యద్ధం ఎఫెక్ట్: పెరిగిన చమురు ధరలు
ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్యారెల్ చమురు ధర నాలుగు శాతానికి పైగా పెరిగి 87.5 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఎస్ రకం ధర 85.80 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. భారత చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతుల ద్వారానే సమకూరుతోంది. ఈ నేపథ్యంలో చమురు ధరల పెరుగుదల భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. చమురు సరఫరాలపై తక్షణమే ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.