• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • తెలంగాణ దేశానికే ఆదర్శం; గవర్నర్ తమిళిసై

  తమ ప్రభుత్వం ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ప్రగతి సాధించిందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. తెలంగాణ బడ్జెట్ 2023 సమావేశాల సందర్భంగా గవర్నర్ శాసనసభలో ఉభయసభల నుద్దేశించి మాట్లాడారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. 24 గంటల విద్యుత్, ఇంటింటికీ నీరు, ఆసరా పెన్షన్లు, ఉచిత విద్యుత్, షాదీ ముబారక్, ఉద్యోగాల భర్తీ, మహిళలకు రిజర్వేషన్లు వంటి వాటితో గణనీయమైన అభివృద్ధి సాధించామని వివరించారు.

  కేసీఆర్‌పై గవర్నర్ తమిళిసై అసహనం

  తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి కేసీఆర్ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు రాజ్‌భవన్‌లోనే జరుపుకోవాలన్న లేఖపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సారైనా పరేడ్ గ్రౌండ్‌లో వేడుకలు జరపకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని తమిళిసై కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కాగా ఇక్కడ వేడుకల అనంతరం గవర్నర్ ప్రత్యేక విమానంలో పుదుచ్చేరి వెళ్లి అక్కడ కూడా రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొంటారు.

  ఖమ్మం సభలో కేసీఆర్‌ వ్యాఖ్యలపై గవర్నర్‌ స్పందన

  ఖమ్మంలో BRS పార్టీ బహిరంగ సభలో కేసీఆర్‌ వ్యాఖ్యలపై గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ స్పందించారు. తనను అవమానించేలా సీఎం కేసీఆర్ మాట్లాడారన్నారు. గవర్నర్‌ వ్యవస్థను సీఎం ఎలా అవహేళన చేస్తారని ప్రశ్నించారు. ప్రొటోకాల్‌ అంశంపై సీఎం స్పందించాక తాను మాట్లాడతానని గవర్నర్‌ అన్నారు. ‘‘పాతికేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా. ప్రొటోకాల్‌ ఎలా పాటించాలో నాకు తెలుసు. రిపబ్లిక్‌డే అంశంపై ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాకు సమాచారం లేదు’’ అని తమిళిసై అన్నారు.

  #GetOutRavi ట్రెండింగ్

  తమిళనాడు గవర్నర్‌ RN రవిపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. తమిళనాడును వదిలి వెళ్లిపోవాలంటూ #GetOutRavi ట్రెండ్‌ చేస్తున్నారు. ఇవాళ జరిగిన అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో గవర్నర్‌ స్పీచ్‌ రచ్చకు కారణమైంది. ప్రభుత్వం అందించిన స్పీచ్‌లో RN రవి కొన్ని భాగాలు చదవకుండా వదిలేశారు. దీంతో ప్రభుత్వం ఇచ్చిన స్పీచ్‌ను మాత్రమే రికార్డులలో ఉంచాలని సీఎం స్టాలిన్‌ రిజల్యూషన్‌ తీసుకొచ్చారు. దీంతో జాతీయగీతం కూడా ఆలపించకముందే గవర్నర్‌ సభ నుంచి వెళ్లిపోయారు. సభ నుంచి తమిళనాడు నుంచే వెళ్లిపోండి అంటూ ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  MLAలకు ఎర కేసులో గవర్నర్‌ తమిళిసై?

  గవర్నర్‌ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వం మీద సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నారని, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సంచలనం సృష్టించిన ఫాంహౌజ్‌ కేసులోకి తననూ లాగే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే తన మాజీ ADC తుషార్‌ను ఈ కేసులోకి తెచ్చారని చెప్పారు. విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డుపై న్యాయపరమైన సమస్యలు పరిశీలిస్తున్నానని చెప్పారు. కానీ కావాలనేే విద్యార్థి సంఘాలతో రాజ్‌భవన్‌ ముందు ఆందోళనలకు రెచ్చగొడుతున్నారని గవర్నర్‌ అన్నారు. ఎనిమిదేళ్లుగా ఉద్యోగ నియామకాలు చేయకపోయినా … Read more

  గవర్నర్‌పై మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలు

  గవర్నర్‌ తీరుపై మంత్రి కేటీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తన వద్ద కొన్ని బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని పరిశీలించి ఆమోదిస్తానని గవర్నర్‌ వ్యాఖ్యానించారు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో కేటీఆర్‌ను ప్రశ్నించగా… గవర్నర్‌ తమ పాత్రను, పరిధిని ఎక్కువగా ఊహించుకుంటున్నారని అన్నారు. రాజ్‌భవన్‌ను బీజేేపీ భవన్‌లా మారుస్తానంటే సహించబోమన్నారు. మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలని, బీజేపీ కార్యకర్తలా పనిచేస్తూ, గవర్నర్‌గా గుర్తించమంటే ఎలాగని కేటీఆర్‌ ప్రశ్నించారు. ప్రజల అండ ఉన్నంతవరకూ తమను ఎవరూ ఏమీ చేయలేరని స్పష్టం చేశారు.

  బాసర విద్యార్థులతో గవర్నర్ తమిళిసై ముఖాముఖి

  బాసర విద్యార్థులతో గవర్నర్ తమిళిసై ముఖాముఖి బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో తెలంగాణ గవర్నర్ తమిళిసై సమావేశమయ్యారు. వారితో ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. క్యాంపస్ ప్రాంగణంలో విద్యార్థులతో కలియదిరిగారు. విద్యార్థుల మెస్‌ను పరిశీలించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. క్యాంపస్‌లో అందుతున్న మెస్ పట్ల విద్యార్థులు అసంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు.

  రూ.100 కోట్లు ఇస్తే గవర్నర్ పదవి

  గవర్నర్, రాజ్యసభ సభ్యత్వం ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయింది. పదవుల ఎర వేసి భారీ స్థాయిలో వసూళ్లకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నముఠాను సీబీఐ అరెస్టు చేసింది. ఫోన్ కాల్స్ ఆధారంగా పక్కా సమాచారంతో నిందితులను అదుపులోకి తీసుకుంది. వీరు దాదాపుగా రూ.100 కోట్ల వసూలుకు పాల్పడేందుకు కుట్ర పన్నినట్లు గుర్తించారు. ఈ ముఠాలో మహారాష్ట్ర, కర్ణాటక, దిల్లీకి చెందిన పలువురు ఉన్నట్లు సీబీఐ తెలిపింది.