• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘మ్యాడ్‌’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్

    నార్నే నవీన్, సంగీత శోభన్, రామ్ నితిన్ కీలక పాత్రలు పోషించిన ‘మ్యాడ్‌’ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా నవంబర్‌ 3 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. చిన్న సినిమాగా రిలీజైన మ్యాడ్‌.. థియేటర్లలో పెద్ద సక్సెస్ అయ్యింది. రూ.25 కోట్ల గ్రాస్‌, రూ.12 కోట్ల షేర్‌ను సంపాదించింది. యంగ్‌ డైరెక్టర్‌ కళ్యాణ్‌ శంకర్‌ తెరకెక్కించిన ఈ మూవీకి భీమ్స్‌ సిసిరోలియో సంగీతాన్ని అందించారు.

    సాలిడ్ కలెక్షన్లతో దూసుకెళ్తోన్న ‘మ్యాడ్’

    యువ హీరోలు సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మ్యాడ్’ మూవీ మంచి వసూళ్లను రాబడుతోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.10.2 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. యూఎస్‌లో ఈ చిత్రం రూ.2.5 లక్షల మేర గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మేకర్స్ అంచనాలకు మించి విజయం సాధించడంతో మూవీ టీం సంబరాలు చేసుకుంటోంది. గౌరీప్రియ, అనంతిక, గోపిక హీరోయిన్లుగా నటించారు. భీమ్స్ సిసిరోలియా సంగీతం అందించాడు.

    మా బావకి ‘మ్యాడ్’ బాగా నచ్చింది: నార్నే నితిన్

    ‘మ్యాడ్’ మూవీ చాలా బాగుందని తన బావ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నారని యంగ్ హీరో నార్నే నితిన్ అన్నాడు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో మూవీ టీం సోమవారం సక్సెస్ మీట్ నిర్వహించింది. టీం మొత్తం కష్టపడి పనిచేయడంతోనే ఈ విజయం దక్కిందని వారు పేర్కొన్నారు. ఈ చిత్రంతో కల్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీప్రియారెడ్డి, అనంతిక, గోపిక ఉద్యాన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

    ‘మ్యాడ్‌’ సినిమా పూర్తి రివ్యూ

    ప్రస్తుతం టాలీవుడ్‌లో యూత్‌ఫుల్‌ సినిమా హవా బాగా పెరిగిపోయింది. యువతను ఆకట్టుకునే అంశాలను కథాంశంగా చేసుకొని పలు సినిమాలు మంచి టాక్‌ను తెచ్చుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మరో యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం మ్యాడ్‌ (MAD) తెరకెక్కింది. కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. ఇవాళ థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ తెలుగు తెరకు పరిచయమయ్యాడు. అసలు మూవీ కథేంటి? వంటి అంశాల కోసం YouSay Webపై క్లిక్ చేయండి.

    ఎన్టీఆర్ బావమరిది సినిమా రెడీ

    జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ ‘మ్యాడ్’ అనే సినిమాతో తెలుగు తెరకి పరిచయం అవుతున్నాడు. దీనికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నేపథ్యమంతా కాలేజీ చుట్టే తిరుగుతుందని టీజర్ చూస్తే అర్థమవుతుంది. క్యాంపస్ లో జరిగిన గొడవలు, విద్యార్థుల మధ్య భేదాభిప్రాయాలు, రాగింగ్, అలాగే కొంచెం రెండర్థాల మాటలు కూడా ఇందులో కనిపిస్తుంది.టీజర్ విడుదలైన ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. Crazyyyyyy #MADtheMovie Teaser ???pic.twitter.com/F3XWcqBUWQ — ???????? ????? (@BheeshmaTalks) August 31, 2023