• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హైదరాబాద్ వచ్చేసిన జాన్వీ కపూర్

    యంగ్‌టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ‘ఎన్టీఆర్30’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ క్రమంలో జాన్వీ ఇప్పటికే హైదరాబాద్ చేరుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె రామోజీఫిలింసిటీలో బస చేస్తున్నట్లు సమాచారం. కాగా ‘ఎన్టీఆర్30’ మూవీకి సంబంధించి రామోజీ ఫిలింసిటీలో ఓ భారీ సెట్ వేసినట్లు తెలుస్తోంది. ఈ సెట్‌లో ఎన్టీఆర్, జాన్వీలపై కీలక సన్నివేశాలు షూట్ చేయనున్నట్లు టాక్.

    ‘ఎన్టీఆర్ 30’ లాంఛ్; గెస్ట్ అతడే?

    యంగ్‌టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివల కాంబినేషన్‌లో ‘ఎన్టీఆర్ 30’ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 23న ఈ సినిమా ఓపెనింగ్ సెర్మనీ జరగనుంది. కాగా ఈ మూవీ లాంఛ్‌ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నారని సమాచారం. అలాగే రామ్‌చరణ్, కళ్యాణ్‌రామ్, రాజమౌళి, కీరవాణి కూాడా ఈ ఈవెంట్‌కు హాజరు కానున్నారు. కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటించనుంది. కళ్యాణ్‌రామ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. సినిమా లాంఛ్ కార్యక్రమానికి చిరంజీవి గెస్ట్‌గా వస్తారని అనుకున్నప్పటికీ రాలేదు. … Read more

    ‘ఎన్టీఆర్30’; జాన్వీ రెమ్యూనరేషన్ అన్ని కోట్లా?

    యంగ్‌టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ‘ఎన్టీఆర్30’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో నటించేందుకు బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్ రూ.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. ప్రస్తుతం జాన్వీ బాలీవుడ్‌లో ఒక్కో సినిమాకు రూ.3.5 కోట్లు ఛార్జ్ చేస్తోందని తెలుస్తోంది. కానీ సౌత్‌లో రూ.5 కోట్లు తీసుకుంటుండడంతో ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. Screengrab Twitter:ntrartsofficial