యంగ్‌టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివల కాంబినేషన్‌లో ‘ఎన్టీఆర్ 30’ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 23న ఈ సినిమా ఓపెనింగ్ సెర్మనీ జరగనుంది. కాగా ఈ మూవీ లాంఛ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నారని సమాచారం. అలాగే రామ్‌చరణ్, కళ్యాణ్‌రామ్, రాజమౌళి, కీరవాణి కూాడా ఈ ఈవెంట్‌కు హాజరు కానున్నారు. కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటించనుంది. కళ్యాణ్‌రామ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు.
సినిమా లాంఛ్ కార్యక్రమానికి చిరంజీవి గెస్ట్‌గా వస్తారని అనుకున్నప్పటికీ రాలేదు. రాజమౌళి, ప్రశాంత్ నీల్ ముఖ్య అతిథులుగా హాజరై NTR30 చిత్రాన్ని ప్రారంభించారు. రాజమౌళి క్లాప్ కొట్టగా… ప్రశాంత్ దర్శకత్వం వహించారు. దాదాపు మూడేళ్ల క్రింద ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. తారక్ సినిమా ఎప్పుడు ప్రారంభిస్తాడా ? అని చాలాకాలంగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. త్వరలోనే షూటింగ్‌కు వెళ్తారు.
ముఖ్య అతిథిగా చిరంజీవి వస్తే బాగుండేది. ఎందుకంటే ఆచార్య ఫ్లాప్ తర్వాత దర్శకులపై చిరు చేసిన వ్యాఖ్యలు కొరటాల గురించే అన్నట్లుగా ప్రచారం జరిగింది. చిరంజీవి కాదని క్లారిటీ ఇచ్చినప్పటికీ చర్చ ఆగలేదు. ఒకవేళ NTR30కి చిరు వచ్చి ఉంటే అవన్నీ పటాపంచలయ్యేవి. అటు చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా మరింత ఆనందపడేవారు.
Celebrities Featured Articles
Vijay Devarakonda: ‘ప్రేమిస్తే బాధ భరించాల్సిందే’.. విజయ్ కామెంట్స్ రష్మిక గురించేనా?