• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అందుకు ఓకే అంటే ఛాన్స్ ఇస్తానన్నాడు: రెజీనా

    తాను కూడా క్యాస్టింగ్ కౌచ్‌కు గురయ్యానని హీరోయిన్ రెజీనా తెలిపింది. ‘‘కెరీర్ తొలినాళ్లలో ఛాన్సుల కోసం చూస్తున్నా. అదే సమయంలో ఓ వ్యక్తి ఫోన్ చేసి అడ్జెస్ట్‌మెంట్‌కు ఓకే చెప్తే ఇప్పుడే ఛాన్స్ ఇస్తా అన్నాడు. సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేద్దామని చెప్పాడు. అప్పుడు నాకు అడ్జెస్ట్‌మెంట్‌ అంటే ఏంటో తెలియదు. నా మేనేజర్‌ను అడిగితే విషయం చెప్పాడు. దీంతో నేను మళ్లీ ఆ వ్యక్తి వైపు వెళ్లలేదు. ఇది జరిగి పదేళ్లు అవుతోంది. ఇన్నేళ్లలో మళ్లీ అలాంటి అనుభవం ఎదురుకాలేదు.’’ అంటూ … Read more

    అందుకే సినిమాలకు దూరమయ్యా: హీరోయిన్

    బాలకృష్ణ హీరోగా నటించిన ‘విజయేంద్రవర్మ’ సినిమా సక్సెస్ అయిఉంటే ఇండస్ట్రీలో ఉండేదన్ని అని హీరోయిన్ అంకిత తెలిపారు.‘‘ ‘విజయేంద్రవర్మ’ సినిమాపై ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకున్నా. కానీ ఆ సినిమా నిరాశపరిచింది. ఆ సినిమా కనుక సక్సెస్ అయి ఉంటే సినిమాల్లో కొనసాగేదాన్ని. నవదీప్‌తో నాకెలాంటి గొడవలు లేవు. ఎన్టీఆర్‌తో సోషల్ మీడియాలో టచ్‌లో ఉంటున్నాను.’’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా అంకిత చివరగా 2009లో ‘ఖతర్నాక్’ సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్‌లో నటించింది. Courtesy Twitter: kirankumar Courtesy Twitter: Ananth Rupanagudi

    ‘బలగం’ పాపకు అవమానం!

    కెరీర్ తొలినాళ్లలో తనకు అవమానాలు ఎదురయ్యాయని ‘బలగం’ హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్ తెలిపింది. ‘‘కెరీర్ మొదట్లో పలు ఆడిషన్స్‌కు వెళ్లాను. ఆ ఆడిషన్స్‌లో నేను లావుగా ఉన్నానని దర్శకనిర్మాతలు హేళన చేశారు. మీరు చాలా లావుగా ఉన్నారు.. ఇంత లావు ఉంటే మీకు సినిమా ఛాన్స్‌లు కష్టమని అవమానించారు. సన్నబడితినే అవకాశాలు వస్తాయని చెప్పారు. కానీ నేను అవేమీ పట్టించుకోకుండా ఇప్పుడు సినిమాలు చేస్తున్నాను.’’ అంటూ ‘బలగం’ పాప చెప్పుకొచ్చింది.

    అందుకే ముద్దు సీన్స్‌కు ఓకే చెప్పా: తమన్నా

    తాను పెట్టుకున్న ‘నో కిస్సింగ్ రూల్‌’ను హీరోయిన్ తమన్నా 18 ఏళ్ల తర్వాత బ్రేక్ చేసింది. దీనిపై మిల్కీ బ్యూటీ తాజాగా స్పందించింది. ‘‘కాలానికి తగ్గట్లు మార్పులు అంగీకరించాలి. కాలానుకనుగుణంగా మారే వ్యక్తుల్లో నేనూ ఒకదాన్ని. దేశంలో అనేక రకాల ప్రేక్షకులు ఉన్నారు. సృజనాత్మకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా. ఇండస్ట్రీకి వచ్చిన 18 ఏళ్ల తర్వాత ఫేమస్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. కొత్తదనం కోసమే ముద్దుసీన్లలో నటించాను.’’ అంటూ ఈ మిల్కీ బ్యూటీ చెప్పుకొచ్చింది.

    చాలామందితో డేటింగ్ చేశా: ప్రియాంక

    తాను చాలా మందితో డేటింగ్ చేసినట్లు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తెలిపింది. ‘కాల్ హర్ డాడీ’ పాడ్‌క్యాస్ట్‌లో ప్రియాంక మాట్లాడుతూ ‘‘నా పెళ్లి కాక ముందు చాలా మందితో డేటింగ్ చేశా. ఒకరితో బ్రేకప్ అవగానే మరొకరిని లవ్ చేసేదాన్ని. ఎప్పుడూ ఎవరో ఒకరిని లవ్ చేస్తూనే ఉండేదాన్ని. నాతో పనిచేసిన కోస్టార్స్‌తోనే ఎక్కువగా డేటింగ్ చేశాను. నేను డేటింగ్ చేసినవారందరూ అద్భుతమైనవారు. చివరకు నిక్ జొనాస్‌ను ప్రియుడుగానే కాక భర్తగా స్వీకరించాను.’’ అంటూ ప్రియాంక చెప్పుకొచ్చింది.

    అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చా: సంయుక్త మీనన్

    అనుకోకుండా సినిమాల్లోకి వచ్చానని ‘విరూపాక్ష’ హీరోయిన్ సంయుక్త మీనన్ తెలిపింది. సినిమాల్లోకి రాకముందు ఉద్యోగంలో స్థిరపడటమే తన లక్ష్యమని చెప్పింది. ‘‘నా తొలి సినిమా ‘పాప్‌కార్న్’ చూసి అందరూ నాకు నటన రాదని ఎగతాళి చేశారు. నాకు అప్పట్లో సినిమాలపై అంతగా అవగాహన లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీపై ఓ అవగాహన వచ్చింది. అందుకే ఇప్పుడు నన్ను నేను ప్రూవ్ చేసుకుంటున్నా.’’ అంటూ చెప్పుకొచ్చింది.