• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..

    దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:28 గంటలకు సెన్సెక్స్‌ 151 పాయింట్ల లాభంతో 66,174 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 46 పాయింట్లు పెరిగి 19,858 దగ్గర కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు ఉండడంతో మార్కెట్లు లాభపడ్డాయి. అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, హెచ్‌యూఎల్‌, సన్‌ఫార్మా, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. ఏషియన్‌ పెయింట్స్‌, విప్రో, ఎంఅండ్‌ఎం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. .

    నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు

    నేడు దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ నష్టాలతోనే ప్రారంభమైయ్యాయి. ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్‌ 27 పాయింట్ల నష్టంతో 63,847 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 4 పాయింట్ల స్వల్ప నష్టంతో 19,075 దగ్గర కొనసాగుతోంది. యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, నెస్లే ఇండియా, టీసీఎస్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టాటా స్టీల్‌, సన్‌ఫార్మా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

    Stock Market: రెండో రోజు లాభాల్లో మార్కెట్లు

    నేడు దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి. మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు, కార్పొరేట్‌ ఫలితాలు మార్కెట్లకు దన్నుగా నిలిచాయి. ఉదయం సెన్సెక్స్‌ 63,885.56 దగ్గర నష్టాలతో ప్రారంభమైంది. చివరకు 329.85 పాయింట్ల లాభంతో 64,112.65 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 19,053.40 దగ్గర ప్రారంభమై 93.65 పాయింట్లు లాభపడి 19,140.90 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.25 వద్ద నిలిచింది.