ్యూటీ డింపుల్ హయాతీ తన క్యూట్ అందాల ప్రదర్శనతో కుర్రకారును ఫిదా చేస్తోంది. బ్లాక్ అవుట్ ఫిట్‌లో అందాల విందు చేసింది. తాజాగా తన ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను హయాతి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్‌గా మారుతున్నాయి. కాగా గోపిచంద్ హీరోగా తెరకెక్కిన ‘రామబాణం’ మూవీలో డింపుల్ హయాతీ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా మే5న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. Screengrab Instagram: dimplehayathi Courtesy Instagram: dimplehayathi