• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నెలవారీ బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి రికార్డు

    నెలవారీ బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి రికార్డు నెలకొల్పింది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా డిసెంబర్‌లో మెుత్తం 67.2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. రోజుకి 2.18 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసి చరిత్ర తిరగరాసింది. స్వరాష్ట్రంలో సింగరేణి ప్రగతి పరుగులు తీస్తుందని కార్మికులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంస్థను ఎంతో ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. ఇదే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని వెల్లడించారు.

    సింగరేణి ప్రైవేటుపరం చేసే కుట్రలు ఆపండి: కేటీఆర్

    తెలంగాణ ఆయువు పట్టైన సింగరేణిని ప్రవేటుపరం చేసే కుట్రలు మానుకోవాలని కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ హితవు పలికారు. తెలంగాణలో ప్రగతిని చూసి ఓర్వలేక భాజపా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. సింగరేణికి చెందిన నాలుగు బొగ్గుగనులు వేలం వేస్తున్నట్లు కేంద్రం మంత్రి ప్రహ్లాద్‌ జోషి పార్లమెంట్‌లో ప్రకటించడం పట్ల KTR ధ్వజమెత్తారు. గుజరాత్‌లో లిగ్నైట్‌ గనులను ప్రభుత్వ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు అప్పజెప్పినట్లే, తెలంగాణలో సింగరేణిని ప్రభుత్వానికి అప్పగించాలని ఎన్నిసార్లు విన్నవించినా ప్రధాని మోదీ పట్టించుకోవట్లేదని మండిపడ్డారు.

    సింగరేణి ప్రైవేటుపరమేనా?!

    రాష్ట్ర ఉనికికి మారుపేరైన వాటిలో ఒకటైన సింగరేణి మనుగడపై ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా కోయగూడెం గని ప్రైవేటుపరం కావడంతో పాత గనులతో నెట్టుకురావడం కష్టమేనని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని సింగరేణిని ప్రైవేటుపరం చేసే యోచన లేదని చెప్పారు. అయితే సింగరేణికి కొత్త గనులు కేటాయించకపోవడం ప్రైవేటీకరించడమేనని కార్మిక సంఘాలు వాదిస్తున్నాయి. మరోవైపు సత్తుపల్లి బ్లాక్‌-3, శ్రావణపల్లి బ్లాక్‌-3, కల్యాణ ఖని బ్లాక్‌-6లను వేలం ద్వారానే అప్పగించేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది.

    ‘సింగరేణిని ప్రైవేటుపరం చేయబోం’

    TS: సింగరేణి కోల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎస్‌సీసీఎల్)ని ప్రైవేటుపరంపై ప్రధాని మోదీ స్పందించారు. సింగరేణిని ప్రైవేటు పరం చేసే ఆలోచన కేంద్రానికి లేదని స్పష్టం చేశారు. కావాలనే ప్రైవేటు పరంపై దుష్ప్రచారం చేస్తున్నారని మోదీ తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ వాటా 51శాతమని, కేంద్ర వాటా 49శాతం మాత్రమేనని గుర్తు చేశారు. మెజార్టీ వాటా రాష్ట్రానిది అయితే, కేంద్రం ఎలా విక్రయిస్తుందని చెప్పారు. సింగరేణి విషయంలో కొందరు అబద్ధాలు చెప్తున్నారని మోదీ విమర్శించారు.

    ‘మా బొగ్గు మాకే కావాలి’

    తమ బొగ్గు తమకే కావాలంటూ సింగరేణి కార్మికులు డిమాండ్ చేశారు. సింగరేణిని నిర్వీర్యం చేసే కుట్రలకు తెర లేపుతున్నారని సింగరేణి జేఏసీ చైర్మన్ ఆరోపించారు. 10 వేల మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాల్లోని బ్లాక్‌లను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ప్రైవేటీకరణను విరమించుకోవాలని విజ్ణప్తి చేశారు. ప్రభుత్వ రంగ ఆస్తులను అమ్మేస్తూ ప్రధాని మోదీ కార్మికులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా సింగరేణిపై చేస్తున్న కుట్రలు ఆపివేయాలని కోరారు.