తెలంగాణ సర్కారుకు హైకోర్టు షాక్
గణతంత్ర దినోత్సవాలను ఘనంగా జరపాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించింది. రాష్ట్రంలో కరోనా ప్రభావం ఉన్నందున గణతంత్ర వేడుకలు జరపడం లేదన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. రాష్ట్రంలో కొవిడ్ ఉందని ఏజీ కోర్టుకు వివరించగా.. కరోనా ఆంక్షలు ఎక్కడున్నాయో చెప్పాలని ప్రశ్నించారు. కాబట్టి గణతంత్ర స్ఫూర్తిని చాటి చెప్పేలా వేడుకలతో పాటు పరేడ్ నిర్వహించాలన్నారు.