మీకు ‘ఈ సిమ్’ ఉందా? దాని ఫీచర్స్ తెలుసా?
ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ దర్శనమిస్తోంది. ఫోన్ లేనిదే ఏ పనీ కావడం లేదు. ప్రస్తుతం సెల్ఫోన్లలో ఉపయోగించే ‘సిమ్’ కార్డు కనుమరుగై పోతోంది. తొలుత పెద్ద సైజులో ఉన్న సిమ్.. నానో సైజుకు మారిపోయింది. ప్రస్తుతం కంటికే కనిపించకుండా డిజిటల్ రూపంలోకి మారిపోయింది. మొబైల్ స్టోర్‌లోకి వెళ్లకుండానే ఈసిమ్ పొందవచ్చు. మల్టీపుల్ ఫోన్ నంబర్లను, ప్లాన్లను ఒకే డివైజ్‌లో ఉపయోగించవచ్చు. ఎస్ఎంఎస్ ద్వారా సిమ్ యాక్టివేట్, డీయాక్టివేట్ చేసుకోవచ్చు. సైబర్ నేరాల నుంచి తప్పించుకోవచ్చు.